Tuesday, 9 December 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

వృత్తి జీవితం – 1 పనివేళలో అదనపు గంట ( 1 )

వృత్తి జీవితం – 1 పనివేళలో అదనపు గంట ( 1 ) కొన్ని సంవత్సరాల క్రితం టైం మేనేజిమెంటు విూద ఒక వర్క్‌ షాపు నిర్వహిస్తూ, ఒక ఆస్తక్తి కరమైన సర్వే చేశాం . ఆ ట్రెనింగ్‌ ప్రోగ్రాంలో ఒక 30 మంది ఉన్నారు. 40 నుంచి 50 మధ్య వయసు వారు. మధ్య స్థాయి మేనేజలు. వారిని ఒక ప్రశ్న అడిగాం. ”మేడమ్స్‌ అండ్‌ సార్స్‌. మాకు తెలుసు విూరంతా తమ తమ పనుల్లో, ఉద్యోగాలలో బిజీ. సకాలంలోపూర్తి చేయాల్సిన పని వత్తిడి కూడా విూ విూద ఉంది . ఇది తెలిసి కూడా, విూ బాసు, విూకు ఒక అదనపు పని లేదా ప్రాజక్టు వప్ప జెప్పారు . విూరు దాన్ని స్వీకరిస్తారా? అయితే, ఈ అదనపు పనికి గాను విూకు అదనపు జీతం / బోనస్‌ లేదా ఓవర్‌ టైం వంటి అదనపు పారితోషికం ఉండదు! ఎవరు టేకప్‌ చేస్తారో చేతులె త్తండి ! ”అని ఒక్క చెయ్యి కూడా పైకిపోలేదు . కొంతమంది అన్నారు , ‘మాకు ఉన్న పని వత్తిడితో, మేము ఎక్స్‌ట్రా పని చేయలేము సార్‌ అని మా బాస్‌తో చెబుతాము ‘అని మరి కొందరు’ విూరు చెప్పిన అదనపు బాధ్యత తప్పకుండా స్వీకరిస్తాను సర్‌. కానీ, నా చేతిలో ఉన్న పనిలో కొంత భాగం మరొకరికి అప్పగించగలరా? లేదా, నాకు అప్పగించిన పని పూర్తి చెయ్యడానికి మరికొంత సమయం ఇవ్వగలరా? నా ప్రాజక్టు డెడ్‌ లైను కొంత పొడిగించగలరా? అని వారి పై అధికారులతో ‘నెగోషియేట్‌ ‘ ( బేరసారాలు ) చేస్తాము అని చెప్పారు ! బాగుంది ఐడియా. కానీ, మేము అడిగిన ప్రశ్నలో, వారు కోరే ఆ రెండు వెసులుబాట్లూ  ఉండవు అని చెప్పాము. అలాంటప్పుడు ఏమి చేస్తారు? అని మళ్ళీ అడిగాము కాస్త మెతక స్వభావం ఉన్న వారు, ‘మనస్పూర్తిగా అయితే ( అదనపుబాధ్యత) స్వీకరించము సర్‌ ! విూకు తెలుసు మా సంస్థలో ఎంత పని వత్తిడి ఉంటుందో. ఫోను స్విచ్చాఫ్‌ చెయ్యలేము సెలవు రోజు కూడా. ఇకపై అధికారి అడిగారు కాబట్టి, నో చెప్పలేము కాబట్టి టేకప్‌ చేస్తాం. మాకు చేతనయినంత వరకు చేస్తాం . కానీ,2 పడవల విూద కాళ్ళు పెడితే, పని నాణ్యత దెబ్బ తింటుంది. మా ఆరోగ్యాలూ పాడవుతాయి ! అని మా మేనేజిమెంటు వారికి విూరయినా చెప్పండి ‘అని మాతో అన్నారు .ఆ ట్రెయినింగ్‌ కి వచ్చిన మరొక మేనేజర్‌ జోక్‌ చేశారు, ఇలా. ”ఏదో టైం మేనేజిమెంటు పైన ట్రెయినింగ్‌ ప్రోగ్రాం – అంటే ఇలా వచ్చాం. విూరేదో మాకు నేర్పుతారని ఇలాంటి ఫిట్టింగులు పెడతారు అనుకోలేదు” అని. అందరూ గొల్లున నవ్వారు! సో, ఏతావాతా, మనస్పూర్తిగా ఎవ్వరూ చేతులెత్త లేదు. అప్పుడు మరో ప్రశ్న జోడించాం. అయితే , ఈ అదనపు ప్రాజక్టు విూరు ఒప్పుకుంటే, రోజుకు ఒక గంట అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది . కానీ, విూకు విూ కంపెనీ యజమాని /ఎండీతో నేరుగా కలిసి పని చేసే అవకాశం ఉంటుంది ! విూరు ఆయన కి మెయిల్‌ పంప వచ్చు. ఆయన విూకు ఫోన్‌ చేస్తూ ఉంటారు! అని. ఈ సారి దాదాపు అందరూ చెయి పైకి లేపారు . దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగులలో నిజమైన సందిగ్ధం ! చూస్తూచూస్తూ ఇలాంటి అవకాశం ఎవరు వదులుకుంటారు ? కంపెనీ యజమానితో కలిసి పని చేసే అవకాశం. మనమేంటో నిరూపించుకునే అవకాశం. మన సామర్ధ్యం పైవారికి తెలిసే అవకాశం! కానీ ఎలా? మన ఉద్యోగం సేఫ్‌. పైగా మన పనితనం డైరక్ట్‌గా దేవుడికి తెలిస్తే, ఈ మధ్యలోని అడ్డమైన పూజారులకీ సోపు వేసే అవసరం ఉండదు ! ఇలాంటి ఆలోచనలు. కానీ, మన పని వేళలలో ఒక గంట అదనపు టైంని ఎలాగుర్తించి పట్టుకోవడం? ఈ ప్రశ్నకి జవాబులు, రేపు ఇదే సమయానికి… (12-10-2019)

