వార్త ముఖ్యాంశాలు
- భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో Ola–Uber–Rapido క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ బృందానికి GMR యాజమాన్యం హామీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో Ola, Uber, Rapido క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ బృందం GMR Visakhapatnam International Airport Limited (GVIAL) యాజమాన్యాన్ని…
- సీఐటీయూ బృందం GMR CEO గారిని కలిసి క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
- అనంతరం ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి శాస్త్రీ గారికి మెమోరాండం అందజేసింది.
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో Ola–Uber–Rapido క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ బృందానికి GMR యాజమాన్యం హామీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో Ola, Uber, Rapido క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ బృందం GMR Visakhapatnam International Airport Limited (GVIAL) యాజమాన్యాన్ని కలిసి వినతిపత్రం సమర్పించింది.
సీఐటీయూ బృందం GMR CEO గారిని కలిసి క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. అనంతరం ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జి శాస్త్రీ గారికి మెమోరాండం అందజేసింది.
ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, Ola–Uber–Rapido పికప్ పాయింట్లు, బుకింగ్ కౌంటర్లు, Airport Taxi బుకింగ్స్‌లో సమాన అవకాశాలు, ఇతర ట్రావెల్ సంస్థల వాహనాలను Pick-up Point వద్ద నిలిపి ఉంచడం, టోల్/ఎంట్రీ చార్జీలు తదితర సమస్యలను సీఐటీయూ ప్రతినిధులు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు.
డ్రైవర్లు ఎక్కువ సమయం ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వస్తున్నందున వారికి తగిన మంచినీటి సౌకర్యం కల్పించాలని సీఐటీయూ కోరింది.
దీనిపై ఎయిర్పోర్ట్ యాజమాన్యం వెంటనే మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ప్రస్తుతం Mega Cabs, Srinivasa Travels తదితర ట్రావెల్ సంస్థలకు ప్రయాణికులు సులభంగా చేరుకునే విధంగా Pick-up సౌకర్యం ఉందని, అదే విధంగా Ola, Uber, Rapido క్యాబ్ డ్రైవర్లకు కూడా ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండే Pick-up Point కల్పించాలని సీఐటీయూ కోరింది.
దీనిపై యాజమాన్యం ఇతర ట్రావెల్ సంస్థల మాదిరిగానే Ola, Uber, Rapido క్యాబ్‌లకు కూడా ఒకే ప్రదేశం నుంచి Pick-up సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు క్యాబ్‌లను గుర్తించడం సులభమవడంతో పాటు Ola, Uber, Rapido డ్రైవర్లకు కూడా సమాన అవకాశాలు లభిస్తాయని సీఐటీయూ నాయకులు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌లో అన్ని క్యాబ్ మరియు ట్రావెల్ ఆపరేటర్లకు సమానమైన నిబంధనలు అమలు చేయాలని సీఐటీయూ కోరింది. బుకింగ్ లేని వాహనాలను Pick-up Point వద్ద నిలిపి ఉంచకుండా ప్రత్యేక Parking/Waiting Areaలో ఉంచే విధానం అమలు చేయాలని డిమాండ్ చేసింది.
అలాగే Ola, Uber, Rapido డ్రైవర్లకు కూడా ఇతర ట్రావెల్ సంస్థలతో సమానంగా ప్రయాణికులను Pick-up చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది.
క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించడం పట్ల సీఐటీయూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ విజయనగరం జిల్లా కార్యదర్శి బి. సూర్యనారాయణ, యూనియన్ గౌరవ అధ్యక్షులు బి. జగన్, ప్రధాన కార్యదర్శి పోల్ నాయుడు, యూనియన్ నాయకులు సిహెచ్. శ్రీనివాసరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.