Tuesday, 9 December 2025

Blog

Featured సాహితీ

ఈత పోటీల్లో నెల్లూరుకు పతకాల పంట

9 బంగారు పతకాలు 4 కాంస్య పతకాలు 2 రజిత పతకాలు నెల్లూరు : ఈ నెల 19 , 20 తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 బాల, బాలికల స్కూల్ గేమ్స్ ఈత పోటీల్లో నెల్లూరు జిల్లాకు పతకాల పంట పండిందని నెల్లూరు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.బాలుర జట్టులో సాయి ధీరజ్ , కే ఎన్ ఎస్ చరణ్ కుమార్ రెడ్డి , త్రినాద్ లు మూడు బంగారు పతకాలు గెలవగా , వచన్ , నివిద్ , సాయిప్రదీప్ లు మూడు కాంస్య పతకాలు ఒక రజిత పతకం సాధించారు .అదేవిధంగా బాలికల జట్టులో గోపీచందన రజిత పతకం గెలుపొందగా శ్రీజ కాంస్య పతకం సధించారు.ఈ జట్టులకు కోచ్గ్ గా నాగరాజు, మేనేజర్‌గా శ్రీధర్ , టోర్నమెంట్ అబ్జర్వర్లుగా ప్రభాకర్ రెడ్డి ,  సనత్ కుమార్ లు వ్యవహరించారు.  

Featured Uncategorized

ఏడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లను నెల్లూరులో ఆపండి

నెల్లూరు ఎంపీ ఆదాలకు వైసీపీ నేతల వినతి  నెల్లూరులో 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించాలని ముగ్గురు వైసీపీ నేతలు నెల్లూరు ఎంపీ ఆదాలకు ఒక వినతి పత్రాన్ని బుధవారం సాయంత్రం సమర్పించారు ఈ రైళ్లను నిలపడం వల్ల నెల్లూరు ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు గరీబ్ రథ్, కోరమండల్ ,హౌరా -మైసూర్, బిలాస్పూర్ నెల్లూరులో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు న్యాయవాది గూడూరు సుబ్బారెడ్డి, ముదిగొండ మాధవ్, పాముల హరి ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తి చేశారు .దీనిపై స్పందించిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. Also read

Featured ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య రంగం లో డాక్టర్ సుజాత రావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి” Dr Mvr

ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రథమ మహాసభ ఈరోజు డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది .ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ వైద్య కమిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యా రంగాన్ని పూర్తిగా వ్యాపార మయం చేసింది..అలాగే ప్రజారోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది అని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2012 ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలందించే చిన్న, మధ్య తరహా ప్రైవేట్ ఆస్పత్రులకు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం వైద్య ఆరోగ్య రంగంలో డాక్టర్ సుజాత రావు కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని మరియు అలాగే ఆ సిఫార్సులను కొన్నింటిని సవరించి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సదుపాయాలు మెరుగ్గా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు . రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సుజాత రావు గారు చేసిన సిఫార్సులు తూచా తప్పకుండా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెంచాలని, డాక్టర్లు మరియు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిపించాలని మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం అన్ని రాజకీయ పార్టీల,ప్రజా సంఘాల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో గత రెండేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను సవివరంగా మహాసభకు అందించారు.వైద్య సేవల కార్పొరేటీకరణను ప్రజారోగ్య వేదిక వ్యతిరేకిస్తుందన్నారు. కోశాధికారి జి.వేణుగోపాలరావు ఆర్థిక నివేదికను మరియు 16 డిమాండ్లతో కూడిన నివేదికను ప్రవేశపెట్టారు. తదుపరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. Also Read: టీవీ , సెల్ ఫోన్ ల వాడకం – తెచ్చి పెడుతుంది ఊబకాయం అధ్యక్షులు–డాక్టర్ రాజేశ్వర రావు ఉపాధ్యక్షులు– డాక్టర్ ఎస్కే కాలేషాభాష –ఎన్.నవకోటేశ్వరరావు — ఎస్కే గౌస్ బాష ప్రధాన కార్యదర్శి—- జి.శ్రీనివాసరావు కార్యదర్శులుగా– జి కృష్ణారెడ్డి ఎస్ కే జిలాని భాష ఎన్ . సతీష్ కుమార్ కోశాధికారిగా—– జి వేణుగోపాలరావు అలాగే 20మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైనారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