Featured ఆంధ్రప్రదేశ్

అవినీతి తిమింగలం ఇంట ఏసీబీ సోదాలు

అవినీతి తిమింగలం ఇంట ఏసీబీ సోదాలు రూ.కోట్లలో అక్రమాస్తులు భారీగా ప్రాంసరీ నోట్లు, నగదు, నగలు ఏసీబీ అదుపులో టీజీపి డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీనరసింహం నెల్లూరు, అక్టోబర్‌ 10 (పున్నమి విలేకరి) : లెక్కకు మించిన ఆస్తులు… లక్షలాదిరూపాయల నగదు నిల్వలు… కేజీల కొద్ది బంగారం … లక్షల కొద్ది ప్రాంసరి నోట్లు… బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు… భారీగా ఎకరాలు కొద్ది భూములు… కళ్లు బైర్లు కమ్మే బంగారు, వజ్రాల ఆభరణాలు… లాకర్లు కొద్ది నగదు నిల్వలు, దస్తావేజులు ఇవి రాపూరు తెలుగు గంగ స్పెషల్‌ కలెక్టర్‌ ఎం.లక్ష్మీనరసింహం అడ్డగోలుగా కూడబెట్టిన ఆస్తుల చిట్టా… గత కొద్ది కాలంగా అవినీతే ప్రధాన అజెండాగా అక్రమ ఆస్తులు కూడబెడుతున్నాడంటూ అతని పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈవాళ నెల్లూరు ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం నివాసాలు, స్నేహితుల ఇళ్లు, బంధుపరివారాల పైన ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఇందులో అధికారులకు కళ్లు బైర్లు కమ్మే ఆస్తుల చిట్టాలు బయటపడ్డాయి. జిల్లాలోని కావలి, నెల్లూరులలో ఆర్డీవోగా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహం గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించారు. పక్కా ఆధారాలు చూసుకున్న ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం పై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో డైకస్‌రోడ్డు వద్ద ఉన్న లక్ష్మీనరసింహం ఇంట్లో సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలు, లక్షలాది రూపాయల ప్రాంసరీ నోట్లు నెల్లూరులో నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, కావలిలో ఒక షాపింగ్‌ కాంప్లెక్సు, 14 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ ప్రాధమికంగా గుర్తించింది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం, ఆపై అడ్డగోలుగా అందిన మేరకు అక్రమార్జన చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనరసింహంను ఏసీబీ డిఎస్పీ దేవానంద్‌ శాంతో అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను సేకరించే పనిలో వున్నారు. జిల్లాలో కావలి ఆర్డివోగా పనిచేసిన లక్ష్మీనరసింహం పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులో అవినీతి అధికారికంగా ఆరోపణలున్న టీజీపీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీనరసింహం ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాయనే సమాచారంతో తెలుగు గంగా స్పెషల్‌ కలెక్టర్‌ లక్ష్మీ నరసింహం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లక్ష్మీనరసింహంఇంటితోపాటు సమీప బంధువులు స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పనిచేసిన ప్రతిచోటా భారీగా అవినీతి, అక్రమాస్తుల కూడబెట్టారంటూ లక్ష్మీనరసింహం పై కేసునమోదు చేసిన ఏసీబీ. గతప్రభుత్వ హయాంలో కావలి ఆర్డీవో గా పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దగదర్తి విమానాశ్రయం భూసేకరణ లో పేదల భూముల రికార్డులు మార్చి అనర్హులకు కట్టబెట్టినట్లు ఉన్నతాధి కారులకు ఫిర్యాదులు చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

