# Punnami > Telugu Dina Patrika ## Posts - [*నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన వైద్య చికిత్స*](https://punnami.in/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2/): జనవరి (పున్నమి ప్రతినిధి) వైద్యరంగంలో మారుతున్న చికిత్సా విధానాలకు అనుగుణంగా నూతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అనేక అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలోనే అపోలో హాస్పిటల్స్ మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఓ వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సను చేపట్టి ప్రాణాలను నిలబెట్టింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఆ వైద్యం మొట్ట మొదటి సారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలియజేశారు. కావలి పట్టణానికి చెందిన 37 సంవత్సరాల వయస్సు కలిగిన నాగరాజు అనే వ్యక్తికి నోట్లి నుండి ఆగకుండా తీవ్రమైన రక్తస్రావం అవుతుండగా వారి కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసువచ్చారని చెప్పారు. నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఓ చోట ఉబ్బి ఉండటమే కాకుండా, రంధ్రం కూడా ఏర్పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు చేరాల్సిన రక్తం బయటకు లీక్ అవుతూ, ఆ రక్తం నోటి గుండా బయటకు వస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా జరుగుతుంటాని, ఆ సమస్యకు చికిత్స కూడా కేవలం మెట్రో నగరాల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో క్లిష్టమైన సమస్యలకు కూడా వైద్య సేవలు అందించే పరికరాలతో పాటూ అనుభవజ్ఞులైన వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ రోగి నాగరాజుకు బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ అనే పద్ద ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కడైతే రక్తనాళానికి రంధ్రం పడిందో అక్కడ కాయిన్ ను అమర్చి నోట్లో నుండి వస్తున్న రక్త స్రావాన్ని నివారించామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ఈ తరహా చికిత్స జరగడం నెల్లూరులో ఇదే మొదటి సారి అని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అన్నీ రోగాలకు నెల్లూరు అపోలో హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. - [పోసానిపేట పీఏసిఎస్‌లో జిల్లా వ్యవసాయ అధికారి, డిసిఓలు తీవ్ర హెచ్చరికలు](https://punnami.in/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f-%e0%b0%aa%e0%b1%80%e0%b0%8f%e0%b0%b8%e0%b0%bf%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%bf/): కామారెడ్డి, 1 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ (పీఏసిఎస్)ను జిల్లా వ్యవసాయ అధికారి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డిసిఓ) సందర్శించారు. ఎరు వుల డీలర్లు సేల్ రిజిస్టర్, స్టాక్ బోర్డులు తప్పక సరిగ్గా పెట్టాలని ఘాటైన ఆదేశాలు జారీ చేశారు. రికార్డులు సరిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.ఈ తనిఖీలు రైతులకు నాణ్యమైన ఎరువుల సులభ సరఫరా, పారదర్శక తను బలోపేతం చేస్తాయని చెప్పారు. పీఏసిఎస్‌ లు ఎరువులు, విత్తనాల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డీలర్లు రికార్డులు సరిగా ఉంచక పోతే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయని అధికారులు స్పష్టం చేశారు - [దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య](https://punnami.in/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%89%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%81/): ఏపీ ప్రభుత్వ విప్‌, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గురువారం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్వల్పంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలను చేపట్టాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. - [దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు](https://punnami.in/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%a4-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%97%e0%b1%8c%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d/): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఉదయగిరిలో SMGR వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులుర్పoచారు కళాశాల ఆసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణరెడ్డి పేద పిల్లలు విద్యాభి హృద్దికి మేకపాటి కుటుంబం ఎంతో సహాయం చేశారని కొనియాడారు దాదాపు 100 ఎకరాల పైగా స్థలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. Uploaded Video: - [ఉదయగిరి నుంచి చెన్నై కి డైరెక్ట్ బస్](https://punnami.in/%e0%b0%89%e0%b0%a6%e0%b0%af%e0%b0%97%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%88-%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a1/): ఉదయగిరి నుంచి చెన్నై కి సూపర్ లగ్జరీ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు RTC డిఎం రమేష్ కుమార్ తెలిపారు రాత్రి 9:30 గంటలకు బస్ బయలుదేరుతుందన్నారు ఆత్మకూర్, నెల్లూర్ సూళ్లూరుపేట మీదుగా చెన్నై కి ఉదయం 4 గంటలకు చేరుతుందన్నారు తిరిగి చెన్నై నుంచి ఉదయం 10:30 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 3:30 నిమిషాలకు ఉదయగిరి వస్తుందన్నారు కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. - [నూతన సంవత్సరం రోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%95%e0%b1%87%e0%b0%95%e0%b1%8d-%e0%b0%95-2/): సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు. Uploaded Video: - [నూతన సంవత్సరం రోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%95%e0%b1%87%e0%b0%95%e0%b1%8d-%e0%b0%95/): సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు. Uploaded Video: - [ఉపాధ్యాయులకు లంచ్ బ్యాగులు పంపిణీ](https://punnami.in/%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b2%e0%b0%82%e0%b0%9a%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%97%e0%b1%81/): సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని యుటిఎఫ్ శాఖకు చెందిన ఉపాధ్యాయులకు గురువారం గోనువారి పల్లి కి చెందిన టిడిపి యువ నాయకుడు కుర్రా రత్తయ్య సీతారామపురం మండల కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో లంచ్ బ్యాగులను అందించారు. ముందుగా నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి ఉపాధ్యాయులకు పంచిపెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ ఎడమ తిరుపతయ్య మాట్లాడుతూ సీతారామపురం మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన కుర్ర రత్తయ్య కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి మండల కన్వీనర్లు కప్పా ప్రభాకర్ రాజు, వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, మండల టిడిపి యూత్ అధ్యక్షుడు పసుపులేటి వికాస్ బాబు, యుటిఎఫ్ నాయకులు గొడ్లవీటి వెంకటేశ్వర్లు, అన్నంగి ప్రసాదు, డివిఆర్, పవిత్ర కుమారి, మురళి, నరసింహ రాజు, మహేష్, ముజిబా బేగం, నాయకులు షేక్ బాబు, ఏనుగుల సుబ్బరాయుడు, బండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. - [అనారోగ్య బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత](https://punnami.in/%e0%b0%85%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ac%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf/): సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని బోడ సిద్ధాయ పల్లి గ్రామానికి చెందిన సవరం పద్మావతి అనే మహిళ పక్షవాతంతో మంచాన పడిన విషయాన్ని తెలుసుకుని బాదిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సోంపల్లి టిడిపి నాయకుడు నేదురుపల్లి రవి సహకారంతో సీతారామపురం సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను బాధిత కుటుంబానికి అందజేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి సీతారామపురం మండలంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న పెనుబడి రఘురాములు ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి నేదురుపల్లి రమేష్, టిడిపి నాయకులు నేదురుపల్లి రవి,జోడు ఓబయ్య, బూత్ కన్వీనర్ బందుగుల రమణయ్య, బూత్ ప్రచార కార్యదర్శి భూతపాటి వెంకటరమన, గ్రామ కమిటీ మెంబర్ బత్తల రవి తదితరులు పాల్గొన్నారు. - [రోడ్డుపై గుండుపల్లె గ్రామస్తుల నిరసన](https://punnami.in/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b1%88-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%81%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be/): సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి ) సీతారామపురం మండలంలోని గుండుపల్లి గ్రామం మీదుగా వెళ్లిన 167 బి జాతీయ రహదారి పనుల బాధ్యులు గుండుపల్లె గ్రామానికి జరిగిన నష్ట నివారణ చర్యలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుండుపల్లె గ్రామస్తులు గురువారం 167 బి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండుపల్లె గ్రామం మీదుగా 167 బి జాతీయ రహదారి వెళ్లి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని అయితే నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు గుండుపల్లె గ్రామంలోకి సర్వీసు రోడ్డు ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు గ్రామంలోకి రాకపోకలు జరపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా గుండుపల్లి గ్రామంలోని వీధులలో ప్రవహిస్తున్న మురుగునీటి కాలువపై జాతీయ రహదారి నిర్మాణ పనులు జరిపారని మురుగు కాలువ ను మళ్లించి మరొక కాలువకు కలిపి మురుగునీటిని గ్రామం బయటకి వెళ్లేలా చర్యలు చేపడతామని చెప్పి పంట పొలాలలోకి మురుగునీరు వెళ్లేలా కాలువలను ఏర్పాటు చేశారని అందువల్ల మురుగు నీరు పొలాల్లోకి చేరడంతో పంటలు పండించేందుకు అనుకూలంగా లేదని వాపోతున్నారు. పొలాలలోకి వెళ్లేందుకు సైతం దారిని కల్పించకుండా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుండుపల్లి గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోని గుండుపల్లి గ్రామంలోకి సర్వీస్ రోడ్డు, మురుగు నీటిని పంట పొలాల్లోకి కాకుండా బయటకు వెళ్లేలా కాలువలను నిర్మించాలని, అదేవిధంగా పొలాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి నుండి పొలాల్లోకి వెళ్లేందుకు దారిని కల్పించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. - [మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ముచ్చర్ల సుగుణ సంపత్ లకు ఘన సన్మానం](https://punnami.in/%e0%b0%ae%e0%b1%87%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae/): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ముచ్చర్ల సుగుణ సంపత్ కు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది - [ఏం.టి.ఎస్.ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం - ఎన్.టి.ఏ. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు](https://punnami.in/%e0%b0%8f%e0%b0%82-%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%89%e0%b0%aa%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d/): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం… !) ఏం.టి.ఎస్.ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం !)ఎన్.టి.ఏ. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు రాష్ట్ర, జిల్లాలోని ఉపాద్యాయులు సమస్యలు నిరంతర పరిష్కారం కోసం అవిశ్రాంతంగా తమ సంఘం కృషి చేస్తున్నదని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ అన్నారు.నూతన ఆంగ్ల సంవత్సరం…2026 ప్రారంభం సందర్భంగా గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఏ. ప్రతినిధులు బృందం శుభాకాంక్షలు తెలిపి ఆయనను దుశాలువలు కప్పి,భోకేలను అందించి ఘనంగా సన్మానించింది.నోబుల్ టీచర్స్ అసోసియేషన్ …2026 సంవత్సరపు కేలండర్,డైరీలను జిల్లా విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరింపజేశారు.అనంతరం కార్యాలయం వెలుపల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ పత్రికలవారితో మాట్లాడుతూ….. ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా మంచి సమాచారంతో రాష్ర్ట శాఖా తరఫున ముద్రించిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కేలండర్ – 2026 చాలా బాగుందని కితాబిచ్చారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య లు మాట్లాడుతూ…… నోబుల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వానికి అనేక రకాల ఉపాద్యాయుల సమస్యలు తెలుపడం తెలిసిందేనన్నారు.సమస్యలు పరిష్కరించుకోవడంలోనూ తమ సంఘం తనదైన శైలిలో ప్రత్యేకతలు చూపుతుందన్నారు.రాష్ట్రంలోని ఉపాద్యాయుల పలు పెండింగ్ సమస్యలతో పాటు ఎం.టి.ఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.త్వరలో 1998 ఏం.టి.ఎస్. ఉపాద్యాయులకు మేలుచేసే ఒకటి రెండు అంశాలు తమ దృష్టిలో వుందన్నారు.సాధ్యమైనంత అతి తక్కువ కాలంలో పరిష్కరింప బడుతుoదని విశ్వసించారు.ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఏ.రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు. - [జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఎ రాష్ట్ర, జిల్లా నాయకులు](https://punnami.in/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/): జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఎ రాష్ట్ర, జిల్లా నాయకులు నూతన ఆంగ్ల సంవత్సరం… 2026 ప్రారంభం సందర్భంగా గురువారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు ఏంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, చిత్తూరు ఎం.ఎల్.ఎ గురజాల జగన్ మోహన్ నాయుడు,ఆయన తండ్రి చెన్న కేశవులు నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్, డీ.ఈ.ఓ రాజేంద్ర ప్రసాద్ లను కలసి పుష్పగుచ్ఛాలు అందించి దుషాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.తమకు వినతులు రూపంలో అందించే ఉపాధ్యాయులు సమస్యలు పట్ల సత్వరం పరిష్కoపజేయడానికి తాము సిద్ధంగా వున్నట్లు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.ఈ పాటికే ఉపాద్యాయుల పలు సమస్యలు సాధనలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అగ్రభాగాన నిలిచిందని ప్రజాప్రతినిధులు ఎన్.టి.ఎ.నాయకులను ప్రశంసించారు. అదేవిధంగా నూతన సంవత్సరం క్యాలెండర్,డైరీలు, టేబుల్ క్యాలెండర్ లు ఎంపీ, ఎం.ఎల్.ఏ లు చేతుల మీదుగా ఆవిష్కరింప జేశారు. కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్, కార్యదర్శి రాజేశ్వర కుమార్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు. - [నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%80/): నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్* నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం జనసందోహంగా మారింది. గురువారం ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రజలందరూ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి నూతన సంవత్సరంతో పాటు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. - [మండల అధ్యక్షుడు ఆలంపల్లి నరసింహ 9వ వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్ కి ఘనంగా సన్మానం](https://punnami.in/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2-%e0%b0%85%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf/): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన 9వ వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్ కి ఈరోజు ఘనంగా సన్మానం ప్రజా సమస్యలపై గ్రామపంచాయతీలో గలమెత్తి ప్రశ్నించే ప్రజా గొంతుక కావాలని తమ్మునికి చిన్న సన్మానం చేస్తున్న ఆలంపల్లి నరసింహన్న వారి మిత్రబృందం - [రైల్వే కోడూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి](https://punnami.in/%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87-%e0%b0%95%e0%b1%8b%e0%b0%a1%e0%b1%82%e0%b0%b0%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b0%e0%b1%86%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82/): – ప్రభుత్వానికి ఏపీ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక డిమాండ్ – ఐదు మండలాల ప్రజలకు పరిపాలన చేరువ కావాలి: తుంగా లక్ష్మీనారాయణ చిట్వేలు, జనవరి 1పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ తుంగా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చిట్వేలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -తిరుపతిలో కలపడం హర్షణీయం రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం సముచితమైనదని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు బాలాజీ జిల్లాను ప్రతిపాదించినప్పుడే, కోడూరును అందులో కలపాలని ప్రజలు కోరుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -దూరభారం తగ్గించడమే లక్ష్యం ప్రస్తుతం కోడూరు, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలాలు రాజంపేట రెవెన్యూ డివిజన్ నుండి విడిపోయి తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరాయని, దీనివల్ల ప్రజలకు పరిపాలనాపరంగా దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదు మండలాల పరిధితో మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో, అదే తరహాలో రైల్వే కోడూరును కూడా డివిజన్‌గా ప్రకటించాలని కోరారు.