Sunday, 24 May 2026

Blog

Featured

అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేబినార్ ద్వారా ఇంటి వద్దదే కుంటుంబం తో యోగ అనే కార్యక్రమం✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️✍️ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భముగా విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఇంటివద్ద యోగా , కుటుంబం తో యోగా అనే అంశంపై ఆన్ లైన్ వెబినార్ ను నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు గారు ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. యోగ మరియు ఆయుర్వేదం అనే రెండు ముఖ్యమైన అంశాలు మన దేశ సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యమైనవి అని అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం గా అలవాటు చేసుకున్నారని అన్నారు. ప్రస్తుతం నెల కొని వున్న పరిస్థితులలో మన సంప్రదాయ పద్ధతులు అయిన యోగ అలాగే ఆయుర్వేదమును అందరు ఆచరించాలని కోరారు. మినిస్ట్రీ అఫ్ ఆయుష్ వారు యోగ మరియు ఆయుర్వేదమును శాస్త్రీయ పద్దతిలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నెలకొనివున్న కోవిద్-19 విపత్కర పరిస్థితులలో ఇలా ఆన్ లైన్ లో కలుసుకోవలసి వచ్చిందని, ఇది ఒకరకంగా బాధాకరమైన అంశమైనా, ఇప్పుడు అందరు నూతనముగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీ ను వినియోగించుకొని సరికొత్త పద్దతిలో కాన్ఫెరెన్సెస్ మరియు వర్కుషాప్స్ నిర్వహించగలుగుతున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరము నుంచి విశ్వవిద్యాలయం యోగ మీద ఒక ప్రత్యేకమైన 3 నెలల సర్టిఫిఫికేట్ కోర్స్ ను ప్రారంబించామని అన్నారు. లాక్ డౌన్ సమయం లో VSU NSS సెల్ వారు చేసిన సేవలను అయన కొనియాడారు. తదనంతరం రాష్ట్ర NSS అధికారి డా. కె. రమేష్ రెడ్డి గారు యోగ యొక్క ప్రాముఖ్యతను విపులంగా వివరించారు. తదనంతరం స్థానిక సర్టిఫైడ్ యోగ ప్రక్షనేర్ శ్రీమతి స్వప్న గారి అంతర్జాతీయ యోగ దిన ప్రోటోకాల్లో వున్న వివిధ రకాల యోగాఆసనాలను ఆన్లైన్లో చేసిచూపించారు. అలాగే నేచర్ థెరపిస్ట్ శ్రీ ఎం వి. ప్రసన్న కుమార్ గారు కోవిద్-19 నిరోదించటంలో నేచురోపతి మరియు యోగ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా అందరికి తెలియ పరచారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి గారు యోగ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ వెబినార్ కు NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం నిర్వాకునిగా , NSS ప్రోగ్రాం అధికారి డా. వై. విజయ, మోడరేటర్ గా మరియు NSS ప్రోగ్రాం అధికారి డా. సుశీల, ముగింపు కార్యక్రమాన్నీ సమన్వయము చేశారు. ఈ వెబినార్ లో విశ్వవిద్యాలయానికి సంబందించిన NSS ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు పిన్సిపల్స్ మరియు NSS వాలంటీర్లు మరియు విద్యార్థులు సుమారు 200ల మంది పాల్గొన్నారు.  

Featured

తడ మండలం లో విషాదం

తడ మండల చేనిగుంట గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు AMC మాజీ చైర్మన్  వేనాటి పరందామరెడ్డి గారు అనారోగ్యం కారణంగా ఈరోజు స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారు.

Featured గూడూరు

నీళ్ల కష్టాలు తీరేది ఎప్పుడు?

ఒక పక్క కరోనా భయంతో ,ఇళ్ళ నుండి బయటకు రావద్దు అని చెప్తుంటే మరో పక్క గ్రామాలలో నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … ప్రభుత్వలు ఎన్ని మారిన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అంటున్న గ్రామ ప్రజలు… వివరాలలోకెలితే నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో గత 20 సంవత్సరల నుంచి ప్రభుత్వలు ఎన్ని మారిన నీళ్ళ కష్టాలు మాత్రం తీరడం లేదు … గతవారం రోజులుగా మంచినీళ్లు లేక గ్రామంలోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇక్కడ నీళ్లట్యాంకర్లు తొలి కొంతమంది డబ్బులు సంపదించుకుంటున్నారు, ఈ గ్రామంలో ఒక ప్రజా ప్రతినిధి ఉండడం గమనార్హం,కాని అధికారులు పట్టించుకోనేవాళ్లు ఎవరు లేరు.ఇకనైన ఎవరైన అధికారులు స్పందిస్తారని వాళ్లు వేడుకుంటున్నారు