అవును…. వారిద్దరు ఒక్కటయ్యారు….

అవును…. వారిద్దరు ఒక్కటయ్యారు…. నెల్లూరు, అక్టోబర్‌ 10 (పున్నమి విలేకరి) : అవును వారిద్దరు ఒక్కటయ్యారు…. ఇదేదో సినిమా టైటిల్‌లో లేకుంటే వ్యవహారిక పదమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏపీలోని రాజకీయాలకు రాజధానిగా ఉన్న నెల్లూరులో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఐక్యతారాగం. దాదాపు ఆరు నెలల నుంచి నిన్నమొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్లింది. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్‌ కూడా చేశారు. అంతే…పార్టీ అధినేత రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యేలనేగా మీ సందేహం. వారే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఇప్పుడు అర్థమైవుంటుంది వీరిద్దరి మధ్య గొడవేంటో… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడమే రాజకీయ లౌక్యం అంటారు పెద్దలు. గతమేమో గాని ఇటీవల నెల్లూరుజిల్లాలో నెలకొన్న కొన్ని సంఘటనలు అక్కడి రాజకీయ నాయకుల ఆంతర్యాన్ని బైటపెట్టాయి. ఇటీవలి రాజకీయాల్లో కృష్ణార్జునులుగా పేరుగాంచిన బావబామర్దులు గోవర్ధన్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డిల రాజకీయ వైరం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్నటికి మొన్న కాకాణిపై నిప్పులు చెరిగిన రూరల్‌ ఎమ్మెల్యేకోటంరెడ్డి అధినేత సయోద్యతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. తూచ్‌… మేమిద్దరం సన్నిహితులం… కుటుంబ బాంధవ్యమే కాదు, బాల్యమిత్రులమంటూ కాకాణి పై శ్రీధర్‌ రెడ్డి ప్రేమ ఒలకబోశారు. మరోవైపు తమ ఇద్దరి మధ్య కేవలం అవగాహన లోపమే కాని, అనుబంధం చెక్కుచెదరలేదంటూ శ్రీధర్‌ రెడ్డి బావ కాకాణి కాకాపట్టారు. దీంతో ఎమ్మెల్యేలిద్దరి మధ్య వివాదం పై నిన్నమొన్నటి వరకు కత్తులు నూరుకున్నా కేడర్‌ మాత్రం ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ప్రత్యేకించి వివాదం తారాస్థాయికి కారణమైన అధికారిణి సరళా మాత్రం సైలెంట్‌ అయిపోయారు. ఎమ్మెల్యేల వివాదానికి రాజకీయాలే కాదు, కొన్నివ్యక్తిగతమైన అంతర్గత విభేదాలున్నట్లు జిల్లాలో గతం నుంచే చర్చ జరుగుతోంది. గత టీడీపీ హయాంలో నెలకొన్న కొన్నిరాజకీయ పరిణామాలు కాకాణి ఆయన ప్రత్యర్థి సోమిరెడ్డి మధ్య నెలకొన్ని విభేదాల్లో శ్రీధర్‌ రెడ్డి ప్రత్యర్థికి సపోర్టు చేశారన్నది కాకాణి వర్గీయుల వాదన. ఆ విభేదం తారాస్థాయికి చేరి రియల్‌ ఎస్టేట్‌లో బహిర్గతమైంది.  నెల్లూరు జిల్లాలో బావబామ్మర్దులుగా బాంధవ్య భావాలున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గత కొద్దికాలంగా అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పై అక్కడి స్థానిక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు న్యాయపరమైన చిక్కులు తెచ్చాయి. తన పై గోవర్ధన్‌ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ సోమిరెడ్డి కేసు వేశారు. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంలో తనకు స్వయాన బావమర్ధిగా పేరున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అప్పట్లో సోమిరెడ్డికి సపోర్టుగా నిలిచారన్నది కాకాణి వాదన. ఇదే సమయంలో రూరల్‌ ఎమ్మెల్యేకు చెందిన కొన్ని వ్యక్తిగత విషయాల్లో కాకాణి జోక్యం చేసుకుంటున్నారంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే కాకాణి పై గుర్రుగా వుంటూ వచ్చారు. అధికార పార్టీలో పవర్‌పుల్‌ లీడర్లుగా ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వివాదం ఈ మధ్య రచ్చకెక్కింది. ఓ రియల్‌ ఎస్టేట్‌కు నీళ్ల వ్యవహారంలో అక్కడి ఎంపీడీవో సరళాదేవి అనుమతులు ఇవ్వలేదంటూ రూరల్‌ ఎమ్మెల్యే ఆమె పై ఆగ్రహించారు. నివాసానికి వెళ్ళి మరీ హెచ్చరికలు చేశారు. తమ నియోజకవర్గంలో అధికారిణిపై రూరల్‌ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారన్న వ్యవహారం పై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అరికాల్లో కాలింది. తమ అనుచరుల ద్వారా అధికారిణితో రూరల్‌ ఎమ్మెల్యే పై కేసులు పెట్టించారు. దీంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. అధికారిణి పై ఎమ్మెల్యే ఆగ్రహించారన్న సమాచారం అధినేతకు చేరడంతో ఆయన భగ్గుమన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు, చర్యలు తీసుకోండి అంటూ అధికార యంత్రాంగాన్ని ఆపార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పాలనాధిపతి నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం పోలీసులు నానా హంగామా చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఆపై బెయిల్‌ పై ఆయన విడుదల అయ్యారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప్పు నిప్పుగా మారడం, పార్టీలో గందరగోళానికి కూడా దారితీసింది. ఇది కాస్తా పార్టీ డ్యామేజి అయ్యే స్థాయికి వెళ్లిపోయింది. గత ప్రభుత్వ హయాంలో మహిళా అధికారిణి వనజాక్షి పై దెందులూరు ఎమ్మెల్యే పై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ ఘటన కళ్ళ ముందు సాక్షాత్కారిస్తుండడంతో ప్రస్తుత ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఒకవైపు పార్టీ పై దురభిప్రాయాన్ని పోగొడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అధినేత అరెస్ట్‌ చేయించారన్న సంకేతాన్ని సాధారణ ప్రజల్లోకి వెళ్లేలా ఒక చర్య, మరో వైపు గొడవ కొనసాగితే జిల్లాలో కేడర్‌ గందరగోళం పడుతుందన్న విధానానికి స్వస్తి పలుకుతూ సయోధ్య కుదర్చడంతో వైసీపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే మధ్య జరిగిన వివాదాన్ని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన మార్కు రాజకీయంతో సర్దుబాటు చేశారు. బట్‌ ఈ సయోధ్య ఎంత వరకు కొనసాగుతుంది అన్నది వేచిచూడాల్సిందే…