ఐదు మండలాల ప్రజలకు రైల్వే కోడూరు కేంద్ర బిందువుగా ఉంటుందని, తద్వారా పరిపాలన సౌలభ్యంగా మారుతుందని సూచించారు.వెంటనే స్పందించి రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. - [నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన ఎన్డీఏ కూటమి శ్రేణులు – ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు శుభాకాంక్షలు](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%86%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf/): నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ను పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరం గ్రామానికి గురువారం భారీగా తరలివచ్చారు. నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు.అందరినీ ఆప్యాయంగా స్వాగతించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, పేరు పేరునా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు కలిగించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ను కలిశారు. - [నందిగామలో నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ](https://punnami.in/%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b6/): నందిగామ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నూతన సంవత్సర శుభాకాంక్షలతో కళకళలాడింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, అధికారులు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి, సంక్షేమం కలగజేయాలని ఆకాంక్షించారు. కూటమి పాలనలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. - [నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa/): నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు జగన్మోహన్ రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు. - [సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మనుబోలు–చెర్లోపల్లి టిడిపి నాయకులు](https://punnami.in/%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%ae/): ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గార్లను మనుబోలు రాజా గౌడ్, కాగితాలపురి వెంకటరమణారెడ్డి, చెర్లోపల్లి నీటి సంఘం ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, టిడిపి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, కుడితిపల్లి గోపిరెడ్డి ప్రసాద్ తదితర కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. - [నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆకాంక్ష](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95/): పెద్ద అవుటపల్లి(ఉంగుటూరు మండలం): జనవరి 1 పున్నమి ప్రతినిధి నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఉంగుటూరు మండల ప్రజలకు మరియు భక్తులకు పెద్ద అవుటపల్లి ష్రైన్ రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు (ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఓఎఫ్ఎం క్యాప్.) తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, గడిచిన కాలంలోని బాధలను, ఆందోళనలను మర్చిపోయి.. సరికొత్త ఆశలతో, ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం సరికొత్త అవకాశాలకు వేదిక కావాలని, ప్రతి ఒక్కరూ తమ అంచనాలను అందుకునేలా కృషి చేయాలని కోరారు. ​ప్రేమ, ఆప్యాయతలతో ముందుకు సాగాలి: మన చుట్టూ ఉన్న వారందరినీ సంతోషపరుస్తూ, నలుగురికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన నూతన సంవత్సర వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సుఖసంతోషాలతో కూడిన ఉజ్వల భవిష్యత్తును గడపాలని ఆయన ఆశీర్వదించారు. - [నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2/): ఖమ్మం, జనవరి: (పున్నమి ప్రతినిధి) నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం యువతకు నూతన అవకాశాలు కల్పిస్తూ సార్థకంగా మారాలని కోరుకుంటున్నట్లు గ తెలియజేసారు. - [కాలము కరిగిపోతుంది](https://punnami.in/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%81-%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-2/): *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా* - [కాలము కరిగిపోతుంది](https://punnami.in/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%ae%e0%b1%81-%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/): *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా* - [కాలం కరిగిపోతుంది](https://punnami.in/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%82-%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-2/): *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా* Uploaded Video: - [కాలం కరిగిపోతుంది](https://punnami.in/%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%82-%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/): *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా* Uploaded Video: - [రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ అరకు పేరుతో నిర్వహిస్తున్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకలు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%87%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9-8/): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ అరకు పేరుతో నిర్వహిస్తున్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకలను భగ్నం చేశారు డిజె సెట్ ని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మధు తెలిపారు Uploaded Video: - [రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆగపల్లి ఇయర్ వేడుకలు నిర్వహించడంతో సిఐ మధు అక్కడికి చేరుకొని వేడుకలను నిలిపివేశారు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%87%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9-7/): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆగపల్లి కంటైనర్ ఫార్ము స్టే లో అనుమతు లేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడంతో సిఐ మధు అక్కడికి చేరుకొని వేడుకలను నిలిపివేశారు డిజె సెట్ ని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మధు తెలిపారు Uploaded Video: - [రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులను సతాయించిన మందుబాబు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%95%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%a1/): రామగుండంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులను సతాయించిన మందుబాబు Uploaded Video: - [తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్](https://punnami.in/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af/): *తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్ కొత్త మద్యం పాలసీతో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ ఈరాత్రి అమ్మకాల తర్వాత మరింత పెరగనున్న సేల్స్ గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్లు అదనం. - [నూతన సంవత్సర స్వాగతాక్షర సుమాంజలి(2026) - డాక్టర్ బద్రి పీర్ కుమార్](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%97%e0%b0%a4%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0/): వి *నూ* తన ప్రపంచంలో విహరించగ, విధి రా *త* లు జీవన పుష్ప రేఖలై పరిమళించగ జ *న* సమోహం సత్ప్రవర్తన గీతం ఆలపించగ ఆ *సం* గీత సరాగసుమాలు దీర్ఘాయుషు నివ్వగ న *వ* వసంతనాదం సంతసమున చేయూత నందించగ వా *త్స* ల్య వాయువు సులక్షణ సుమాలు వెదజల్లగ ప్రా *రం* భం కానున్న ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకగ విజయ సంకల్ప సోపాన తోరణాల ఆహ్వానం సరికొత్త ఆశల ఆత్మీయ సంపదల జీవన గమనం నిరంతరం సాగాలని కాంక్షిస్తూ… పలుకుతున్నాము నూతన సంవత్సరానికి స్వాగతం అందుకుందాము మధుర స్మృతుల సమ్మేళన ఫలితం. - [చిట్వేలు జెడ్పీ హైస్కూల్‌లో అధికారుల నిర్లక్ష్యం](https://punnami.in/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%aa%e0%b1%80-%e0%b0%b9%e0%b1%88%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d/): ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచిన చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు అధికారుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి, చిట్వేలు మండలాన్ని అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లా లోకి చేర్చిన పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న బోర్డును మార్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. బోర్డుపై పాత జిల్లా పేరే.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యాలయం మరియు పాఠశాల బోర్డులపై జిల్లా పేరును సవరించాల్సి ఉంది. కానీ ఈ పాఠశాల బోర్డుపై నేటికీ పాత జిల్లా పేరే దర్శనమిస్తోంది. పాఠశాల పరిపాలన యంత్రాంగం కనీసం బోర్డును మార్చే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల తీరుపై ‘గుసగుసలు’: పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు పెట్టింది పేరైన ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని, దీనికి ఉపాధ్యాయుల అలసత్వమే కారణమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. తక్షణ చర్యలు అవసరం: పాఠశాల బోర్డును వెంటనే మార్చాలని, అలాగే ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెంచి పాఠశాల పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. - [నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్న శ్రీ వినాయక హోటల్](https://punnami.in/%e0%b0%a8%e0%b1%82%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7-2/): తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలో శివాలయం ఎదురుగా ఉన్న శ్రీ వినాయక హోటల్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది. హోటల్ యజమాని గిరి ఎంతో కష్టపడి అంచులంచెలుగా ఎదిగిన ఈ హోటల్ నేడు రుచికి, నాణ్యతకు మరో పేరుగా నిలుస్తోంది. శుభ్రత, రుచిపై ప్రత్యేక శ్రద్ధతో వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ప్రతిరోజూ ఏదో ఒక స్పెషల్ ఐటమ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రతి ఆదివారం 99 రూపాయలకే బిరియాని మరియు ప్రత్యేక ఆఫర్లు ఉండటంతో కుటుంబాల ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హోటల్‌కు వచ్చే కస్టమర్లందరికీ గిరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం రూ.99కే రుచికరమైన బిరియాని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక ఆఫర్‌తో చిట్వేలు ప్రాంతంలో శ్రీ వినాయక హోటల్ రుచుల కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. - [మెరుగైన సమాజ నిర్మాణానికి సి.హెచ్.ఎస్ సేవా బాట](https://punnami.in/%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a3%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95/): తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, నీటి కొరత సమస్యలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ (సి.హెచ్.ఎస్) సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి ఫిల్టర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల చిట్వేల్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, ఫుడ్ బ్యాంక్, పాత వస్తువుల డొనేషన్ స్టాండ్ వంటి సేవా కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. అదే విధంగా మార్గోపల్లి, వెంకటరాజుపల్లి, నగిరిపాడు, తిమ్మాయపాలెం, కేఎస్ అగ్రహారం తదితర గ్రామాల నుండి సి.హెచ్.ఎస్ సభ్యులు, గ్రామస్తులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా త్రాగునీటి ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. దీని కొనసాగింపుగా నేడు ఆయా గ్రామాలకు కూలింగ్ వాటర్ ఫ్రిజ్‌లను డెలివరీ చేయడం జరిగిందని, త్వరలోనే ఆర్వో ఫిల్టర్ల ఇన్‌స్టాలేషన్ కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాల నిర్వహణ, నిరుపేదలకు ఆపద సమయంలో చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలను సి.హెచ్.ఎస్ సంస్థ నిరంతరంగా చేపడుతోందన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే వారు సభ్యత్వం తీసుకోవచ్చని, సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. మానవ జన్మ సార్థకత పుచ్చుకోవడంలో కాకుండా ఇచ్చుకోవడంలోనే ఉందని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, సూర్యనారాయణ, బొంతల సతీష్, సంస్థ సభ్యులు ఎంవి నరసారెడ్డి, తిరుమల రెడ్డయ్య, అలిశెట్టి పెంచలయ్య, గాడి ఇంతియాజ్, బాలరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు. - [మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్‌కు కస్తూరి విశ్వనాథ నాయుడు ఘన నివాళి](https://punnami.in/%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b1%80-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/): రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం చిట్వేలు పట్టణంలోని ఆయన స్వగృహానికి చేరుకున్న కస్తూరి విశ్వనాథ నాయుడు, మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గుంటి ప్రసాద్ కుటుంబ సభ్యులను కస్తూరి విశ్వనాథ నాయుడు పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటి ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం రైల్వే కోడూరు రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. మృదుస్వభావిగా అందరితో ఆప్యాయంగా ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యేను కడసారి చూసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, బంధువులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కస్తూరి విశ్వనాథ నాయుడు వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించారు. - [గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యం: ముక్కా రూపానంద రెడ్డి](https://punnami.in/%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7-5/): గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా చిట్వేల్ మండల నాయకులు, కార్యకర్తలతో బుధవారం రోజున ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రైల్వే కోడూరు పట్టణం రాఘవరాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిట్వేల్ మండలానికి చెందిన గ్రామ, పంచాయతీ నాయకులు పాల్గొని తమ గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గ్రావెల్ రోడ్లు, పాఠశాలల మౌలిక వసతులు, పంచాయతీ స్థాయి సమస్యలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా అమలు చేయడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన ముక్కా రూపానంద రెడ్డి, గ్రామస్థాయిలో టీడీపీని మరింత బలంగా నిలబెట్టేందుకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. - [కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు](https://punnami.in/%e0%b0%95%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%a8-2/): తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1న స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బుధవారం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచే విశేష అభిషేకాలు, ఫలపుష్ప అలంకరణలు, హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. స్వామివారిని నూతన ఏడాది తొలిరోజున దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రత్యేకతగా పేరుగాంచిన పొంగుబాలు సమర్పణ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి చెక్కభజనలు నిర్వహించడంతో పాటు రోజంతా నిరంతర అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వేడుకను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. - [ఆత్మీయ సమావేశం](https://punnami.in/%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80%e0%b0%af-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%b6%e0%b0%82/): రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకలకొండ నందు పాత,కొత్త ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల నందు గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, మరియు బదిలీ పై ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయునికి మరియు ప్రమోషన్ పై వివిధ పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు, మరియు ఇదే పాఠశాలలో పనిచేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు అందుకున్న ఉపాధ్యాయునికి, ఇదే పాఠశాలలో ప్రమోషన్ పొందిన వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు నూతనంగా 2025 DSC ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, మరియు ఎంఆర్సి సిబ్బందికి, ఆత్మీయ సమావేశం ఘన మరియు సన్మానం ప్రధానోపాధ్యాయులు P. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో MEO – 1 పి.రమేష్, ఏ. సుభాషిని, ఎస్ తులసీరామ్ రెడ్డి, సమీరా బేగం, ప్రతాప్, నరేష్, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మము లాభి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మయ్య, మహేష్, మోహన్ రావు, సూరా రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, ఎమ్మార్సీ సిబ్బంది మౌనిక రెడ్డి, ధర్మారెడ్డి హజరత్ రెడ్డి,జలీల్ పాల్గొన్నారు - [జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన : కలెక్టర్](https://punnami.in/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8-%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b0%ae%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4/): నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ బుధవారం నల్గొండ జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. - [జగ్గయ్యపేటలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ](https://punnami.in/%e0%b0%9c%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d/): జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో మసీద్ సెంటర్ వద్ద నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు నేరుగా అందించడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత సమర్థంగా చేరుతున్నాయో ఈ కార్యక్రమం స్పష్టంగా చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్కరూ కూడా ప్రభుత్వ సహాయం నుండి దూరం కాకుండా చూసే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా లభించడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిజంగా అమలవుతున్నాయనే విషయానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నెట్టెం శివరామ్, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కోరకుటి సైదులు, 11వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోరకుటి బొబ్బిలి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. - [నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు](https://punnami.in/%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%ae-2/): నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. - [నందిగామలో ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు](https://punnami.in/%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b1%87-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%ae%e0%b1%8d/): నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఎమ్మెల్యే సౌమ్య నూతన సంవత్సర కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా పాలన సాగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్‌, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, వివిధ హోదాల రాష్ట్ర డైరెక్టర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చైర్మన్లు, కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతోస్వాగతించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. - [మునగచర్లలో రూ.115 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన](https://punnami.in/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b0%97%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%82-115-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2-%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%b5/): పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్), పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంపౌండ్ వాల్స్, సిమెంట్ రోడ్లు, మెటల్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన మొత్తం 9 పనులకు శంకుస్థాపన చేయగా, వీటి అంచనా వ్యయం రూ.115 లక్షలుగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి సదుపాయాలతో గ్రామాల రూపురేఖలు మారతాయని, ఉపాధి హామి పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు ఉపాధితో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - [మునగచర్లలో సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం](https://punnami.in/%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b0%97%e0%b0%9a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%9c%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be/): నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో బుధవారం సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, సామాజిక భరోసా పెన్షన్లు పేదలు, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల గడప దాటే పాలన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని, గ్రామాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, గ్రామ సర్పంచ్ పంగులూరి నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. - [సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిన దార్శనికుడు*](https://punnami.in/%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8b%e0%b0%ad%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be/): ** (పున్నమి ప్రతినిధి) ఆర్థికలోటులోనూ అవకాశాలను సృష్టించిన ఘనుడు చంద్రబాబు* కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు తీసింది. కూటమి ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని అభివృద్ధితో చాటిచెప్పింది.* సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పై ప్రతిపక్షాలు చేసిన అర్థరహిత విమర్శలు తేలిపోయాయి.* యువగళం హామీలను నెరవేర్చేందుకు నారా లోకేష్ అనుక్షణం తపనపడ్డారు. దేశ, విదేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించారు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించారు.* రాజధాని లేని రాష్ట్రంగా, భావితరాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో… పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడే స్థాయి పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తెచ్చింది.* ఆర్థికలోటుతో అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్రంలో తన అపార అనుభవం, ప్రధాని మోదీ సాయం, పవన్ కళ్యాణ్ సహకారంతో వెలుగులు నింపారు చంద్రబాబు.* — MLC బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, (నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు)* మెగా డీఎస్సీ హామీని నెరవేర్చుతూ తొలి సంతకంతో 15941 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యారంగం బలోపేతానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. 5757 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంతో పాటు స్టైఫండ్ ను 12.5 వేలకు పెంచింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 50,000కోట్ల రూపాయలను(ఏడాదికి 33000 కోట్లు చొప్పున, నెలకు 2750కోట్లు) పింఛన్ల రూపంలో ఇప్పటివరకు లబ్దిదారులకు అందించింది కూటమి ప్రభుత్వం. 46 లక్షల రైతులకు లబ్ది చేకూరుస్తూ 6310 కోట్ల రూపాయలను “అన్నదాత సుఖీభవ పథకం” ద్వారా అందించి రైతన్నలకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పేరిట 67.27 లక్షల విద్యార్థులకు మేలు చేకూర్చేలా వారి తల్లుల ఖాతాల్లో 10,090 కోట్ల జమతో పాటు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరిట కిట్స్ ను కూటమి ప్రభుత్వం అందిస్తోంది. 1144 కోట్ల వ్యయంతో, స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల బస్సు ప్రయాణాలను రాష్ట్ర మహిళలకు ఉచితంగా కల్పించింది కూటమి ప్రభుత్వం. 2.90లక్షల ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15 వేల చొప్పున 436 కోట్లు సాయం జమ చేసింది. ప్రతీ ఏటా 3 గ్యాస్ సిలిండర్ లు అందించాలన్న లక్ష్యంతో దీపం – 2 పథకం ద్వారా 2684 కోట్లు వెచ్చించి ఇప్పటివరకు 2 కోట్ల సిలిండర్ లను పేద, మధ్య తరగతి మహిళలకు పంపిణీ చేసింది కూటమి ప్రభుత్వం. పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న తపనతో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు 4 కోట్ల భోజనాలను పేదలకు నామమాత్రపు ధరకు అందించింది. మైనారిటీ సంక్షేమం కోసం 3670 కోట్లు కేటాయింపు తో పాటు ఇమామ్ లకు 10 వేలు, మౌజన్ లకు 5 వేలు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో 8427 పాస్టర్లకు 5 వేల చొప్పున 51 కోట్ల రూపాయలు, దేవాలయాల్లోని పురోహితులకు 15 వేలు, నాయీ బ్రాహ్మణులకు 25 వేలు చొప్పున 90 కోట్లు అందించింది. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల మరమ్మత్తులు చేపట్టడమే కాకుండా, 3 వేల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మించింది కూటమి ప్రభుత్వం. “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” ద్వారా 84 లక్షల టన్నుల చెత్త సేకరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వ చొరవతో జరిగిన సీఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు జరుగగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు,16.13 లక్షల ఉద్యోగాలు మరియు 13 ఎస్.ఐ.పి.బి.సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. విశాఖ ఐటీ హబ్, గూగుల్ – రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్ కు శంకుస్థాపన జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం పనుల్లో పురోగతి వచ్చింది. వెలిగొండ వేగం పుంజుకుంది. క్వాంటం వ్యాలీకి తొలి అడుగు పడటంతో అమరావతి పనులు ఊపందుకున్నాయి. పల్లె పండుగ పథకం ద్వారా గ్రామాల్లో 4 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. 13326 గ్రామ సభలను నిర్వహించి 3 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం లో రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ జరిగింది. ధాన్యం అమ్మిన 24 గం.ల్లోనే రైతన్నల ఖాతాల్లో డబ్బును జమ చేసింది. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 3050 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 కోట్లమంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా “అమరజీవి జలధార పథకం” ద్వారా మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. - [వాసవి మాత జన్మస్థలం ‘వాసవి పెనుగొండ’గా గుర్తింపు – హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం](https://punnami.in/%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%82-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8/): పెనుగొండ క్షేత్రంలో జన్మించిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలాన్ని “వాసవి పెనుగొండ”గా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమని యన్.టి.ఆర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం నేత పారేపల్లి సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పెనుగొండ పట్టణంలో అధికారులు “వాసవి పెనుగొండ”గా సూచిక బోర్డు ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను గౌరవిస్తూ ఈ కీలక తీర్మానం చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని కొనియాడారు. - [జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు](https://punnami.in/%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-3%e0%b0%b5-%e0%b0%a4%e0%b1%87%e0%b0%a6%e0%b1%80%e0%b0%a8-%e0%b0%9b%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2/): జనవరి 3వ తేదీన ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల సంఘాల JAC - [ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ](https://punnami.in/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9b%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/): ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ రైల్వేకోడూరు డిసెంబర్ 31 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సచివాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్మ శివ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ .ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం . - [కంపసముద్రం ‘స్తంభారాయుని’ క్షేత్రంలో జనవరి 1న విశేష పూజలు](https://punnami.in/%e0%b0%95%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%82%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%a8/): -నూతన ఏడాది వేళ అంగరంగ వైభవంగా వేడుకలు | పొంగుబాలతో మొక్కులు తీర్చుకోనున్న భక్తులు | రోజంతా అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు చిట్వేలు, డిసెంబర్ 31: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం కంపసముద్రం పంచాయతీ పరిధిలోని గుడ్లవారిపల్లె గ్రామంలో వెలసిన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ స్తంభారాయు స్వామి ఆలయం నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఈ క్షేత్రంలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా బుధవారం (జనవరి 1న) స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారికి విశేష అభిషేకములు, ఫలపుష్ప అలంకరణలు మరియు హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. నూతన ఏడాది తొలిరోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. -ముగియనున్న పొంగుబాలు ముక్కు బడులు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ‘పొంగుబాలు’ సమర్పించడం ప్రధానమైనది. భక్తులు తమ కోర్కెలు సిద్ధించాలని లేదా నెరవేరిన కోర్కెలకు కృతజ్ఞతగా ఆలయ ప్రాంగణంలో పొంగుబాలు (పాలు పొంగించి నైవేద్యం వండటం) సమర్పించి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఆకర్షణీయంగా చెక్కభజనలు.. నిరంతర అన్నదానం భక్తి పారవశ్యాన్ని పెంచేలా ఉదయం 9 గంటల నుండి కళాకారులచే చెక్కభజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా **అన్న ప్రసాద వితరణ (అన్నదానం)జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. -భక్తులకు విన్నపం నైవేద్యాలు, ప్రసాదాలతో స్వామివారిని సేవించి, ఆయన కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ కోరింది. భక్తులు క్రమశిక్షణతో క్యూలైన్లలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, పవిత్రమైన ఈ వేడుకను జయప్రదం చేయాలని గ్రామ పెద్దలు ప్రార్థిస్తున్నారు. - [ఘన వైకుంఠ ఏకాదశి వేడుకలు](https://punnami.in/%e0%b0%98%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0-%e0%b0%8f%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b0%b6%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/): కామారెడ్డి, 30 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. రామారెడ్డి మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవలు పలు వీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేశారు. రామారెడ్డి మండల బండరాలలోని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆకర్షణ కేంద్రంగా మారింది. భక్తుల ఉత్సాహం తండోపతండాలుగా వచ్చిన భక్తులు అభిషేక పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తుల రద్దీతో కిటికిటలా డాయి. ప్రత్యేకంగా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది.జిల్లా వ్యాప్తంగా పలు ఆలయల్లో వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30, 2025) పర్వదినం మార్మోగాయి.భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం పొందారు.పూజా విధానాలు భక్తులు దైవిక నిష్ఠతో ఉపవాసం, జాగరణం, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. ఆలయాల్లో భక్తులకు మంచి నీరు, క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్వం వైకుంఠ ప్రాప్తికి మార్గం అని భక్తులు భావిస్తున్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్రీ బండి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ శ్రీ హన్మొయ్యొల్ల నవీన్, వార్డు సభ్యులు పిప్పరి లింబాద్రి, రంజిత్, రాజు, మాజీ సర్పంచ్, దండబో యిన సంజీవ్, మాజీ ఎంపీటీసీ నామాల యాదగి రి, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు - [APSET–2025 నోటిఫికేషన్ విడుదల](https://punnami.in/apset-2025-%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf%e0%b0%ab%e0%b0%bf%e0%b0%95%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b1%81%e0%b0%a6%e0%b0%b2/): APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:➡️ 09 జనవరి 2026 దరఖాస్తు ఫీజు:🔹 జనరల్: ₹1600/-🔹 BC / EWS: ₹1300/-🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/- అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.inwww.apset.net.in - [ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య](https://punnami.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%b6%e0%b0%be%e0%b0%b2%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%82-%e0%b0%b5%e0%b1%8d/): ప్రైవేటు పాఠశాలల్లోనూ వ్యాయామ విద్య ▪️ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో వ్యాయామ విద్య నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యోగా, ఆరోగ్య విద్య, డ్రిల్, క్రీడలు నిర్వహించాలని సూచించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి తరగతికీ వారానికి ఆరు పీరియడ్లను ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం ఒకగంట శారీరక శ్రమ ఉండేలా చూడాలని ఆదేశించింది. పాఠశాల అసెంబ్లీలో ప్రతి రోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ను నిర్దేశించిన సిలబస్ మేరకు ఆరోగ్య విద్యకు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు కాల నిర్ణయం పట్టికను విడుదల చేసింది. - [రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ](https://punnami.in/%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%86/): రైల్ వన్ యాప్ ద్వారా టికెట్లు కొంటే 3% రాయితీ ▪️అన్ రిజర్వ్ టికెట్లపై రాయితీ జనవరి 14 నుంచి జులై 14 వరకు. రైళ్లలో అర్రిజర్వ్డ్ టికెట్లను రైల్ వన్ యాప్ ద్వారా కొని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేవారికి 3% రాయితీని రైల్వే మంత్రిత్వశాఖ ఇవ్వనుంది. 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆర్-వ్యాలెట్తో చెల్లింపుల్ని చేసేవారికే ప్రస్తుతం ఈ రాయితీని క్యాష్బ్యాక్ రూపంలో ఇస్తోంది. డిజిటల్ బుకింగ్లను ప్రోత్సహించడానికి ఈ యాప్ ద్వారా జరిగే అన్నిరకాల డిజిటల్ చెల్లింపులకు దీనిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత సాఫ్ట్వేర్లో తగిన మార్పులు చేయాలని ‘రైల్వే సమాచార వ్యవస్థ కేంద్రం (క్రిస్)కు మంగళవారం రైల్వేశాఖ ఆదే శాలిచ్చింది. ప్రయాణికుల స్పందన ఎలా ఉందో మే నెలలో తెలియజేస్తే దీనిపై తదుపరి పరిశీలన చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్-వ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఉన్న రాయితీ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఇతర ఏ ఆన్లైన్ విధానాల్లో కొన్న అన్ రిజర్వ్ టికెట్లకు వర్తించబోదని తేల్చిచెప్పింది. - [శ్రీ సౌమ్యనాథ స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్న అతికారి కృష్ణ ​గౌరవప్రదంగా స్వాగతం పలికిన యెద్దల విజయ సాగర్ ​టీడీపీ నాయకులను పరిచయం చేసిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్](https://punnami.in/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5/): ​వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ఆయనకు మర్యాదపూర్వక స్వాగతం పలికి, ఆప్యాయంగా పలకరించారు. వీరు కలిసి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఆలయ విశిష్టతను వివరించిన విజయ సాగర్: దర్శనానంతరం యెద్దల విజయ సాగర్ ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక విశిష్టతను అతికారి కృష్ణకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నందలూరు మండలంలోని తెలుగుదేశం పార్టీకు చెందిన నాయకులను, కార్యకర్తలను అతికారి కృష్ణకు పేరుపేరునా పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతికారి కృష్ణ మాట్లాడుతూ: అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ​ఈ సందర్భంగా యెద్దల విజయ సాగర్ మాట్లాడుతూ: “వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాన మన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ సౌమ్యనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరం అని. నందలూరు క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది అని. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించాలని, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అండగా నిలవాలని కోరుకుంటున్నాము అని. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని” ఆయన తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో మండల జనసేన మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - [మానసిక దృఢత్వం, మత్తు పదార్థాల నిరోధంపై కస్తూర్బా బాలికల విద్యాలయంలో అవగాహన](https://punnami.in/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a6%e0%b1%83%e0%b0%a2%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%be/): కామారెడ్డి 31 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళ వారం మానసిక సమస్యలు, పరీక్షా కాలంలో జాగ్ర త్తలు, మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వనిత ఈ కార్యక్రమాన్ని సమీకరిం చారు. జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మానసిక దృఢ త్వం తప్పనిసరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి న జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ మానసి కంగా దృఢంగా ఉండాలని సూచించారు. “అప్పుడే మీ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు” అని తెలిపారు. టీనేజీ వయస్సులో వచ్చే అవరోధాలను వివరిం చుతూ, పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాలని, మానసిక ఒత్తిడి పెట్టుకోవద్దని ఆయన అన్నారు. మొబైల్ వ్యసనానికి దూరంగా ఉండాల ని సలహా ఇచ్చారు. మానసిక సమస్యలు తలెత్తి నా తమను సంప్రదించాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.యువత మత్తు పదార్థాలు వద్దు.. బంగా రు భవిష్యత్తు కోల్పోకండిఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, టీనేజీలు మత్తు పదార్థాల కు లోనై, విలువైన జీవితాలను వృధా చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు కలిగే అనర్థాలను ఇంట్లో చెప్పాలని సూచించారు. రామారెడ్డి మండలంలో డ్రగ్స్ వాడ కానికి బానిసైన వ్యక్తులను ఇప్పటికే పట్టు కొని, మందలించి, కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. “కుటుంబం, సమాజాన్ని కాపాడటం మీ బాధ్యత.. మీరు కూడా భాగస్వాములవ్వండి” అని యువత కు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధానికి అందరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పీఎచ్సీ మెడికల్ ఆఫీసర్ డా. సురేష్, సైకియా ట్రిక్ సోషల్ వర్కర్ డా. రాహుల్, ఉపాధ్యాయులు పద్మ, గంగలక్ష్మి, రజిత, అరుణలు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. - [ఊరందూరు కాల్వలో తేలిన మహిళ మృతదేహం](https://punnami.in/%e0%b0%8a%e0%b0%b0%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%b9/): శ్రీకాళహస్తి పున్నమి క్రైం న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి మండలం ఊరందూరు చెరువు దగ్గర ఉన్న ఎస్టీ కాలనీలో ఊరందూరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనది. ఆమె వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చునని పంట పొలాల్లో ఉండే రైతులు ఆ మృతదేహం గుర్తించి శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి తెలియగాజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసు వాళ్ళు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తరలించారు. మృతదేహం చేతులపై హిందీలో అక్షరాలు ఉండడం గమనించిన పోలీసులు ఎవరికైనా వివరాలు తెలిస్తే శ్రీకాళహస్తి రూరల్ పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు cell:9154141891 , cell:7330823611. - [తెలంగాణ సీఎంకి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు](https://punnami.in/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82%e0%b0%95%e0%b0%bf-%e0%b0%98%e0%b0%a8%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%97%e0%b0%a4%e0%b0%82/): శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి నియోజిక వర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా తిరుమలలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. - [శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే](https://punnami.in/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0/): శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తొండమనాడులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, కుమార్తె పవిత్ర రెడ్డి, మనవడు దేవస్కంద రెడ్డిలు స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్రి సుదర్శన్ రెడ్డి, జై చంద్రారెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేష్, సుబ్బానాయుడు కండ్రిగ వేణు, జయ కృష్ణ రెడ్డి, బలరాం, చంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు. - [వైభవంగా శ్రీ వైకుంఠనాథ స్వామీవారి ఏకాదశి మహోత్సవం](https://punnami.in/%e0%b0%b5%e0%b1%88%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5-%e0%b0%b8/): శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వైకుంఠనాథ స్వామీ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు, కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులతో వేడుకలను నిర్వహించి భక్తులకు తీర్ధ, ప్రసాదాలు, అందజేయడంతో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఆనందానుభూతిని పొందారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారి ముక్కోటి ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా ఏకాదశి మహోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఏకాదశి వేడుకలను ఘనగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. - [శివయ్య సన్నిధిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు](https://punnami.in/%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%af%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d/): శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీ కాళహస్తీశ్వరా స్వామీవారి అమ్మ వార్ల దర్శనార్దం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు తన కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం నాడు ఆలయానికి వెచ్చేశారు. వీరికి ఆలయాధికారులు, స్థానిక భాజపా నాయకులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం ఆలయ వేదపండితుల చేత ఆశీర్వాదం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. - [భార్య పై దాడి భర్తకు 14 రోజులు రిమాండ్](https://punnami.in/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a6%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b1%81-14-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81/): ఉదయగిరి లోని రజక విధిలో ఈ నెల 28న చి పీ నాపీ తిరుపతమ్మ పై భర్త గురవయ్య చాకుతో దాడి చేశాడు నిందితుడైనా ఆమె భర్త గురవయ్యను ఉదయగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో హాజరుపరిచారు గురవయ్యకు జడ్జి జె, అంజయ్య 14 రోజులు రిమాండ్ విధించారనీ ఉదయగిరి ఎస్ఐ అల శ్రీను పేర్కొన్నారు నిందితుడీనీ ఆత్మకూర్ సబ్ జైల్ కు తరలించారు. - [వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ ఉప్పల లింగస్వామి*](https://punnami.in/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0-%e0%b0%8f%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b0%b6%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%82%e0%b0%97%e0%b0%be-2/): పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. - [ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు](https://punnami.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%87%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4/): ఉదయగిరి లోని 2025 సంవత్సరం ముగియనందున నూతన సంవత్సరంకు ప్రారంభమవుతున్నా సమయంలో ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉదయగిరి సీఐ యన్ వెంకట్రావు తెలిపారు ఆయన విలేకరులు సమావేశం మాట్లాడుతూ 4 మండలాల్లో ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరియు ఏ ఇతర డీజే కార్యక్రమలు ట్రిపులు రైడింగ్ మద్యం సేవించి రోడ్ల పైకి అనవసరంగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. - [*ఎల్లంకి కాశమ్మ కుటుంబానికి భరోసాగా నిలిచిన చలమల కృష్ణారెడ్డి *](https://punnami.in/%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82%e0%b0%95%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%b6%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%81%e0%b0%82%e0%b0%ac%e0%b0%be%e0%b0%a8/): పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థన్నా రాయణపురం మండలం సర్వేల్ (మర్రిగూడెం) గ్రామానికి చెందిన కామ్రేడ్ కీ”శే,ఎల్లంకి మారన్నా తల్లి ఎల్లంకి కాశమ్మ మరణించిన వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబానికి భరోసాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది - [* వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాచీన శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పల లింగస్వామి *](https://punnami.in/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0-%e0%b0%8f%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b0%b6%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%82%e0%b0%97%e0%b0%be/): పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాచీన శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి సర్పంచిగా ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా శివాలయం ని దర్శించుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు రాజమౌళి ఉప్పల లింగస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాంపల్లి సాయినాథ్ గౌడ్,క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునుగంటి రాజు గౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. - [* మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన--కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి--](https://punnami.in/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4%e0%b1%83%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%8b%e0%b0%ad%e0%b0%b5-%e0%b0%85%e0%b0%a8%e0%b0%be%e0%b0%a7-%e0%b0%86%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%82-%e0%b0%86/): పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో 11 వ వార్డులో మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉప్పల లింగస్వామి హాజరయ్యారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టుగిరి, 11వ వార్డు సభ్యులు చింతల శైలజ సత్యనారాయణ లతో కలిసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బల్గురి శివ, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ, రాచకొండ రమేష్ బాబు, భూపని బలరాం, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, బోయ శంకరయ్య, బొడ్డు పెళ్లి లోకనాథం, ఈసం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు - [బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం](https://punnami.in/%e0%b0%ac%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%af%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%ab%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%87%e0%b0%95%e0%b0%b0/): బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో మొండిగారెల్లి యువ కళాకారుడికి ఘన గౌరవం యాచారం: డిసెంబర్ 30 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న వేళ కళలు–కళాకారులను ప్రోత్సహించాలనే సదుదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2025” కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో తెలంగాణ నలుమూలల నుంచి 536 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాచారమ మండలం మొండిగారెల్లికి చెందిన పర్శమోని శ్రీను ముదిరాజ్ పాటల పోటీలో పాల్గొని విశేష గుర్తింపు సాధించారు. డింపుల్ డ్రీమ్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ రచన, స్వరకల్పన, దర్శకత్వం వహించిన “డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ” అనే అవగాహనాత్మక గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు తెలంగాణ ప్రముఖ చలనచిత్ర నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు, ప్రముఖ గాయని మంగ్లీ, సింగర్ మోహన భోగరాజు చేతుల మీదుగా ఘనంగా సత్కారం లభించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగి, సామాజిక అంశంపై సందేశాత్మక గీతంతో గుర్తింపు సాధించిన శ్రీను ముదిరాజ్‌కు గ్రామ ప్రజలు, కళాభిమానులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్షముని శ్రీను కుటుంబ సభ్యులు.