Tuesday, 9 December 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్‌ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు. తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్‌ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్‌ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది. మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్‌ ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సోదరుడు దినకర్‌ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్‌ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్‌ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

వైయస్‌ హయాం నాటి పథకాలను పూర్తి చేయండి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపు నెల్లూరు, అక్టోబర్‌ 23 (పున్నమి విలేకరి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి హయాంలో చేపట్టిన పలు పథకాలను ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని జూబ్లీహాలులో బుధవారం జరిగిన సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఐదేళ్లుగా వర్షాలు లేక పోవడం వల్ల రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నదని తెలిపారు. అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత  వర్షాలు కురిసి జిల్లాలోని జలాశయాల్లో దాదాపు 100 టీఎంసీలకు పైన నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు జిల్లాలోని రైతాంగానికి మొదటి పంటకు నీటి కొరత లేదని, అయితే నీటి యాజమాన్యం చక్కగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ విషయంలో అధికారులు తగిన శ్రద్ధ లేదని పేర్కొన్నారు. ఒక్క టీఎంసీ నీటితో దాదాపు 14 వేల ఎకరాలు పండించామని తెలిపారు .గతంలో ఇది అమలు చేసి విజయం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు తగిన శ్రద్ధ చూపినట్లయితే నీరు సమ ద్ధిగా లభించి రెండో పంట పడుతుందని పేర్కొన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ,నీటిపారుదల శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి మరో 20 టీఎంసీల నీటిని తెచ్చినట్లయితే కండలేరు జలాశయం 50 టీఎంసీలకు నిల్వ చేరుతుందని తెలిపారు వైయస్‌ హయాంలో చేపట్టిన ప్ధకాలను గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని, ఇప్పుడైనా వాటిని పూర్తి చేసినట్లయితే బాగుంటుందని సూచించారు. రైతులు కూడా ఈ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొంది జీవితాంతం గుర్తు పెట్టుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రెండో పంటకు నీరు ఇచ్చే విషయంలో అధికారులు ప్రత్యేక ద ష్టి పెట్టాలని, అలాగే రైతులకు ఎప్పుడు ఇచ్చేది తెలపాలని కోరారు సాగునీటి సలహా సంఘ సమావేశానికి మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గౌతమ్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించారు జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల తో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి సాగునీటి సంఘాల నేతలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ తమ ప్రాంతాల పరిధిలోని సాగునీటి వెతలను సమావేశం దష్టికి తీసుకువచ్చారు.

Featured

బెజవాడ ఓబులురెడ్డి ఈక లేరు. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ బెజవాడ రామచంద్రా రెడ్డి గారి తనయుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ బెజవాడ పాపిరెడ్డి గారి సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బెజవాడ ఓబులురెడ్డి గారు కొద్ది సేపటి క్రితం పరమ పదించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని పార్థిస్తున్నాను. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

Featured

సోషల్ మీడియా పై కేంద్రం నియంత్రణ

*జనవరి 15 నాటికి సోషల్ మీడియా నియంత్రణకు సరికొత్త నిబంధనలు* *సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం* *వివిధ హైకోర్టుల్లో సోషల్ మీడియాపై పిటిషన్లు* *సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ తో అనుసంధానించాలని విజ్ఞప్తి* *పెండింగ్ పిటిషన్లు సుప్రీం కోర్టుకు బదిలీ* సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, దూషణలు, పరస్పర ఆరోపణలు వంటి అవాంఛనీయ అంశాలకు అడ్డుకట్ట వేసేందుకు జనవరి 15 నాటికి సరికొత్త నియమావళికి రూపకల్పన చేస్తామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కొంతకాలంగా సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేసే విషయం చర్చకు వస్తోంది. తద్వారా ఫేక్ ఐడీలను నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, దీనిపై మధ్యప్రదేశ్, మద్రాస్, బొంబాయి హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే, సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థలు అన్ని పిటిషన్లను ఒకే న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దీనిపై నేడు విచారణ జరిగింది. వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు తన ధర్మాసనం పరిధిలోకి బదిలీ చేయించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించేందుకు వీలుగా నియమావళి ఏర్పాటుపై తమకు జనవరిలో నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ధర్మాసనానికి బదిలీ అయిన పిటిషన్లపై వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.