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఈఎస్‌ఐలోనూ అవినీతి జాడలు

భారీ మొత్తంలో గడువు తీరే మందులు కొనుగోళ్లు కార్మికుల వైద్యానికి కాస్మోటిక్‌ ఔషధాల్ణు విజిలెన్స్‌ విచారణలో వెలుగుచూస్తున్న అక్రమాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం – విజిలెన్స్‌ ఎస్పీ ఎం.వి.సుబ్బారెడ్డి. (నెల్లూరు, పున్నమి ప్రతినిధి) తలవెంట్రుకలు… పెరిగేందుకు… అక్కడ భారీఎత్తున ఔషధాలు కొన్నారు… అక్కడ ఈసీజీ..పరికరాలు.. లేకున్నా… వాటికోసం లక్షల్లో బిల్లులు చేశారు.. ఇదేదో కాస్మొటిక్‌… అవసరాలకు… కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో బిల్లులు అనుకునేరు… నిరుపేద కార్మికులకు తూతూ మంత్రంగా సేవలందించే ఇఎస్‌ ఐ హాస్పిటల్స్‌ లో డ్రగ్స్‌ కొనుగోళ్లు మాటున జరుగుతున్న అక్రమాలు… జ్వరమొస్తేనే.. మాత్రలు లేవనే ఈ హాస్పిటల్స్‌ లో మందులపేరు తో జరిగిన దోపిడీలుపై విచారణ జరుగుతున్న నేపద్యంలో నెల్లూరులోనూ ఆశ్చర్యం కలిగించే అక్రమాలు బయటపడుతున్నాయి.. ఇంతకీ జిల్లాలో ఈ ఎస్‌ ఐ హాస్పిటల్స్‌ అక్రమాలేంటో మీరే చదవండి. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో..కార్మికులకు అత్యవసరంగా చికిత్స అందించాలంటే… సవాలక్ష కారణాలు చెపుతారు.. అక్కడి వైద్యులు… ఏఒక్క జబ్బుకీ…సరైన మందులు కనిపించని ఆ వైద్యశాలల్లో.. సౌందర్యపోషణకు కూడా చికిత్స అందిస్తాయంట…అందుకోసమే వీరు మందులు కొనుగొలు చేసినట్లు రికార్డులు తయారు చేసారు.నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ పోర్స్‌ మెంట్‌ తనిఖీలలో నమ్మలేని వాస్తవాలు బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎస్‌ ఐ అసుపత్రులలో జరుగుతున్న తనిఖీలు దిమ్మ తిరిగే వాస్తవాలను వెలికి తెస్తున్నాయి.విన్న వారంతా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.తెలంగాణ రాష్టంలో ఈఎస్‌ ఐ అసుపత్రులలో జరిగిన మందుల కుంభకోణం తర్వాత ఎపిలో కూడా రాష్ట వ్యాప్తంగా విజిలెన్స్‌ ఇప్పుడు ఈఎస్‌ ఐ అసుపత్రులలో తనిఖీలు నిర్వహిస్తుంది.ఇందులో బాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాంతాలలో తనిఖీలు చేసింది.జిల్లాలో నెల్లూరులోని పోదలకూరు రోడ్డు లోని అసుపత్రి,కావలి ,సూళ్ళురు పేట లలో వున్నక్లీనిక్‌ లలో విజిలెన్స్‌ తనిఖీలు నిర్వహించింది.అక్కడ రికార్డులతో పాటు మందుల నిల్వ,ఎక్కడ నుంచి కొనుగొలు చేసారు.ఎలాంటి మందులు కొనుగొలు చేసారు లాంటి వాటిపై తనిఖీలు చేస్తున్నారు. కార్మికులు,ప్రయివేటు కంపెనీల సిబ్బందికి ఈఎస్‌ ఐ అసుపత్రులలో చికిత్స అందిస్తారు.నెల్లూరు నగరంలోరెండు,సూళ్ళురు పేటలో రెండు ,గూడురులో 1,తడ,కావలిలలో రెండు ఈఎస్‌ ఐ అసుపత్రులు నడుస్తున్నాయి.వాటి పరిదిలో కార్మికులకు ఎక్కువుగా చికిత్సలు అందిస్తారు. అయితే తనిఖీలలో విచిత్రమైన అంశాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.కావలి ఈఎస్‌ ఐ అసుపత్రిలో అయితే జుట్టు రాలకుండ వుండేందుకు వాడే మందులు 60-100 కేస్‌ ల వాడినట్లు రికార్డులు లలో వుంది.అయితే వ్యాదుల చికిత్సకు మందులు ఇవ్వాల్సిన అసుపత్రిలో సౌందర్యానికి ఉపయోగపడే మందులు ఎందుకు వాడారన్నది ఇప్పుడు విజిలెన్స్‌ అదికారులనే విస్మయానికి గురిచేసింది.సూళ్ళురు పేటలో ప్రభుత్వం పంపించిన మందులు కాకుండా బయట అధికంగా కొనుగొలు చేసినట్లు రికార్డులు చూపించారు. అంతేకాకుండా పది మంది రోగులు వస్తుంటే వారి సంఖ్యను నాలుగింతలు పెంచినట్లు విజిలెన్స్‌ తనిఖీలలో బయటపడింది.మిగిలిన వారికి కూడా మందులు పంపిణీ చేసి నట్లు రికార్డులు తయారు చేసుకున్నట్లు గుర్తించారు అదికారులు.తనిఖీలు మరింత కాలం కొనసాగుతాయని అంటున్నారు విజిలెన్స్‌ అదికారులు…అయితే పూర్తి వివరాలు తనిఖీలు ముగిసిన తర్వాత చెబుతామంటున్నారు. ఈ ఎస్‌ ఐ ఆసుపత్రుల్లో అక్రమాలు తెలంగాణాకు పరియం8తమనుకున్న విజిలెన్స్‌ అధికారులకు ఇక్కడి మందుల కొనుగోళ్లు… వాటిపంపిణి చూసి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది… ఊహించని జబ్బులకు మందులు కొనుగోలు చేశారు… గాయాలకు… జ్వరాలకు మాత్రలు దొరకని ఈ కార్మిక దవాఖానలో మాత్రం… కాస్ట్లీ మందులు భారీగా కొన్నారు.. అందులోనూ రికార్డుల్లో మాత్రమే… నిరుపేద కార్మికులకు వైద్యసేవలు అందించినట్లు సొమ్ముచేసుకున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…