నక్క బాలరాజా సంగీత తమ కుమారులు. విజయ్ టీచర్. శ్రీనివాస్ గుప్తా. తదితరులు పాల్గొన్నారు - [వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా. రాపర్తి రామకృష్ణ.](https://punnami.in/%e0%b0%b5%e0%b1%88%e0%b0%af%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0-3/): రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30: గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. - [వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణమైన త్యాగం చేస్తా. రాపర్తి రామకృష్ణ.](https://punnami.in/%e0%b0%b5%e0%b1%88%e0%b0%af%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b0-2/): రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 30: గుమ్మా్రేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ను మాజీ ఎమ్ ఎల్ సి ఆగులూరి లక్ష్మి శివ కుమారి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాపర్తి రామకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మీ శివ కుమారి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కరుడుగట్టిన కార్యకర్తరామకృష్ణ అని పార్టీ ఏ కార్యక్రమాలు ఆదేశించిన కష్టపడి పనిచేసే తత్వం కల రామకృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడంతో ప్రత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు ఆయనను కలిసి మునుపటిలాగే పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో రాపర్తి రామకృష్ణ పై వచ్చిన వార్తలు ఆ వాస్తమని చిత్తశుద్ధితో పనిచేసే నాయకులను పార్టీ ఎప్పటికీ వదులుకోదని లక్ష్మి శివకుమారి అన్నారు. అనంతరం రాపర్తి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ తన గొంతులో ప్రాణం ఉన్నంతసేపు వదలను అని నేనిప్పుడు జగన్కు విధేయుడినినని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైయస్సార్సీపీ నాయకులు అంకంరెడ్డి సతీష్, చిట్టిబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల వైఎస్ఆర్సిపి నాయకులు బచ్చల తమ్మారావు, నాగేశ్వరరావు, మరియు రౌతులపూడి మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. - [విజయం సాధించిన కుమ్మర నాయకులను సన్మానించిన : రాష్ట్ర, జిల్లా నాయకులు](https://punnami.in/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b0-%e0%b0%a8%e0%b0%be/): నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర, జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల కులదేవత శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ధర్మేశ్ పురం లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ లు, సర్పంచ్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కుమ్మరు నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘం ఐక్యతను చాటారు. - [కామారెడ్డి జిల్లాలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం](https://punnami.in/%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%98%e0%b0%a8%e0%b0%82%e0%b0%97/): పున్నమి ప్రతినిధి కామారెడ్డి – 29 డిసెంబర్ 2025* *కామారెడ్డిలో ఘనంగా గణిత ప్రతిభా పురస్కారాల ప్రధానం* ==================================== కామారెడ్డి జిల్లా స్థాయిలో గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వేణుగోపాల అధ్యక్షతన, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు నీలం లింగం గారి పర్యవేక్షణలో స్థానిక గంజ్ హైస్కూలు నందు గణిత ప్రతిభా ఫోటీ పరీక్షల కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో 225 మంది విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. డీ.ఈ.వో రాజు గారు మాట్లాడుతూ మనిషి జీవితంలో గణితం లేకపోతే మనకు మనుగడే లేదన్నారు. విద్యార్థులకు గణితమంటే చాలా భయం ఉంటదని ఆ అపోహలను గణిత ఉపాధ్యాయులు తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థులు గణితం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయి గణిత ఫోరం ప్రతిభా పోటీల విజేతలు *తెలుగు మీడియంలో* ప్రథమ స్డానంలో బి.రాంచరణ్ – బోర్లం హైస్కూలు ద్వితీయ స్థానంలో జే.శ్రీకాంత్ – బుడ్మి హైస్కూలు తృతీయ స్థానంలో యం.గీత హంగర్గా హైస్కూలు *ఇంగ్లీషు మీడియం విభాగంలో* ప్రథమ స్డానంలో కే.సాయి వర్షిణి చుక్కాపూర్ హైస్కూలు ద్వితీయ స్థానంలో కే.విష్ణు ప్రియ – మాచారెడ్డి హైస్కూలు తృతీయ స్థానంలో జి మ.ప్రదీప్ – చుక్కాపూర్ హైస్కూలు *ఉర్దూ మీడియంలో* ప్రథమ స్డానంలో షేక్ మారిన్ గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ ద్వితీయ స్థానంలో ఫాతిమా గవర్నమెంట్ హైస్కూలు అడ్లూర్ తృతీయ స్థానంలో బుష్రానాజ్ గల్స్ హైస్కూలు కామారెడ్డి *మోడల్ స్కూల్ & రెసిడెన్షియల్ స్కూల్స్* విభాగంలో ప్రథమ స్డానంలో జి.లక్ష్మణ్ మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ ఎర్రాపహడ్ ద్వితీయ స్థానంలో యస్.మానస సోషల్ వెల్ఫేర్ గల్స్ స్కూల్ దోమకొండ తృతీయ స్థానంలో కే శ్రీజ మాడల్ స్కూల్ ఎల్లారెడ్డి. పోటీలలో ప్రతిభ కనపరచి విజేతలైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ రాజు గారి చేతుల మీదిగా అందించడం జరిగింది. అనంతరం ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవి పొందిన ఈ.నివేదిత గారికి, అశోక్ గారికి, బసంత్ రాజ్ గారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించిన రాజేంద్ర గారికి, స్కౌట్ మాస్టర్ గారికి, రాధాదేవి మేడంకు మొ,, వారికి సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో గణిత ఫోరం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ గారు, జిల్లా సైన్స్ అధికారి సిద్దారాం రెడ్డి గారు, ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతాప్ రెడ్డి గారు, నరేందర్, లక్ష్మణ్, మంజుల, మరియు జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు, విధ్యార్థులు పాల్గొన్నారు - [రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-3/): జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది. - [రాష్ట్ర జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-2/): జిల్లా స్థాయిలో మెరిసిన టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోవూరు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “స్పెల్‌బీ” పోటీల్లో టీ.ఎన్‌.సీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో అర్హత పరీక్ష, క్విజ్‌, ఇంగ్లీష్ పదాల ఉచ్చారణస్పెల్లింగ్ పరీక్షల్లో రాణిస్తూ, మొదటి సంవత్సరం బైపీసీ విద్యార్థిని గాయత్రీ నెల్లూరు జిల్లా స్థాయిలో రెండవ స్థానాన్ని సాధించింది. అదే కళాశాలకు చెందిన ఎంఫీసీ విద్యార్థిని నేహా నిపేక్ష ఆగ్రా లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచింది. సీఈసీ విద్యార్థి మహేంద్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఈ విజయాలపై ప్రిన్సిపాల్‌ సికిందర్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు వివిధ నైపుణ్యాల్లోనూ రాణిస్తూ మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపక వర్గం కూడా విద్యార్థులను శుభాకాంక్షలు తెలిపింది. - [రాష్ట్ర , జిల్లా స్థాయిలో మెరిసిన TNC ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు విద్యార్ధులు](https://punnami.in/%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b/) - [మహాదేవి ( విభాగం -1)](https://punnami.in/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%be%e0%b0%97%e0%b0%82-1/): అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వాయు లింగేశ్వరపురం. ఆ ఊరిలో మహేశ్వరి, దేవా అనే దంపతులు ఉండేవారు. వీరికి పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా వీళ్ళకు పిల్లలు లేరు. అందుకు వీరు చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక ఋషి ఆ ఊరికి వచ్చి, అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న శివుని దర్శనం చేసుకుని,ఆ దంపతులు ఇద్దరూ ఉన్న ప్రదేశం గుండా అతను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఋషి వచ్చి ఆ దంపతులతో ఇలా చెప్పాడు ” తల్లీ నీవు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నావు కదా ” అని ఆ ఋషి వాళ్లను అడిగాడు. మహేశ్వరి ” అవును! మీకు ఎలా తెలుసు” అని అడిగింది. ఋషి ” అంతా ఆ మహాదేవుని మహిమ” అని చెప్పాడు. తరువాత ఆ ఋషి మహేశ్వరి తో ఇలా చెప్పాడు ” తల్లి నీవు ఈ క్షణం నుంచి మహాదేవుడిని పూజించు, అతనికి భక్తి శ్రద్ధలతో శ్రమించుకో ఇలా నువ్వు చేయడం ద్వారా నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది” అని ఆ ఋషి చెప్పాడు. అప్పుడు తన భర్త దేవాతో ఈ విషయాన్ని గురించి చెప్పింది. అలా రోజు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్న శివాలయంనందుకు వెళ్లి రోజు పూజలు చేసి, అభిషేకం చేసి, నైవేద్యం సమర్పించి, చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో మహా దేవుడిని పూజించారు. ప్రతి సోమవారం వారు ఇద్దరూ సాయంత్రం సమయంలో దీపం వెలిగించి,ఆ రాత్రి అక్కడే ఉండి జాగారం చేసి, తెల్లవారి జామున లేచి, అక్కడే ఉన్న కోనేరు లో స్నానం చేసి, మహాదేవుడిని దర్శించుకుని వారి ఇంటికి వెళ్లారు. తరువాత కొన్ని రోజులకి మహేశ్వరి తన పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు తన వెళ్ళిన రెండో రోజు తను తల్లి కాబోతుంది అని తెలిసింది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది మహేశ్వరి. మహేశ్వరి మరియు తన భర్త దేవా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి మహాదేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆరోజు మొత్తం వారు ఇద్దరు గుడిలో ఉండి అన్నదానం కార్యక్రమం చేసి, రాత్రి జాగారం చేశారు. కొన్ని నెలల తరువాత మహేశ్వరి శ్రీమంతం చేసుకుంది. అలా అందరూ సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు మహేశ్వరి తన భర్త అయినా దేవాతో కలిసి మందుల కోసం పట్నం వెళ్ళారు. అప్పుడు దేవా రోడ్డును దాటబోతు ఉండగా ఒక లారీ వచ్చి అతనిని ఢీ కొట్టింది. అప్పుడు అతనిని వైద్యశాలకు తరలించారు. దేవా తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వరి వెంటనే స్పృహ కోల్పోయింది. వెంటనే మహేశ్వరిని అదే వైద్యశాలలో చేర్పించారు. అప్పుడు తన స్థితి చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. అని వైద్యులు చెప్పారు. తన కడుపులో ఉన్న బిడ్డకు చాలా ప్రమాదం ఉందని చెప్పారు. - [పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..!](https://punnami.in/%e0%b0%aa%e0%b1%80%e0%b0%8f%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%86%e0%b0%b6/): పీఏసీఎస్ చైర్మ‌న్ పై ఆశ‌..! వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. వెల్దండ : రాష్టంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నామినేటెడ్ విధానంలో పాలక మండళ్ల‌ను నియమిస్తారనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో వెల్డండ మండల కాంగ్రెస్ నాయకుడు పీఏసీఎస్ చైర్మన్ పదవీ పై ఆశలు పెట్టుకున్నట్టు సొంత పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సహకార పరపతి సంఘాలకు ఇకపై ఎన్నికలు ఉండవని, నామినేటెడ్ పద్దతిలో పాలక మండలాల‌ను వచ్చే సంవత్సరం జనవరి లో ప్రకటించనున్నారనే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రోవైపు వెల్డండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవీ కోసం ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి తో మంతనాలు కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకే చైర్మన్ పదవీ దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. - [మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక .](https://punnami.in/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be-%e0%b0%97%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%80-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b1%80%e0%b0%af-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be/): ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిహారానికి సంబంధించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదికను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎండిఓ జలజాక్షి మేడం ,పి డి గంగాభవాని మేడం ,డి వి ఓ విజయలక్ష్మి మేడం, జె క్యు సి ఖలీల్ సార్, ఏ పి డి గాయత్రీ దేవి మేడం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పనుల అమలు, ఖర్చుల వివరాలు, పరిహార చెల్లింపులపై పారదర్శకంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సామాజిక తనిఖీ ద్వారా పథకం అమలులో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. - [రబి సీజన్ లో యూరియా సరఫరాకు ఇబ్బందులు లేవు : రెవిన్యూ అదనపు కలెక్టర్](https://punnami.in/%e0%b0%b0%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%80%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%b8%e0%b0%b0%e0%b0%ab%e0%b0%b0%e0%b0%be/): నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) రబి సీజన్లో యూరియా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరతలేదని, యాప్ ద్వారా రైతులు సులభంగా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. - [న్యూ ఇయర్ వేడుకల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు – ఎస్సై హెచ్చరిక](https://punnami.in/%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82-%e0%b0%87%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6/): ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మనుబోలు ఎస్సై శివ రాకేష్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అశాంతి సృష్టించడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలకు తావిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సంయమనంతో వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రంతా ప్రత్యేక తనిఖీలు, ప్యాట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు. - [*ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ*](https://punnami.