Featured

యువకుడు దారుణహత్య

  *దగదర్తి మండలంలోని సున్నపుబట్టి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీప్రాంతంలో చంద్రారెడ్డి అనే యువకుడు సోమవారం దారణ హత్యకు గురయ్యాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు మృతుడు బుచ్చి మండలంలోని పురందరపురం గ్రామానికి చెందిన చంద్రారెడ్డి (23)గా గుర్తించారు. అయితే మృతుడు చంద్రారెడ్డి మెడికల్ ఏజెన్సీలో రిప్రజింటర్ గా పనిచేస్తుంటాడని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి రాత్రి ఇంటికి పోవకపోవటంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆప్ వచ్చింది .దీంతో కుటుంబసభ్యులు ఉదయం నుంచి చుట్టుపక్కల వారిని విచారించగా సున్నపుబట్టి అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ ఉందని తెలుసుకొని సంఘటన ప్రాంతానికి అక్కడ ఉన్న బైక్ ను చూసి తమ వాడేనని గుర్తించి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మెఖం పై గాటులు పక్కన కండోమ్ ప్యాకెట్లు ఒక కత్తి పడి ఉండటాన్ని గమనించారు. అయితే మృతిడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు అలానే ఉన్నాయి.దీంతో పోలీసులు ఏదైనా అక్రమ సంబందం ఉందేమో అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో ప్రణాళికా బద్దంగా ముందుకు పోతున్న అధికార వైసీపీ పార్టీ

గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరమైన, పోటాపోటీగా ఎత్తులు,వ్యూహాలు తో పయనిస్తుండగా…వైసీపీ జిల్లాలో తనదైన ముద్ర పడాలని ప్రణాళికలు రచిస్తుంది .మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో గుంటూరు పశ్చిమ నియోజక వర్గం,రేపల్లె నుంచి మద్దాలిగిరిధర్,అనగాని సత్యప్రసాద్ లతో టిడిపి సరి పెట్టు కోగా…మూడు పార్లమెంట్ స్థానాల్లో 2 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకొని తిరుగులేని ఆధిక్యత సాధించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జిల్లాలో వైసిపిని తిరుగులేని శక్తి గా తయారు చేయాలని పావులు కదుపుతున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత…4 నెలలు పైగా పాలనలో కొన్ని ఇబ్బందులు,గత ప్రభుత్వ అవినీతి జరిగిందని దానిని బయట పెట్టాలని కాలయాపన చేసే బదులు పాలన పై దృష్టి పెట్టి కొనసాగించాలని అలా కాకుండా అన్ని చోట్లా అవినీతిపై యుద్ధం చేయడం వలన పాలన గాడి తప్పుతున్నదని ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను అధిక మించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కొంతమంది రాజకీయ పండితులు భావిస్తున్నారు.కానీ వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…తనదైన శైలిలో ఇచ్చిన హామీలు,నవరత్నాలు ను అందరకు అందించేలా ప్రణాళికా బద్దంగా దూసుకు పోతున్నారు.గుంటూరు జిల్లాకు రాష్ట్ర హోమ్ శాఖా మంత్రిణీ గా శ్రీమతి మేకతోటి సుచరితను,బిసి శాఖా మంత్రిగా మోపిదేవి వెంకట రమణారావు ను,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి లకు మంత్రి వర్గంలో కేటాయించి జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.మొదటి నుంచి గుంటూరు జిల్లా తెలుగు దేశం నకు మంచి పట్టు ఉండటంతో…ఈసారి ఎలాగైనా తెలుగుదేశం ను ఓడించాలని మొదట నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంది.2014 ఎన్నికల్లో 14 సీట్లు సాధించిన టిడిపి మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 2 స్థానాలకే చతికిల పడింది.తెలుగుదేశం అధికారము లో ఉన్నపుడు 4 సంవత్సరం లో బిజెపి తో చేతులు కలిపి సహా జీవనం సాగించి,చివర్లో ప్రజల నుంచి ప్రత్యేక హోదా విషయంలో వ్యతిరేకత రావటంతో తెగ దెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ను పసి గట్టలేకపోయింది.జిల్లాలో తెలుగు దేశం లో సీనియర్లు ఉన్నా కాని…అనేక స్థానాల్లో శాసన సభ్యుల పని తీరు,సంక్షేమ పథకాల అమలులో పారదర్శక లేకపోవటం,ఒకే సామాజిక వర్గం పెత్తనం చెలవించటం టిడిపి నాయకులు ఇసుక మాఫియా లాగా ఏర్పడి ఆ శ్రేణులు ఎక్కువ ఆదాయ వనరులు పొందారని వీటివల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడకట్టుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అనేక మంది సీనియర్లు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు,మాజీ స్పీకర్ స్వర్గీయ డా: కోడెల ఇంకా యరపతినేని శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు జి వి ఆంజనేయులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ లాంటి అనుభవం గల నాయకులు ఉన్నప్పటికి జిల్లాలో ఓట్ బ్యాంక్ ను తమ వైపు సాధించు కోవడంలో విఫలం అయ్యారు. మొత్తం 17 నియోజక వర్గాల్లో..పని తీరు పరిశీలించితే… మంగళగిరి నియోజకవర్గములో మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ ఓటమిని తెలుగు దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.అక్కడ వైసీపీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణరెడ్డి నియోజకవర్గము లో ప్రజల్లో ఉండి పాగా వేయ్యటం, ప్రతిపక్షము లో ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉండటం వలన బలమైన ప్రత్యర్థి అయిన నారా లోకేష్ ను తేలిగ్గా ఓడించగలిగారు.ప్రధానంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటం అక్కడ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ను వారు తిప్పు కోవటంలో విజయవంతం అయ్యారు.జిల్లా వ్యాప్తంగా శాసన సభ్యులుగా విజయ కేతనం ఎగురవేసిన ఎమ్మెల్యే లు తమ నియోజక వర్గం లో నిర్మాణాత్మమైన పాత్ర పోషించి ప్రజలకు వెన్ను దన్నుగా ఉండాలని,ప్రధానం గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను,నవరత్నాలు ను అమలు చేసే పనుల్లో బిజీ బిజీ గా ఉన్నారు.

Featured హెల్త్ టిప్స్

డెంగ్యూ జ్వరం జీవితకాలంలొ నాలుగు సార్లకు మించి రాదు.

డెంగ్యూ జ్వరం జీవితకాలంలొ నాలుగు సార్లకు మించి రాదు.ఐదవ సారి రాదు అంటే అది మనిషి గొప్పదనం కాదు.అలాగని డెంగ్యూ వైరస్ చేతగానితనము అంతకన్నా కాదు.మనకి డెంగ్యూ జ్వరాన్ని కలిగించే వైరస్ లు నాలుగు రకాలు .ఒక రకం వల్ల డెంగ్యూ జ్వరం వస్తే ఆ రకం వైరస్ మనకు మళ్ళీ సంక్రమించే అవకాశం లేదు. ఆ రకం వైరస్ కు వ్యతిరేకంగా మన శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇలా ఏర్పడిన వ్యాధి నిరోధక శక్తి మనిషీ జీవితకాలం పాటు కొనసాగుతుంది .అందుకే జీవితంలో ఈ రకమైన డెంగ్యూ జ్వరం మళ్ళీ వచ్చే అవకాశం లేదు.ఈ నాలుగు రకాల డెంగ్యూ వైరస్ లు నాలుగు సార్లు మాత్రమే డెంగ్యూ జ్వరాన్ని కలిగించ గలవు.ఐదవ సారి వచ్చే అవకాశం లేనే లేదు. ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటిటంటే మొదటి సారి కంటే రెండో సారి ప్రమాదం ఎక్కువ. రెండవసారి కంటే మూడవసారి, మూడవ సారి కంటే నాలుగవసారి ప్రమాదం ఎక్కువ. డాక్టర్ MV RAMANAIAH

