Sunday, 7 December 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్

అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం

అట్టహాసంగా ఎంపీ ఆదాల జన్మదినోత్సవం దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు, అక్టోబర్‌ 25 (పున్నమి ప్రతినిధి) : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి జన్మదినోత్సవం శుక్రవారం ఉదయం ఆయన ఇంట్లో అట్టహాసంగా జరిగింది. ఉదయాన్నే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వింధ్యావళి దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు ఉదయం నుంచే ఆయన ఇంటికి అభినందించేందుకు బారులు తీరారు. ఏపీ ఆర్‌ జిందాబాద్‌ ఏపీ ఆర్‌ వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. భారీ గజమాలలతో సత్కరించారు డప్పులు మోత మోగాయి. బాణాసంచా శబ్దాలతో ప్రాంతమంతా హోరెత్తింది. పలువురు కార్యకర్తలు, నేతలు శాలువాలతో సత్కరించారు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత అభిమానుల మధ్య ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి భారీ కేకును కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. ప్రాంతాలకతీతంగా పార్టీలకతీతంగా ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఇంటికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఆదాల అభిమాని నిజాముద్దీన్‌ హైదరాబాదు నుంచి భారీ బెలూన్ను తెప్పించి గురువారం రాత్రి ఆయన ఇంటి పైన ఎగరవేశారు తన అభిమానాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించుకున్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు కు అల్పాహారం మిఠాయిలు పంపిణీ జరిగింది ఆదాల ప్రభాకర్‌ రెడ్డి జన్మదినోత్సవ ఏర్పాట్లు విజయ డైరీ చైర్మన్‌ రంగా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి అంధుల పాఠశాలకు ఎంపీ ఆదాల లక్ష విరాళం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం విశ్వభారతి అంధుల పాఠశాలకు లక్ష రూపాయల విరాళం అందించారు సతీమణి వింధ్యావళి సమేతంగా పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశ్వభారతి అంధుల పాఠశాలలో తన జన్మ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషమని తన అభిమానాన్ని ప్రకటించారు అంధుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నగదుతో పాటు అక్కడ అవసరమైన మరుగుదొడ్లను కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇక్కడి అంధ విద్యార్థు లకు మేలు జరగాలని ఆశిస్తున్న ట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ విద్యార్థులకు పండ్లు పలహారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదాల సతీమణి వింధ్యావళితో పాటు పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి, నెల్లూరు రూరల్‌ ఇన్చార్జి గిరిధర్రెడ్డి ,కోటేశ్వర్‌ రెడ్డి , స్వర్ణ వెంకయ్య, సుధాకర్‌ రెడ్డి, అబూబకర్‌, ఇక్బాల్‌, సుధాకర్‌ యాదవ్‌, మధు, నరసింహారావు ,నెల్లూరు ఝాన్సీ లక్ష్మి, పాముల హరి తదితరులు పాల్గొన్నారు దివ్యాంగ బాలలు మంచి జీవితాన్ని పొందాలి దివ్యాంగ బాలల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరు రెడ్‌ క్రాస్‌ ప్రాంగణంలో జరిగిన మహా రక్తదాన శిబిరం, దివ్యాంగ బాలలకు అన్నదానం, వ్యాయామ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్క్రాస్‌ ఆధ్వర్యంలో చాలా సంస్థలు సేవాగుణం తో పనిచేస్తున్నాయని ప్రశంసించారు. దివ్యాంగ బాలలు ఇక్కడ లభిస్తున్న శిక్షణతో కోలుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టి , స్వతంత్య్రంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు జిమ్‌ వంశి ఆధ్వర్యంలో జరగడం సంతోష దాయకమని పేర్కొన్నారు. రక్తదానం ఉత్తమమైనదని, దీనివల్ల ఎందరో ప్రాణాలను రక్షించ వచ్చునని తెలిపారు . ముఖ్యంగా విష జ్వరాలు ప్రబలి ఉన్న ఈ తరుణంలో రక్తదానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు తన జన్మదినం సందర్భంగా చాలా మంది యువకులు ముందుకు రావడం సంతోషదాయకం దాయకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. రెడ్‌ క్రాస్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మనోహర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. జిమ్‌ వంశీ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారు .ఈ సందర్భంగా వికలాంగ బాలలకు ఆయన తరఫున ఒక వ్యాయామ పరికరాన్ని ఎంపీ చే అందజేశారు. అలాగే స్పాస్టిక్‌ సెంటర్లో దాదాపు 150 మందికి పైగా ఉన్న బాలలకు అన్నదానం జరిగింది.ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి, కోటేశ్వర్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి , అబూబకర్‌, ఇక్బాల్‌, పాముల హరి , హరి శివారెడ్డి, డాక్టర్‌ సుబ్రమణ్యం, నరసింహారావు, ఎస్‌ గోపి, బాల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