ఉద్యోగం వేటలో మనం చెయ్యకూడని విషయాలు – 1

ఉద్యోగం వేటలో మనం చెయ్యకూడని విషయాలు – 1 మొన్నొక రోజు ఒక రిక్రూటర్‌ మిత్రుడు ఫోన్‌ చేశాడు. చాలా కాలంగా ఫ్రెండ్‌. నేను : ఏంట్రా చెప్పు ! రిక్రూటర్‌ మిత్రుడు : అబ్బ పిచ్చెక్కి పోతోంది రా, ఒక పక్క క్లయింట్‌ ( కంపెనీలూ ) లతోటీ, మరొక పక్క ఉద్యోగ అభ్యర్దులతోనీ ! రక రకాల సినిమాలు చూపిస్తున్నారు ! నేను(పైశాచికంగా నవ్వుతూ ) : ఏమైందేమిటి? రి.మి : కుర్రాడి రెస్యూమే చాలా బాగుంది . మొదటి సారి తన సొంత పేరు ఉన్న ఇమెయిల్‌ ఐడీతో పంపించాడు. రెండవ సారి సం ప్రదిస్తే , ” స్వీట్‌ బాయ్‌ లడ్డు అనే ఇ మెయిల్‌ ఐ డీ నుంచి నాకు రెప్లై ఇచ్చాడు ! నేను : అలాగా ! రి.మి : ఆ పిలగాడి తో చెప్పాను, ‘స్వీట్‌ బాయ్‌లడ్డు’ అనే ఇమెయిల్‌ ఐడీతో మెయిల్‌ ఐ డి నుంచి రాస్తే , అక్కడ ఐబీఎం కంప్యు టర్స్‌లో నిన్ను తీసుకోరు నాయనా ! అని ! అతనేమో ‘ఐ హ్యావ్‌మై ఓన్‌ రూల్స్‌ ”అంటున్నాడు ! పైగా, అతని గర్ల్‌ ఫ్రండ్‌ అలా పిలుస్తుందట ! నేను : హీ హీ హీ ! ఇంకేమంటున్నాడు లడ్డు బాబు? రి.మి : నీకేమి రా ? నవ్వులాటగా ఉంటుంది! ఏంటిరా ఈ ఇమెయిల్‌ ఐడిలు. ఆడ పిల్లలేమో, ‘డ్యాడ్స్‌ ప్రిన్సెస్‌’ అనీ, ‘ఐస్‌ క్రీం గర్ల్‌ అనీ ‘ ఇలా . బాయ్స్‌ ఏమో, లడ్డు అనీ, ‘క్రేజీ డ్యూడ్‌’ అనీ, ఇలాంటి ఇమెయిల్‌ ఐడీ ల నుంచి మెయిల్‌ పంపితే, టీసీయెస్‌లూ, ఇన్‌ఫోసిస్‌ లూ ఎలా కన్సిడర్‌ చేస్తాయి? రిక్రూటర్‌ : అంటే, యువతరానికి టాలెంటు , నైపుణ్యం లేవని చెప్ప లేను. రెస్యూమే లు చాలా బాగున్నాయి . టెలిఫోన్‌ ఇంటర్వ్యూ చేశాను. బాగానే రెస్పాండ్‌ అయారు ! ఇదేంటి రా బాబు ? నేను : ఇటీవలి సినిమాల ప్రభావం కావచ్చు . లేదా వీరికి జీవితంలో ఇంకా మొట్టికాయలు తగిలి ఉండవు . మన లాగా ! సరేలే ! ప్రస్తుతం అలాంటి ఇమెయిల్‌ ఐడీ ల నుంచి పెద్ద పెద్ద కంపెనీ లకు యధా తధం గా పంపకు . రెస్యూమేలనీ ల్యాప్‌ టాప్‌లోకి దౌన్‌ లోడ్‌ చేసి , నీ మెయిల్‌ నుంచి మీ క్లయింట్‌ లకి పంపు ! అని చెప్పాను. అసలే ఆర్ధిక మాంద్యం. మీరు ‘గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ రిపోర్టు’ చూశారా ? ప్రజల ఆకలి తీర్చే విషయంలో మన దేశం ప్రపంచంలో నే 102 వ అధమ స్థానానికి దిగజారి పోయింది! పాకిస్తాన్‌ మనకంటే మెరుగుగా, 94 వ స్థానంలో ఉంది. వ్యవస్థలోని ఆర్ధిక మాంద్యా నికి, మనుషుల బుద్ధి మాంద్యం కూడ తోడు అయితే, ఉద్యోగం వేట కష్టమే! ఈ వారం మరియు వచ్చే వారం మన శీర్షికలో, ‘ఉద్యోగం వేటలో మనం చేయకూడని 10 విషయాలు ఏమిటో తెలుసుకుందాం ! మీ ప్రతిస్పందన తెలియజేయవలసిన ఇమెయిల్‌:essence.training@yahoo.com, punnami.news @gmail.com