Featured

మూడు రోజుల్లో భారీ వర్షాలు

నెల్లూరు, అక్టోబర్‌ 22 (పున్నమి విలేకరి): దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెల్లూరు జిల్లా పై పూర్తి ప్రభావాన్ని చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా రెండు రోజు లుగా ఎడతెరిపి లేని మోస్తారు వర్షాలు కురుస్తు న్నాయి. గత రాత్రి నుంచి తీర ప్రాంతంలోని దాదాపు 10 మండలాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నెల్లూరు నగరం సహా గూడూరు, కావలి, సూళ్లూరుపేటలలో వర్షం కురిసింది. శివారు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ప్రత్యేకించి నెల్లూరు నగరంలోని కొత్తూరు కాలని, వైఎస్‌ఆర్‌ నగర్‌, ఇందిరమ్మ కాలనీ, బిఎంఆర్‌ నగర్‌, బుజబుజనెల్లూరు, భగత్‌సింగ్‌ కాలని సహా పల్లపు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాలువలు పొంగి ప్రవహిస్తు న్నాయి. దాంతో వర్షపు నీరు మొత్తం ఇళ్లలోకి చేరుతోంది. ఇందిరమ్మ కాలనీ, బుజబుజ నెల్లూరులో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షా లతో చిన్నాపెద్దా చెరువులు, రిజర్వాయర్‌లలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. ఇప్పటికే సోమశిల జలాశయంలో 74 టిఎంసిల నీటిమట్టం కొనసాగుతుండగా, కనిగిరి, సర్వేపల్లి, అల్లూరు, నెల్లూరు, చినక్రాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలలో 1 నుంచి 3 టిఎంసీల నీటిమట్టం చేరువైంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో ప్రధానమైన నదులు, ఏరులలో నీటి ప్రవాహం మొదలైంది. కండలేరు, కైవల్య, కాళంగి, స్వర్ణముఖి, బొగ్గేరు, బీరాపేరు, కేతామన్నేరు, పిల్లాపేరులలో నీటి ప్రవాహం మొదలైంది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో కావలి నుంచి సూళ్లూరుపేట వరకు ఉన్న 11 మండలాలలో అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో తీరప్రాంతాల మండలాల అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. Also read నెల్లూరు-కేంద్రంగా-ఇసుక

