Sunday, 24 May 2026

Blog

Featured

కరోనా అరికట్టెందుకు మాస్కులు తప్పనిసరి: ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి

*మాస్క్ వేసుకోకపోతే ఇక ఫైన్ బాదుడే…* గ్రామాల్లో రూ.100, పట్టణాల్లో రూ.200 12-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు లో భాగంగా మండల పరిధిలోని ప్రజలు ఇళ్లలోనుంచి బైటకొచ్చేవాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన విధించారు. బైక్ లపై వచ్చేవారు కానీ, ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేవారు కానీ కాలినడకన వచ్చేవారు కానీ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఒకవేళ అలా మాస్క్ కట్టుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారని ఈమేరకు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు అని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు . ఫైన్ విధిస్తున్నా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే దాన్ని పెంచుతామని, మరిన్ని కఠిన చర్యలు అమల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. షాపులు కస్టమర్లలో శారీరక దూరాన్ని పాటించాలని వివాహ సంబంధిత సమావేశాలు అతిథుల సంఖ్య 50 మించకూడదు అని అంత్యక్రియలు సంబంధిత సమావేశాలు: వ్యక్తుల సంఖ్య 20 మించకూడదు అనిబహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం జరిమానాతో శిక్షార్హంగా ఉంటుందని నియమాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు మొదలైనవి తీసుకోవడం నిషేధించబడింది అని బయటకు వచ్చే ఏ వ్యక్తి అయినా తన ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే ఫేస్ మాస్క్ ధరించాలని మరోసారి తెలియజేస్తున్నామని ఫేస్ మాస్క్ ధరించని వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో రూ .100 / – (వంద రూపాయలు ) మరియు పట్టణ ప్రాంతాల్లో రూ .200 / – (రెండు వందల రూపాయలు ) తో జరిమానా విధిస్తారని . 188 ఐపిసి ఈ ఉత్తర్వులు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి అని సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు,అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇంట్లో ఉండాలని సూచించారు. పై నిబంధనలు ప్రజలందరూ పాటించి కరోన వ్యాప్తిని అరికట్టెందుకు పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.

Featured

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు తీరును నిరసిస్తూ పలమనేరు టీడీపీ నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి సుమారు 100 పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆ అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు దీన్ని కండిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందుశెట్టి, బాలాజీ రాయల్,పాలబాబు, బ్రహ్మయ్య , సుబ్రమణ్యం గౌడు, క్రిష్ణమూర్తి,ఆర్బీసి కుట్టి, ఎస్సీ సెల్ నాగరాజు, గిరిబాబు, చిన్ని,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured

పడకేసిన పారిశుద్ధ్యం

పలమనేరు, జూన్12,2020 (పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండల పంచాయతీ కార్యాలయం ముందు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురుగు కాలువల్లో పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది .కరోనా వైరస్ నేపథ్యంలో తప్పనిసరిగా క్లోరిన్ పనులు చేపట్టి కరోనా వైరస్ సోక కుండా నేను తన కొరకు నియంత్రణ కొరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయినా కూడా గంగవరం మండలం సచివాలయం కార్యాలయం ముందే కాలువ నిండ మురుగునీరు కంపు కొడుతుందని రోగాలు ప్రబలే అవకాశం మొండుగా కనబడుతున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టి మంచి వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Featured

మాస్క్ ధరించని వారికి భారిగా జరిమానా

పలమనేరు జూన్ 12,2020(పున్నమి విలేకరి): మాస్కులు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి భారీ జరిమానా విధించునట్లు ఎస్ఐ ప్రియాంక శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు రూ 500 నుంచి రూ1000 జరిమానా విధించినట్లు చెప్పారు. ద్విచక్ర వాహనం లో ఒకరు మాత్రమే ప్రయాణించాలన్నారు. ఇతర వాహనాలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించాలన్నారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు

నెల్లూరు నగరంలోని రంగనాయకులు పేట, సుబేదార్ పేట, రైల్వేస్టేషన్ గేట్, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఫైర్ ఆఫీస్, ఆర్.టి.సి బస్టాండ్ లలో…, శుక్రవారం ఉదయం కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు, మున్సిపల్ కమీషనర్ బాపిరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలో డ్రైనేజీ సిస్టమ్స్ నిర్వహణ, కాలువలు ఎలా శుభ్రం చేస్తున్నారు, వార్డులలో తీసుకుంటున్న పారిశుధ్య చర్యలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మురుగుకాల్వలో ప్రొక్లైన్లతో శుభ్రం చేస్తున్నామని, ప్రతిరోజూ వీధుల్లో బ్లీచింగ్ చల్లడంతో పాటు.., ప్రతిరోజూ పారిశుధ్య నివారణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆర్.టి.సీ బస్టాండ్ ని పరిశీలించారు. బస్టాండ్ ప్రాంగణంలో తిరుగుతూ.., పరిసరాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలపై ఆర్.టి.సి. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బస్ లో టిక్కెట్ ఇచ్చే సమయంలోనూ.., బస్ లో ప్రయాణికులు ప్రయాణించే సమయంలోనూ సానిటైజర్స్ అందుబాటులో ఉంచాలన్నారు. బస్ లో కూడా ప్రయాణికుల సీట్ల మధ్య దూరం పాటించేలా నిబంధనల ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Featured

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పలమనేరు సబ్-డివిజన్ పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతులు నిమిత్తం శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ సబ్-డివిజన్ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పలమనేరు మునిసిపాలిటీ, పలమనేరు రూరల్,గంగవరం మరియు బైరెడ్డిపల్లి మండల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడున్నారు. విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో సీఎం జగన్‌ పర్యటన*

   : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని, చేయి ఎత్తకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించే సేవలు, విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలి. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలి. ఎవరి దరఖాస్తులు కూడా తిరస్కరించకూడదు. అర్హత ఉన్నవారికి పథకాలు రాకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెన్షన్లు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలి. మొదట వీటిపై దృష్టి పెట్టాలి. ఆగస్ట్‌ నుంచి గ్రామాల్లో పర్యటిస్తా. అప్పుడు ఎవరి నుంచి కూడా తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదు.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం జగన్‌ గ్రామాల్లో పర్యటనకు సిద్ధం అవుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగు త‌మ్ముళ్ళ‌కు సీబీఐ ఉచ్చు త‌ప్ప‌దా ?