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

న్యాయశాస్త్రానికే వన్నె తెచ్చిన గూడూరు వాసి పునుగు సిరి ‘కంఠం’

                                                గూడూరు కోర్టుహాలు ముందు జనం గుమిగూడి ఆత్రుతతో ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. అక్కడున్న అందరిలో గుసగుసలు ఒకవైపు వెంకటగిరి జమీందార్లు, ఇంకొకవైపు సామాన్య రైతులు. పొలం పుట్ర పనులు చేసుకోకుండా ఎందుకయ్యా ఈ కేసులు జమిందార్లకు ఎదురొడ్డి గెలుస్తారా ? అంటూ కొంతమంది హితబోధలు. పాపం రైతుల ముఖాల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళ లాయరు ఇంకా రాలేదు వస్తాడో రాడో అంటూ రైతులకు దెప్పిపొడుపులు. ఇంతలో ఎదురుగా డొక్కు సైకిల్లో పాత సాంప్రదాయానికి గుర్తుగా లాయర్ రానే వచ్చాడు. నేరుగా రైతుల దగ్గరికివచ్చి చిన్నపాటి పలకరింపు, ఏమి కాదు నేనున్నానంటూ అభయ మిచ్చి అందరికి అభివాదం చేశారు. అక్కడున్న చిన్నా చితక న్యాయవాదులందరు లేచి నిలబడి ఆయనకు సలాములు చేశారు. భక్తి భావంతో స్వాగతం చెప్పారు. సదరు రైతుల న్యాయవాది సామాన్యవ్యక్తిలా ఒక్కడే నడుచుకొంటూ కోర్టు హాల్లోకి వెళ్ళాడు. చేతిలో కాగితాలు లేవు, జూనియర్ల హడావుడి లేదు, చుట్టూ మంది మార్బలం లేదు, ఆయనొచ్చిన విషయం జడ్జి గారికి తెలిసినట్లుంది. ఆయన కూడా వచ్చారు. వాదోపవాదనలు అంతకుముందే జరిగిపోయాయి కనుక జడ్జిమెంట్ సమయం రానేవచ్చింది. ఆఖరికి కేసు రైతుల పక్షం నిలిచింది. జమీందార్లు ఓడిపోయారు. బయట జయ జయధ్వానాలు పెక్కుటిల్లాయి. రైతులు గెలవరు అనుకొన్న వారు కూడా ఆయనకు అభివాదం చేశారు. రైతుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసిన వ్యక్తి మరెవరో కాదు ఎస్టేట్ లాండ్ ఆక్ట్, హిందూ లా లో అపార ప్రజ్ఞావంతుడుగా పేరుపొందిన శ్రీ పునుగు శ్రీకంఠం. ఇప్పటి తరానికి తెలియని ఈయన గూడూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా, ప్రభుత్వ న్యాయవాదిగా, రైతుల పక్షపాతిగా అనేక కేసులను విజయవంతంగా గెలిచి, నిస్పక్షపాతంగా సేవచేసిన వ్యక్తిగా చరిత్రపుటల్లో ఎక్కడో మరుగున పడిపోయారు.                                     పునుగు శ్రీకంఠం వావిళ్ళ వారి త్రిలిజ్ఞ పత్రికా సంపాదకులు అయిన పునుగు సీతారామ శాస్త్రి గారి కుమారులు, మద్రాసు ప్రెసిడెన్సీకాలేజీ పండితులైన చదలవాడ సీతారామశాస్త్రి దౌహిత్రులు. తన చిన్నతనం నుంచి అల్లాడి మహాదేవశాస్త్రి, వేదం వెంకటరాయశాస్త్రులతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. దీంతో సహజంగానే శ్రీకంఠం పాండిత్యప్రతిభకు గురువుల చనువు నగిషీలు దిద్దినట్టయింది. మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి మెళకువలను వంటబట్టించుకొన్నారు.