నెల్లూరులో కిమ్స్హె హాస్పిటల్ యాజమాన్యం హెల్మెట్ అవగాహన, పంపిణీ కార్యక్రమం
నెల్లూరు: రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నెల్లూరు నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన మరియు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి హెల్మెట్లను పంపిణీ చేసి, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు సూచించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి” అనే సందేశంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచారు. – నెల్లూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాల్గొని హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం కేవలం నిబంధన మాత్రమే కాదని, అది మన ప్రాణాలను రక్షించే ముఖ్యమైన భద్రతా చర్య అని ఆమె పేర్కొన్నారు.