ఏపీ క్యాబినెట్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్ట‌బోతోందా ? చ‌ంద్ర‌బాబు టీమ్ పై చ‌ర్య‌లు త‌ప్ప‌వా ? ప‌రిణామాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ ‌కు మింగుడు ప‌డ‌క‌పోవ‌చ్చు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై విమర్శలు గుప్పిస్తున్న చంద్ర‌బాబు, లోకేష్‌, ఆ పార్టీ నాయ‌కుల దూకుడుకు క‌ళ్ళెం వేసే దిశ‌గా క్యాబినెట్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులోభాగంగానే టీడీపీ హయాంలో అమలైన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌ పథకాల్లో జ‌రిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ పథకాల్లో అక్రమాల పరిశీలన కోసం ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం తన నివేదికను మంత్రివ‌ర్గానికి సమర్పించింది. అలాగే, నాటి ఐటీ మంత్రిగా నారా లోకేశ్ నేతృత్వంలో నడిచిన ఫైబర్ నెట్ పథకంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు త‌న నివేదిక‌లో పేర్కొంది. వీటి ఆధారంగా తండ్రీకొడుకులపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే కాదు గ‌తంలో రాజ‌ధాని అమ‌రావ‌తి భూమాయ విష‌యంలోనూ అదే జ‌రిగింది. న‌వ్యాంధ్ర‌లో తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ, అనేక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డి, అక్ర‌మాల‌కు తెర‌లేపింద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌క ముందే చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ అక్క‌డ ముందుగానే నాలుగు వేల ఎక‌రాలను కొనుగోలు చేసి భూదందాకు తెర‌లేపార‌ని వైసీపీ స‌హా ఇత‌ర పార్టీలు ఆరోపించాయి. అయితే వాట‌న్నింటినీ ఖండిస్తూ అవ‌స‌ర‌మైతే ఏ విచార‌ణ‌కైనా సిద్ధ‌మేనంటూ టీడీపీ శ్రేణులు స‌వాల్ చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ అంశంపై పెద్ద రాద్దాంత‌మే జ‌రి‌గింది. రాజ‌ధాని భూ దందా వ్య‌వ‌హారం తారాస్థాయికి చేరుకోవ‌డంతో టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. దమ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌వాళ్ళు విసిరారు. ఎట్టకేలకు విపక్షాల డిమాండ్ మేరకే జగన్ సర్కారు భూదందాల వ్యవహారాలను సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌ పథకాల్లో జ‌రిగిన అక్రమాలపై కూడా సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌నుంది. ఈ నిర్ణ‌యం టీడీపీ త‌మ్ముళ్ల మెడ‌కు సీబీఐ ఉచ్చు ఏవిధంగా బిగిస్తుందో చూడాలి.

