Sunday, 24 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్

ప్రభుత్వ టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. టీచర్ల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సీఎం ఆదేశాలకు మేరకు త్వరలోనే(పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక) ప్రక్రియ స్టార్ట్ చేస్తామని, స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామన్నారు.   వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి చెప్పారు. ట్రాన్సఫర్ల కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రెకమెండేషన్ల అవసరం లేదని మంత్రి అన్నారు. విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారనే ఆరోపణలపై మంత్రి స్పందించారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు.

Featured

రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం

రోడ్డును కప్పేసిన ముళ్ల పొదలు- రాకపోకలకు అంతరాయం పలమనేరు జూన్3,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం గంగవరం పంచాయతీ పరిధిలో గల కుర్నిపల్లి గ్రామం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు వర్షాలకు రోడ్డుపైకి పడిపోయాయి. గంగవరం పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఈ గ్రామీణ రహదారిల రహదారిలో కుర్నిపల్లి, చీళ్ళవారి పల్లి,ఒడ్డిఇండ్లు, ఉయ్యాల మిట్ట, తమ్మిరెడ్డి పల్లి, తాళ్లపల్లి ఏడురు,దండపల్లి పాటు ఇంకా పలు గ్రామాలు ఉన్నాయి. ఈ రహదారిపై ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు, రైతులు వెళ్తుంటారు అలాగే ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాక్టర్లు, లారీలు, బస్సులు కూడా వెళుతుంటాయి పది గ్రామాల ప్రజలు ఈ రహదరిలోనే ప్రయాణిస్తుంటారు. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది ఇలాంటి రహదారిలో వర్షాలకు రోడ్డుపై పడిపోయిన ముళ్ల పొదలను తొలగించాలని వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. ముళ్ళ పొదలు రోడ్డుపై పడిపోవడంతో దారి కనిపించకుండా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై పడిపోయిన ముళ్ళ పొదలు తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Featured

లబ్ధిదారుల నోట్లో మట్టి కొడుతున్నారు

పలమనేరు, జూన్3,2020(పున్నమి విలేకరి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొంటూ,నాణ్యమైన ఇసుక కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరను మీసేవ ఆన్ లైన్ లో చెల్లించి నిబంధనలను పాటిస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు అధికారులు..పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన బత్తి గౌడ్ కుమారుడు భానుచందర్ మే నెల 30వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఇసుకకు డబ్బులు చెల్లించాడు. ఈ రోజు శంకర్ రాయల్ పేట రీచ్ నుండి ట్రాక్టర్ ద్వారా పంపిణీ చేశారు. ఇసుక కి బదులుగా బంకమట్టి, మట్టిని తోలారు. డ్రైవర్ ని ప్రశ్నించగా ఇసుక రీచ్ నుండి ఇదే ఇవ్వమన్నారు. దీని గురించి మాకు తెలియదు అని అన్నారు. దీంతో ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. దీనిపై ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకొని లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాడు. రీచ్ నుంచి తీసుకొచ్చిన బంకమట్టితో ఇళ్ళ నిర్మాణాలను చేపడితే మా పరిస్థితి ఏంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Featured

మోర్ల భరత్ కుమార్ ను పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.

03-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన వై సి పి నాయకుడు మోర్ల భరత్ కుమార్ సోదరుడు మోర్ల వేణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మోర్ల భరత్ ను వారి కుటుంబసబ్యులను పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస రావు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి, సీతారామ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వైసిపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Featured

ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము-కాకాని గోవర్ధన్ రెడ్డి

తేది:03-06-2020 పొదలకూరు: పొదలకూరుమండలం ఇనుకుర్తి, ముదిగేడు గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. గర్భవతులకు, బాలింతలకు మేలురకం బియ్యం (సార్ టెక్స్) పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి. స్క్రోలింగ్ పాయింట్స్: ? సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. ? నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నాం. ? ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఊహించిన దాని కన్నా మిన్నగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ? మహోన్నతమైన పాలనను అందించిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పాలనను కూడా మైమరిపించే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలనను కొనసాగిస్తున్నారు. ? ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ? గ్రామాలకు అవసరమైన తాగునీరు, సాగునీరు, రోడ్లు, సైడు కాలువలు, స్కూళ్లు, స్మశానవాటికల అభివృద్ధి, పొలాలకు వెళ్లే దారులు లాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వీధిలైట్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. ? ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు శాశ్వత ఇళ్లు నిర్మించి ఇస్తాం. ? నీరు- చెట్టు లాంటి దోపిడి కార్యక్రమాలు కాకుండా ప్రజలకు అవసరమైన శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాం. ? గతంలో పెత్తనం వెలగబెట్టిన కొంతమంది, అధికారులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచన మానుకుంటే మంచిది. ? ఎవడో పనికిమాలిన వాడి తాటాకు చప్పుళ్ళకో, ఉడతా బెదిరింపులకు సర్వేపల్లి నియోజకవర్గంలో అధికారులు ఎవ్వరూ భయపడరు. ? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ? గతంలో అనుసరించిన విధానాలకు స్వస్తి పలికి, అనవసరంగా నోరు పారేసుకోకుండా విమర్శలు చేసి నవ్వులపాలు కాకుండా ఉంటే మంచిది. ? కండలేరు జలాశయం నుండి పొదలకూరు, మనుబోలు మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తాం. ? గత ప్రభుత్వంలో మాదిరి నీటి విడుదలలో రాజకీయ జోక్యం లేకుండా ప్రజా అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తాం. ? సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, “ఆదర్శ నియోజకవర్గం”గా నిలపడమే నా లక్ష్యం.