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b0%ae%e0%b1%88/): *శాసన సభ్యులు వనమాడి కొండబాబు* కాకినాడ జిల్లా కాకినాడ సిటీ :కాకినాడ నగర ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 32, 33,34,35 డివిజన్లకు సభందించి పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగాణంలో మధ్యాహ్నం 27,28,29,30,31, డివిజన్లకు సంబంధించి అన్నదాన సమాజంలోనూ ప్రజాధర్భర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారం మార్గాలు చేపట్టడమే కొరకు ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని, నగర అభివృద్ధి, మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై ఫిర్యాదులు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పెన్షన్, ఇళ్ల స్థలాల కోసం పిర్యాదులు అధికంగా వస్తున్నాయని వాటిని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా చేస్తాయని, ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడానికి ఇవి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, టిపిఆర్ఓ శైలజ, డిసిపి కృష్ణారావు, డి కనకారావు, స్థానిక కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, SK రహీం బాబు, గుజ్జు దుర్గ లక్ష్మణరావు, బంగారు సూర్యావతీ సత్యనారాయణ, చింతలపూడి రవి, రిక్క లక్ష్మి, పొంగ బుజ్జి, పసుపులేటి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి బూరయ్య, కోడూరి పెద్ద, రెడ్డనం సత్తిబాబు, నేమాని సత్యనారాయణ, చిట్టిబాబు, మనోహర్ గుప్తా, అమలకంటి బలరాం, పొంగా సత్య, గబ్బర్ సింగ్, బాక్సర్, తోట రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. - [పురస్కారాలకన్నా ముందున్న వ్యక్తిత్వం – డాక్టర్ ప్రసాద్](https://punnami.in/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d/): కుటుంబం అనే బలమైన పునాదిపై నిలబడి, బాల్యం నుంచే క్రమశిక్షణ, కష్టపడి చదవాలనే తపన, ఇతరులకు ఉపకారం చేయాలనే సేవాభావాన్ని అలవర్చుకున్న వ్యక్తి డాక్టర్ ప్రసాద్. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చినా, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిన ఆయన జీవన ప్రయాణం నేటి యువతకు ఒక జీవంత ఆదర్శంగా నిలుస్తోంది. బాల్య దశలోనే తల్లిదండ్రులు నాటిన విలువలు — నిజాయితీ, వినయం, బాధ్యత, మానవత్వం — ఇవే ఆయన వ్యక్తిత్వానికి పునాదులయ్యాయి. చదువులో ప్రతిభ చూపుతూ, ఒక్కో అంచెలో తన లక్ష్యానికి దగ్గరవుతూ ఎదిగిన డాక్టర్ ప్రసాద్, వైద్య విద్యను కేవలం వృత్తిగా కాకుండా ఒక మహత్తర సేవగా భావించారు. యూరాలజీ వైద్యుడిగా అనేక విజయాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు, జాతీయ స్థాయి గుర్తింపులు ఆయనను వరించాయి. అయితే ఈ అన్నిటికన్నా ముందుగా ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన స్వభావమే. రోగితో మాట్లాడే తీరు, వారి బాధను అర్థం చేసుకునే మనసు, నమ్మకాన్ని నింపే మాటలు — ఇవే ఆయనను నిజమైన “డాక్టర్”గా నిలబెట్టాయి. పురస్కారాలు గోడలపై అలంకరణలైతే, రోగుల నమ్మకం ఆయన జీవితానికి అసలైన సత్కారం. విజయ శిఖరాలను అధిరోహించినప్పటికీ నేలమీద నిలబడి ఉండే వినయం, నిరంతరం నేర్చుకోవాలనే తపన, సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలనే త్యాగభావమే డాక్టర్ ప్రసాద్ గారిని మరింత గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. కుటుంబం ఇచ్చిన విలువలు, బాల్యం నుంచే అలవర్చుకున్న క్రమశిక్షణ, అంచెలంచలుగా సాధించిన విజయం — ఇవన్నీ కలిసే డాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి. అందుకే ఆయనకు దక్కిన ప్రతి గౌరవం కేవలం వ్యక్తిగత విజయం కాదు; అది విలువలకు దక్కిన గౌరవం. విజయాన్ని పండగగా మార్చే స్నేహం డాక్టర్ ప్రసాద్ గారికి వచ్చిన ప్రతి గౌరవం ఒక సర్టిఫికెట్ మాత్రమే కాదు. ఆయనతో పాటు చదివిన స్కూల్ మిత్రుల హృదయాల్లో వెలిగే ఆనంద దీపం. “మాలో ఒకడు ఎదిగాడు” అనే గర్వమే ఆ దీపానికి నూనె. విజయం వస్తే పండగలా చేసుకోవడం, బాధ వస్తే భుజం ఇచ్చి ధైర్యం నింపడం — ఇదే వారి స్నేహానికి నిర్వచనం. ఎవరిదైనా సంతోషం అందరిదీ అవుతుంది. ఎవరిదైనా బాధ అందరూ పంచుకుంటారు. అందుకే ఆ స్నేహం కాలాన్ని, దూరాన్ని దాటి నేటికీ అలాగే నిలిచింది. డాక్టర్ ప్రసాద్ గారి స్కూల్ మిత్రులందరూ నేడు వివిధ రంగాల్లో, వివిధ ఖండాల్లో ప్రత్యేక స్థానాల్లో రాణిస్తుండటం విశేషం. పోలీస్ సుధాకర్, సుధా, శ్రీ, త్రినాధ్, రమేష్, మూర్తి, కేఎం, ఎమ్మెస్ ఎస్, మహేష్, సాల్మన్, కిషోర్, వెంకట్, కుమార్, గోవింద్, బలివాడ, చిన్ని తదితరులు తమ తమ రంగాల్లో గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అయితే వారిలో ఒకరిద్దరు మాత్రమే సాధారణ దిగువ–మధ్యతరగతి జీవితాల్లో ఉన్నప్పటికీ, ఈ మిత్రుల సాంగత్యంతో వారు ఒంటరితనాన్ని కాదు — ధైర్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి కారణం వారి మధ్య ఉన్న అపూర్వమైన స్నేహభావమే. ఫిట్‌నెస్‌కు స్ఫూర్తిగా పోలీస్ సుధాకర్ ఈ మిత్రబృందంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పోలీస్ సుధాకర్. క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహనతో ఆయన ఫిట్‌నెస్‌కు నిర్వచనంగా నిలుస్తున్నారు. తన ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని సమానంగా చూసుకుంటూ, మిత్రులకు కూడా ఫిట్‌నెస్‌పై ప్రేరణగా మారుతున్నారు. ఇది వారి స్నేహ బంధానికి మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. పురస్కారాలు డాక్టర్ ప్రసాద్ గారి పేరును ప్రపంచానికి చెబితే, ఆ విజయానికి నిజమైన అర్థం ఇచ్చేది ఆయన మిత్రుల అనుబంధమే. ఎందుకంటే నిజమైన గౌరవం అవార్డుల్లో కాదు… స్నేహ హృదయాల్లో ఉంటుంది. - [విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ - బృందం.](https://punnami.in/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b0/): విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కి అభినందనలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ – బృందం. విశాఖపట్నం,డిసెంబర్ 30 పున్నమి ప్రతినిధి:- విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సేవలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా, ఇప్పుడు డైడెక్టర్‌ జనరల్‌గా (డీజీ) ప్రమోషన్‌ ఇచ్చింది. అయితే అదే హోదాలో విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించాలని సూచించడం గమనార్హం.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ -ఏపీఎంఎఫ్ విశాఖపట్నం యూనియన్ శంక బ్రత బాగ్చి ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. లత, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేశానపల్లి.కిరణ్ కుమార్,కార్య దర్శి బేర.సురేష్ ,సహాయ కార్యదర్శి అప్పలరాజు, కోశాధికారి వాసుపల్లి రాజు , అలాగే కమిటీ సభ్యులు శంకర్, ప్రసాద్ యాదవ్, మీనా, జెమిని న్యూస్ ఎడిటర్ సారా, అనుపమ యాదవ్ , అర్జున్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలను అంద జేశారు. - [తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం](https://punnami.in/%e0%b0%a4%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%97%e0%b1%8b-3/): తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి ఇల్లు మొత్తం దగ్ధమైంది. గ్రామ ప్రజలు ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు RND - [తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం గ్రామంలో అగ్నిప్రమాదం](https://punnami.in/%e0%b0%a4%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%97%e0%b1%8b-2/): తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామ కాపురస్తులు సాయిల నాగరాజు గారి ఇంట్లో ఫ్రిడ్జ్ కాలి పోయి ఫైర్ అయిపోయింది ఇంట్లో కరెంట్ బోర్డులు మొత్తం కాలి పోయాయి RND - [నందిగామలో బాలకోటయ్యకు ఘన సత్కారం](https://punnami.in/%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%81-%e0%b0%98%e0%b0%a8/): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొతుల బాలకోటయ్య కు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కమిటీ చైర్మన్ కొట వీరబాబు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు పి.మీరా హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో బాలకోటయ్య ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు చిరుమామిళ్ళ నానాజీ, జర్నలిస్టులు పఠాన్ సైదాఖాన్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొని బాలకోటయ్య సేవలను ప్రశంసించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మరింత చురుకుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. - [విశాఖపట్నం రూరల్‌లో బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025 వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహణ](https://punnami.in/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b0%e0%b1%82%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be/): విశాఖపట్నం రూరల్ మండలం, కే.కోటపాడు సమీపంలోని చంద్రయ్యపేట గ్రామం దరిదాట్ల లేఅవుట్‌లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం మరియు లలితా గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “బ్రాహ్మణ ఆత్మీయ కలయిక–2025” పేరుతో వనసమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి, హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అలాగే రాష్ట్ర అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి, అధికార ప్రతినిధి డా.పెంట శేషుబాబు శర్మ, రాష్ట్ర కోశాధికారి దంతుర్తి కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు న్యాసావఝ్జల ప్రశాంత్, భాస్కర పట్ల సత్యప్రసాద్ శర్మ, గంటి భాస్కర్, దంతుర్తి కాశీ విశ్వనాథ శర్మ, దూర్వాసులు సాయి, చామర్తి కేశవాచార్యులు, రాచకొండ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. దేవాలయాల్లో సేవలందిస్తున్న అర్చకులకు జీతభత్యాలను క్రమబద్ధంగా అందించడమే కాకుండా, ఇనాం భూముల ఆదాయాన్ని అర్హులైన అర్చకులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని బండారు సత్యనారాయణమూర్తి సభాముఖంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది బ్రాహ్మణులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని వనసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా, ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. - [నందిగామలో మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ ఉత్తర్వుల ప్రదానం](https://punnami.in/%e0%b0%a8%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80-%e0%b0%85%e0%b0%82%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%80/): మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ICDS)లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి చెందిన పలువురు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ అయ్యారు.ఈ సందర్భంగా సోమవారం నాడు నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో అప్గ్రేడ్ ఉత్తర్వులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, శాఖ అధికారులతో కలిసి కార్యకర్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు మహిళా, శిశు సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో తల్లి–శిశు ఆరోగ్యం, పోషణ, విద్యా అవగాహన పెంపొందించడంలో వారి సేవలు అమూల్య మైనవని ప్రశంసించారు.అంగన్వాడీ కార్యకర్తల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం చేపడుతున్న ఈ అప్గ్రేడ్ ప్రక్రియ అభినందనీయమని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. - [చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు*](https://punnami.in/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/): *చిన్నారుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త కోసం ప‌టిష్ట‌ చర్యలు* *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మూడు వ‌రుస స‌మావేశాలు *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలో బాల‌ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర‌ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన చైల్డ్ వెల్ఫేర్ & ప్రొటెక్షన్ కమిటీ, సిఫారసుల కమిటీ, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ స‌మావేశాలు జ‌రిగాయి. వీటిల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్, సీడ‌బ్ల్యూసీ క‌మిటీ స‌భ్యులు, అధికారులు భాగ‌స్వామ్య‌మ‌య్యారు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ కు సంబంధించి తుది నమోదు సర్టిఫికెట్ల జారీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సిఫారసులు క‌లెక్ట‌ర్ చేశారు. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమం, రక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 – సెక్షన్ 27(8) ప్రకారం చైల్డ్ వెల్ఫేర్, సంరక్షణ, రక్షణ, పునరావాసానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ వివిధ అంశాల‌పై మాట్లాడారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు, బాలల అక్రమ ర‌వాణ‌ నిరోధానికి, బాల్య వివాహాల నివారణకుచ, పిల్లల పునరావాసం కోసం త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాల కార్మిక వ్యవహారాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, బాల్య వివాహాల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం నుంచి పిల్లలను రక్షించే చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని సూచించారు. డ్రాప్‌ఔట్ పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని టీకాలు సమయానికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. బాల‌, బాలిక సంర‌క్ష‌ణ గృహాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాలని, వ‌స‌తులు క‌ల్పించాల‌ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య‌ద‌ర్శి ఆర్. స‌న్యాసినాయుడు సూచించారు. పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర ఆహారం అందించాలని, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో సేవ‌లందించాల‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రామలక్ష్మి శాఖాపరమైన అంశాలపై వివరించారు. అనంత‌రం అధికారులంతా క‌లిసి పోస్ట‌ర్ను ఆవిష్క‌రించారు. ఈ సమావేశాల్లో మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, జువెనైల్ వెల్ఫేర్ విభాగం అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు. - [జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*](https://punnami.in/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d/): *జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి* *అధికారుల‌కు, దాత‌ల‌కు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు సాయం చేయాల‌నే దృక్ప‌థంతో నెల‌కొల్పిన సంజీవ‌ని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వ‌చ్ఛంద విరాళాలు అందించాలని, అధికారుల‌ను, దాత‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ విజ్ఞ‌ప్తి చేశారు. నూతన సంవత్సరం – 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్న‌వించారు. అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలపడం సందర్భంగా పూలు, పండ్లు, కేకులు, మొక్కలు తదితరాలను అందించడం కన్నా.. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని ప్ర‌త్యేక సందేశం ద్వారా సోమ‌వారం విజ్ఞప్తి చేశారు. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’ ద్వారా సేకరించిన విరాళాలు జిల్లాలోని అవసరమైన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా, సమాజంలో బాధితులకు అండ‌గా నిల‌వ‌డంతో పాటు, సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలవగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవని స్పష్టం చేస్తూ, సేవాభావంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని జిల్లా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు. విరాళాలకు సంబంధించిన‌ వివరాలు: నిధి పేరు: SANJEEVANI NIDHI – District Relief Fund ఖాతా సంఖ్య: 50100500766040 బ్యాంకు & IFSC: HDFC Bank – HDFC0009179 - [ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు*](https://punnami.