రోడ్డెక్కిన సూదలగుంట చెరకు రైతులు

రోడ్డెక్కిన సూదలగుంట చెరకు రైతులు రూ.10 కోట్లకు పైగా ఎగనామం పెట్టిన యాజమాన్యం తిరుపతి మయూరా హోటల్‌ ఎదురుగా ఆందోళన రాజధానిని ముట్టడిస్తాం – బాధితుల హెచ్చరిక నెల్లూరు, (పున్నమి ప్రతినిధి) తీపి పండించే చెరకు రైతుల కష్టాలు కడు చేదుగా మారుతున్నాయి నెల్లూరు జిల్లాలో. ఇప్పటికే అతి పెద్ద సహకార ఫ్యాక్టరీ కోవూరు షుగర్స్‌ మూతపడిపోగా తాజాగా పొదలకూరు మండలం, సూదలగుంటలోని మయూరా గ్రూప్‌ షుగర్‌ ఫ్యాక్టరీ చక్కెర తయారీకి దూరమైంది. రైతులను నమ్మించి నట్టేట ముంచింది. పదుల కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి యాజమాన్యం ముఖం చాటేసింది. కార్మికుల చేత ఏడేళ్లు వెట్టి చాకిరి చేయించుకుని చేతులెత్తేసింది. దీంతో రైతులు, కార్మికులు బకాయిలు, వేతనాల కోసం రోడ్డెక్కారు. మయూరా గ్రూప్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న తిరుపతిలో మయూరా హోటల్‌ ఎదుట నాలుగు రోజులుగా ఆందోళనకు దిగారు. రాత్రిపగలు అక్కడే ఉంటూ న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం మాత్రం కనీసం స్పందించడం లేదు. ఇటు చెరుకు పండించిన రైతులు, అటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆకలి కేకలతో అల్లాడుతున్నా ఆ ఫ్యాక్టరీ ప్రధాన నిర్వాహకులు సూదలగుంట జయరామ్‌కృష్ణ చౌదరి, ఆయన కుమారుడు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణకుమార్‌లు పత్తా లేరు. దీంతో రైతులు తిరుపతిలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కష్టాలు, నష్టాల బాటన పడుతున్న సమయంలో తానున్నానంటూ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి పొదలకూరు మండలం, ప్రభగిరిపట్నం వద్ద గాయత్రి షుగర్స్‌ పేరుతో 15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరిని ప్రారంభించారు. పెద్దఎత్తున రైతులకు ప్రోత్సాహాలు ప్రకటించి, చెరకు సాగుకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలోను వేలాది ఎకరాల్లో రైతులు చెరకు సాగుచేశారు. సవ్యంగా ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో ధరల పతనం, ఇతర ఆర్ధిక ఇబ్బందులతో ఆ యాజమాన్యం ఫ్యాక్టరిని ప్రముఖ ఎరువుల కంపెనీ నాగార్జున ఫెర్టిలైజర్స్‌కు విక్రయించారు. కొన్నాళ్ల తరువాత ఆ యాజమాన్యం తమకున్న వ్యాపార ఒడంబడికల వత్తిడిలో ఫ్యాక్టరిని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కె.ఎం.సి. నిర్వాహకుల్లో ఒకరైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఆ ఫ్యాక్టరిని తీసుకున్నారు. కొన్నాళ్ల తరువాత మేకపాటి సోదరులు ఈ ఫ్యాక్టరిని మయూరా గ్రూప్‌కు అప్పగించారు. కొద్ది రోజుల పాటు ఫ్యాక్టరిని క్రషింగ్‌ చేయించిన మయూరా నిర్వాహకులు చేతులెత్తేశారు. అప్పటి వరకు రైతులకు ఉన్న బకాయిలను చెల్లించి కె.ఎం.సి. ఫ్యాక్టరి నిర్వహణను నుంచి తప్పుకుంది. మేకపాటి సోదరుల నుంచి ఫ్యాక్టరిని తీసుకున్న మయూరా గ్రూప్‌ కొన్నేళ్లు సక్రమంగా నిర్వహించి ఆపై నిర్వాహకాన్ని ప్రదర్శించింది. నెల్లూరుతో పాటు కాళహస్తి,ఇతర ప్రాంతాలలో చెరకు క్రషింగ్‌ కలిగిన మయూరా గ్రూప్‌ ప్రభగిరిపట్నం పై సీత కన్ను వేసింది. దాంతో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల మేర రైతుల బకాయిలు, సుమారు కోటి రూపాయలకు పైగా కార్మికుల వేతనాలు నిలిపివేసింది. దీంతో రైతులు పలుమారులు ప్రశ్నించినప్పటికి స్పందన లేదు. ఇటీవల యాజమాన్యం ఫ్యాక్టరిని పూర్తిగా విస్మరించడంతో రైతులు, కార్మికులు రోడ్డెక్కారు. అప్పటికి స్పందన లేకపోవడంతో గత నాలుగు రోజులుగా మయూరా గ్రూప్‌ కేంద్రమైన తిరుపతిలోని మయూరా హోటల్‌ ఎదుట ఆందోళనను చేపట్టారు. తమకు చెల్లించాల్సిన బకాయిల పై యాజమాన్యం స్పందించకుంటే నేరుగా అమరావతిలో ఆందోళనకు దిగుతామని బాధిత రైతులు, కార్మికులు హెచ్చరిస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆ…. తరం నెల్లూరు జిల్లా ముఖ్యమంత్రులు