Featured బిజినెస్

పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం

వృతి ్త జీవితం పున్నమి పాఠకులకు నమస్కారములు ఈ రోజు అనగా 22 అక్టోబరుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization (WHO), అంతర్జాతీయం గా ” పని చేసే చోట మానసిక ఆరోగ్య దినం ”(International Workplace Wellness Day) గా నిర్ణయించింది. ఈ సందర్భంగా, యాజమాన్యాలకు, మేనేజర్‌లకు, మరియు పని చేసే మనలాంటి వారికి, కొన్ని మార్గ దర్శక సూత్రాలు ( గైడ్‌ లైన్స్‌ ) సూచించింది. పని చేసే చోట మానసిక ఆరోగ్యం, ఉల్లాసం ఏర్పరచడం అనేది – పని తీసుకునే యాజమాన్యాల బాధ్యత . పని వారి హక్కు ఈ సందర్భంగా ఈ ఆర్టికల్‌ . ఈ రోజు ఆది వారం కాక పోయినా !! పున్నమికి ప్రత్యేకం . వర్క్‌ ప్లేస్‌ అనగా నేమి ? ఆ సందర్భంగా, వర్క్‌ ప్లేస్‌, అనగా పని చేసే చోట – అది ఆఫీసు కావచ్చు, లేక దుకాణం, షాపింగ్‌ మాల్‌, ఫ్యాక్టరీ, లేదా పొలం, లేక సేల్స్‌లో పని చేసే వారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసే వారు అయితే బయటి ప్రపంచం రోడ్డు ఇవన్నీ వర్క్‌ ప్లేస్‌ క్రిందకే వస్తాయి. మన దగ్గరపని చేసే వారి మానసిక ఆరోగ్యం మీదనే, కంపెనీ ఆ ఆరోగ్యం ఆధార పడి ఉంటుంది. మొన్న , తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీ గా పని చేసే పోలీసు అధికారి , రివాల్వర్‌ తో కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. ఇంకా మరెందరో ఉద్యోగులు. యువ సాఫ్ట్‌ వేర్‌ / సెల్స్‌ ఉద్యోగులు. న్యూస్‌ లో చదువుతూ ఉంటాం. పని వత్తిడి, టార్గెట్‌ల వత్తిడి భరించ లేక, తాగుడుకిలోను కావడం, పెరిగి పోతున్న టెంపర్‌లు, విడాకుల సంఖ్య. అందుకే , మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యం !! ‘పనిచేసే చోట మానసికారోగ్యానికి కొన్ని సూచనలు . పనిచేసే చోట సంతోషానికి నియమాలు :- 1. ఎవరిపైనా అమిత విశ్వాసం ఉంచకండి కానీ అందరితో గౌరవంగా మెలగండి . 2. కార్యాలయాలలో జరిగేది కార్యాలయాలలో ఉంచాలి. కార్యాలయాలలో జరిగేవి ఇంటికికానీ, ఇంటి విషయాలు కార్యాలయాలకు గానీ మోసుకు రాకండి 3. సమయానికి రండి సమయానికి వెళ్ళండి. మీ కార్యాలయ మేజా మీ ఆరోగ్యాన్నేమీ మెరుగుపరచదు. 4. పనిచేసేచోట సంభంధబాంధవ్యాలు పెంచుకోకండి. అవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. (స్నేహ భావంతో మెలగండి కానీ అంతా స్నేహితలని భ్రమపడవద్దు) 5. ఏదీ ఆశించకండి. ఎవరయినా సహాయం చేస్తే కతజ్ఞతాపూర్వకంగా ఉండండి, చేయకపోతే ఆ పని ఎలా చేయాలో మీరే నేర్చుకుంటారు. 6. హోదాలకోసం ఉర్రూతలూగకండి. పదోన్నతి (ప్రమోషన్‌) కలిగితే సంతోషం, లేకుంటే పోయేదేమీ లేదు, హోదా కన్నా మీ పనితీరు, మేధలపై ఎక్కువ గౌరవం ఆధారపడి ఉంటుంది. 7. కార్యాలయ విషయాల వెనకపడవద్దు. చేయటానికి ముఖ్యమయిన ఇతర పనులెన్నో ఉంటాయి. 8. ప్రతీ విషయం మీ అహం పై ప్రభావం చూపనీయవద్దు. మీరు చేసే పనికి జీతం వస్తుంది. మీ మేధ, బలాలతో సంతోషం వెతుక్కోండి. 9. మీతో ఇతరుల ప్రవర్తనను పట్టించుకోకండి. అందరికీ నచ్చేలా ఉండాలని లేదు. (గుర్తించుకోండి, అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నించడము వైఫల్యాలకు దగ్గరి దారి) 10. చివరగా ఇల్లు, కుటుంబం, స్నేహితులు, స్వీయమనశ్శాంతి వీటి కన్నా ఏదీ ఎక్కువ కాదు . (ఈ వ్యాసం రెండవ భాగం , వచ్చే మంగళవారం, అనగా 29 అక్టోబరు ) ఈ వ్యాసం చదువుతున్న మీ అందరి సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని మనస్ఫూర్తిగా కోరు కుంటూ…. మీ సి.వి.రమణ, హైదరాబాద్‌ Also read ఉద్యోగం-వేటలో-మనం-చెయ్యక

