Thursday, 12 March 2026

Blog

మహబూబ్ నగర్

మహబూబ్నగర్ డీఈవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ బిటిఏ

బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF ) క్యాలెండర్ ఆవిష్కరణ నేడు మహబూబ్నగర్ ఫాతిమా స్కూల్ సైన్స్ ఫెయిర్ లో బి టి ఎఫ్ క్యాలెండర్ గౌరవ డిఈఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం గౌరవ గౌరవ డిఈఓ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సూచనగా ప్రభుత్వ పాఠశాల లను పటిష్టం పరిచి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు సరైన విద్యా బోధన చేసి భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులకే ఉంది అందుకే ఉపాధ్యాయులు ఉద్యోగ నిబద్ధతను కచ్చితంగా పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు అన్ని విధాలుగా సుసక్తులను చేయుటకు ప్రతి ఉపాధ్యాయుడు తనవంతు కృషి చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సీఎమ్ఓ సుధాకర్ రెడ్డి గారు ఏ ఎం ఓ దూకుడు శ్రీనివాస్ గారు డీఎస్ఓ శంషుద్దీన్ బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి జై పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు దేవరకద్ర ఇన్చార్జి డి విజయ్ కుమార్ మిత్ర సంఘాల అధ్యక్షులు ఎస్ ఎల్ టి ఎస్ సురేంద్రనాథ్ గారు జి టి యు హిరలాల్ గారు టిఎస్టియు జనరల్ సెక్రెటరీ తాయరు ఇతర సంఘ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో పాల్గొని విజయవంతం చేశారు

మహబూబ్ నగర్

మహబూబ్నగర్ డీఈవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ బిటిఏ

బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF ) క్యాలెండర్ ఆవిష్కరణ నేడు మహబూబ్నగర్ ఫాతిమా స్కూల్ సైన్స్ ఫెయిర్ లో బి టి ఎఫ్ క్యాలెండర్ గౌరవ డిఈఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం గౌరవ గౌరవ డిఈఓ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక సూచనగా ప్రభుత్వ పాఠశాల లను పటిష్టం పరిచి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు సరైన విద్యా బోధన చేసి భావితరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం కేవలం ఉపాధ్యాయులకే ఉంది అందుకే ఉపాధ్యాయులు ఉద్యోగ నిబద్ధతను కచ్చితంగా పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు అన్ని విధాలుగా సుసక్తులను చేయుటకు ప్రతి ఉపాధ్యాయుడు తనవంతు కృషి చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో సీఎమ్ఓ సుధాకర్ రెడ్డి గారు ఏ ఎం ఓ దూకుడు శ్రీనివాస్ గారు డీఎస్ఓ శంషుద్దీన్ బి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు పట్నం చెన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కడం బాల శంకర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి జై పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు దేవరకద్ర ఇన్చార్జి డి విజయ్ కుమార్ మిత్ర సంఘాల అధ్యక్షులు ఎస్ ఎల్ టి ఎస్ సురేంద్రనాథ్ గారు జి టి యు హిరలాల్ గారు టిఎస్టియు జనరల్ సెక్రెటరీ తాయరు ఇతర సంఘ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో పాల్గొని విజయవంతం చేశారు

ఖమ్మం

ఖమ్మం బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఐదుగురు మహిళా కార్పొరేటర్లు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం రాజకీయాల్లో బీ.ఆర్.ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వానికి జై కొడుతూ బీ.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో వీరు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీ, 25వ డివిజన్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ, 32వ డివిజన్ కార్పొరేటర్ డోనవన్ సరస్వతి, 40వ డివిజన్ కార్పొరేటర్ దాదే అమృతమ్మ, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఉన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ, ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా పేరుగాంచిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్థవంతమైన నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనతో ఖమ్మం నగరాన్ని ప్రగతి బాటలో నిలిపే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చేరికలతో ఖమ్మం నగర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తిరుపతి