Featured ఆంధ్రప్రదేశ్

కరుణ చూపిన వరుణుడు

కరుణ చూపిన వరుణుడు నెల్లూరు, అక్టోబర్‌ 17 (పున్నమి విలేకరి) : చాలా కాలంగా కనిపించని వరుణుడు కరుణ చూపాడు. చినుకు చిత్తడయింది. ముసారా ముసురేసింది. గలగలలు లేని సెలయేళ్లు పర వళ్లు తొక్కాయి. నీటి జాడ లేని జలా శయాలు, ఏరులు, నదులు జలకళను సంతరించు కున్నాయి. పరుగుపరుగున పరవళ్లు మొదలుపెట్టాయి. దాదాపు ఏడేళ్లుగా కనుమరుగైన వరుణుడు చినుకు రూపంలో చిత్తడి చేసి వట్టిబోయిన నదులకు, ఏరులకు జలకళను తెచ్చాడు. వెరసి నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన పెన్నా సహా ప్రధాన నదులు, ఏరులు ఇప్పుడు పర వళ్లు తొక్కుతున్నాయి. చూపరులను మదిని పులకింపచేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో నదులు, ఏరులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రధానమైన సోమశిల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. వరద నీటితో పెన్నా పరివాహక జలాశయాలు జలకళను సంతరించు కున్నాయి. దాదాపు 11 ఏళ్లు తరువాత నెల్లూరు ఆనట్ట నీటి సిరులతో కనువిందు చేస్తోంది. పరుగుపరుగున ప్రధాన కాలువల వైపు ఉరకలెత్తుతోంది. పెరుగుతున్న వరద ఉధృతి కడలి తీరం వైపు కదం తొక్కుతోంది. నెల్లూరు పెన్నా బ్యారేజీ నిండు కుండలా మారింది. జలకళను సంతరించుకుంది. చాలా కాలం తరువాత ఆనకట్ట పై పెన్నా ప్రవాహం చూసి నగర ప్రజలు పులకించిపోతున్నారు. ఉరకలెత్తుతున్న నీటి ఉధృతిని చూసి పరవ శిస్తున్నారు. మరెన్నాళ్లకో ఇలాంటి వరద ప్రవా హాన్ని చూస్తామో అన్నట్లుగా పరవళ్లు తొక్కే పెన్నను తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. సెల్పీలు తీసుకుంటూ చిరుమందహాస్యం పొందు తున్నారు. కొందరు నది వెంట ఆనం దంతో కేరింతలు కొడుతున్నారు. పెన్నా నదికి సుదీర్ఘ విరామం తరువాత వరద రావడంతో డెల్టా ఆయుకట్టులో ఆనందం వెల్లివిరుస్తోంది. చినుకు రాలదేమో చింత తీరదేమోనని దిగులు చెందుతున్న అన్నదాతలు సాగుకు డోకా లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఆనకట్ట నుంచి ఇటు సర్వేపల్లి, నెల్లూరు నగరం తాగునీటి అవసరాలకు అధికారులు నీటిని మళ్లిస్తున్నారు. సర్వేపల్లి, ముత్తుకూరు, ఈదూరు, కోడూరు, జాఫర్‌సాహెబ్‌ కాలువలకు ఆనకట్ట నుంచి ఇంజనీరింగ్‌ అధికారులు నీటిని మళ్లించారు. వరద నీటితో పరవళ్లు తొక్కే కాలువలను చూసి రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మెట్ట ప్రాంతంలోని బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు, కేతామన్నేరు, కొమ్మలేరు, కైవల్య, కాళంగి, కండలేరు సహా కాలువలు పొంగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతుంది.

Featured బిజినెస్

ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ?

