Tuesday, 9 December 2025

Blog

Featured ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ వర్క్ షాప్

రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ కార్యక్రమంలో భాగంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారుR.W.S DE B. మోహన్ రావు మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు నిర్మాణం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా గ్రామాలలో LOB( మరుగుదొడ్లు నిర్మించి సగంలో ఆగిపోయినవి) NLOB( కొత్తగా వాలంటీర్లు సర్వే నిర్వహించి నిర్మించవలసినవి) వీటిపై అవగాహన బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచడం నిర్మాణానికి అయ్యే వేయాల కి సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలోMPTO ఆమోస్ బాబు,AE ఆంజనేయులు, పురుషోత్తం, అజీమ్ స్వచ్ ఆంధ్ర కమిషన్ కన్సల్టెంట్ మహేష్,ఈ.ఓ.పి.ఆర్. డి గంగయ్య, తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమం

రాపూరు డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసి D.Y.C మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ యువత స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపాలని ఫిట్ నెస్ ని డెవలప్మెంట్ చేసుకొని ఆటలలో బాగా రాణించాలని పలు సూచనలు సలహాలు ఇచ్చి కళాశాలకు కావలసిన స్పోర్ట్స్ కి అవసరమైన ఆటవస్తువులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శివరామయ్య వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, కిషోర్ మరియు యువ కేంద్రం అధ్యక్షులు శివ, కోటేశ్వరరావు, బాలాజీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఎంపీ ని కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు నివేదించారు. ఒక అరగంట పాటు వారి మధ్య సమావేశం జరిగింది. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎంపీకి వినతి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు తాము రిటైర్ అయినప్పటికీ నామమాత్రపు పెన్షన్ మాత్రమే పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువ అని దానితో జీవితాన్ని ఎలా గడపాలో అని ప్రశ్నించారు తమకు కనీస మొత్తం పెన్షన్ సాధించి పెట్టాలని వారు ఎంపీ కి విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించి తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు

Featured ఆంధ్రప్రదేశ్

మీ నిరసనను సీఎంకు నివేదిస్తా : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్, సి ఏ ఏ ల పై నిరసన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు ఎంపీ ని కలిసిన జేఏసీ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. నేను ఈ అంశాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు లేనని, హైదరాబాదులో ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉన్నారని తెలిపారు. ఇదే ఐక్యత, సోదరభావం కొనసాగాలన్న దే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ , సి ఏ ఏ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ ను ఆయనకు చేర వేస్తానని స్పష్టం చేశారు. ఇదివరకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీనికి వ్యతిరేకమని తన నిర్ణయాన్ని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ మీ కోరిక మేరకు ఆయనకు మరొక్కసారి విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. అంతకుముందు జేఏసీ నాయకులు మౌలానా ఇలియాస్, ఆసిఫ్, జాకీర్, ఫయాజ్, జియావుల్ హక్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరులకు కూడా మరొకసారి తెలియజేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

రేషన్ డీలర్ల సమావేశం

రాపూరు తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి రేషన్ డీలర్లకు పలు సూచనలు తెలిపి కచ్చితంగా సమయపాలన పాటించాలని, స్టాక్ బోర్డు నందు వివరాలు కనబరచాలని తెలిపారు.  అలాగే తూకాలు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని స్టాకు రికార్డులు లోపాలు లేకుండా చూసుకోవాలని లోపాలు వుండిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగినది. రేషన్ షాపుల నందు నాణ్యమైన బియ్యం సరఫరాకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నదని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

Featured క్రైమ్

మద్యం బాటిళ్లు స్వాధీనం

రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్. శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించగా వడ్లపల్లి మస్తానయ్య అనే వ్యక్తి వద్ద 10 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 180 ml మద్యం సీసాలు కలిగియుండగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గూడూరు కోర్టుకు పంపడమైనదని తెలియజేస్తూ ప్రస్తుతం కొత్తగా వచ్చిన జీవో ప్రకారం  నాన్ బెయిలబుల్ కావున ఎలాంటి స్టేషన్ బెయిలు ఇవ్వబడవు ఆని ప్రజలకు తెలియజేశారు

Featured ఆంధ్రప్రదేశ్

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పై అవగాహన

రాపూరు మండల పరిషత్ కార్యాలయం నందు డివిజన్ పంచాయతీ ఆఫీసర్ కృష్ణ మోహన్ రావు మండలంలోని 21 పంచాయతీ కార్యదర్శుల తో సమావేశం నిర్వహించారు S W P C ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ) పై అవగాహన కలిగిస్తూ రాపూరు మండలంలో 6 షెడ్లు కంప్లీట్ అయ్యాయి 2 షెడ్లు కంప్లీట్ కావలసి ఉన్నాయని తెలిపారు ఈ షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ తయారుచేసి ఆ గ్రామాలలో రైతులకు విక్రయిస్తామని తెలుపుతూ పంచాయతీలకు ఇదివరకే ఇచ్చిన బుష్ కట్టర్, స్ప్రే మిషన్స్ ,మూడు చక్రాల సైకిల్ లు, ట్రాక్టర్లు గురించి అడిగి తెలుసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఇంటి పన్నులు, కొళాయి పన్నుల బకాయిలు 31-3-2020 నాటికి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని తెలియజేసి సిద్దవరం గ్రామంలో షెడ్లను తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి వెంట ఈ.ఓ.పి.ఆర్.సి గంగయ్య పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు భక్తి