ఆ…. తరం నెల్లూరు జిల్లా ముఖ్యమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా నెల్లూరుకు చెందిన ముగ్గురు ప్రముఖులకు అవకాశం లభించింది. రాష్ట్రస్థాయి అత్యున్నత పదవులను అలంకరించగలగడం నెల్లూరు జిల్లాకు గర్వకారణం. రెండు పదవులను అలంకరించిన ఏకైక వ్యక్తి బెజవాడ గోపాలరెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బెజవాడ గోపాలరెడ్డి, నేదురుమల్లి జనార్థనరెడ్డి ఎన్నికైనారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి, పశ్చిమబెంగాల్‌ గవర్నరుగా కె.వి. రఘునాథరెడ్డి పదవులనలంకరించారు. డా|| బెజవాడ గోపాలరెడ్డి (1907 – 1997) ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కాగా, రెండవ ముఖ్యమంత్రిగా డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి 1955లో పదవిని స్వీకరించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే వరకు పదవిలో వున్నారు. (అటుతర్వాత నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా వున్నారు.) నెల్లూరు సీమవాసులలో తొలి ముఖ్యమంత్రి. అప్పటి రాజధాని కర్నూలు పట్టణం. గోపాలరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన వారు. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఉత్తరప్రదేశ్‌ గవర్నరుగా ఐదేళ్లపాటు ఉన్నారు. అంతకు ముందే కేంద్రంలో మంత్రి పదవులు పొందారు. 1958లో రాజ్యసభకు ఎన్నికై 1963 వరకు నెహ్రూ మంత్రివర్గంలో రెవెన్యూ, ఆర్ధికశాఖ, సమాచార ప్రసారశాఖల మంత్రిగా పనిచేశారు. మచ్చలేని నాయకుడుగా పేరు ప్రతిష్ఠలు గడించారు. ఆయనలో హుందాతనం, రాజసం, ఠీవి ఉట్టిపడేవి. బహుభాషా కోవిదుడు. లలితకళలపై మక్కువ గలిగినవారు. రవీంద్రనాథ్‌ఠాగోర్‌ స్థాపించిన శాంతినికేతన్‌లో విద్య నభ్యసించారు. విశ్వకవి రవీంద్రుడు రచించిన ”గీతాంజలి” ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్రఠాగోర్‌, అభినవ ఠాగోర్‌గా ప్రశంసలందుకొన్నారు. మరెన్నో కవితలు, పద్యాలు వ్రాశారు. తన స్వీయ చరిత్రలో తాను నెల్లూరుకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాడిని మాత్రమే కాదు, ‘విశ్వ నరుడిని’ అని సగర్వంగా చెప్పుకొన్న విశాల హృదయుడు. రవీంద్రనాథ్‌ ఠాగోర్‌పై ఎంత గౌరవమంటే ఠాగోర్‌ జన్మదినం రోజున ఆర్యసమాజ్‌ పద్ధతిలో గోపాలరెడ్డి వివాహం చేసుకొన్నారు. ఆయన నివసించిన భవనానికి ‘శాంతి నికేతన్‌’ అని పేరు పెట్టుకొన్నారు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యా గ్రహం చేసి జైలు కెళ్లారు. పలుసార్లు ఉద్యమాలలో పాల్గొని దాదాపు 18 నెలలపాటు జైలు జీవితం గడిపారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షులు గాను, ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగాను సేవలందించారు. జ్ఞానపీఠ్‌ అవార్డు నిర్ణేతగా ఉన్నారు. 29 ఏళ్ళ ప్రాయంలోనే రాజగోపాలాచారి మంత్రి వర్గంలో స్థానం పొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు అందివచ్చినన్ని పదవులు రాష్ట్ర చరిత్రలో మరెవ్వరికి రాలేదు. రాజకీయాలు, సాహిత్యం రెండింటిలోను రాణించారు. 