Featured ఆంధ్రప్రదేశ్

కళ తప్పిన వెంగమాంబ తిరునాళ్ళు

కళ తప్పిన వెంగమాంబ తిరునాళ్ళు కరోనా దెబ్బతో వెలవెలబోతున్న నర్రవాడ (నెల్లూరు – పున్నమి ప్రతినిధి) . ఈ పేరు చెప్తేనే దేశవ్యాప్తంగా నెల్లూరు, జిల్లా నుంచి వెళ్లిన వలస వాసులు పులకించిపోతారు. ఉపాధి ఉద్యోగాల కోసం బతుకుదెరువు కోసం ఇక్కడి మెట్ట ప్రాంతం నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్లిన వారందరూ ఒక్కసారిగా వచ్చి పల్లెల్లో వాలిపోతారు… అప్పటివరకు వెలవెలబోయిన పల్లెలు జనంతో కళకళలాడుతాయి.అప్పటివరకు ఇంటికొకరుగా బిక్కుబిక్కుమంటూ ఉన్న మెట్టప్రాంతంలో ఒక్కసారిగా ఆనందం గెంతులేస్తుంది… ఆ ప్యాయతలు.. అనురాగాలు పచ్చటి పందిళ్లు వేస్తాయి..గడపగడపా పసుపు పారాణి తో కళకళలాడుతాయి. ఇక తిరునాళ్ళలో అందచందాలు వర్ణనాతీతం. కోలాటాలు… కులుకు భజనలు..కౌమారుగైపోయాయన్న.. భోగాతాలు …డ్రామాలు..హరికథలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు… పండరి భజనలు.. ఆధునిక సినిమా గీతాల హాస్యవల్లరి లు ఆనందాన్ని పంచుతాయి..డీ జేల దారువులతో దద్దరిల్లే రికార్డ్ డాన్స్ లు కొత్త ఉత్సాహాన్నిస్థాయి…ఆపక్కనే డైమండ్ డబ్బాలు..జేబులు ఖాళీ చేస్తాయి.ఒకటేమిటి… అడుగడుగునా ఎగ్జిబిషన్లు… ఆకాశాన్ని తాకే జెయింట్ వీల్స్ విహరింపులు… ఇంద్ర మహేంద్రజాల తో మైమరిపించే ఆధునిక మాంత్రికుల ఆశ్చర్య విన్యాసాలు.. ఇలా ఒక్కటేమిటి గ్రామీణ ప్రాంతాల్లో పాత.. కొత్త తరం సంస్కృతి సంప్రదాయాలు… ఆచార వ్యవహారాలకు అదో వేదికంటే అతిశయోక్తి కాదు.. ప్రత్యేకించి నాటి నేటి తరం జానపద సౌరభాలు అక్కడ సాక్షాత్కరిస్తాయి.. ఇంకా చెప్పాలంటే మెట్ట ప్రాంతానికి సంక్రాంతి మాటేమో కానీ వెంగమాంబ తిరునాళ్ళు పేరు చెబితే ఊరూరా సంబరాలు సంతరించుకుంటాయి..బందుగణం తో నిండిపోతాయి. ఎక్కడెక్కడి నుంచో వలస పక్షుల్లా వాలిపోతారు.కొన్ని యువజంటలు అక్కడ ఒక్కటౌతాయి.. మరికొందరు ప్రేమికులు చకోరిపక్షుల్లా అక్కడి తిరునాళ్ళలో విహరిస్తారు.. ఆపై అమ్మవారిపై గుండెల్లో నిండిన భక్తి భావాలతో వెంగమాంబ గురవయ్య చౌదరి ల పూజలతో పులకించిపోతారు. లక్షల కొద్దీ జనం అక్కడ ఆలయానికి చేరి… అమ్మా.. మేమంతా.. లక్షణంగా ఉండాలంటూ పూజలు చేస్తారు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క-సారక్క తిరణాల తరువాత అత్యంత వైభవంగా… అంతకుమించిన జన సందోహంతో నిండే గ్రామీణ జనజాతర పండుగ ఏదైనా ఉంది అంటే అది శ్రీ వెంగమాంబ తిరునాళ్ళలో మాత్రమేనని చెప్పకతప్పదు… వారం రోజుల పాటు జరిగే వెంగమాంబ తిరుణాల కోసం వేలాది మంది అక్కడ వ్యాపారాల కోసం వాలిపోతారు.. మూడు నెలలు ముందుగానే దుకాణాల వేలాది రూపాయల తో వేలంలో దక్కించుకుంటారు. లక్షలాదిగా వచ్చిన అమ్మవారి భక్తజనంతో కొద్దిపాటి వ్యాపారాలు చేసి పెట్టుబడి తో పాటు కొద్దిపాటి లాభాలు పొంది తిరుగు ప్రయాణం అవుతారు.. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని లక్షల మంది తో నరవాడ కిక్కిరిసి పోతుంది.. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. వారం రోజుల్లో ప్రధానమైన కళ్యాణం కొండ తిరుగుడు అమ్మవారి పూజా కార్యక్రమాల మూడు రోజులు జనం రద్దీని నియంత్రించేందుకు వేలాది మంది పోలీసులు.. అంతకుమించిన నిఘా కెమెరాలు పహారాతో… అధికారుల పర్యవేక్షణతో.. మధ్యమధ్యన రాజకీయ నాయకులు.. ప్రజాప్రతినిధుల హడావుడితో సాగే సందడి.. అంతా.. ఇంతా కాదు…కట్ చేస్తే… ఇదంతా గతం…గా.. మారిపోయింది…మెట్ట పండుగ చరిత్రలో కలిసిపోయింది…జనసంబరాలు.ఆనందాలు ఆవిరయ్యాయి…తిరునాళ్ళ కళమారిపోయింది. వెంగమాంబ తిరునాళ్లు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు… ఏపీ నుంచి గాక తెలుగు రాష్ట్రం తెలంగాణ పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు సహా అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపే రాష్ట్రాలు సైతం ఈసారి మౌన ముద్రలో ఉండిపోయాయి. తిరునాళ్ల సందర్భంగా వచ్చిన వలస వాసులతో కలకలలాడే మల్లెలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అన్నింటికీ కారణం ఒక్కటే అదే… ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. ఈ శతాబ్దంలోనే తొలిసారిగా అమ్మవారి ఆలయం లో భక్తి భజన కళ తప్పింది. తిరునాళ్ళు అన్న పేరే గాని నరవాడ మొత్తం వెలవెలబోతోంది. బస్సుల సందడి లేదు. ఇతర వాహనాల రద్దీ అసలే లేదు… అంతా నిర్మానుష్యం రాజ్యమేలుతున్న అన్నట్లుగా మారిపోయింది అమ్మవారి ఆలయ ప్రాంగణం నర్రవాడ.. మెట్ట వాసుల ఆరాధ్యదేవత శ్రీ వేంగమాంబ ఆలయ ప్రాంగణం తిరునాళ్ళలో కళ్యాణ అనంతరం జరిగే బండలాగుడు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే బసవన్నల బారులు కనిపించలేదు..ఆబోతు ఎద్దుల అందచందాలు కనుమారుగయ్యాయి.. తిరునాళ్ల అనంతరం గుడి చుట్టూ తిరిగే బండ్లు తిరుగుళ్ళు మచ్చుకైనా లేవు.. కళ్యాణానికి కిక్కిరిసి పోయి జనం కనుచూపు మేర కానరాలేదు.. అమ్మవారి స్వగ్రామం వడ్డీ పాలెం లో పసుపు దంపకాల..దరువు లేవు..వాటికోసం పోటీపడే ఆడపడుచుల హడావుడి లేదు.. తిరునాళ్ళ వచ్చిందంటే పసుపు వర్ణాల రంగవల్లులతో నిండే గడపలు..పల్లె లోగిళ్లు మారి పోయాయి.. రంగవల్లులతో అలరించే అమ్మవారి పుట్టింటి వద్ద సాంప్రదాయ ఆనవాళ్లు అస్సలు కనిపించడం లేదు. గ్రామీణ పల్లె భారతాన్ని సాక్షాత్కరించే మెట్ట తిరునాళ్ళు ఇప్పుడు మూగబోయాయి..కరోనా తో మొత్తం వలసవాసుల విడిది.. ఏడాదికోసారి..అక్కడి ఆప్యాయతలు.. అనురాగాల కలయికలను ఎగరేసుకుపోయింది ఈ దుష్ట మహమ్మారి…అంటూ అనేక మంది అమ్మవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కి తిరునాళ్లతో ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి ఇక్కడ కలిసి తమను ఇప్పుడు కరోనా విడదీసిందని కొందరు ఆ మహమ్మారిని తిట్టిపోస్తున్నారు.