Featured ఆంధ్రప్రదేశ్

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్‌ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు.    తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్‌ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్‌ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది. మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్‌ ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సోదరుడు దినకర్‌ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్‌ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్‌ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

సహకార పరపతి సంగం డైరెక్టర్‌గా పెళ్లకూరు

సహకార పరపతి సంగం డైరెక్టర్‌గా పెళ్లకూరు నెల్లూరు, అక్టోబర్‌ 4 (పున్నమి విలేకరి): నెల్లూరు రూరల్‌ పిడతాపోలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంగం డైరెక్టర్‌ గా మన ఆణిముత్యం జంగాలకండ్రిగ వాస్తవ్యులు పెళ్లకూరు శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈయన శనివారం డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పంచేటి భరత్‌ నాగు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పిడతాపోలూరు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెళ్లకూరుకు శుభాకాంక్షలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు

మగవారి సెక్స్‌ సామర్థ్యానికి విరోధులు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అది తెలుసుకోవటానికి ఆకలి నిద్ర, లైంగిక సామా ర్థ్యాలను అంచనా వేయటం ద్వారా తెలుసు కోవచ్చు. వీటిలో ఏ ఇబ్బంది లేకుండా బాగుంటే వారి ఆరోగ్యం ఇంకా చెడిపోనట్టే. దీని అర్థం మొత్తం బాగుందని కాదు. చెడి పోతూ ఉండవచ్చు. లైంగిక సామర్థ్యం చెడిపోకుండా నాలుగు కాలాల పాటు ఉంచుకోవాలంటే దానికి శత్రువులుగా ఉండే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరిగే కొద్ది లైంగిక సామర్థ్యం ముందు కంటే కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్న అంశా లలో అప్రమత్తంగా ఉంటే ముందు ముందు తలలు బోడులైనా తలపులు బోడులు కాకుండా చూసుకోవచ్చు. బరువు : ప్రతి వారికి వారి వారసత్వ లక్షణాన్ని బట్టి, వారి ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఇది ఇతరత్రా కూడా ఆరోగ్యకరం. జీవన విధానాన్ని బట్టి కొంత అటూ ఇటూ ఉండవచ్చు కానీ అతిగా బరువు పెరిగి ఊబకాయం తెచ్చుకుంటే లైంగిక సామర్థ్యం పడిపోతుంది. పరిధి దాటి పెరిగే ప్రతి కేజీకి బరువుకి కొంత సెక్సు సామర్థ్యం తగ్గు తుంది. లడ్డుగా ఉన్న వారిలో నలబై దాటాక లేపన సమస్య వస్తే బరువు తగ్గటం మొదలు పెట్టాలి. తిండి మీద అదుపు, ఒంటికి వ్యాయామం లేకుం డా మరి ఏ ఇతర పద్ధతిలో కూడా బరువు తగ్గటం సాధ్యంకాని పని. కొలెస్టరాలు : సాధరాణంగా మన శరీరంలో ఉండాల్సినంత కొలెస్టరాలు ఉంటుంది. అయితే కొంత మందికి అవసరానికి మించి ఉంటుంది. కోలెస్టరాలులో మంచి కొలెస్టరాలు, చెడు కొలెస్ట రాలు అని రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట రాలు తగ్గే కొద్ది లైంగిక సామర్థ్యం తగ్గుతూ వుం టుంది. కాబట్టి ఎవరికైయినా అధిక కొలెస్టరాలు ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవటానికి జాగ్ర త్తలు తీసుకోవాలి. దీన్ని మందులు వాడి తగ్గించు కోవటం కంటే జీవన సరళిని మార్చు కోవటం ద్వారా తగ్గిం