1997లో స్వర్గస్తులయ్యారు. గోపాలరెడ్డి బ్రతికి ఉన్న కాలంలోనే కళాకారుల సహాయనిధి ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఏటా పేద కళాకారులకు ఆర్థికసాయం అందుతుంది. ఇదిగాక ఆయన ఆశయం మేరకు సాహిత్య కళారంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం అవార్డులందిస్తున్నారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి (1935 – 2014) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 1990 డిసెం బరులో జనార్దనరెడ్డి పదవినలంకరించి రెండేళ్ల పాటు అందులో ఉన్నారు. నెల్లూరు జిల్లా స్వర్ణముఖీ తీరాన ఉన్న వాకాడులో జన్మించారు. ఉపాధ్యా యుడుగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రాజకీయవేత్త. రాజకీయాలను కాచి వడపోసిన వ్యక్తి. మొదటి నుంచి కాంగ్రెసువాది. ఆయన ఎప్పుడూ పార్టీలు మారలేదు. పదవి ఉన్నపుడు పొంగిపోలేదు. లేనపుడు క్రుంగిపోలేదు. కాంగ్రెసు అధిష్టానంతో సన్నిహిత సంబంధం కలిగిన వారు. కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడుగా పేరు పొందారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన అంజయ్య, చెన్నారెడ్డి ప్రభుత్వాలలో రెవెన్యూ విద్యుత్‌శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. వీరు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పి.వి. నరసింహరావులకు సన్నిహితంగా ఉండే వారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన తర్వాత, కాంగ్రెసు రెండుగా చీలి కాంగ్రెసు (ఐ), కాంగ్రెస్‌ (ఆర్‌)గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్య నాయకులు రెడ్డి కాంగ్రెసు పక్షం వహించినపుడు జనార్దనరెడ్డి ఇందిరా కాంగ్రెస్‌ పక్షాన నిలిచారు. మొట్టమొదట 1970లో నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గం నుండి ఎం.ఎల్‌.సి.గా పోటీచేసి ఓడినా, పి.వి. నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1972లో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శాసనమండలికి ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వీరి హయాంలోనే రైతులకు పట్టాదారు పుస్తకాలిచ్చే పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 1998లో బాపట్ల, 1999లో నర్సారావుపేట, 2004లో విశాఖపట్నం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైనారు. నాలుగు చట్టసభలలో పనిచేసిన అరుదైన ఘనత వీరికి దక్కింది. 1988-89లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడుగా ఉన్నారు. 1989 వెంకటగిరి నుండి శాసన సభకు ఎన్నికయ్యారు వారి సతీమణి రాజ్యలక్ష్మి వెంకటగిరి అసెంబ్లీ నుండి రెండుసార్లు ఎన్నికై మంత్రిపదవి చేపట్టారు. వారి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటి సభ్యులుగా కొంతకాలం వున్నారు. నెల్లూరులో ఆయన నివసిస్తున్న భవనానికి ‘స్వర్ణముఖి’ అని పేరు పెట్టుకొన్నారు. రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ జనార్దనరెడ్డి 2014 మే 9న కన్నుమూశారు.

