Sunday, 24 May 2026

Blog

Featured

రాపూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చాలివేంద్రం ఏర్పాటు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో గ్రంధాలయం వద్ద పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా వెంకటగిరి సిఐ అన్వర్ బాషా చేతుల మీదుగా రిబన్ కటింగ్ చేసి త్రాగునీరు చాలివేంద్రం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సిఐ అన్వర్ బాషా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు వెంకటగిరి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు పరిధిలో ఒకటి లేదా రెండు చాలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అందులో భాగంగా రాపూరు పోలీసు వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ వారు హెచ్చరించడం జరిగినది కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ చలివేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ చాలివేంద్రం ఏర్పాటు చేసిన రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటిరెడ్డి,ఎస్ఐ స్వప్న,ఏ ఎస్సై వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు

Featured

రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని మునగాల వెంకటాపురం పంచాయతీ లో నాయనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ గా నిర్దారించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇది కోయంబేడు లింకు గా నిర్దారించడం జరిగింది ఈ వ్యక్తి చెన్నై ప్యారిస్ సెంటర్ నందు చిల్లర దుకాణంలో పనిచేస్తు ఎటువంటి అనుమతి లేకుండా ఈ నెల 9 వ తేదీన బైక్ మీద రావడం జరిగినది. వచ్చినప్పుడు నుండి హోమ్ కోరంటైన్ లో ఉంచి పరిశీలన లో ఉంచారు అతనికి నెల్లూరులో పరిక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్ గా నిర్దారించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. గ్రామన్ని పరిశీలించిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ బాషా మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనడని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Featured

కావ్య, కళ్యాణి కి స్నేహ హస్తం పౌండేషన్ చేయూత

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : బాలాయపల్లి మండలం సుబ్రమణ్యం గ్రామం ఎస్సీ కాలనీ కు చెందిన కాటయ్య కుమార్తెలకు రాపూరు కు చెందిన స్నేహ హస్తం ఫౌండేషన్ ఐదు వేల రూపాయల నగదు, మందులు ,పండ్లు అందించింది అక్క చెల్లెలు అయిన కావ్య కళ్యాణి ఇద్దరు చిన్నప్పటినుంచి చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్నారు తల్లిదండ్రులది మేనరికపు వివాహం కావడంతో ఈ తరహా సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు తెలిపారు సుమారు 14 సంవత్సరాలు గా ఈ పిల్లలిద్దరికీ అనేక ఆర్థిక ప్రయాసలకోర్చి రక్షిస్తూ ఉన్నారు వీరికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం లేదు తనకు ఉన్నటువంటి కొద్ది భూమిని అమ్మి వారి వైద్య ఖర్చులకు ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాదులోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల లో కంటికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది ఎవరైనా సహాయం చేస్తే కానీ వారి పిల్లలకు చికిత్స అందించలేని దయనీయ పరిస్థితి ఎవరైనా దాతలు స్పందించి సహాయం చేసినట్లయితే తమ పిల్లలను మరి కొంత కాలం చికిత్స అందించగలమని వారు ప్రాధేయ పడుతున్నారు.ఈ కార్యక్ర మానికి పెరుమాళ్ళ ప్రసాద్ జ్ఞాపకార్థం వారి అక్క సుజాత గారు మరియు తల్లి రంగనాయకమ్మ గారు సహాయం చేశారు.మరియు వారికి అవసరమైన మందులను ప్రతి నెల స్నేహ హస్తం ఫౌండేషన్ నిర్వాహకులు దగరా పాండు రంగా రెడ్డి గారు ఉచితంగా అందజేస్తము అని తెలియజేశారు.

Featured

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం స్పెషల్ క్యాలెండర్ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వారిచే భక్తుల సమాచారం కోసం ముద్రించిన 2020 స్పెషల్ క్యాలెండర్ ను నెల్లూరు ఆనం నివాసంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జే వెంకటసుబ్బయ్య మరియు దేవస్థానం అర్చకులు పలువురు పాల్గొన్నారు.

