Sunday, 24 May 2026

Blog

Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన:కాకాణి

25-06-2020మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కాగితాలపూరు, లక్ష్మీ నరసింహపురం గ్రామాలలో పర్యటించి, ₹3కోట్ల 25 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు . ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఆ తర్వాత కరోనా కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించలేకపోయాము. ప్రస్తుతం గ్రామాల్లో పూర్తి చేసిన పనులను ప్రారంభిస్తూ, గ్రామస్థులకు అవసరమైన పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టి, పూర్తి చేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గతంలో సంక్షేమ పథకాలలో అర్హులైన వారిని పక్కనపెట్టి, జన్మభూమి కమిటీల సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తెలుగుదేశం పాలనలో జిల్లా కలెక్టర్ సైతం జన్మభూమి కమిటీలను కాదని ఏమి చేయలేని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకు చేర్చే వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకొని అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే, చంద్రబాబు దానితో కుల రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజ్యాంగానికి అతీతుడు కాదు, తప్పు చేస్తే చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా జైలుకు వెళ్లాల్సిందే!. ఆంధ్ర రాష్టాన్ని అప్పుల ఊబిలో ముంచి, అవినీతికి పాల్పడి, అగాదంలోకి నెట్టిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి!. అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల పంపిణీని కొందరు అడ్డుకుంటున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత నాది. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా అసెంబ్లీలో NRC పై తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నాను. నిరుపేద లందరికీ ఇళ్ళు ఇప్పిస్తా నని ఎమ్మెల్యే కాకాణి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రంగుల వలన ఎవరికైనా నష్టం జరిగిందా అని ప్రశ్నించారు చంద్రబాబు నీఛరాజకీయాలు చేస్తున్నాడన్నాడు ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన ఘనత టీడీపీ దేనన్నారు. అభివృద్ధి లో తండ్రి ఒకడుగువేస్తే జగన్మోహన్ రెడ్డి రెండుఅడుగులు వేశారన్నారు చల్లాయానాదులకు ముందుగా ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ళునిర్మించి ఇస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచాక అభివృద్ధి అజెండా గా పని చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సమస్యలపై ఒక్క అర్జీకూడా రాకుండా చేస్తామన్నారు. 15సంవత్సరాల అభివృద్ధి చేసిచూపుతామని తెలిపారు. కాగితాలపూరు నాయకులు రాజా, రవి, ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎల్ఎన్ పురంలో ఎంపిటిసి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మేళతాళాలు శాలువా లతో ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు,వివిధ శాఖల అధికారులు వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Featured

వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోంది – మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి):వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు సరైంది కాదన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే మూర్ఖత్వంతో ముందుకెల్తుదన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తున్నామనే ఆలోచన లేకపోవడం భాధాకరం అన్నారు. కక్షపూరిత, అణచివేత, బెదిరించే దోరణిని వీడాలన్నారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలిని అలాగే అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలిని ఆయన డిమాండ్ చేశారు.

Featured

గుంతల రోడ్డు బాగు చేయండి

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది. రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. సుమారు 22 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి వల్ల గుంతలమయంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Featured

తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

పలమనేరు,జూన్25,2020(పున్నమి విలేకరి): ఆశావర్కర్ల ఆల్ ఇండియా డిమాండ్స్ డే ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ… ఆశాలను రెగ్యులరైజ్ చేసి,చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కోవిడ్ డ్యూటీ లో ఉన్న ఆశా లకు నెలకు ప్రత్యేక అలవెన్సు రూ.10000 ఇవ్వాలని, భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు వర్తింపజేయాలని,3సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న యూనిఫామ్స్ వెంటనే అందచేయాలన్నారు.రక్షణ చర్యలు చేపట్టకుండా రోగులను ఆసుపత్రికి చెకప్ ల కోసం తీసుకురావాలని ఒత్తిడి చేవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశా డివిజన్ కార్యదర్శి సావిత్రి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఆశాలు సలోమీ,పద్మ,కైరున్నిసా,గీత లతో పాటు మండలం లోని ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

చంద్ర‌బాబు పాచిక పారేనా ?