Featured

వేద విద్య వ్యాప్తికి పెద్ద‌పీట – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

  మ‌న పూర్వీకుల వార‌స‌త్వ సంప‌దైన వేదాల‌ను ప‌రిర‌క్షించి, వేద విద్య వ్యాప్తికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో సోమ‌వారం ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ‌నివాస వేద విద్వ‌త్ స‌ద‌స్సును ఛైర్మ‌న్ వైవీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ వేదాల్లోని విజ్ఞానాన్ని సామాన్య ప్ర‌జ‌లకు అందేలా పండితులు కృషి చేయాల‌ని కోరారు. వేద విద్య నేర్చుకున్న‌వారికి స‌మాజంలో మంచి గౌర‌వం ఉంద‌న్నారు. శ్రీ‌వారి వైభవం, పూజ‌లు, ఉత్స‌వాలు త‌దిత‌ర అంశాలు కూడా వేదాల్లో ఉన్నాయ‌న్నారు. టీటీడీ అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ వేల సంవ‌త్స‌రాలుగా వేదాలు మౌఖికంగా లోకానికి జ్ఞానాన్ని పంచుతున్నట్లు తెలిపారు. స‌ద‌స్సుకు పాల్గొన్న వేద‌విద్వాంసుల సందేశాన్ని భ‌క్తులంద‌రూ వినాల‌ని కోరారు. అనంత‌రం వేద విద్యార్థులు చ‌తుర్వేద పారాయ‌ణం చేశారు. ఎస్వీ వేద వ‌ర్సిటీ మాజీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య కెఇ.దేవ‌నాథ‌న్ వేదంలో పురుషార్థాలు అనే అంశంపై ఉప‌న్య‌సించారు. కార్య‌క్ర‌మంలో టీటీడీ సీఏవో శేష‌శైలేంద్ర‌, ఎస్టేట్ అధికారి విజ‌య‌సార‌థి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ పాల్గొన్నారు.  

Featured ఆంధ్రప్రదేశ్

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

వివాదాలకు కేరాఫ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆయన ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల ఇబ్బందులున్నాయంటూ సుదీర్ఘ పోరాటాలు చేసిన నేత. సాధారణ కుటుంబం నుంచి విద్యార్థి ఉద్యమ నేతగా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఎరిగిన వ్యక్తి కూడా. ఆయనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. రాజకీయంగా ఎలాంటి పూర్వ నేపథ్యం లేకుండా రెండు సార్లు శాసనసభ్యులయ్యారు. అధికారం చేపట్టిన అనంతరం అనుచరుల ప్రభావమో, కేడర్‌కు అండగా వుంటానన్న భరోసా కోసమో గత కొద్ది కాలంగా రాజకీయ వివాదస్పదుడిగా మారారు. ప్రత్యేకించి నెల్లూరు రూరల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే దూకుడు పెంచారు. బెదిరింపులు, హుంకరింపులు, హెచ్చరికలు ఆ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అంతలోనే వివరణలు ఇలా అడుగడుగునా ఆయన అధికార పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఒకప్పటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల అనుచరుడిగా రాజకీయ మెట్లెక్కి శాసనసభ్యుడిగా ఎదిగిన శ్రీధర్‌ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలలో వివాదాలకు కేరాఫ్‌గా మారారు. తాజాగా వెంకటాచలం ఎంపీడీవో సరళ పై దౌర్జన్యం చేశారంటూ గత రాత్రి నుంచి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టాయి. తన ముఖ్య అనుచరుడు, ఆంతరంగికుడు అయిన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డి అతని స్నేహితుడు కలిసి వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఏర్పాటు చేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్‌కు సంబంధించి వివాదం తెరపైకి వచ్చింది. ఆ లేఅవుట్‌లో వెళుతున్న పైప్‌లైన్‌ నుంచి నీరు ఇవ్వాలంటూ చేసిన ప్రతిపాదన అనుమతులలో జాప్యం చేస్తున్నారంటూ ఎంపీడీవో సరళా పై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహించారు. గతరాత్రి కల్లూరుపల్లిలోని ఎంపీడీవో సరళ నివాసం వద్ద దౌర్జన్యం చేశారంటూ ఆమె ఆందోళనకు దిగారు. పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. తెల్లవారుజామున ఆయన అనుచరుల పై కేసు నమోదు చేశారు రూరల్‌ పోలీసులు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పై కేసే నమోదు వరకు వెళ్ళింది. మొన్నటి ఎన్నికలు నాటి నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్నికలకు ముందు తర్వాత వరుసగా పలువురిని బెదిరింపులు, ఫోన్లులో అసభ్యకరంగా మాట్లాడడం, భౌతిక దాడులకు దిగడం లాంటి ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల పై గతంలో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి వెళ్లాయి. ఆ తరువాత పార్టీ నేరుగా రంగంలోకి దిగి వివాదాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలంటూ అధినేత జగన్‌ ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం పెత్తనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సోదరుడు దినకర్‌ రెడ్డికి అప్పగించారు. నెలలో కొన్ని రోజులు మాత్రమే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించాలి. మిగతా సమయంలో అమరావతిలో అందుబాటులో వుండాలంటూ వైసీపీ పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఇటీవల విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో వరుసగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పై ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో కొన్నాళ్లు ఎమ్మెల్యే సైలంట్‌ అయ్యారు. నియోజకవర్గానికి కొన్ని రోజులు దూరంగానూ ఉన్నారు. ఇటీవల రొట్టెల పండుగ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధి పనుల పై దృష్టి పెట్టారు. వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో బిజీగా మారారు. ఇదే సమయంలో మరోసారి ఎంపీడీవో పై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే వ్యవహారం వివాదస్పదంగా మారింది. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్‌ రెడ్డి పై తాజాగా నెలకొన్న వివాదాలపై ఆ పార్టీ అధినాయకత్వం ఎలాగు వ్యవహరించబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీలోను హాట్‌టాపిక్‌గ మారింది.