Featured

రాపూరు మండలం లో 18 రైతు భరోసా కేంద్రాల

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండల పరిధిలో 18 సచివాలయాలకు సంబంధించి 18 రైతు భరోసా కేంద్రాలను ఈనెల 30 తేదీన ప్రారంభించడం జరుగుతున్నది అని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ తెలిపారు ఇకనుండి రైతులకు వ్యవసాయ శాఖ సేవలను గ్రామ స్థాయిలో పొందవచ్చు అనగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు రైతు భరోసా కేంద్రాల నుండి సరఫరా చేస్తారు అని తెలియజేశారు.

Featured

చలివేంద్రాలను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు.

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : సర్వేపల్లి నియోజకవర్గంలో వేసవి తీవ్రత దృష్ట్యా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన చోట ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ప్రతి చలివేంద్రలో పరిశుభ్రమైన తాగునీరుతో పాటు మజ్జిగ కూడా అందుబాటులో ఉంచుతున్నాం.ఉదయం నుండి సాయంత్రం వరకు చలివేంద్రాల ద్వారా తాగునీరు అందించడంతో పాటు, వృద్ధులకు, మహిళలకు మజ్జిగ అందజేస్తున్నాం.కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, డిస్పోజబుల్ గ్లాసులను ఉపయోగిస్తూ, ప్రజలకు సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సూక్ష్మమైన, చిన్నపాటి పనులను కూడా ప్రజల అవసరాన్ని బట్టి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాం.ప్రజల అవసరాలను తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా అని తెలిపారు

Featured

స్పాట్… చావనైనా చస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం.

*స్పాట్… చావనైనా చస్తాం గాని మా భూములు మాత్రం ఇవ్వం.* 28-05-2020 *బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి)* కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1977 సంవత్సరంలో దళితులు ఆకలికి అలమటించ కుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మిగిలిన భూముల సీలింగ్ చట్టం క్రింద నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామంలోని హరిజన అరుంధతీయవాడలో దళితులకు ఇందిరాగాంధీ 40 మందికి సుమారు పది ఎకరాల భూమి ఇచ్చింది. అయితే 2019 జనవరి వరకు ఆ భూములు నెల్లూరు జిల్లా ఆర్ డి ఓ పేరుపై ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలు ఇవ్వాలని వారు గత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. టిడిపి ప్రభుత్వం ఆ స్థలాలను తమ పేరు మీదకు మార్చి పట్టాలను ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దామరమడుగు గ్రామంలో లో చుట్టూ పక్కల ఎక్కడ భూములు తక్కువ ధరలు లేనందువల్ల ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, అధికారులు కన్ను దళితుల భూములు పై పడింది. లాక్ డౌన్ కు ముందు తమ భూముల అమ్మే ప్రసక్తే లేదంటూ వారి తిరగబడ్డారు. లాక్ డౌన్ అనంతరం మరల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. మీరు కనుక భూములను అమ్ముకుంటే మీ అకౌంట్లో డబ్బులు వేసి ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడతాను అంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు బెదిరిస్తున్నారు అంటూ దామరమడుగు మాజీ సర్పంచ్ సురేష్ అన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఈ విషయం పై చర్చించి తమకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. తమకు మాత్రం అన్యాయం జరుగుతుంటే రానున్న కాలంలో తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Featured

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ

28-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ, గమళ్లపాలెం, ఎస్సీ కాలనీలు , ఎస్ టి కాలనీలు లో దాదాపునాలుగు టన్నుల కూరగాయలు ను దాదాపు 1500 పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు మనుబోలు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పేద ప్రజలకు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనిఅన్నారు కరోన మహమ్మారి వచినప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూ సహాయసహకారాలుఅందిస్తున్నారు. మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి మనుబోలులో సోంతనిధులతో నిత్యవసరవస్తువులు పంపిణీ చేసారు. మనుబోలు మండల కేంద్రంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బి.సి.కాలనీ, గమళ్ల పాళెం ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కరోనా వ్యాధి పట్ల అవగాహనతో నివారణ చర్యలను తీసుకుంటూ, ధైర్యంగా ఉండండిఅని వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ,పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు ఆదేశించడం ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకుల సరఫరాతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా అవసరాల కోసం 24 గంటలు సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, అవసరమైన ఇతర సరుకులను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే చేర్పిస్తున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళ చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించా రు.రెడ్ జోన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అవసరమైన వసతులు మౌలిక సదుపాయాల కల్పనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోకలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతున్నా సర్వేపల్లి నియోజకవర్గం లో మాత్రం పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకున్న వ్యక్తి మన అందరి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బీసీ సెల్అధ్యక్షులుదాసరిభాస్కర్ గౌడ్,చేరెడ్డిపట్టాభిరామిరెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చల్లా రవీంద్ర ,చలగల దయాకర్ ,సుధాకర్ రెడ్డి ,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Featured

ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం

28-05-2020 (పున్నమి ప్రతినిధి) విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల మన్ననలు పొందారు. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఎన్టీఆర్.. ఈ పేరు ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, భావితరాలకు ఆదర్శం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన తారక రాముడి ఖ్యాతి తెలుగు వెలుగు ఉన్నంత కాలం, తెలుగు వెలుగుతూ ఉన్నంత కాలం శాశ్వతం.సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మనుబోలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 97 జయంతిని పురస్కరించుకొని మనుబోలు,యాచవరం గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పంచాయతీ సిబ్బందికి ,వైద్య సిబ్బందికి ఓ. .ఆర్. ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి ,కలికి రమేష్ రెడ్డి ,సాని వెంకటరమణయ్య,దండు చంద్రశేఖర్ రెడ్డి, రాజా గౌడ్ ,రావుల అంకయ్య గౌడ్, చేరెడ్డి పద్మనాభ రెడ్డి ,చల్ల గిరి ప్రసాద్ ,శ్రీనివాసులు రెడ్డి ,చింతల వెంకటేశ్వర్లు, గుంజి రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మౌలిక వసతులు కల్పనే నాడు-నేడు లక్ష్యం …జిల్లా కలెక్టర్.యం. వి.శేషగిరి బాబు

27-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం.వి.శేషగిరి బాబు పర్యటించారు. బండేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను…, కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నాడు నేడు కార్యక్రమానికి 401 కోట్లరూ పాయాలు కు ప్రతిపాదనలు పంపినామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపినారు. బుధవారంమనుబోలు మండలం లోని చెర్లోపల్లి, బండే పల్లి గ్రామాలను ఆయన పరిశీలించారు జిల్లాలో 1085 స్కూ ళ్ల లో గదులునిర్మిస్తామన్నారు. ఇందుకుగాను 115 కోట్లు రూపాయల నిధులు తొలివిడితలో మంజూరు అయ్యినయన్నారు. ఆగస్టు 3 న పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్ పూర్తవ్వాలన్నారు. స్కూలు ప్రారంభం కాగానే ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారమ్స్, బూట్లు అందించాలని.., మెరుగైన మౌలిక వసతులతో అత్యత్తుమ విద్యా బోధన అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని… డి.పి.ఓ కి తెలిపారు. నాడు-నేడు పనులకు ఇసుక కొరత ఉందని, సిమెంట్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడి నాడు-నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హార్టీ కల్చర్ ఎ.డి. తో కలిసి.., మనుబోలు మండలంలోని వంగతోటలను పరిశీలించారు. సాధారణంగా కోయంబేడు మార్కెట్ కి పండిన కూరగాయలను ఎగుమతి చేస్తుంటామని.., కరోనా కేసులు నమోదు అవడంతో కోయంబేడ్ మార్కెట్ కి కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయని.., దీంతో పండిన పంటన అమ్ముకోలేక పోతున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానికంగా కూరగాయ మార్కెటింగ్ కి వ్యాపారులతో మాట్లాడి., రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కోదండరాం పురం లోని మెయిన్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని విలేకరులు చెప్పగా వెంటనే స్పందించి ఎంపీడీవో సమగ్ర నివేదిక ఇస్తే చర్యలు చేపడతామన్నారు . ఈ కార్యక్రమంలోఎస్ ఎస్ ఏ ఈఈ శ్రావణ్ కుమార్ ,ఈ ఈ ఆనంద్ రెడ్డి డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, ఉద్యావనశాఖఎ.డి,ఎంపీడీవోవెంకటేశ్వర్లు,తహశీల్దార్ హరనాథ్ అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.