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b0-%e0%b0%b5%e0%b1%87-3/): *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 110 ఫిర్యాదులు* *ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు ఈ రోజు 110 ఫిర్యాదులు రావడం జరిగినది* ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., గారు ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 110 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ గారికి అందజేసినారు. సిపి గారు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. - [బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు*](https://punnami.in/%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d/): *బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు బోట్ అసోసియేషన్ పెద్దలు* *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి* *9 మంది మత్స్యకారులకు పదివేలు(10000/రూ) మరియు 4000 విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ*అదేవిధంగా బోటు యజమానికి 10000 మరియు నిత్యావసర వస్తువుల అందజేసిన ఎమ్మెల్యే మరియు అసోసియేషన్ సభ్యులు* *మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే* *మత్స్యకారుల విడుదలకు నిరంతరం పర్యవేక్షిస్తున్న అసోసియేషన్ పెద్దలకు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే* ఈరోజు ఫిషింగ్ హార్బర్ లో ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులకు పోషణ నిమిత్తం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు అసోసియేషన్ పెద్దలు శ్రీ లక్ష్మణరావు గారు అప్పారావు గారు సహకారంతో మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. 9 మంది మత్స్యకార కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు చ (10000) చొప్పున ,ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మరియు 4000 రూపాయల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు . అదేవిధంగా బోటు యజమానికి 10000 రూపాయలు మరియు నిత్యాసర వస్తువులను అందజేశారు .కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 9 మంది మత్స్యకారులను క్షేమంగా వెనక్కి రప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని తెలియజేశారు. మత్స్యకార కుటుంబీకులు అపోహలకు పోకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు. బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్న ఇటీవల సంఘటన నేపథ్యంలో మత్స్యకారుల విడుదలకు కొంత ఆలస్యం అయిందని అతి త్వరలో వారిని వెనక్కి రప్పించే బాధ్యత కేంద్ర మంత్రి, విశాఖ ఎంపీ భరత్ గారు, విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలను నిరంతరం పర్యవేస్తున్నామని తెలియజేశారు. మత్స్యకారులకు తాము అండగా ఉన్నామని వారి కుటుంబ సభ్యులు అధైర్య పడకూడదని ఎమ్మెల్యే వంశీ గారు తెలిపారు . మత్స్యకారుల కుటుంబ సభ్యుల పోషణ నిమిత్తం ప్రభుత్వానికి కూడా 20000 రూపాయలు ఇవ్వాలని తాము నివేదించానని వివరించారు .కార్యక్రమంలో బోటు అసోసియేషన్ పెద్దలు కూటమి శ్రేణులు పాల్గొన్నారు…. - [10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ](https://punnami.in/10-%e0%b0%9c%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%be-%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%80%e0%b0%8e%e0%b0%82%e0%b0%b8%e0%b1%80-%e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d/): 10 జోన్లుగా జీవీఎంసీ పునర్వ్యవస్థీకరణ. *జనవరి 1 నుండి అన్ని జోనల్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం. * జోనల్ కమిషనర్లు జనవరి 1న జోనల్ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధం చేయాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో 2026 జనవరి 1వ తేదీ నుండి పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలను కార్యచరణ ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జోనల్ కమిషనర్ లను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆదేశించారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న జోనల్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది జోన్లను 10 జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి జోనల్ కార్యాలయాలు, అధికారులు,సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. 2026 జనవరి 1 వ తేదీ నుండి 10 జోనల్ కార్యాలయాలు పనిచేయాలని అందుకు సంబంధించిన ఫైల్స్, రికార్డులు తారుమారు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఆయా జోన్లకు తీసుకువెళ్లాలన్నారు. ఇకపై సిబ్బంది, అధికారులు ఆయా జోనల్ కార్యాలయాల నుండి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. ఆయా జోనల్ కార్యాలయం పరిధిలో ఉన్న వార్డులు, సచివాలయాలు ప్రజలకు తెలిసే విధంగా సచివాలయాల వారీగా వార్డు కార్యదర్శులు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లను, అధికారులను కమిషనర్ ఆదేశించారు. “” జివిఎంసి క్రొత్త జోన్ల వివరాలు”” భీమునిపట్నం జోన్ – వార్డులు: 1, 2, 3, 4 – మొత్తం 4 వార్డులు – 58.884 చ.కి.మీలు, మధురవాడ జోన్ – వార్డులు: 5, 6, 7, 8, 98 – మొత్తం 5 వార్డులు – 95.668 చ.కి.మీ లు, ఈస్ట్ జోన్ – వార్డులు: 9, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 28 – మొత్తం 15 వార్డులు – 48.527 చ.కి.మీ లు, నార్త్ జోన్ – వార్డులు: 14, 24, 25, 26, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55 – మొత్తం 17 వార్డులు – 19.928 చ.కి.మీలు, సౌత్ జోన్ – వార్డులు: 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 41 – మొత్తం 13 వార్డులు – 9.698 చ.కి.మీలు, వెస్ట్ జోన్ – వార్డులు: 40, 52, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 89, 90, 91, 92 – మొత్తం 14 వార్డులు – 72.937 చ.కి.మీలు, పెందుర్తి జోన్ – వార్డులు: 88, 93, 94, 95, 96, 97 – మొత్తం 6 వార్డులు – 75.038 చ.కి.మీలు, గాజువాక జోన్ – వార్డులు: 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 86, 87 – మొత్తం 15 వార్డులు – 108.115 చ.కి.మీలు, అగనంపూడి జోన్ – వార్డులు: 77, 78, 79, 85 – మొత్తం 4 వార్డులు – 102.830 చ.కి.మీలు, అనకాపల్లి జోన్ – వార్డులు: 80, 81, 82, 83, 84 – మొత్తం 5 వార్డులు – 41.079 చ.కి.మీలు గా విభజించడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇకపై జీవీఎంసీ కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాలు ,సేవలు ఆయా జోనల్ కార్యాలయాల ద్వారా పొందవచ్చునని తెలిపారు - [జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు.](https://punnami.in/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%8e%e0%b0%82%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2-%e0%b0%aa-3/): జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు. – జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 100 వినతులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరం లో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 100 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 06, మధురవాడ జోన్ కు 16, ఈస్ట్ జోన్ కు 15, వెస్ట్ జోన్ కు 07, నార్ట్ జోనుకు 06, సౌత్ జోన్ కు 12, పెందుర్తి జోన్ కు 07, అగనంపూడి జోన్ కు 02, గాజువాక జోన్ కు 07, అనకాపల్లి జోన్ కు 01, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 21 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 14, రెవెన్యూ విభాగమునకు 11, ప్రజారోగ్య విభాగమునకు 06, పట్టణ ప్రణాళిక విభాగమునకు 43, ఇంజినీరింగు విభాగమునకు 18, మొక్కల విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 05 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, సిసిపి ఏ.ప్రభాకర రావు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎమ్.దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, కార్యదర్శి బివి రమణ ,స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, సిపి, డిసీపీ లు, ఏసీపీ లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,బయాలజిస్ట్, తదితరులు పాల్గొన్నారు. - [కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం...* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా... లేరా...?*](https://punnami.in/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%8f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6-%e0%b0%85%e0%b0%82/): పున్నమి ప్రతినిధి: *కొత్తగా ఏర్పడిన పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ల మీద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం…* 🎥 *ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా… లేరా…?* *మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ శ్రీ దండెం రాంరెడ్డి మీడియా సమావేశంలో దండెం రాంరెడ్డి మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే ఉన్నారా.. లేరా..? అనేది ప్రజలకు అర్ధం కావడం లేదు అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉంది అన్నారు, వ్యవసాయం మీద ఆధారపడిన నాలుగు గ్రామాలను తెచ్చి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ లో కలిపారు ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ని జీహెచ్ఎంసీ లో కలపడం వలన ఆయా గ్రామాల ప్రజల మీద తీవ్ర టాక్స్ భారం పడుతుంది, అందువలన ఏం అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు, ఎల్బీనగర్ జోన్ లో ఉన్న పెద్ద అంబర్ పేట్, కుంట్లూరు డివిజన్ లను నాగోల్ సర్కిల్ లో కాకుండా పక్కనే ఆనుకొని ఉన్న హయాత్నగర్ సర్కిల్ లో ఈ డివిజన్ల ను కలపాలి అని అన్నారు, పెద్ద అంబర్ పేట్ మరియు కుంట్లూరు డివిజన్ల లోని ఓటర్ల వ్యత్యాసం, పెద్ద అంబర్ పేట్ డివిజన్ లో 55 వేలకు పైచిలుకు, కుంట్లూరు డివిజన్ లో 12 వేల పైచిలుకు ఓటరు వ్యత్యాసం ఉంది అన్నారు, అదేవిధంగా కుంట్లూరు రెవెన్యూ ఏ లేదు దానిని ఒక డివిజన్ గా చేశారు అన్నారు, కుంట్లూరు తట్టి అన్నారం కలిపి ఒక డివిజన్ గా చేయాలని తెలిపారు, ఈ విషయమై కమిషనర్ గారికి మెమోరాండం కూడా అందజేయడం జరిగింది అన్నారు, రంగారెడ్డి జిల్లా లోనే సీనియర్ శాసన సభ్యుడిని అని చెప్పుకునే మన ఎమ్మెల్యే కి ఈ మాత్రం అవగాహన లేదా అని ప్రశ్నించారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న అన్ని డివిజన్ల లో లోపాలు సరిచేసి అన్ని డివిజన్లు సరిసమానంగా ఏర్పాటు చేయాలని అన్నారు, దీని మీద స్థానిక ఎమ్మెల్యే పునరాలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు, లేని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగా తేల్చుకుంటాం అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఈదమ్మల్ల బలరాం, మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ అర్చన దామోదర్, తాజా మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ తొండెపు రోహిణి బ్రహ్మానంద రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేసారం బాలకృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్ పిల్లి నగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ భాస్కర్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు జోర్క రాము, గాదె శేఖర్, పత్తి రవికాంత్, ఊటుకూరి కర్నాకర్, గాయాల రాము, పండుగుల సత్యనారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు. దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం} - [*అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి](https://punnami.in/%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b9%e0%b1%81%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%80-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0/): పున్నమి ప్రతినిధి: అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలి* *గ్రేటర్ పరిధిలోని మండలాల్లో అక్రిడిటేషన్ల సంఖ్య పెంచాలి* *ఐ అండ్ పి ఆర్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) బృందం* గ్రేటర్ హైదరాబాద్ పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా జీవోలో సవరింపులు చేపట్టాలని కోరుతూ టీ యూ డబ్ల్యూ జే (ఐజేయూ) బృందం సమాచార శాఖ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయం లోని ఐ అండ్ పిఆర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ప్రియాంకను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, హెచ్ యు జె అధ్యక్షులు శిగా శంకర్, మేడ్చల్ అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మేడ్చల్ కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణలు సమస్యను ఆమెకు వివరించారు. గ్రేటర్ పరిధిలోని అర్బన్ మండలాలలో ప్రధాన పత్రికలలో నలుగురు నుంచి ఐదుగురు జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని ఆమెకు తెలిపారు. నూతన జీవో 252 ద్వారా ఒక పత్రికకు మండలానికి ఒకే అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురు నలుగురికి అక్రిడిటేషన్ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రూరల్ మండలాలతో కాకుండా అర్బన్ మండలాలను ప్రత్యేకంగా చూడాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆవేదనలు దృష్టిలో ఉంచుకొని జీవోలో సవరణలు చేసి న్యాయం చేయాలని కోరారు. *సానుకూలంగా స్పందించిన కమిషనర్* గ్రేటర్ పరిధిలోని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్య పై పౌర సంబంధాలు అండ్ సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక సానుకూలంగా స్పందించారు. అర్బన్ మండలాలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వడం న్యాయ బద్ధమైనదని తెలిపారు. త్వరలోనే మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీని ఇచ్చారు. - [రబి సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన: మంత్రి](https://punnami.in/%e0%b0%b0%e0%b0%ac%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%80%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%aa%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a3/): నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఈరోజు(సోమవారం) రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో, రబీ సీజన్లో యూరియా పంపిణి పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరతలేదని అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. - [రెడ్డిపేటలో ఉచిత నట్టల నివారణ శిబిరం](https://punnami.in/%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%87%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%89%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b2-%e0%b0%a8/): 1404 జీవాలకు మందులు…… కామారెడ్డి, 29డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గొర్రెల పెంపకం దారులు ఉచిత నట్టల నివారణ మందుల శిబిరాలను సద్వి నియోగం చేసుకోవా లని మండల పశువైద్యాధికారీ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరాలు రైతులకు గొప్ప ఆశీస్సుగా మారాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారీ, సర్పంచ్ చేతుల మీదుగా రెడ్డిపేట గ్రామంలో ఉచిత నట్టల నివారణ శిబిరాన్ని ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, నారాయణ జేవీఓ, రమేష్ వీఏ , సిబ్బంది ఆంజనేయులు, బలమని, గోపాల మిత్ర హారిక, స్వామి, గొర్రెల పెంపకం దారులు రాములు, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. - [వరుస దొంగతనాలతో హడలిపోతున్న కోళ్ల పెంపకం దారులు](https://punnami.in/%e0%b0%b5%e0%b0%b0%e0%b1%81%e0%b0%b8-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%82%e0%b0%97%e0%b0%a4%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%a1%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%81/): కృత్తివెన్ను మండలం సీతనపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామం లో 25 వ తారీకు అర్ధరాత్రి జరిగిన కోళ్లు దొంగతనం కేసులో కొప్పర్తి. అచ్చిబాబు s/o లక్ష్మణరావు గుడ్లవల్లేరు మండలం, పేరం కొండలరావు s/o దుర్గారావు, గుడ్లవల్లేరు మండలం అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి 10కోడిపుంజులు, బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్టు కృత్తివెన్ను SI పైడిబాబు తెలిపారు. ఇటు బంటుమిల్లి లో కూడా షుమారు 6 లక్షలు విలువ చేసే 10 కోడిపుంజులను ఆదివారం తెల్లవారు జామున దొంగలు అపహారించినట్టు సమాచారం. సంక్రాంతి సమీపిస్తుండడం తో కోళ్లు దొంగతనాలు జరగడం అవి లక్షల ఖరీదు చేసేవి కావడం తో కోళ్ల పెంపకం దారులు హడలెత్తిపోతున్నారు. - [యూరియా కోసం రైతుల తిప్పలు పట్టనట్టున్న