Featured ఆంధ్రప్రదేశ్

వైయస్‌ హయాం నాటి పథకాలను పూర్తి చేయండి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపు నెల్లూరు, అక్టోబర్‌ 23 (పున్నమి విలేకరి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్రెడ్డి హయాంలో చేపట్టిన పలు పథకాలను ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని జూబ్లీహాలులో బుధవారం జరిగిన సాగునీటి సలహా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత ఐదేళ్లుగా వర్షాలు లేక పోవడం వల్ల రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నదని తెలిపారు. అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత  వర్షాలు కురిసి జిల్లాలోని జలాశయాల్లో దాదాపు 100 టీఎంసీలకు పైన నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు జిల్లాలోని రైతాంగానికి మొదటి పంటకు నీటి కొరత లేదని, అయితే నీటి యాజమాన్యం చక్కగా జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ విషయంలో అధికారులు తగిన శ్రద్ధ లేదని పేర్కొన్నారు. ఒక్క టీఎంసీ నీటితో దాదాపు 14 వేల ఎకరాలు పండించామని తెలిపారు .గతంలో ఇది అమలు చేసి విజయం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు తగిన శ్రద్ధ చూపినట్లయితే నీరు సమ ద్ధిగా లభించి రెండో పంట పడుతుందని పేర్కొన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ,నీటిపారుదల శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి మరో 20 టీఎంసీల నీటిని తెచ్చినట్లయితే కండలేరు జలాశయం 50 టీఎంసీలకు నిల్వ చేరుతుందని తెలిపారు వైయస్‌ హయాంలో చేపట్టిన ప్ధకాలను గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని, ఇప్పుడైనా వాటిని పూర్తి చేసినట్లయితే బాగుంటుందని సూచించారు. రైతులు కూడా ఈ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొంది జీవితాంతం గుర్తు పెట్టుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రెండో పంటకు నీరు ఇచ్చే విషయంలో అధికారులు ప్రత్యేక ద ష్టి పెట్టాలని, అలాగే రైతులకు ఎప్పుడు ఇచ్చేది తెలపాలని కోరారు సాగునీటి సలహా సంఘ సమావేశానికి మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ గౌతమ్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షత వహించారు జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల తో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి విజయ డైరీ చైర్మన్‌ రంగారెడ్డి సాగునీటి సంఘాల నేతలు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ తమ ప్రాంతాల పరిధిలోని సాగునీటి వెతలను సమావేశం దష్టికి తీసుకువచ్చారు.