న్యాయవాదిగా శ్రీకంఠంకు ఎదురులేకుండా పోయింది. శ్రీకంఠం వాదిస్తుంటే న్యాయశాస్త్రంలో తలపండిన వారు, మద్రాస్ అడ్వకేట్ జనరల్, భారత రాజ్యాంగ రూపకర్తలలో ఒకరైన అల్లాడి కృష్ణస్వామయ్య లాంటి మహామహులు, కొమ్ములు తిరిగిన న్యాయవాదులు సైతం భయపడేవారు. న్యాయశాస్త్రంపై పూర్తి పట్టుండటంతో శ్రీకంఠంగారు తాను అనుకున్నదే, జరుగుతుండటంతో జడ్జీలు సైతం ఆయనతో ఏకీభవించేవారు. ఎలాగైనా శ్రీకంఠాన్ని కోర్టుకు రానీయకుండా ఖర్చులకు డబ్బులిచ్చి ఎక్కడికైనా పంపించి వాయిదా తీసుకోండని ఇతర లాయర్లు జూనియర్లకు చెప్పేవారు. శ్రీకంఠం వాయిదాకు రాలేదంటే గండం గడిచినట్టు భావించేవారు. అంతటి ప్రజ్ఞాశాలి వీరు. అందరిలాగా వీరికి ప్రిపరేషన్ ఉండేది కాదు. అంతా బుర్రలో ఉండేది. కేసు డైరీలు రాసేవారు కాదు. ఒకసారి ఫైలు చూశారంటే అన్నివిషయాలు పిన్ టు పిన్ గుర్తుపెట్టుకునేవారు. అంతటి జ్ఞాపకశక్తి వారిది. వీరు గెలిచిన కేసులకు వేరే న్యాయవాదులు అయితే వేలల్లో తీసుకొనేవారు. వీరు మాత్రం 1 రూపాయనుంచి 5 లేదా పది రూపాయలు తీసుకొనేవారు. మహా అయితే వంద అంతకంటే ఎక్కువ తీసుకొనేవారు కాదు. అందుకే మిగతా లాయర్లు వట్టి వెర్రివాడు శ్రీకంఠం అనేవారు. భారత న్యాయ శాస్త్రాన్ని తన తల్లిలా భావించే గొప్ప గుణం వీరిది. నేను వ్యాపారం చేయడానికి కోర్టుకు రావడంలేదని చెప్పేవారు. ఇలా న్యాయశాస్త్రాన్ని మనసా, వాచా, కర్మణా తల్లిలాగ భావించే వారు అత్యంత అరుదుగా ఉంటారు.శ్రీకంఠం పేదల పక్షం వైపు, అందులోను రైతుల పట్ల సానుభూతి కలిగి ఉండేవారు. రైతులకు వ్యతిరేకంగా, జమిందార్లచే బనాయించబడ్డ కేసులే ఎక్కువగా వచ్చేయి. అన్నికేసులను ఒక్కరే చాలా సునాయాసంగా నిర్వహించేవారు. జమీందార్లు, శ్రీకంఠం దగ్గరకు రైతులు వెళ్లకుండా భయపెట్టడమో, ఆశ చూపించి రాజీ చేసుకోవడమో చేసేవారట. ఇంతలా జమీందారులు భయపడేవారు. శ్రీకంఠం గురించి ఒక జమీందారు ‘మహాసముద్రం చెరువు మీదపడితే చెరువు కొట్టుకొని పోతుంది. అలా శ్రీకంఠంగారు సంస్థానాల మీద పడితే అవి కూడా చెరువులమాదిరి కొట్టుకుపోయేటివి’ అని అన్నాడు. అంతటి ప్రతిభ పాటవం శ్రీకంఠం గారిది.                                       నెల్లూరు జిల్లా జమీన్ రైతు ఉద్యమాన్నిసమర్ధించి ఒక లాయర్గా చాలా సేవచేశారు. న్యాయవాదిగా కాకుండా సాహిత్యంలోనూ వీరికి ప్రవేశముంది. సంస్కృతాంగ్లములో మంచి పట్టుకలవారు కావడంతో సూటిగా అనర్గళంగా, మనసుకు హత్తుకొనే విధంగా మాట్లాడేవారు. రామాయణ మహాభారత ఉపన్యాసాలలో అందెవేసిన చేయి వీరిది. విక్రమసింహపురి మండల సర్వస్వమున నెల్లూరు జిల్లా సంస్థానాలు అనే వ్యాసం రాశారు. వివిధ పత్రికల్లో జమీందారీ పాలనలో రైతుల సమస్యలు, చట్టాల తీరుపై అనేక వ్యాసాలు రాశారు. భావవ్యక్తీకరణ సజీవంగా, భాషశైలి సరళంగా ఉంటూ పామరులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉండేది. ఉత్తముడుగా, ఉదాత్తుడుగా, అమాయకుడుగా, మనసున్నవ్యక్తిగా పేరు గడించినా, సంపాదనలో మాత్రం వెనుకబడిపోయారు. 1963 లో వ్యాధిగ్రస్తులై తాను ఎంతగానో ప్రేమించే గూడూరులో మరణించారు. వీరి ఇద్దరి కుమారుల్లో ఒకరైన అనంతరామన్ వైజాగ్ లో ఉంటున్నారు. రెండవ కుమారుడు రాయలు గూడూరు ఎస్కెఆర్ ప్రభుత్వ కాలేజీలో టైపిస్టుగా పనిచేస్తూ అవివాహితులుగా మరణించారు.ప్రతిభావంతులందరూ ప్రయోజకులు కాలేరు. ప్రయోజకులందరూ ప్రతిభావంతులు కాలేరు. ప్రయోజకుడుగా రాణించలేకపోయిన ప్రతిభాసంపన్నులైన లాయరు శ్రీకంఠం. శ్రీకంఠంగారి వంటినిండా మెదడే. మెదడు నిండా ‘లా’ యే అని రాసిన జమీన్ రైతు పత్రిక మాటలు అతిశయోక్తికాదనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఆంధ్రప్రదేశ్