చంద్ర‌బాబు పాచిక పారేనా ? టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ కాషాయంవైపు చూస్తున్నారా ? మోడీతో చెలిమి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా ? అందుకే ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారా ? ప‌రిణామాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీపై ఒంటి కాలుపై లేచిన చంద్రబాబు ఇప్పుడు నెమ్మదించారు. అధికారంలో లేరు. ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది నాయ‌కులు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి స్కెచ్ తో ముందుకెళ్తే బలపడవచ్చనే దానిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. 151 సీట్ల మెజార్టీతో బ‌ల‌మైన స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జ‌గ‌న్ జెట్ స్పీడుతో ముందుకెళుతున్నారు. అభివృద్ది సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు ప్ర‌భుత్వంపై కౌంటర్ లు కూడా వేయలేని స్థితికి తీసుకొచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఆరు నెల‌ల పాల‌న అనంత‌రం విమ‌ర్శ‌లుగానీ, ఆరోప‌ణ‌లుగానీ చేస్తామ‌న్న చంద్ర‌బాబు, ‌వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 3నెలలకే విమర్శలు మొదలుపెట్టారు. అయినా అధికార‌పార్టీని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్కువగా గెలవడం.. గెలిచినవారు కూడా ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం, ఇత‌ర పార్టీల‌కు జంప్ చేయ‌డంతో చంద్ర‌బాబు మ‌రింత కుంగిపోతున్నారు. ఇక టీడీపీ నేత‌లపై కేసులు న‌మోదు కావ‌డం, అరెస్టులు జ‌ర‌గ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు. ఒక‌వైపు పార్టీ ఏమైపోతుంది అన్న టెన్ష‌న్ వుంటే మరోవైపు ఏడాది కాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో సీఎం జగన్ పడడంతో ఎన్నడూ చూడని రాజకీయ విచిత్రాల‌ను చంద్ర‌బాబు తొలిసారి చ‌విచూస్తున్నారు. ఇంకోవైపు కరోనా ప్ర‌బ‌లిపోతుండ‌డంతో గ‌తంలోలాగా జనంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టాలంటే త‌న ఒక్క‌డితో సాధ్య‌మ‌య్యే ప‌నికాదన్న విష‌యాన్ని గ్ర‌హించారు. ఈ త‌రుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడు తనకు మోడీతో వ్యక్తిగత విబేధాలు లేవని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే పోరాటం చేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ స‌ర్కార్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే బీజేపీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రానికి అన్యాయం చేస్తుందోంటూ బీజేపీ ప్ర‌భుత్వంపైన ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు, అంత‌టితో ఆగ‌కుండా ఏకంగా మోడీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని మోడీతో దోస్తీకి సై అంటూ సంకేతాలిస్తున్నారు. అయినా అటువైపు నుంచి స‌మాధానం రావ‌డం లేదు స‌రిక‌దా బాబుని క‌న్నెత్తైనా చూడ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. సుజనా చౌదరి, సీఎం ర‌మేష్‌, కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే. అయితే వీరి ద్వారా రాయ‌బారం న‌డుపుతారా ? అలా అనుకున్నా చంద్ర‌బాబు గురించి నేరుగా మోడీతో మాట్లాడేందుకు సాహ‌సిస్తారా ? అనేది ప్ర‌శ్నార్ధకం. ఎన్నిక‌ల ముందు మోడీతో సున్నం పెట్టుకున్న చంద్ర‌బాబుకు, ఇప్పుడు ఆయ‌న‌ను ఎలా ప్ర‌స‌న్నం చేసుకోవాలో మాత్రం బోధ‌ప‌డ‌డం లేదు. ఇక‌ ఎప్ప‌టినుంచో ఏపీలో ఒంట‌రిగా ఎద‌గాల‌ని బీజేపీ క‌ల‌లు కంటూ వ‌స్తోంది. ఇప్పుడు టీడీపీ హ‌వా త‌గ్గ‌డం, మ‌రో బ‌ల‌మైన పార్టీ లేక‌పోవ‌డంతో త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతోంది. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీతో బీజేపీ చెలిమి చేసే అవ‌కాశ‌ముందా ? అస‌లు అంత అవ‌స‌రం వుందా ? అందులోనూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మోడీని దూషించిన చంద్ర‌బాబుతో దోస్తీ చేసేందుకు ముందుకొస్తుందా ? అన్న‌ది అనుమాన‌మే. అయినా చంద్ర‌బాబు ప్ర‌స్తుతం అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీతో స‌ఖ్య‌త‌తో ఉంటే భ‌విష్య‌త్తులోనైనా స‌త్ఫ‌లితాలిస్తాయ‌నే భావ‌న‌లో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలన్నా, జ‌గ‌న్ దూకుడుకు క‌ళ్ళెం వేయాల‌న్నా క‌మలంతో జ‌ట్టు క‌ట్ట‌క త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు అదే ఆలోచ‌న‌తోనే ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌లికాలంలో ప్ర‌ధానిపై ప్ర‌శంస‌లు కురిపించ‌డ‌మే. అయితే మోడీ ఏమీ చంద్రబాబుకి చుట్టం కాదు, ఏది చెప్పినా వినేయ‌డానికి, న‌మ్మేయ‌డానికి. రాజకీయాలలో ద్వంద్వ వైఖరితో చ‌క్రం తిప్ప‌డంలో, ఎప్పటికప్పుడు నాలుక మడత వేయ‌డంలో దిట్టగా పేరొందిన చంద్ర‌బాబు… మోడీ ముందు వేస్తున్న స్నేహ‌ పాచిక పారేనా ? అది జ‌రిగే ప‌నేనా ?