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం నిరుపేద యువకుల శ్రమతో జీవంపోసుకున్న మఠం దాతల సహకారంతో అభివృద్ధి కృష్ణదాసు అనబడే వ్యక్తి ఒకప్పుడు గూడూరులోని హుస్సేన్ అనే మహమ్మదీయుడు దగ్గర శిష్యరికం చేసి యోగిగా మారి ఆశ్రమాన్ని స్థాపించి ప్రజలకు నీతి వాఖ్యాలు భోదిస్తూ 1905 వ సంవత్సరంలో గూడూరు రాణిపేట వీధి పరిసరాల్లో మహా సమాధి చెందారు. అప్పటి వీరి శిష్య ప్రముఖులు అయ్యపనేని ఆదెమ్మగారిచే ఇక్కడ రామదాసు మఠం రూపుదిద్దుకొంది. తదనంతరం కృష్ణదాసును అవధూతగా కొలుస్తూ వచ్చి కొన్ని సంవత్సరాలకు ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరుపబడి సత్సంగం తదితర ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ వచ్చేవి. కాలక్రమేణా ఈ ఆశ్రమం ఆక్రమణలకు గురి అయి శిథిలావస్థకు చేరుకోవడంతో సరోజనమ్మ, నాగేశ్వర రావు గారిచే తిరిగి సజీవ స్థాయికి చేరుకొంది. మఠం ప్రాంతానికి చెందిన యువకులైన సాయిప్రసాద్, అరుణ్, వెంకటేశ్వర్లు, సుమన్, చంద్ర, రవికుమార్, శీను తదితరులు ఇక్కడ మరికొన్నిపూజా విగ్రహాలు, వసతులు నెలకొల్పి ధార్మిక ఉత్సవాలను జరుపుతున్నారు.వీరంతా కలసికట్టుగా శ్రమదానం చేసి మఠాన్నిమరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఉగాది, వినాయక చవితి, దసరా పండుగ, శివరాత్రి ఉత్సవాలను దాతల సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడం ఇక్కడ ఆనవాయితిగా వస్తుంది. శివరాత్రి రోజున మఠంలో ప్రత్యేక పూజలు మరియు భారీ అన్నదానము జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనడం ఇక్కడి విశేషంగా చెప్పవచ్చును

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో టోరె పరిశ్రమను ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 

 రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరే ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యుచియమ, టోరే ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిట్సు ఒహయో, టోరే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షిగెకజు సునగా, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం, సూళూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్దికి పెద్దపీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా వుందన్నారు. శ్రీసిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీసిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  1000 కోట్లతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. ఇంజనీరింగ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్సటైల్స్ తయారుచేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.  జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. 29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. టోరె తన వినూత్న ఉత్పత్తులతో భారత మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామా అన్నారు. మిత్సువో ఓహ్యా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ప్లాంట్‌ను ప్రారంభించిన టోరె ఇండస్ట్రీస్‌కు ఇది చారిత్రాత్మక రోజు అన్నారు. యూనిట్  వేగవంతమైన ఆరంభానికి అద్భుతమైన మద్దతు, సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి, శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. షిగెకాజు సునాగా మాట్లాడుతూ, 2011 నుండి భారతదేశంలో టోరె కార్యకలాపాలను, అభివృద్ధిని పవర్పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.  టోరె ప్రారంభోత్సవం కోసం శ్రీసిటీకి తొలిసారి విచ్చేసిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, యువ డైనమిక్ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి పారిశ్రామిక అభివృద్ధికి చూపుతున్న చొరవను ప్రశంసించారు. పెట్టుబడులు ఆకర్శించేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి వీరు త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానం అద్భుతమైన ఫలితాలు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలసీని శ్రీసిటీ నుంచే ప్రారంభించాలని మంత్రిని కోరారు.    కాగా, శ్రీసిటీలో 85 ఎకరాలలో, సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫాక్టరీలో రెండు ఉత్పత్తి  కేంద్రాలుంటాయి. ఒక దానిలో వ్యక్తిగతపరిశుభ్రతకు వాడే డైపర్ల తయారీకి అవసరమైన పాలీ ప్రొపిలిన్ ఫైబర్ వస్త్రం (Technical textile) తయారౌతుంది.  రెండవ ఉత్పత్తి కేంద్రంలో ఆటొమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ఎలాస్టిక్ రెజిన్ పదార్థాన్ని తయారు చేస్తారు. సుమారు 750 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీసిటీలో ఇప్పటికే 19 జపాన్ పరిశ్రమలు కొలువుతీరి ఉండగా, టోరే 20వ జపాన్ పరిశ్రమ. ఫైబర్ టెక్స్‌టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సైన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వ్యాపార  సంస్థ టోరేగ్రూప్ 2011లో భారత్‌లో,   టోరే  ఇండస్ట్రీస్ (ఇండియా) పేరుతో అడుగు పెట్టింది. తొలుత గుర్గాంలో తన ప్రధాన కార్యాలయాన్ని, ముంబాయిలోవాణిజ్జ్య కార్యాలయాన్ని స్థాపించిoది. వ్యాపార విస్తరణలో  భాగంగా 2016లో గుజరాత్ లోని వాపి లో మోటర్ వాహనాల్లో వాడే ప్రత్యేక ఫైబర్ వస్త్రంతో చేయబడె ‘ఏయిర్ బ్యాగుల’ ఉత్పత్తి సంస్థను స్థాపించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.