చెవిరెడ్డి కి సీఎం అభినందనలు * రాజ్యసభ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర

  తిరుపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విప్,చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళిక బద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి చెవిరెడ్డి కృషి చేశారని, కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 గా ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపధ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యే లందరిని పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా చెవిరెడ్డి చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా ఎమ్మెల్యేలను సమన్వయ పరచడం, నలుగురు అభ్యర్థులకు సమకాలీన ఓట్లు రావడం, వారి ఘన విజయానికి చెవిరెడ్డి కృషి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి చెవిరెడ్డిని అభినందించారు.

Featured తూర్పు గోదావరి

వాలెంటర్ వేధిస్తున్నాడని మహిళా ఆరోపణ.

అనపర్తి ( పున్నమి విలేకరి) :- అనపర్తి మండలంలోని కొప్పవరం గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న వ్యక్తి వేధిస్తున్నాడని వివాహిత మహిళ ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాల ప్రకారం తన భర్త వ్యాపారం నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లడంతో మండలం లోని కొప్ప వరం గ్రామం లో తన తల్లిదండ్రులు ఇంటివద్ద ఉంటున్నానని, అయితే తమ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు గొలుగూరి దుర్గారెడ్డి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడని, అతను నన్ను అక్క అని పిలుస్తూ మా ఇంట్లో సన్నిహితంగా ఉండేవాడిని, క్రమేపీ అతని మనసులో చెడు ఆలోచనలు కలిగి వరసా వాయ లేకుండా నన్ను లొంగ దీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడని, నేను వ్యతిరేకించడంతో నాపై కక్ష కట్టి ఫేస్ బుక్ లో నా పేరున ఫేక్ ఐడిని సృష్టించి నావి, నా కుటుంబముతో ఉన్న అనేక ఫోటోలను అప్లోడ్ చేసి వేధిస్తున్నాడని, ఈ వ్యవహారంపై నేను అనపర్తి పోలీసులను ఆశ్రయించడంతో కొప్పవరం గ్రామ పెద్దలు రాజీ కుదుర్చారని, ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయకపోతే అరెస్ట్ చేస్తానని అతన్ని పోలీసులు కూడా హెచ్చరించారని, ఈ వ్యవహారము జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతను ఫేస్ బుక్ లో ఫోటోలు డిలీట్ చేయలేదని, ఎందుకు డిలీట్ చేయలేదని అతని నిలదీస్తే నన్ను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఆమెను తల్లిదండ్రుల ఇంటికి పంపించడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సదరు వాలంటరీ ఇంటివద్ద ధర్నాకు దిగింది. పోలీసులు గ్రామ పెద్దలు నాకు న్యాయం చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని కన్నీటితో విలపిస్తుంది. వాలంటీరుగా పని చేస్తూ ఉన్నతమైన స్థానంలో ఉంది ఇటువంటి అసభ్యకరమైన వ్యవహారం చేయడం మంచిది కాదని ప్రజలు అనుకుంటున్నా రు.