Featured

బెజవాడ ఓబులురెడ్డి ఈక లేరు. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ బెజవాడ రామచంద్రా రెడ్డి గారి తనయుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ బెజవాడ పాపిరెడ్డి గారి సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బెజవాడ ఓబులురెడ్డి గారు కొద్ది సేపటి క్రితం పరమ పదించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని పార్థిస్తున్నాను. చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

Featured

సోషల్ మీడియా పై కేంద్రం నియంత్రణ

*జనవరి 15 నాటికి సోషల్ మీడియా నియంత్రణకు సరికొత్త నిబంధనలు* *సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం* *వివిధ హైకోర్టుల్లో సోషల్ మీడియాపై పిటిషన్లు* *సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ తో అనుసంధానించాలని విజ్ఞప్తి* *పెండింగ్ పిటిషన్లు సుప్రీం కోర్టుకు బదిలీ* సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు, దూషణలు, పరస్పర ఆరోపణలు వంటి అవాంఛనీయ అంశాలకు అడ్డుకట్ట వేసేందుకు జనవరి 15 నాటికి సరికొత్త నియమావళికి రూపకల్పన చేస్తామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కొంతకాలంగా సోషల్ మీడియా ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేసే విషయం చర్చకు వస్తోంది. తద్వారా ఫేక్ ఐడీలను నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, దీనిపై మధ్యప్రదేశ్, మద్రాస్, బొంబాయి హైకోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే, సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థలు అన్ని పిటిషన్లను ఒకే న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, దీనిపై నేడు విచారణ జరిగింది. వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు తన ధర్మాసనం పరిధిలోకి బదిలీ చేయించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకలాపాలను నియంత్రించేందుకు వీలుగా నియమావళి ఏర్పాటుపై తమకు జనవరిలో నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ధర్మాసనానికి బదిలీ అయిన పిటిషన్లపై వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు తెలిపింది.

Featured

యువకుడు దారుణహత్య

  *దగదర్తి మండలంలోని సున్నపుబట్టి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీప్రాంతంలో చంద్రారెడ్డి అనే యువకుడు సోమవారం దారణ హత్యకు గురయ్యాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల కథనం మేరకు మృతుడు బుచ్చి మండలంలోని పురందరపురం గ్రామానికి చెందిన చంద్రారెడ్డి (23)గా గుర్తించారు. అయితే మృతుడు చంద్రారెడ్డి మెడికల్ ఏజెన్సీలో రిప్రజింటర్ గా పనిచేస్తుంటాడని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి రాత్రి ఇంటికి పోవకపోవటంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆప్ వచ్చింది .దీంతో కుటుంబసభ్యులు ఉదయం నుంచి చుట్టుపక్కల వారిని విచారించగా సున్నపుబట్టి అటవీ ప్రాంతంలో డెడ్ బాడీ ఉందని తెలుసుకొని సంఘటన ప్రాంతానికి అక్కడ ఉన్న బైక్ ను చూసి తమ వాడేనని గుర్తించి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మెఖం పై గాటులు పక్కన కండోమ్ ప్యాకెట్లు ఒక కత్తి పడి ఉండటాన్ని గమనించారు. అయితే మృతిడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు అలానే ఉన్నాయి.దీంతో పోలీసులు ఏదైనా అక్రమ సంబందం ఉందేమో అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లాలో ప్రణాళికా బద్దంగా ముందుకు పోతున్న అధికార వైసీపీ పార్టీ

గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరమైన, పోటాపోటీగా ఎత్తులు,వ్యూహాలు తో పయనిస్తుండగా…వైసీపీ జిల్లాలో తనదైన ముద్ర పడాలని ప్రణాళికలు రచిస్తుంది .మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 2 స్థానాల్లో గుంటూరు పశ్చిమ నియోజక వర్గం,రేపల్లె నుంచి మద్దాలిగిరిధర్,అనగాని సత్యప్రసాద్ లతో టిడిపి సరి పెట్టు కోగా…మూడు పార్లమెంట్ స్థానాల్లో 2 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకొని తిరుగులేని ఆధిక్యత సాధించింది.రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జిల్లాలో వైసిపిని తిరుగులేని శక్తి గా తయారు చేయాలని పావులు కదుపుతున్నారు.ప్రభుత్వం ఏర్పడిన తరువాత…4 నెలలు పైగా పాలనలో కొన్ని ఇబ్బందులు,గత ప్రభుత్వ అవినీతి జరిగిందని దానిని బయట పెట్టాలని కాలయాపన చేసే బదులు పాలన పై దృష్టి పెట్టి కొనసాగించాలని అలా కాకుండా అన్ని చోట్లా అవినీతిపై యుద్ధం చేయడం వలన పాలన గాడి తప్పుతున్నదని ప్రభుత్వం ముందున్న లక్ష్యాలను అధిక మించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కొంతమంది రాజకీయ పండితులు భావిస్తున్నారు.కానీ వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…తనదైన శైలిలో ఇచ్చిన హామీలు,నవరత్నాలు ను అందరకు అందించేలా ప్రణాళికా బద్దంగా దూసుకు పోతున్నారు.గుంటూరు జిల్లాకు రాష్ట్ర హోమ్ శాఖా మంత్రిణీ గా శ్రీమతి మేకతోటి సుచరితను,బిసి శాఖా మంత్రిగా మోపిదేవి వెంకట రమణారావు ను,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి లకు మంత్రి వర్గంలో కేటాయించి జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.మొదటి నుంచి గుంటూరు జిల్లా తెలుగు దేశం నకు మంచి పట్టు ఉండటంతో…ఈసారి ఎలాగైనా తెలుగుదేశం ను ఓడించాలని మొదట నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంది.2014 ఎన్నికల్లో 14 సీట్లు సాధించిన టిడిపి మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 2 స్థానాలకే చతికిల పడింది.తెలుగుదేశం అధికారము లో ఉన్నపుడు 4 సంవత్సరం లో బిజెపి తో చేతులు కలిపి సహా జీవనం సాగించి,చివర్లో ప్రజల నుంచి ప్రత్యేక హోదా విషయంలో వ్యతిరేకత రావటంతో తెగ దెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ను పసి గట్టలేకపోయింది.జిల్లాలో తెలుగు దేశం లో సీనియర్లు ఉన్నా కాని…అనేక స్థానాల్లో శాసన సభ్యుల పని తీరు,సంక్షేమ పథకాల అమలులో పారదర్శక లేకపోవటం,ఒకే సామాజిక వర్గం పెత్తనం చెలవించటం టిడిపి నాయకులు ఇసుక మాఫియా లాగా ఏర్పడి ఆ శ్రేణులు ఎక్కువ ఆదాయ వనరులు పొందారని వీటివల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడకట్టుకున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అనేక మంది సీనియర్లు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు,మాజీ స్పీకర్ స్వర్గీయ డా: కోడెల ఇంకా యరపతినేని శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు జి వి ఆంజనేయులు డొక్కా మాణిక్య వర ప్రసాద్ లాంటి అనుభవం గల నాయకులు ఉన్నప్పటికి జిల్లాలో ఓట్ బ్యాంక్ ను తమ వైపు సాధించు కోవడంలో విఫలం అయ్యారు. మొత్తం 17 నియోజక వర్గాల్లో..పని తీరు పరిశీలించితే… మంగళగిరి నియోజకవర్గములో మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ ఓటమిని తెలుగు దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు.అక్కడ వైసీపీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణరెడ్డి నియోజకవర్గము లో ప్రజల్లో ఉండి పాగా వేయ్యటం, ప్రతిపక్షము లో ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉండటం వలన బలమైన ప్రత్యర్థి అయిన నారా లోకేష్ ను తేలిగ్గా ఓడించగలిగారు.ప్రధానంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటం అక్కడ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ను వారు తిప్పు కోవటంలో విజయవంతం అయ్యారు.జిల్లా వ్యాప్తంగా శాసన సభ్యులుగా విజయ కేతనం ఎగురవేసిన ఎమ్మెల్యే లు తమ నియోజక వర్గం లో నిర్మాణాత్మమైన పాత్ర పోషించి ప్రజలకు వెన్ను దన్నుగా ఉండాలని,ప్రధానం గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను,నవరత్నాలు ను అమలు చేసే పనుల్లో బిజీ బిజీ గా ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.