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కేంద్రంగా ఇసుకదోపిడీ

నెల్లూరు కేంద్రంగా ఇసుకదోపిడీ బల్క్‌ ఆర్డర్ల పేరుతో భారీ అక్రమాలు నెల్లూరు టూ రామాపురం వయా పొదలకూరు రేవుల నిర్వాహకులే సూత్రధారులు? ప్రేక్షకపాత్ర వహిస్తున్న నిఘా విభాగాలు. నెల్లూరు, (పున్నమి ప్రతినిధి) : ఇసుక… గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఒక అరుదైన వినియోగ వస్తువు. నిర్మాణ రంగానికి మూలపదార్థం. అనేక మంది కార్మికుల నుంచి కార్పొరేట్‌ స్థాయి వరకు ఉపాధి కూడా. ఇప్పుడది అందని ద్రాక్షలా మారింది కొందరికి. మరికొందరికి ఆయాచిత వరమైంది. నిల్వలు సమ ద్ధిగా వున్నా నదుల వెంట పదుల కొద్ది రేవులున్నా ఇసుక గిరాకి మాత్రం రోజురోజుకి పెరుగుతుంది. ఎందుకీ దుస్థితి… కారకులెవరు… కార్యనిర్వహణలో జరుగుతున్న లోపాలు ఏంటి? రాష్ట్రం ఇసుక విధానం పై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ రంగాలకు అందుబాటులోకి తేవాలంటూ అనేక మార్పులు చేస్తోంది రాష్ట్రం ప్రభుత్వం ఇసుక విధానం పై.అన్నింటినీ.. అనుకూలంగా మార్చుకొంటున్నారు…అక్రమార్కులు.. ఇసుక రేవులను నిలువుదోపిడీ చేస్తున్నారు.. అందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు… అక్రమార్కులకు అనంత కోటి ఉపాయాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానం పై తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు, కఠిన నిబంధనలను సైతం కొందరు అక్రమ మార్గాలకు అడ్డాగా మారుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇసుక రవాణా ఇందుకు తార్కాణంగా వుంది. జిల్లాలో 27కు పైగా ఇసుక రేవులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అవసరాల మేరకు ఆన్‌లైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనినే తమ అక్రమ ఆర్థిక ఆర్జనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు ఇసుక రేవుల నిర్వాహకులు. నెల్లూరు నగర సమీపంలోని పొట్టేపాళెం, జొన్నవాడ, పల్లెపాడు రేవులను దక్కించుకున్న ఓ నిర్వాహకుడు ఏకంగా తన పేరు మీదనే వేలకొద్ది టన్నుల ఇసుకను ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా దొడ్డి దారిన అనుమతులు తీసుకుని కొల్లకొట్టేస్తున్నాడు. ఇసుక రేవును అనుమతి పొందిన వారు వాటిని సరఫరా చేసే బాధ్యతను చేపట్టవలసి వుండగా, ఇక్కడ ఇసుకరేవు నిర్వాహకుడు తన పేరుమీదనే బల్క్‌ఆర్డర్లు పొందారు. ఒక్కో రేవు నుంచి ఉన్నతాధికారుల ద్వారా 5000 టన్నులకు అనుమతి తీసుకుని నా రేవు నా ఇష్టం అన్నట్లుగా మిగిలిన వారికి ఇసుక దక్కకుండా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ నిర్మాణ రంగాల అవసరాలకు ప్రాధాన్యతను ద ష్టిలో ఉంచుకొని బల్క్‌ ఆర్డర్ల అనుమతికి తెర లేపింది. దీనినే అనుకూలంగా మార్చుకున్న పొట్టేపాళెం, జొన్నవాడల రేవు నిర్వాహకులు బల్క్‌ఆర్డర్‌ల పేరుతో ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించేస్తున్నారు. ఏపీ సరిహద్దులోని తడ మండలం, రామాపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీల పేరుతో 5 వేల మెట్రిక్‌టన్నుల అనుమతి పొంది దొడ్డి దారిన హద్దులు దాటించేస్తున్నారు. రెండు రోజుల క్రితం బల్క్‌ఆర్డర్ల నిర్వాహకులు రవాణా చేస్తున్న భారీ వాహనాలను పొదలకూరు పోలీసులు గుర్తించారు. ఒకవైపు అనుమతి, ఒక చోట సరఫరా మరోచోటికి అన్నట్లుగా అక్రమ రవాణా చేస్తూ దొడ్డి దారిన నెల్లూరు టు రామాపురం, వయా పొదలకూరు అన్నట్లు ఈ సరఫరాను కొనసాగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పల్లిపాలెం, పొట్టెపాళెం, జొన్నవాడ రేవుల నిర్వాహకులు ఒక్కరే కావడంతో వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా తయారైంది ఇసుక రవాణా. సహజంగా జిల్లాలో జరుగుతున్న అభివ ద్ధి పనుల కోసం బల్క్‌ ఆర్డర్లు పొందిన వారికి ప్రాధాన్యత క్రమం ప్రకారం ఇసుక సరఫరా చేయాల్సి వుంటుంది. అయితే ఆయా రేవుల నిర్వాహకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. నెల్లూరులో జరిగే అభివ ద్ధి పనులకు సుదూర ప్రాంతాల నుంచి ఇసుక అనుమతులు ఇస్తున్నారు. అందులోనూ అయిన వారికి ఆకులో, కాని వారికి కంచాలు అన్నట్లు రీచ్‌లలో లోడుకి లోడు అదనపు సొమ్ము చెల్లించిన వారికి ముందుగా రేవులో లోడింగ్‌ జరుగుతోంది. అలా కాని వారికి మాత్రం సవాలాక్ష ఆంక్షలు విధిస్తున్నారు ఇసుక సరఫరాకు అనుమతులు పొందిన నిర్వాహకులు. నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అభివ ద్ధి పనులు జరుగుతుండడం, నిర్మాణ రంగం వేగవంతం కావడంతో ఇసుకకు పెద్ద ఎత్తున గిరాకి ఏర్పడింది. ఇటీవల ఇసుక విధానంలో నెలకొన్ని గందరగోళం నేపథ్యంలో ఇక్కడ రేవుల నిర్వాహకులు దానిని రూపాయికి రూపాయి అదనం అన్నట్లుగా క్యాష్‌ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. వాస్తవంగా శ్రీసిటీలో అభివ ద్ధి పనులు వేల కొద్ది టన్నులు జరుగుతున్నా సమీపంలోని స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి సరఫరా చేసుకునే అవకాశం వుంటుంది.అయితే ఇక్కడి నిర్వాహకులు మాత్రం నెల్లూరులో అభివ ద్ధి పనులకు మాత్రం స్వర్ణముఖి, సూళ్లూరుపేటల నుంచి అనుమతులుఇస్తున్నారు.అక్కడి అభివ ద్ధి పనులకు నెల్లూరు నుంచి ఇసుక సరఫరాకు అనుమతులు తెస్తున్నారు. అందులోను నెల్లూరు నుంచి ఏపీ తమిళనాడు సరిహద్దులో నున్న రామాపురానికి మాత్రమే అత్యధిక స్థాయిలో ఇసుక సరఫరా అవుతుంది. జిల్లా కేంద్రంలో భారీ నిర్మాణాలు కేంద్ర రాష్ట్రప్రభుత్వాల అభివ ద్ధి పనులకు చెందిన ప్రాజెక్టుపనులు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నా, వాటికి సరఫరా చేయకుండా ఒక్క రామాపురానికే పెద్ద ఎత్తున బల్క్‌ ఆర్డర్లు పొందడం ఖచ్చితంగా సరిహద్దును దాటించేందుకేనన్న విమర్శలు, ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక రవాణా,అనుమతులు, గిరాకిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.