ఆర్ధిక మాంద్యంలో మన ఉద్యోగాలు కాపాడుకోవడం ఎలా ? పున్నమి పాఠకులకు నమస్కారములు. శుభోదయం. మా ‘వత్తి జీవితం’ శీర్షికని పునః ప్రారంభిస్తున్నాము అని తెలియ జేయడానికి సంతోషిస్తున్నాము. ప్రస్తుతం దేశంలో ఆర్ధిక మాంద్యం నడుస్తోంది. ఇది వాహన రంగాన్ని పెను తుఫానులా తాకింది. ప్రభుత్వ సంస్థ అయిన ‘బిఎస్‌ఎన్‌ ఎల్‌’ నుంచి ఏకబిగిని 32,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పను న్నారు. సాఫ్ట్‌ వేర్‌ రంగం తప్ప మిగతావి అంత సేఫ్‌గా లేవు! కంపెనీ పెట్టిన 130 సంవత్సరాల తరు వాత పార్లే బిస్కెట్‌ల పరిశ్రమ ఫాక్టరీకి 10 రోజుల విరామం ప్రకటించారు. అదేంటో !! ప్రజలు బిస్కెట్‌లు తినడం కూడా తగ్గించేశారు! పార్లే జీ పెద్ద ఖరీదైనది కూడా కాదు! అందరికీ అందుబాటులో ఉండే ధర ! ఇలాంటి సమయంలో ‘ఉన్న ఉద్యోగం ఎలా కాపాడుకోవాలి’ అనే అంశం మీద మా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఆర్టికల్‌ ప్రచురిస్తున్నాం . మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తాం. అదే అభద్రత , మనకి వచ్చినప్పుడు మనం ఏమేమి చేయాలో ఈ వారం, వచ్చే వారం చర్చిద్దాం . ముఖ్య గమనిక. ఇప్పుడున్న ఆర్ధిక మాం ద్యం, మరొక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో, మనల్ని ఎవరు రక్షించరు! మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకి కావలసిన భద్రతా భావం (సెక్యూరిటీ) మనమే కల్పించుకోవాలి. మనము, లాభార్జన ధ్యేయంగా ఉన్న కంపెనీ (ఫర్‌ప్రాఫిట్‌ కంపెనీస్‌)లో పని చేస్తున్నాము అనుకోండి. మనం చేసే పని, కంపెనీ యొక్క ఆదాయాన్ని, మరియు లాభాన్ని ఏ విధంగా పెంచుతుందో, మనకి అవగాహన ఉండాలి. అది లేక పోతే, మన ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు! ఇంకా – ‘అలంకార ప్రాయమైన  ఉద్యోగాలు ‘పర్సనల్‌ సెక్రెటరీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజరు, కార్పొరేట్‌ ఇమేజ్‌ మేనేజరు, అడ్వర్‌టైజింగులో ఉన్న వారు, కంపెనీ కష్ట పరిస్థితులలో ఉంటే తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేరు ! కొన్ని ఉదాహరణలు చూద్దాం. మీరు మానవ వనరుల మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ ) అనుకోండి . ”మన కంపెనీకి అవసరమైన మధ్య స్థాయి మేనేజర్‌లను వేటాడడం నా బాధ్యత. క్రితం సంవత్సరం నేను ముగ్గురిని రిక్రూట్‌ చేశాను. ఒకరిని సేల్స్‌లో, ఒకరిని మార్కెటింగ్‌లో, ఒకరిని కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా. వీరి పనితనం వల్ల కంపెనీకి ఇంత లాభం వచ్చింది. వారిని మన పోటీ కంపెనీలు తన్నుకు పోకుండా, బాగా చూసు కున్నాను. ముగ్గురూ ఇప్పటికీ మన కంపెనీలోనే ఉన్నారు. ఇది కంపెనీ లాభానికి నా వంతు సహాయం” మీరు ప్రొడక్షన్‌ మేనేజర్‌ అనుకోండి. ”సకాలంలో ఉత్పత్తులకు , ప్రతి ఉద్యోగి తలసరి ఉత్పాదక శక్తి పెంచాను. వేస్టేజి తగ్గించాను. ఇన్ని లక్షలు / కోట్లు కంపెనీకి ఆదా చేసాను” ఇలా. మీరు ఫైనాన్స్‌ మేనేజర్‌ అనుకోండి. ”కంపెనీకి ఇంత ఖర్చు తగ్గించాను. ఇంత డబ్బు లాభంలో మిగిల్చాను. మంచి టాక్స్‌ ప్లానింగ్‌ ద్వారా, ఎక్కువ మొత్తం ఆదాయపు పన్నుకి పోకుండా కాపాడాను!” ఇలా. సరే! చిన్న ఉద్యోగం ఉదాహరణ తీసు కుందాం. కొరియర్‌ డెలివరీ బాయ్‌, ఏ ఫ్లిప్‌ కార్ట్‌లోనో, అమెజాన్‌ లేదా స్నాప్‌డీల్‌లోనో పని చేస్తూ ఉన్నాడు అనుకుందాం. ‘నేను మన కనుగోలు దారులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా టైం కి వారు ఆర్డర్‌ చేసిన వస్తువులు డెలివరీ చేశాను . తద్వారా, వారు మరొక్క సారి మన దగ్గర కొనే రిపీట్‌ కస్టమర్‌లని తయరు చేశాను’ ఇలా. కస్టమర్‌ సర్వీసులో లేదా రెసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిని : కోపంగా వచ్చిన ఆ కస్టమర్‌ని శాంతింప జేసి, ఆమె సమస్య పరిష్కరించి పంపించాను. తద్వారా కస్టమర్‌ని కాపాడుకున్నాను. వారు మరొక్క కంపెనీకి వెళ్లకుండా ఆప గలిగాను’ ఇలా. ”నిన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసి వేయకూడదు? ఎందుకు ఉంచాలి?” అని మనని యాజమాన్యం అడిగిందే అనుకుం దాం! మనం ఏ డిపార్టుమెంటులో ఉన్నా, మనకి అప్పగించిన పని ఏదైనా, మన పని వల్ల కంపెనీ ఆదాయం, మరియు లాభం ఎలా పెంచడానికి దోహదం చేసాయో, కాన్‌ఫి డెంట్‌గా చెప్పగలిగితే, మనకి ఉద్యోగ భద్రత ఉన్నట్లే. లేక పోతే లేనట్లె . ఒక చిన్న పని : ఒక కాగితం తీసుకుని, మీరు చేసే పని వల్ల , మీ సంస్థకి యే విధంగా లాభమో, ఒక 4 లేక 5 కారణాలు రాయండి ! సమయం: 20 నిముషాలు. ఆ క్లారిటీ మీద ఎప్పుడూ ఉండండి. కంపెనీలు నడిపే యాజమాన్యం వారు, తమ సంస్థలో ఉన్న ఉద్యోగాలను 3 రకాలుగా చూస్తారు. (1) మనకి డబ్బు తెచ్చే ఉద్యోగాలు. (2) మనకి డబ్బు ఆదా చేసే ఉద్యోగాలు (3) మనకి డబ్బు ఖర్చు కలిగించే ఉద్యోగాలు . కంపెనీ ఆర్ధిక ఇబ్బందులలో ఉంటే, మొదటి వేటు, 3 వ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల పైన పడుతుంది. అంతగా ప్రాముఖ్యం లేని ఉద్యో గాలు ఏమిటి ? అంటే ఇదమిద్ధంగా చెప్ప లేము. ఒక్కో కంపెనీని బట్టి, వారు చేసే వ్యాపారాన్ని బట్టి అవి మారుతుంటాయి. మనం చేసే పని ఆగి పోతే సంస్థ నడవదు అనిపించే ఉద్యోగాలు, ప్రాముఖ్యం కలిగినవి. మనం ఒక 4 నెలలు కంపెనీ కి వెళ్ళక పోయినా అది నడుస్తుంది అనిపించే ఉద్యోగాలు – అలంకార ప్రాయమైనవి. వాటిలో తాత్కాలిక సౌకర్యం ఉంటుంది కానీ, ఉద్యోగ భద్రత ఉండదు, సుదీర్ఘ కాలంలో. మీ ప్రతిస్పందన ( ఫీడ్‌ బ్యాక్‌ ) తెలియజేయవలసిన ఇమెయిల్‌: essence.training@yahoo.com, punnami.news @gmail.com