Featured

పేద వారికి కార్పోరేట్ వైద్యం-డాక్టర్ వై.యెస్.ఆర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ

03-06-2020మనుబోలు(పున్నమిప్రతినిధి)జట్లకొండూరు పంచాయతీ లోని కుడితిపల్లి గ్రామంలో సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రోజు యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిదులుగా మనుబోలు మండల మాజీ యం.పి.పి చేరెడ్డి రామిరెడ్డి వై.యెస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జ గన్ మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు అన్నారు.కేన్సర్‌ వ్యాధినిఆరోగ్యశ్రీ పరధిలోకి తీసుకువచ్చారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు అన్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి తోడుగా నిలిచారు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి బాగోలేకపోయినా.. మన ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మంచి వైద్యం, మెడిసిన్‌ దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిని మన రాష్ట్రంలో తీసుకువచ్చారని పేదవాడు వైద్యం చేయించుకునేందుకు,పిల్లలను చదివించుకునేందుకు అప్పులపాలు కాకూడదని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బలంగా నమ్మారని, అందుకనే ఆరోగ్యశ్రీ, పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వై. యెస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవం పోశరని వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి నారు అన్నారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి రామ్ యాదవ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గుంజి రమేష్, పల్లంరెడ్డి రాజా రెడ్డి, మునగల వీరయ్య, ఉడత మధు ,బోయిన ఆది, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Featured

బుచ్చిరెడ్డిపాలెం వద్ద ముంబయి రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

03-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర శివారులో హెచ్ పి గ్యాస్ గౌడౌన్ సమీపంలో ముంబయి రహదారిపై రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లూరు వైపు వెళ్తున్న లారీ(TN52H4519)మరియు సంగం వైపు వెళ్తున్న గూడ్స్ ఆటో(AP26TL3559)ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు కాగా, లారి ముందు వైపు స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించిన వారు రాకపోవడంతో షుమారు 45నిమిషాలపాటు వేచిచూసి, చివరకు అటుగా వెళ్తున్న విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి అతని ద్విచక్ర వాహనంపై ప్రదమ చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బుచ్చి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను తెలుసుకొని, లారీని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం

ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు పని చేయాలి: ఎంపీడీవో కృష్ణ

టంగుటూరు మండల కేంద్రమైన టంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 18 పంచాయతీల కార్యదర్శులు ఈవో ఆర్ డి బ్రహ్మయ్యలకు ఎంపీడీవో సూచనలు ఇచ్చారు. గ్రామాలలో స్పందన కార్యక్రమం చేపట్టాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు సంబంధించిన వారికి జియో టాక్ నిర్వహించాలని అదేవిధంగా సర్వీస్ డెలివరీలు చేయాలని, ప్రజలకు అందించే 227 సర్వీసులు గ్రామ సచివాలయం లోనే అందిస్తారని, కావున ప్రజలు గ్రామ సచివాలయంలోనే సంక్షేమ ఫలాలు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఏ సంక్షేమ పథకం అయినా నా సచివాలయంలోని అధికారులతో సమన్వయ పరుచుకుని తమ గ్రామ సచివాలయంలోనే అర్జీలు గాని ఎటువంటి సంక్షేమ పథకమైనా గ్రామ వాలంటరీ సచివాలయ వ్యవస్థ తోనే ప్రజలు సంక్షేమ పథకాలు అందించాలని కార్యదర్శులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18 పంచాయతీ కార్యదర్శులు, ఈవో ఆర్ డి పంచాయతీ సిబ్బంది, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే… ?

పున్నమి తెలుగు దిన పత్రిక ఏపీలో 24 గంటల్లో కొత్తగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3279 కు చేరింది. ఇందులో 967 యాక్టివ్ కేసులు ఉండగా… 2,244 మంది కరోనా నుండి కోలుకున్నారు. అటు మరణా సంఖ్య 68కు చేరింది. అటు విదేశాల నుండి వచ్చిన వారిలో 119 మంది,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 573మందికి కరోనా వచ్చింది.

Featured

అర్జున అవార్డు సిఫార్సు లో అమలాపురం క్రీడాకారుడి పేరు

తూర్పుగోదావరిజిల్లా అమలాపురానికి చెందిన బాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ పేరును అర్జున అవార్డుకు భారత బాడ్మింటన్ సంఘం సిఫార్సు చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.