చుకోవటమే మంచి పద్ధతి. వీలుకానప్పుడు మాత్రమే మం దులు వాడుకోవాలి. సోమరితనం : శరీరం కదలకుండా పనులు చేసే వారు లైంగికంగా బాగా ఉం డాలని ఆశించటం దురాశే అనుకోవాలి. హుషారుగా, చలాకీగా ఉన్న వారికి లైంగిక సామర్థ్యం బాగా ఉంటుంది. పైగా ఇలాంటి వారు కనీసం తిండిని అదుపులో ఉంచుకోక పోతే బరువు పెరగటం ఖాయం. పెరిగే బరువు మళ్ళీ సెక్సును తగ్గిస్తుంది. పొగాకు వాడకం : పొగాకు ఏ రూపంలో వాడినా లేపన శక్తి దాదాపు 20 పాళ్ళు తగ్గు తుంది. అయితే ఇందులో ఓ గమ్మత్తు వుంది. వయసులో వున్నప్పుడు పొగకు వాడినా దాని వల్ల తగ్గిన లైంగిక సామర్థ్యం పెద్దగా పట్టింపుకు రాదు. కారణం ఏమి టంటే వయసులో వున్నప్పుడు మనలో అవస రానికి మించి చాలా నిలువ లైంగిక సామర్థ్యం ఉంటుం ది. ఏ కారణం వల్ల లేపన శక్తి తగ్గినా అదనంగా ఉన్న నిలువ శక్తి దాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి వయసులో ఉన్నప్పుడు పొగాకు వాడకం వల్ల తగ్గిన సామర్థ్యాన్ని గుర్తించలేరు. వయసు మీరే కొద్ది నిలువ శక్తితో పాటు ఉన్న సామర్థ్యం కూడా తగ్గి లేపన సమస్య వస్తుంది. దీనికి తోడు పొగాకు కూడా వాడితే లేపన శక్తి మరీ దారుణంగా పడిపోతుంది. పొగాకు వాడే వారు తెలుసు కోవాల్సిన సత్యం ఏమిటంటే, లేపన సమస్య రానంత వరకూ పొగాకుతో ఎన్ని ఆటలు దాని ప్రభావం తెలియదు. కానీ ఒక సారి సమస్య వచ్చాక దాన్నుండి బయట పడాలంటే పొగాకు మానాల్సిందే. మానేసిన వారాని కల్లా దాని వల్ల తగ్గిన 20 పాళ్ళ లైంగిక సామర్థ్యం తిరిగి వస్తుంది. ఆల్కహాలు : అప్పుడప్పుడూ మందు కొట్టే వారికి మందు వల్ల సెక్సుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అదే పనిగా తాగే వారి లో నరాలు చీకిపోయి చచ్చుగా తయార వుతాయి. దాంతో మెదడు నుండి కోరిక కరెంటును అంగానికి తీసుకు పోవటంలో తేడా వస్తుంది. నరాలు ఏ మేరకు చీకిపోతే ఆ మేరకు లేపుడు శక్తి తగ్గు తుంది.   ఇదీ నా సమస్య ప్రశ్న : నాకు 30 సంవ త్సరాలు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. నేను పదో తరగతి చదివేటప్పుడు నేను హాస్టల్లో ఉండే వాడిని. హాస్టలు వార్డను నా చేత ¬మోసెక్స్‌ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్సుని కూడా నాతో చేయిం చాడు. రాను రాను నాకు కూడా బాగా అలవాటు అయింది. భార్యతో కూడా సెక్సు చేయగలను కానీ మగ వారిని చేస్తున్నంత కిక్కు రాదు. ఆ మధ్య మా ఆవిడకు సంగతి తెలిసి పెద్ద గొడవ అయిం ది. ఆ వెధవ అలవాటు మానితేకానీ కాపురం చేయనంటుంది. ప్రస్తుతానికి దానికి దూరంగా ఉంటున్నాను కానీ పాత పరిచయం ఉన్న వారు అప్పుడప్పుడు ఫోను చేసి రమ్మన్నప్పుడు వెళ్ళాలని మనసు తహతహలాడుతుంది. వారు గట్టిగా పిలిస్తే మళ్ళీ పోతానేమో అని అనిపిస్తుంది. నాకు ఆ యావలేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? – వి.వి.ఎస్‌., వేదాయపాళెం జవాబు : స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన వారు దాన్ని మానటానికి చాలా నిగ్రహ శక్తి కావాలి. ఎక్కువ మందికి దీని నుండి బయట పడాలని ఉన్నా ఆ సమయం వచ్చే సరికి అదుపు చేసుకోలేరు. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. స్వ లింగ సంపర్కంలో ఉన్న బలహీనతే అది. ఈ పద్ధతి నుండి బయట పడాలన్న గట్టి సంకల్పం మీకు ఉంటే సైకో ధెరపీ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అనుభవజ్ఞులయిన సైకియాట్రిస్టులు, క్లినికల్‌ సైకాలజిస్టులు ఆ చికిత్సను చేస్తారు. డాక్టర్‌ పి. శ్రీనివాసతేజ, నెల్లూరు