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

చిట్వేలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినీ-విద్యార్థులకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన నిష్ణాత ఉపాధ్యాయ బృందం ఈ మెటీరియల్‌ను అత్యధిక మార్కులు సాధించే లక్ష్యంతో రూపొందించింది. ఈ స్టడీ మెటీరియల్‌ను రాజుగుంట గ్రామ సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో ఎస్టీయు ఆధ్వర్యంలో మండలంలోని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తి నరసింహ మాట్లాడుతూ విద్యార్థులే భవిష్యత్ భారతానికి పునాదని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి చిట్వేలి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్టీయు జిల్లా ఆర్థిక కార్యదర్శి కందల హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన మెటీరియల్‌ను శ్రద్ధగా చదివితే విద్యార్థులు తప్పకుండా అధిక మార్కులు సాధించగలరని అన్నారు. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, పోల్లోపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్, వెంకటరాజుపల్లి ఉపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారి తులసి, చిట్వేలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, శివనారాయణ గౌడ్, ప్రవీణ్ కుమార్, మధు, ఈశ్వర్ రాజు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. విలువైన మెటీరియల్ అందించిన దాతకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నం

నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము.

నీరా ప్రాజెక్ట్ అమలు చేయాలి.. ప్రభుత్వానికి విజ్ఞప్తి ..చేసిన ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము. విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- నీరా ప్రాజెక్టును అమలు చేయాలని ఏత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నీరా పథకాన్ని అమలు చేస్తే కొబ్బరి , తాటి రైతులకు, ఆర్థికంగా తోడ్పాటుకలుగుతుందన్నారు.విశాఖలో గీత కులాల ఐక్య వేదిక అద్వర్యం లో ముడ సర్లోవ లో “వన సమారాధన” నిర్వహించారు. రాజకీయ, ఆర్ధిక, సామాజిక అభివృద్దే లక్ష్యం గా నిర్వహించిన వన సమారాధన లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు కులాలకు చెందిన (శెట్టి బలిజ, యాత, గౌడ, శ్రీ శయన, ఈడీగ ) వారంతా పెద్దఎత్తున హాజరయ్యారు.అంతకు ముందు భీమిలి నియజక వర్గం ఆనంద పురం నుంచి ముడసర్లోవ వరకు సుమారు 25 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సులు,కార్లు,ఆటోలు, బైక్ లతో వేలాది మంది వన సమారాధన- ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఏత సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము మాట్లాడుతూ గీత కులస్తులు ఆర్థికంగ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు.గీత కార్మికులకు పెంక్షన్ విధానాన్ని అమలు చేయలని ప్రభుత్వాన్ని కోరారు.మత్స్య కారులకు అమలు చేసిన విధంగా గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రకటించాలని, ప్రమాద వశాత్తు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.అలాగే గీత కార్మికులకు వృత్తి విరామ సమయం లో జీవన భృతి కల్పించాలన్నారు. ఐక్యతే మా లక్ష్యం.. ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్.. ఆంధ్ర ప్రదేశ్ గీత కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్..మాట్లాడుతూ ఆర్థికం గా వెనుకబడిన గీత కార్మికులను పూర్తి స్థాయిలో ప్రభుత్వం గుర్తించాలని,ఆర్ధిక సామాజిక ,రాజకీయరంగాల్లో యాత,శ్రీ శయన, శెట్టి బలిజ,గౌడ, ఈడీగా కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలనికోరారు. విశాఖలో నిర్వహించిన వన సమారాధన – ఆత్మీయ కలయిక తమ కులాల ఐక్యత ను సమాజానికి తెలియజేయల్లన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఈడీగా సంఘం అధ్యక్షుడు ఈడీగా వేణు గోపాల్,రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షుడు గుబ్బల బాబ్జి, గౌడ సంఘం నాయకుడు పామర్తి జయ ప్రకాష్,తో బాటు భీమిలి నియజక వర్గం లోని వివిధ మండలాలనుంచి గీత కులానికి చెందిన నాయకులు, మహిళలు హాజరయ్యారు.