Featured హెల్త్ టిప్స్

టీవీ, సెల్ ఫోన్ ల వాడకం — తెచ్చి పెడుతుంది ఊబకాయం.

సమాజములో ఈ మధ్యకాలంలో బిపి. షుగర్‌ .ఊబకాయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి . గతంలో ధనికులలో ఎక్కువగా ఉండే ఊబకాయం ప్రస్తుతం పేద వారిలో కూడా కనిపిస్తుంది.గతంలో పెద్దవయసు వారిలోనే ఉండేది. ఇప్పుడు చంటి పిల్లల్లో కూడా వస్తుంది.దీనికి ప్రధాన కారణం ”పని తక్కువ – తిండి ఎక్కువ”. దీని నివారణకు తిండి తగ్గించుకోవడం ఒక భాగమైతే .శరీరానికి వ్యాయాయం కల్పించడం రెండవ భాగం. తిండి తగ్గించుకోవాలని, పని పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆచరణలో చేయరు. ఇది చేయాలంటే కావలసింది గట్టి పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పిల్లలలో ఊబకాయం గురించి ” ప్రపంచ ఊబకాయ దినోత్సవం” సందర్భంగా ఈరోజు (11-10-19) కొన్ని విషయాలు చర్చించుకుందాం. పిల్లలు ముద్దుగా, బొద్దుగా బొజ్జలేసుకుని మన కళ్ళముందు తిరుగుతూ ఉంటే ముచ్చటగా ఉన్నారని సంబర పడతాము .కానీ ఈ బొజ్జ కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం, బిపి, షుగర్‌ లాంటి జబ్బులు భవిష్యత్తులో వస్తాయనే విషయాన్ని మర్చిపోతాం. బొజ్జలు వచ్చిన తరువాత తగ్గించుకోవడం కష్టం . బొజ్జ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. పసిపిల్లలకు బొజ్జ రాకుండా ఏమి చేద్దాం? పసికందుకు తప్పక తల్లిపాలు తాగించాలి. బిడ్డకి కనీసం ఆరు నెలల పాటు కచ్చితంగా తల్లిపాలు తాగించాలి. సంవత్సరం రోజులు తల్లి పాలు తాగిస్తే మరీ మంచిది . అలా తాగిస్తే పాలు ఇచ్చిన తల్లికి, పాలు తాగిన బిడ్డకి అందరికీ ఉపయోగమే. తల్లి పాలు తాగిన వారికి ఊబకాయం వచ్చే అవకాశం చాలా తక్కువ.  పండ్లు తినాలి-తినిపించాలి.  అప్పుడప్పుడు పండ్లు తినడం కాదు. ప్రతి రోజూ తినాలి . ఒకే రకం కాదు, రక రకాల వివిధ రంగుల పండ్లు తినాలి. రోజుకు నాలుగైదు విడతలుగా తినాలి. ఇలా పండ్లు పిల్లలకు కూడా తినిపించ గలిగితే ఊబకాయం,షుగర్ ,బిపిలు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది. పండ్లు తినడాన్ని చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. కుటుంబమంతా కలిసి పండ్లు తినడం అలవాటుగా పెట్టుకోవడం మంచిది. అప్పుడే పిల్లలు ఆచరించే ప్రయత్నం చేస్తారు.  ప్రతి రోజు తప్పక వ్యాయామం చేయాలి. పరిగెత్తడం,నడవడం,ఆడుకోవడం లాంటివి ఏవైనా కావచ్చు శరీరం బాగా కదిలే రకంగా రోజుకు ఒక గంట పాటు ఇటువంటి కార్యక్రమాలు చేయగల్గితే ఊబకాయం మనచెంతకు చేరలేదు .ఈ వ్యాయామ కార్యక్రమాన్ని పెద్దలు ఆచరిస్తూ,దగ్గరుండి పిల్లలకు అలవాటు చేయాలి.అప్పుడే పిల్లలు దానిని వారి జీవితంలో ఒక భాగం గా గుర్తించి ఆచరించే ప్రయత్నం చేస్తారు.  వీడియో గేములను చూడడం తగ్గించు కోవాలి. టీవీలు ,సెల్ ఫోన్లు చూడడం చిన్నపిల్లల్లో ఇటీవల చాలా ఎక్కువైంది.పిల్లల గోల తప్పించుకోవడానికి తల్లిదండ్రులకు సెల్ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది . సెల్ ఫోను, లాప్ టాప్ ,టీవీ లను చూడడానికి మనం కేటాయించే సమయాన్ని స్క్రీన్ టైమ్ అంటాం. ఈ స్క్రీన్ టైం గంటకు లోబడి ఉంటే ఇబ్బందులు ఏమీ లేవు .రోజుకు రెండు గంటలకు మించితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి .ఈ సమస్యలు చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. కంటిమీద భారమై చూపులో దోషం వస్తుంది. ఆడుకోవడానికి సమయం లేక ఊబకాయం వస్తుంది. వీడియో చూస్తూ తిండి తింటున్నప్పుడు ఎంత తిన్నామో సరిగ్గా తెలియక ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది.వీడియోలు చూస్తూ నిద్ర సరిగా లేక అనేక అనారోగ్యాలకు గురవుతారు.  కూల్ డ్రింక్స్ ను, జంక్ ఫుడ్స్ ను వీలైనంత తగ్గించు కోవాలి  ఇవి తినడానికి, తాగడానికి రుచిగా ఉండవచ్చు . కానీ ఆరోగ్యానికి ఏ రూపంలోనూ ఉపయోగం లేదు.చిన్న కూల్ డ్రింక్ బాటిల్ లో దాదాపుగా ఎనిమిది నుంచి పది స్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ లు చెడిపోకుండా ఉండడానికి అందులో అనేక రకాల రసాయనాలు కలుపుతారు. వీటన్నిటి వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు కూల్ డ్రింక్ తాగుతున్నారు అంటే వారికి ఊబకాయం రావడం ఖాయం.                  గతంలో                                                                                                                                                ప్రస్తుతం                                                                                                                                                                                                డాక్టర్‌ యం.వి.రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌), డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆసుపత్రి, నెల్లూరు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