ప్రభుత్వం](https://punnami.in/%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b2/): మిరుదొడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. యూరియా వస్తుందని తెలవడంతో భారీగా తరలివచ్చిన రైతన్నలు. యూరియా కోసం ఓ షాప్ ముందు భారీగా లైన్ కట్టిన అన్నదాతలు. వచ్చిన యూరియా అందరికీ సరిపోక నిరాశకు గురైన రైతన్నలు. పున్నమి ప్రతినిధి మిరుదొడ్డి మండలం మల్లేశం . సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి ఉదయం 6 గంటల నుంచి ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు యూరియా కోసం లైన్లో నిల్చొని ఉన్నారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇచ్చిన స్టాక్ లేదని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వింత నిబంధనాలతో రైతులను ఇబ్బంది పెడుతూ యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల ఫర్టిలైజర్ యాప్ తీసుకు రావడంతో గందరగోళంలో పడిన రాష్ట్ర రైతాంగం. అయితే ఈ యాప్ లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తీసుకోకపోతే మళ్లీ 15 రోజుల వరకు యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధనలు తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. యాప్ లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అడగడంతో కౌలు రైతులకు. రైతుబంధు నిధులు వేస్తారేమో అని ఆందోళనలో ఉన్న భూ యజమానులు. ఈ నేపథ్యంలో తమకు భూమినీ కౌలికి ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కౌలి రైతులు. యూరియా తీసుకునే లిమిట్ పెట్టిన ప్రభుత్వం. పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ షాపుల్లో లేని యూరియా యాప్ లో ఎలా అని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతన్నల పైన కక్షపూరిత వైఖరి మాని అన్నదాతలకు యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు డిమాండ్ చేయడం జరిగింది. - [అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ](https://punnami.in/%e0%b0%85%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ad%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b2/): బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ## Pages - [Entities](https://punnami.in/entities/): DECLARATION FORM-B EAST GODAVARI COURT ORDER ELECTION NOTICE NELLORE JOURNALISTS COOP ELURU COURT ORDER INFO PUBLIC RELATIONS AD RATE REVISION JOURNALISM CERTIFICATE PRESS ACADEMY AP KHAMMAM COURT ORDER NELLORE POLICE CLEARANCE POST OFFICE REGISTRATION POST OFFICE RENEWAL MONTHLY PRESS COUNCIL INDIA FEE RECEIPT PRESS COUNCIL INDIA NO DUE CERTIFICATE PUBLISHER DECLARATION CERTIFICATE REGISTRATION FORWARDING LETTER RNI REGISTRATION MONTHLY RNI REGISTRATION WARANGAL COURT ORDER ANNUAL STATEMENT FORM II PUNNAMI TELUGU MONTHLY 2015 EDITORIAL GUIDELINES PUNNAMI TELUGU - [Terms and Conditions](https://punnami.in/terms-and-conditions/): Effective Date: 22-10-2025 Welcome to Punnami! By accessing or using our website (www.punnami.in) or mobile application, you agree to these Terms and Conditions. Please read them carefully before using our services. Acceptance of Terms Using Punnami services indicates agreement to these Terms If you do not agree, please do not access or use the services Use of Services You agree to use our services lawfully and responsibly. Prohibited actions include: Unauthorized access, hacking, or disruption of services Posting harmful, offensive, or illegal content Infringing on intellectual property rights Transmitting malicious code or viruses Account Registration Some features require creating an account Users must provide accurate, current, and complete information You are responsible for securing your account and credentials Notify Punnami immediately of unauthorized account use Intellectual Property All content, logos, graphics, and text are owned by Punnami or licensors Users are granted a limited, non-exclusive, non-transferable license for personal use Copying, modifying, distributing, or commercial use without permission is prohibited User Contributions Comments or feedback must be lawful, non-offensive, and respectful Punnami may remove content violating these Terms Users retain ownership of their submitted content but grant Punnami a license to use it in the platform Third-Party Links External websites or services may be linked within our platform Punnami is not responsible for third-party content or policies Disclaimers Services are provided “as is” without warranties of any kind Accuracy, completeness, or reliability of content is not guaranteed Use of services is at your own risk Limitation of Liability Punnami is not liable for any direct, indirect, incidental, or consequential damages This includes loss of data, revenue, or other intangible losses arising from use or inability to use the services Indemnification Users agree to indemnify Punnami and affiliates from claims, liabilities, or costs arising from: Use of services Violation of Terms User content submitted Governing Law Terms are governed by the laws of India Disputes are subject to courts in Hyderabad, Telangana Changes to Terms Terms may be updated periodically Latest version is available on the website and app Continued use constitutes acceptance of updated Terms Contact Us For any questions regarding these Terms:📧 Email: punnami.news@gmail.com, info@punnami.in - [Privacy Policy](https://punnami.in/privacy-policy/): Last Updated: 22-10-2025 At Punnami, your privacy is important. This Privacy Policy explains how we collect, use, disclose, and protect your personal information when you use our website (www.punnami.in) and mobile application (“App”). By accessing or using our services, you agree to the practices described here. Information We Collect We collect the following types of information to provide and improve our services: Personal Information (voluntarily provided by users) Name Email address Phone number Postal or residential address Usage & Technical Information (collected automatically) Device type, operating system, and browser type IP address and approximate location App usage data, website navigation patterns, and diagnostic information Location Data Collected only when necessary for app or website functionality Always after obtaining user consent Cookies and Tracking Technologies We use cookies, web beacons, and similar tools to improve user experience, analyze traffic, and optimize content delivery Users can manage cookie settings via their browser or device How We Use Your Information Your data helps us to: Provide, maintain, and improve our services Personalize content and recommend features Communicate important updates, support, or service notifications Detect and prevent fraud, unauthorized access, or illegal activities Comply with legal obligations and enforce our policies Data Sharing and Disclosure We do not sell or rent your personal information. Your data may only be shared under these circumstances: Service Providers: Trusted partners assisting in operations (bound by confidentiality) Legal Compliance: When required by law, to protect rights, property, or user safety Business Transfers: In mergers, acquisitions, or sales of assets Data Security Reasonable technical, administrative, and physical safeguards are implemented to protect your information No system is 100% secure; absolute security cannot be guaranteed Users are encouraged to maintain secure login credentials User Rights Depending on your jurisdiction, you may have the following rights: Access, review, and update personal information Request deletion of your account and data Withdraw consent for processing Opt-out of promotional communications Request restriction or portability of data To exercise these rights, contact: punnami.news@gmail.com Children’s Privacy Services are not intended for children under 18 We do not knowingly collect personal information from minors If a parent/guardian believes a child has submitted personal data, please contact us for deletion Third-Party Services Our website or app may contain links to external services Punnami is not responsible for third-party content, practices, or privacy policies Policy Updates Privacy Policy may be updated periodically Latest version is always available on our website and app Significant changes may be communicated via email or notifications Contact Us For any questions regarding this Privacy Policy:📧 Email: punnami.news@gmail.com, info@punnami.in - [e-పేపర్](https://punnami.in/e-%e0%b0%aa%e0%b1%87%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d/) - [Home](https://punnami.in/): AP భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన నందిగామ గాంధీ సెంటర్ వద్ద రోడ్లపై రాయలచెరువును పరిశీలించిన చంద్రగిరిఎమ్మెల్యే పులివర్తి నాని పెనుగంచిప్రోలులో వివాహ రిసెప్షన్ కు హాజరైన మల్లికార్జునరావు ని పరామర్శించిన రాజోలు టిడిపి – భక్తి ఉదయగిరి, సీతారామంజనేయ స్వామి వారి విగ్రహ పూజ గణంగాజరిగింది by NAGURUSMAN Read 0 Mins – భక్తి శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాస సందర్భంగా పూజలు ప్రారంభం by MADDU SUBRAMANYAN Read 0 Mins TG సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ 💰మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి జన్మదిన – భక్తి ఉదయగిరి, సీతారామంజనేయ స్వామి వారి విగ్రహ పూజ గణంగాజరిగింది by NAGURUSMAN Read 0 Mins – భక్తి శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాస సందర్భంగా పూజలు ప్రారంభం by MADDU SUBRAMANYAN Read 0 Mins AP భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన నందిగామ గాంధీ సెంటర్ వద్ద రోడ్లపై రాయలచెరువును పరిశీలించిన చంద్రగిరిఎమ్మెల్యే పులివర్తి నాని పెనుగంచిప్రోలులో వివాహ రిసెప్షన్ కు హాజరైన మల్లికార్జునరావు ని పరామర్శించిన రాజోలు టిడిపి TG సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు పత్తి రైతుల చరవాణి నెంబర్లు అప్డేట్ 💰మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ.98.3 కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి జన్మదిన Top of the Weeks – పల్నాడు నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ – పల్నాడు నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ – తిరుపతి నాయుడుపేట వద్ద బస్సులో చెలరేగిన మంటలు – తిరుపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్* – నాగర్‌కర్నూల్ గుర్తుతెలియని వాహనం ఢీకొని పాడి గేదె మృతి Explore Categories See More E-పేపర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భక్తి సినిమా సక్సెస్ స్టోరీస్ బిజినెస్ హెల్త్ టిప్స్ E-పేపర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భక్తి సినిమా సక్సెస్ స్టోరీస్ బిజినెస్ హెల్త్ టిప్స్ క్రైమ్ Crime అంతరాష్ట్ర దొంగ ని అరెస్ట్ చేసి తెలుగు బిగ్ బాస్‌పై కలకలం – జిల్లా వ్యాప్తంగా యాచకులపై స్పెషల్ డ్రైవ్ Business ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు రూ.12వేల కోట్లతో ఫోన్‌పే మెగా ఐపీఓ..! డాలర్‌పై రూపాయి హవా.. భారీ లాభంతో Cinema అక్టోబర్ 25న ఊర్వశి ఓటిటిలో విడుదలవుతున్న భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాను: నటి రేణూ బాల సరస్వతి మృతి: సంతాపం తెలిపిన Kids ప్రేమకు ప్రతిరూపం అమ్మ… సమయస్ఫూర్తి మీ పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకండి. Stories for you See More 01 ఉదయగిరి, సీతారామంజనేయ స్వామి వారి విగ్రహ పూజ గణంగాజరిగింది by NAGURUSMAN October 22, 2025 02 శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాస సందర్భంగా పూజలు ప్రారంభం by MADDU SUBRAMANYAN October 22, 2025 03 కార్తీక మాసం లో శివాలయ దర్శన విధానం వివరముగపున్నమి పాఠకుల కోసం by Puvvada Nagendra Kumar October 21, 2025 04 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా కేదారి గౌరీ వ్రతం by MADDU SUBRAMANYAN October 21, 2025 Editor pick’s గుజరాత్ నూతన కేబినెట్‌లో రవీంద్ర జడేజా Geddam Prathap October 18, 2025 అయోధ్య లో 26 లక్షల దీపాలతో అద్భుత దృశ్యం -రెండు గిన్నిస్ Puvvada Nagendra Kumar October 19, 2025 Punnami Telugu Dina Patrika Explore Now Recent Articles – ఎన్ టి ఆర్ జిల్లా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో by NANDIRAJU RAJA HANUMANTHA RAO Read 0 Mins – తూర్పు గోదావరి సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి ప్రభుత్వ బాలికల వసతి గృహ బాలిక పై జరిగిన అత్యాచారం ఘటన పై ASWO ను సస్పెండ్ చేయాలని by ANAND BABU PENKE Read1 Mins – హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 23 : ప్రజల భవిష్యత్తే ధ్యేయంగా హైదరాబాద్ అభివృద్ధే by S . DHANUNJAY Read 0 Mins – డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ పొన్నాడ సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన గొల్లపల్లి సూర్యరావు ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ by UNDRU PRASANTH Read 0 Mins – తిరుపతి తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.* తుని కోమటిచెరువు దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం.* మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుంటే అడ్డుకున్న నారాయణరావు ఫ్యామిలీ. ఆందోళన by R SURENDRA KUMAR Read 0 Mins – పల్నాడు నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) గారు నేడు మాచర్ల పట్టణ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ( గబ్బర్ సింగ్ ) . ఆయనను మర్యాదపూర్వకంగా by ANJI REDDY Read 0 Mins Follow US Facebook 45k Twitter 57k YouTube 45k Instagram 45k Top Week – Featured అయోధ్య లో 26 లక్షల దీపాలతో అద్భుత దృశ్యం Read 0 Mins – Featured బెంగళూరు నుండి 3.61 లక్షల విరాళం: పవన్ కల్యాణ్ Read 0 Mins – Featured – విద్య విజ్ఞానం – హెల్త్ టిప్స్ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి Read1 Mins – Featured – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల ప్రారంభం: ఎంపీ డీకే Read1 Mins - [About Us](https://punnami.in/about-us/) - [Password Reset](https://punnami.in/password-reset/) - [Edit Profile](https://punnami.in/edit-profile/) - [Login](https://punnami.in/login/) - [Register](https://punnami.in/register/) - [Bookmark](https://punnami.in/bookmark/) - [Blog](https://punnami.in/blog/) - [Contact](https://punnami.in/contact/): Send a Message Call Us Need assistance? Call us today for quick, friendly, and reliable support with all your needs and questions. +34 000 0000 Visit Us Visit us for exceptional service, a welcoming atmosphere, and personalized attention. Experience the difference firsthand today. Nellore Email punnami.news@gmail.com [comment]: # (Generated by Hostinger Tools Plugin)