విశాఖపట్నం

కలెక్టరేట్ లో జరుగుతున్న రెవెన్యూ క్లినిక్ లో పాల్గొని తహసీల్దార్ లకు ఆదేశాలు, సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్,

కలెక్టరేట్ లో జరుగుతున్న రెవెన్యూ క్లినిక్ లో పాల్గొని తహసీల్దార్ లకు ఆదేశాలు, సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, *విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి * భూములకు సంబంధించి రెవెన్యూ క్లినిక్ లకు వస్తున్న సమస్యలను వీలైనంతవరకు రెవెన్యూ క్లినిక్ లలో పరిష్కరించండి. కార్యాలయాల చుట్టూ తిప్పు కోవద్దు. పరిష్కారం లో జాప్యం చేయ వద్దు. భూ సమస్యల పరిష్కారంలో దళారులు,రాజకీయ నాయకులు చెప్పిన వారి నుండే అర్జీలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, భూసమస్యల పరిష్కారం లో దళారుల ప్రమేయం సహించేది లేదని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. దళారులను, రాజకీయ నాయకులు చెబితేనే రిజిస్టర్ చేస్తామని రెవెన్యూ అధికారులు గాని, సిబ్బంది గానీ చెబితే సస్పెండ్ చేస్తామన్నారు. డిజిటల్ అసిస్టెంట్ లు డాక్యుమెంట్స్ లేవని అర్జీలు నిరాకరించ వద్దని, సర్వే నెంబర్ ఉన్నా స్వీకరించి రిజిస్టర్ చేయాలన్నారు. భూసమస్యలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రెవెన్యూ క్లినిక్ లలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ లలో RDO లు, తహసీల్దార్ లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఈ నెల 09న డీఆర్సీ సమావేశం* @అధికారులు పక్కా నివేదికలతో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్

*ఈ నెల 09న డీఆర్సీ సమావేశం* @అధికారులు పక్కా నివేదికలతో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 09న జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పక్కా నివేదికలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చేలా సన్నద్ధమై ఉండాలన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన పీజీఆర్ఎస్ లో ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ, ప్రాథమిక రంగాలు, రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను స్పష్టంగా పొందుపర్చాలని సూచించారు. ప్రజా సమస్యలకు, అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

విశాఖపట్నం

2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. విద్యుత ఛార్జీలు తగ్గించారు*