Featured ఆంధ్రప్రదేశ్

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు

ఘనంగా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : నెల్లూరులో జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ శేషగిరిరావు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భారతావనికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహనీయులు మహాత్మాగాంధీ అని అన్నారు. ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు

వి.యస్‌.యు లో మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 150వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య . అందె ప్రసాద్‌ గారు విచ్చేసి గాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చాలు సమర్పించారు. రిజిస్ట్రార్‌ గారు మాటా ్లడుతూ గాంధీగారి ఆశయసాధనలో మనం అందరం పాలు పంచుకోవలని సూచించారు ,అదే విధంగా సత్యం, అహింస మార్గాలను ఈ తరం విద్యా ర్థిని, విద్యార్థులు ఆచరించాలని కోరారు. మన భారత ప్రభుత్వం గాంధీగారి 150 వ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత -స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మొదలు పెట్టారు . ఈ కార్య క్రమంలో విద్యార్థులందరూ విరివిగా పాల్గొ నాలని మరియు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ జయంతి ఉత్స వాలను పురస్కరించుకుని గాంధీ యన్‌ స్టడీ సెంటర్‌ వివిధ సాహిత్య పోటీలను నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను అందజేసింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఆచార్య కె . వి. యస్‌ జవహర్‌ బాబు గారు, సి డి సి డీన్‌ ఆచార్య విజయనంద్‌ బాబు గారు, గాంధీయన్‌ స్టడీ సెంటర్‌ సమ న్వయకర్త డా. నీలమణికంఠ గారు, విద్యార్థి, విద్యార్థినులు, భోదన , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు .

Featured ఆంధ్రప్రదేశ్

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

వాకర్స్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి నెల్లూరు, అక్టోబర్‌ 2 (పున్నమి విలేకరి) : 150వ గాంధీ జయంతి వేడుకలను చిల్డ్రన్స్‌ పార్కులో వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వహణ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిట్రపటానికి వాకర్స్‌ పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటీస్‌సెంటర్‌ వారి చే ఉచిత షుగర్‌..బి.పి.పరీక్ష లను 250మందికి నిర్వహించారు.పినాకినీ లయన్స్‌ క్లబ్‌ వారి సహకారం తో 15మందిపార్క్‌ ఉద్యోగస్తులకు వస్త్రాలు పంపిణీ చేసారు. ఈకార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి సింగంసెట్టి మురళీ మొహాన రావు మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని స్వతంత్రం సాధించిన మహనీయుడు గాంధీ గారని వారి ఆసయాలకు ఊపిరి పొయవలసిన భాద్యత మన అందరిది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సింగంసెట్టి మురళీ మోహన్‌ రావు..కొట్టే రామమూర్తి..పాముల రమనయ్య ..లయన్‌ కిషోర్‌ కుమార్‌..గవర్నర్‌ కిషోర్‌ కుమార్‌..లీలారెద్ది..సగిలి జయరాం రెడ్డీ. కె. పెంచల నాయుడు. ఎల్‌. బాబు మరియు వాకర్స్‌ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.