వృత్తి జీవితం – 2

వృత్తి జీవితం – 2 పనివేళలో అదనపు గంట ( 1 ) నిన్న మనం ఒక డైలమాని విశ్లేషించాం. మన కంపెని యజమాని / డైరక్టర్‌తో కలిసి ఒక ప్రాజక్టు విూద పని చేసే అవకాశంవచ్చినప్పుడు, మన పని వేళలో అదనపు గంటనిఎలా వెతికిపట్టుకోవాలి? అనే విషయం? ఈ సంచికలో అది మరింత విపులంగా. ఇలాంటి కష్టమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మన వృత్తి జీవితంలో ఎన్నోవస్తూ ఉంటాయి. ఏదో ఒక అదనపు బాధ్యత వచ్చి పడుతుంది. అది గనక వదులుకుంటే, మళ్ళీ రాదు, రిటైర్మెంటు అయ్యే వరకు గ్రౌండ్‌ లెవెల్‌ సిపాయి ఉద్యోగమే చెయ్యాలి. ఒప్పుకుంటే, ఒక్క సంవత్సర కాలంలో చాలా గుర్తింపు, పైకి వెళ్ళే అవకాశం. కానీ దాని కోసం చాలా వదులుకోవాలా? వీటికి ఒక పరిష్కారం మన టైం మేనేజిమెంటులో ఉంటుంది. ఇలాంటి అవకాశాలు విూ తలుపు తట్టినప్పుడు, విూకు ఈ సూచనలు ఉపయోగపడవచ్చు. (1) మొట్ట మొదటగా ‘రేపు చేయవలసిన పనుల చెక్‌ లిస్ట్‌’ రాసుకోవడం. ఉదాహరణకి విూ ఆఫీసు 6 గంటలకి అయిపోతుంది అనుకోండి. ఒక 10 నిముషాల ముందు, అన్నీ కట్టేసి, అస్త్ర సన్యాసం చేసి, ఇంటికి వెళ్ళడానికి మూటా ముల్లే సర్దుకుని, ఒక కాగితం పైన, లేదా ఒక డేట్లు ఉన్న డైరీలో, రేపు చేయవలసిన లిస్ట్‌ రాసుకోండి. ఏమేమి పనులు చెయ్యాలి? ఏయే రిపోర్టులు ఎవరెవరికి పంపాలి? ఎవరెవరికి ఫోన్‌ చేసి ఫాలో అప్‌ చెయ్యాలి? వగైరాలు. ఒక సారి మన మనసులో నుంచి పేపర్‌ విూద రాస్తే, మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు రేపటి గురించి ఇబ్బందిపడము. రేపు ఆఫీసుకి వచ్చాక, మన చెక్‌లిస్ట్‌ ఫాలో అయిపోతాము. మన పనికి ఒక రిథం, ఒక ఫ్లో వస్తాయి. (2) రాసుకుని పూర్తి చేసిన పనుల విూద ‘టిక్‌ మార్కు’ పెట్టడం. టిక్‌ మార్కు లేనివి మళ్ళీ రేపటికి. ఇలా ఎక్కువ రాసుకోవడం, తక్కువ చెయ్యడం ఎందుకు అవుతుందంటే, ఏ పనికి ఎంత సమయం పడుతుంది అనే విశ్లేషణ లేనప్పుడు. మన బాల్యంలో స్కూలులో ‘కాలము -పని’ లెక్కలు చేశాము గుర్తు ఉందా? దానిని మళ్ళీ తిరగదోడాలి! (3) ఇక 3వ పాయింటు. మన దైనందిక పని జీవితంలో ‘టైం వేస్ట్‌ వ్యవహారాలు’ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని, వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం. వీటిలో ముఖ్యమైనవి. పని సమయంలో ఫేస్‌బుక్‌ అప్‌ డేట్‌లు, వాట్సాప్‌ ఫార్వర్డ్‌లు, చాటింగులు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకుని (అదీ ఆఫీస్‌ వై-ఫైతో!) చూడడం, ఫార్వర్డ్‌ చెయ్యడం, అనవసరమైన విూటింగులు, మధ్యలో ఫోన్‌ కాల్స్‌లాంటి ఆటంకాలు, ఎక్కడో పెట్టి మరిచిపోయిన ఫైల్స్‌ని వెతుక్కో వడం, ఇలా వీటిని తొలగిస్తే రోజుకు గంటన్నర మిగులుతుంది. (4) మనం కేవలం ప్రేక్షక పాత్ర వహించే ఆఫీస్‌ విూటింగుల నుంచి మనని తప్పించమని మనపై అధికారులని రెక్వెస్ట్‌ చేయడం. ఈ టైంలో ‘బిగ్‌బాస్‌ ప్రాజక్టు విూద ఉన్నారు కాబట్టి విూపై బాస్‌ విూ అభ్యర్ధన వింటారు! (5) ఈ చివరి సూచన ఇతర స¬ద్యోగుల సలహా అడగడం వారిని అడగవలసిన ప్రశ్నలు. (1) నాకు ఏయే పనులలో టైం వేష్టు అవుతోంది? (2) ఏయే పనులను నేను తరచుగా చేయడం తగ్గించాలి? (3) ఏ పనులు, నేను మరింత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు? (ఉదాహరణకి, ఆఫీసు విూటింగులు. (4) ఏయే పనులను నేను పూర్తిగా మానేయవచ్చు? మనం ఊహించని జవాబులు వచ్చి, మనని కుదిపేస్తాయి ! సంస్థలో అదనపు బాధ్యతని ఒక భారంగా కాక, విలువైన అవకాశంగా భావించండి. చేసే 8 గంటలలోనే, దాగి ఉన్న అదనపు గంటని కనుక్కుని, విూ ఉత్పాదక శక్తిని పెంచుకోండి. వృత్తి జీవితంలో మరిన్ని మెట్లు అధిరోహించండి.