Featured

నకిలీ డాక్టర్ గుట్టు రట్టు

పలమనేరు,జూన్11,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని నాలుగు రోడ్లు వద్ద ఎలాంటి అర్హత లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తూ నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. వివరాలోకి వెళ్ళితే…గంగవరం మండలంలోని నాలుగు రోడ్లు వద్ద R V క్లినిక్ పేరుతో డాక్టర్ శివ (MBBS) ఆసుపత్రి ప్రారంభించారు. కొద్ది రోజులు రోగులకు వైద్య చికిత్సలు అందించారు. డాక్టర్ శివ ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళారు. డాక్టర్ శివ ప్రారంభించిన ఆసుపత్రిలో మహేంద్ర పనిచేశాడు. డాక్టర్ శివ విదేశాలుకు వెళ్లిన తర్వాత నకిలీ వైద్యడు మహేంద్ర తాను కూడా MBBS చేసినట్లు ప్రజల వైద్యం చేస్తున్నాడు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యడు మహేంద్ర ప్రజలకు సరైన వైద్యం అందించకుండా పోవడంతో ఫిర్యాదులు రావడంతో పత్తికొండ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసులు ఆదేశాలు మేరకు డాక్టర్ యుగంధర్ ఆస్పత్రి తనిఖీ చేయగా నకిలీ వైద్యడు మహేంద్ర పరారీలో ఉన్నాడు. దాంతో ఆస్పత్రిని తాళాలు వేసి సీజ్ చేసినట్లు డాక్టర్ యుగంధర్ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.