పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు ఈ రోజు ఏడునూతుల గ్రామానికి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గ్రామంలో కొత్త అంగన్వాడి భవనం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, పునాది వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ –
> “గ్రామాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను. ఏడునూతులలో విద్యార్థుల ఆరోగ్యం, త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతులలో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యకయ్య గారు మాట్లాడుతూ –
> “మా పాఠశాలలో త్రాగునీటి అవసరాన్ని గుర్తించి, వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. అలాగే అంగన్వాడి భవనం నిర్మాణాన్ని ప్రారంభించడం మా గ్రామానికి మేలుకలిగించే పనిగా నిలుస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు: కమల్ కుమార్, రాంబాబు, సోమేశ్వర్, భాస్కర్, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత, విజయ మరియు
తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