Featured ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు అవసరం

మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు అవసరం నెల్లూరు, అక్టోబర్‌ 11 (పున్నమి విలేకరి) : చదువుతో పాటు మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు ఆడటం ఎంతో అవసరమని వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాలల పురుషుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచి విద్యను అందించాలని చూస్తున్నారే తప్ప క్రీడల పట్ల ఆలోచన చేయడం లేదు. సమాజంలో రాణించాలంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. సమాజంతో పోటీ పడేందుకు క్రీడలు ఉపయోగపడతాయి. గెలుపోటములను తట్టుకుని నిలబడే మానసిక స్థితి, మనో స్థైర్యం క్రీడల ద్వారా మెరుగుపడతాయి. అన్ని క్రీడల పట్ల ఆసక్తి చూపించండి కానీ, గ్రామీణ క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించకండి. తల్లితండ్రులు సమాజంలో తమ బిడ్డ పేరు గర్వంగా చెప్పుకునే స్థాయికి అందరూ ఎదగాలని ఆయన తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ  అభినందనలు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

బాబు పర్యటనను విజయవంతం చేద్దాం

బాబు పర్యటనను విజయవంతం చేద్దాం నెల్లూరు, అక్టోబర్‌ 11 (పున్నమి విలేకరి) : జిల్లాలో ఈ నెల 14,15 వ తేదీలలో మాజీ సియం చంద్రబాబు పర్యటన ఉంటుందని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. 14వ తేదిన జిల్లా విసత స్థాయి సమావేశం జరుగుతుందని, నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికార పార్టీ బాధితులతో సమావేశం నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మాజీ సియం పర్యటనలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూనే, అధికార పార్టీ బాధితులకు బరోసా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి అమర్‌నాధ్‌ రెడ్డి పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలబించిన ప్రభుత్వం ఇదేనని ఆయన విమర్శించారు. వైఎస్‌అర్‌ కంపెనీ లిమిటెడ్‌గా రాష్టాన్ని మార్చారని ఆయన దుయ్యబట్టారు. ఇసుక అక్రమంగా ఇతర రాష్టాలకు తరలిపోతుంది.ఇందులో అదికార నాయకులకే అగ్రబాగంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మద్య నిషేధం అంటు మద్యం రేట్లు పెంచి అమ్ముతున్నారు.త్వరలో మద్యం అమ్మకాలు వారి పార్టీ కార్యకర్తలకు అప్ప చెబుతారని ఇది దారుణమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు మండల స్థాయి అదికారుల పై దాడులు జరుగుతున్నాయి.త్వరలో జిల్లా, రాష్ట స్థాయికి చేరుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. రైతు బరోసా 12500ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చే 6000ను కలుపుకున్నదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. గతంలో మేము అన్నదాత సుఖీభవ లో15000 ఇవ్వడాన్ని మేము ప్రారంబించి 4వేలు ఇచ్చామని రాష్టం ఇప్పుడు ఇచ్చే రైతు బరోసాలో కేంద్రము ఇచ్చే 6వేలును కలుపుకుంటున్నారా..లేక 12500 మీరు స్వంతంగా ఇస్తున్నారా! అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రీటెండరింగ్‌ విధానాన్ని ప్రవేవపెట్టి దానిని అయోమయంగా చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో మీరు విమర్శించిన కాంట్రాక్టు కంపెనీకి మీరు అదే పనిని కట్డ బెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని కంప్లీట్‌ చేయలేదని, వెంటనే కేంద్రము ఈ ప్రాజెక్టు ను వెంటనే హ్యాండోవర్‌ చేసుకొని ప్రాజెక్టు పూర్తి చేయాలని సోమిరెడ్డి తెలియచేశారు. ఎన్‌ అర్‌ జిసి పథకంలో కేంద్రం విడుదల చేసిన రాష్టం ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. వచ్చిన నిధులకు రాష్ట ప్రభుత్వ వాటా కలుపుకొని మూడు రోజుల్లో విడుదల చేయక పోతే 12% వడ్డీతో సహా కట్టి ఇవ్వాలి లేకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ముందుగా చేసిన పనులకు ముందుగా బిల్లు చెల్లించాలి. నీరు చెట్టు పనులు చేసిన వారి వల్ల పార్టీ నష్టపోతుందని ఆయన తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి మెండి వైఖరి వల్ల రాష్టం నష్ట పోతుందని ఆయన తెలిపారు. రాష్టం మీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కాదని ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమని దీనిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాష్డము -43శాతం గ్రోత్‌లో వెనుకబడి పోయిందని బాబు పాలనలో రాష్ట్రం ముందంజలో వుండేదని ఆయన పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.