*చోడే పట్టాభి రామ్, విశాఖ టిడిపి అధ్యక్షులు* *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి* *2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. విద్యుత ఛార్జీలు తగ్గించారు* • *దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం* •*ప్రజలపై ట్రూ ఆప్ చార్జీల భారం పడకుండా దాదాపు రూ. 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోంది. • *ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు రూ. 13 పైసలు తగ్గుతుంది అంటే ప్రతి సగటు బిల్లు దారుడు కి ఆ తేడా కనిపిస్తుంది. • *విద్యుత్ రంగంలో సంస్కరణలతో.. ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం* • *డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ… ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తు ఈ నిర్ణయం తీసుకున్నారు • *ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన నాటి ప్రభుత్వం* పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 2019 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది.. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అనిశ్చిత్తి నెలకొనడంతో పాటు నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చవిచూశారు . *దీంతో గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి రూ. 32 వేల కోట్ల అదనపు భారం వేశారు* *వైసీపీ ప్రభుత్వం. కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి, విద్యుత్ ను ఆదాయ వనరుగా మార్చుకుని తమ జేబులు నింపుకున్న వైసీపీ నేతలు విద్యుత్ రంగానికి మాత్రం రూ. 1.29 లక్షల కోట్లు అప్పులుగా మిగిల్చారు* . చంద్రబాబు ప్రజలకు అండగా నిలవాలనే ఏకైక ఆలోచనతో ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించుకోవడం జరిగింది. .. ముఖ్యంగా వైసీపీ పాలనలో యూనిట్ విద్యుత్ రూ. 5.19 లకు కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4.70 లకు కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించింది. అదే సమయంలో ఆక్వా రైతులపై యూనిట్ విద్యుత్ నాడు రూ. 3.50 వసూలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో యూనిట్ రూ. 1.50 పైసలకు తగ్గించి ఆక్వా రైతులకు అండగా నిలిచింది. అలాగే రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, సోలార్, పవన విద్యుత్ లకు అధిక సబ్సిడీలను అందిస్తూ, ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. *5858*మెగా వాట్ విద్యుత్ ను ఏపీ జెన్కో ఉత్పతి చేసింది. నీరు, గాలి, కొండలు, సముద్రం తో పాటు కరెంట్ ను కూడాదోచిన దొంగలు వైసీపీ నాయకులు. ప్రజలు అర్ధం చేసుకోవాలి .. భోగాపురం ఎయిర్ పోర్ట్ కర్త కర్మ క్రియ టీడీపీ ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నిర్మించిన ల్యాండ్ టిడిపి ప్రభుత్వం లో సేకరించారు. 2019 శంకుస్థాపన చేశారు. జగన్మోహనరెడ్డి ఇదే భోగాపురం కోసం ద్వంద మాటలు మాట్లాడుతున్నారు. ఎర్ర బస్ కూడా రాని ఊరుకి ఎయిర్ బస్ ఎందుకు అని అడిగాడు. కోర్టు లకు వెళ్లి ఐన భోగాపురం ఎయిర్ పోర్ట్ అపుతానని అన్నారు. ఇన్ని మాటలు చెప్పిన జగన్ మళ్ళీ శంఖు స్థాపన చేశాడు. జగన్ మాటలకు విలువ లేదు. కూటమి ప్రభుత్వంలో కొద్ది రోజులు క్రితం జి ఎం ఆర్ మానసా ట్రస్ట్ ఏవియేషన్ ఎడ్యు సిటీ తెచ్చారు ఫలితంగా ఏరో స్పేస్ ఏరో రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పై జగన్ మోహనరెడ్డి వాక్యాలను వీడియో దృశ్యాలు చూపిన విశాఖ టిడిపి కార్యాలయం ఈ పత్రికా సమావేశం లో వి ఏం అర్ డి ఏ ఛైర్మన్ ఏం వి ప్రణవ్ గోపాల్ యన్ టి ఆర్ వైద్య సేవ ఛైర్మన్ సీతం రాజు సుధాకర్. ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, మీడియా కో ఆర్డినేటర్ బైరెడ్డి పోతన రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షులు కోట నరేష్,బొట్టా వెంకట్ రమణ,అబ్దుల్ అనిఫ్,అలిత హేమలత,గరికిన యల్లయ్య( కింగ్ ) కార్పొరేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.

*విశాఖపట్నం డిసెంబర్ 5పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం సిటీ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఈ పోలీస్ స్టేషన్ గత *మంతా తుఫాను* సమయములో చెట్లు కూలి శిథిలమైనది తరువాత దీనిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించుటకు శ్రీ సి పి గారు నిధులు మంజూరి చేసినారు ప్రస్తుతము ఈ భవనము అధునాతన నిర్మాణము చేయబడినది అధికారులు మరియు సిబ్బంది సంతృప్తికరముగా పనిచేయుటకు కావలసిన సౌకర్యములు అందించబడినవి. ఈ కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ మిగిలిన పోలీస్ స్టేషన్లో వాటి యొక్క జీవితకాలము పెంచుటకు మరియు సిబ్బంది సౌకర్య వంతముగా విధులు నిర్వ ర్తించుటకు కావలసిన మర మ్మతులు మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి-01 శ్రీ మణికంఠ చెందోలు ఐ.పి.ఎస్.,,డిసిపి (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి ఐ.పీ.ఎస్.,,ఏసీబీ (క్రైమ్స్) ఏ.నరసింహ మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 90 ఫిర్యాదులు*

*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి* *ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 90 ఫిర్యాదులు* *ప్రతీ సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు ఈ రోజు 90 ఫిర్యాదులు రావడం జరిగినది* ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ Dr.శంఖబ్రత భాగ్చి, ఐ.పీ.ఎస్., గారు ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమానికి 90 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా పోలీసు కమిషనర్ గారికి అందజేసినారు. సిపి గారు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదిదారులతో స్వయముగా మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక *(PGRS)* కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.