Featured ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

కరోనా పట్ల ప్రజల్లో అవగాహన ముఖ్యం – డి.యస్.పి.షేక్ మాసుం భాషా

￰తూర్పుగోదావరిజిల్లా ,అమలాపురం కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉండడంతో ప్రజల్లో వైరస్ పట్ల అవగాహన కల్పించే దిశగా అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ భాష మరియు అధికారులు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా అమలాపురం పట్టణ సి.ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కరోన వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.మాస్కులు తప్పని సరిగా ధరించాలని లేనియెడల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.పట్టణం లోని ప్రధాన కూడళ్లలో ఎస్ఐ శ్రీనివాస్, శివ ప్రసాద్, ఏసుబాబు లు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి కరోనా వైరస్ గురించి దాని వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు.బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి సెంటర్లో అమలాపురం రూరల్ ఎస్.ఐ రాజేష్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.మాస్కులు లేకుండా సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. షాపుల వద్ద జనాలు గుమిగూడి ఉండరాదని, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

Featured

ఇసుకాసురుల ఇంద్రజాలం చూసి అవాక్కైన మంత్రి…

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం : ఇసుక సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది.ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్నా రోజుల తరబడి ఎదురుచూపులు అయినా కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది.బుక్ చేసిన ఇసుక వచ్చినా కూడా పనికిరాని మట్టితో కూడిన తువ్వ ఇసుక వస్తుండడంతో ప్రజలు అవాక్కయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే తాజాగా సాక్షాత్తు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కే ఈ చేదు అనుభవం ఎదురైంది.రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ భట్నవిల్లిలో నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నారు. ఆన్లైన్ లో ఆయన నాలుగు లారీలు ఇసుక బుక్ చేసుకున్నారు. మట్టి తో కూడిన తువ్వ ఇసుకను తెచ్చి సైట్లో దింపేశారు. సైట్ ఇంచార్జ్ అల్లాడ వెంకటరమణ దీనిని గుర్తించి మంత్రి విశ్వరూప్ కు ఫిర్యాదు చేశారు. నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య మానవుని పరిస్థితి ఏమిటని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే జిల్లా కలెక్టర్ కు విషయాన్ని వివరించారు.ఈ విషయం పై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వెంటనే అమలాపురం ఆర్టీవో భవానీ శంకర్ భట్నవిల్లి సైట్ లోకి వెళ్ళి ఇసుకను పరిశీలించారు. తువ్వ ఇసుకను చూసి ఆర్. డి. ఓ.అవాక్కయ్యారు విషయాన్ని కలెక్టర్ కు వివరించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అతి దగ్గరలో ఉన్న రాంపుల నుంచి ప్రజలకు ఇసుక అందించాలని అది నాణ్యమైన ఇసుక అయ్యి ఉండాలని మంత్రి అధికారులును ఆదేశించారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వినతి పత్రం.

ఆర్యా. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరొకటి కాదు. ఓ వైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు, భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వైద్యులు ఈ కరోనా వైరస్ బారి నుండి పిల్లలను, వృద్ధులను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బయట తిరగకుండా చూడడం, ఇంట్లోనే ఉంటున్నా శానిటైజర్ లతో మోచేతుల దాకా చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం, తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చిన వారికి తల స్నానం చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలి.పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలి. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సులు, అవగాహన తరగతుల నిర్వహణ పేరుతో ఉపాధ్యాయులను పిల్లలను పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించింది. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఓవైపున రోజు రోజుకు కరోనా విజృంభిస్తూ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ మరణ మృదంగాలు మోగిస్తుంది. తుఫాన్ వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా పంజా విసిరితూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతుంది. అందుకే ప్రమాదకరమైన ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలే కాకుండా ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంకా అనేక ఎంట్రన్స్ పరీక్షలను కూడా రద్దు చేశాయి. ఈ విద్యా సంవత్సరంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల మరియు పిల్లల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ, తమిళనాడు, ఒడిసా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక కోరుతున్నది. పిల్లలు సాధించిన అంతర్గత మార్కులు, హాజరు ప్రాతిపదికగా ప్రభుత్వమే పదవ తరగతి ఫలితాలు ప్రకటించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, పిల్లలను సంరక్షించుకునేందుకు రాష్ట్రంలో బ్రిడ్జి కోర్సులు, ఇతర అన్ని రకాల పరీక్షలను కూడా రద్దు చేసి ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కోరుతుందికుప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ కోరుతుంది.

Featured

రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్

తూర్పుగోదావరిజిల్లా , అమలాపురం రాజమండ్రి ఓ.ఎన్.జీ.సి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదేశ్ కుమార్ గురువారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి చింతా.అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం ఈ.డి అల్లవరం మండలం మొగళ్ళమూరు లోని ఎం.పి స్వగృహంలో ఎం.పి.అనురాధను కలిశారు.ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు నూతన ఈ.డి కి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఈ.డి తో పాటు హెచ్.ఆర్ జీ.ఎం దినేష్ జైన్ ,సీజిఎమ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.