Featured

వైకాపా ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక గుర్తింపు

పలమనేరు, జూన్23,2020 (పున్నమి విలేకరి): వైకాపా ప్రభుత్వం హయాంలోనే కాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక గుర్తింపు అందుతుందని రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ రాష్ట్ర బడ్జెట్లో రూ2847 కోట్లును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ , చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే సత్తా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం రూ15000వేల చొప్పున ఐదేళ్ళు లబ్దిదారులకు అందజేయడం జరుగుతున్న దన్నారు . వైయస్సార్ కాపు నేస్తం పథకం 45-60 ఏళ్ళు మధ్య వయసున్న మహిళల కాపు, బలిజ, తెలగ ఉప కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సుదర్శన్ రాయల్,ఆకులు గజేంద్ర, జింక చలపతి,పలమనేరు బలిజ సంఘం అధ్యక్షుడు పి జె సి బాబు, ఏ సి బాబు, దైవ ప్రసాద్, కిరణ్, బాల గురునాథ్, నరేష్,హరీష్,రవి తదితరులు పాల్గొన్నారు.

Featured

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలోని జిలానీ సర్కిల్ నుండి గాంధీనగర్ వరకు నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేగౌడ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ… సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబడిన బీటీ రోడ్డును 14వ ఆర్ధిక సంఘం నిధులు ద్వారా వేయడం జరిగిందన్నారు.అనంతరం గాంధీ నగర్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి, పలమనేరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, నాయజ్,హైదర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

పలమనేరు, జూన్23,2020(పున్నమి విలేకరి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్న చేదోడు పథకం క్రింద ఆర్థిక లబ్ధి చేకూర్చన సందర్భంగా మంగళవారం పలమనేరు పట్టణంలోని జిలాని కూడలిలో వైఎస్సార్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి చేసిన పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రజా సంకల్ప యాత్ర సమయంలో టైలర్ లు, రజకులు, నాయిబ్రాహ్మణులను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారుల ఖాతాలో రూ 10 వేలు జమచేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి కొందరు అర్హులు కాలేకపోయారు.అర్హులు మరల దరఖాస్తు చేసుకోవడానికి 10 రోజులు సమయం పొడిగించారని తద్వార అందరూ ధరఖాస్తు చెసుకోవలన్నారు. నాయి బ్రాహ్మణలు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో చేదోడు పథకం ద్వారా 10వేల ఆర్థిక సహాయం అందించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద, వైసీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధ, హేమంత్ రెడ్డి, మురళీకృష్ణ, నగరాజ, ప్రసాద్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Featured

రైతుల ఆత్మహత్యా యత్నం

*రైతుల ఆత్మహత్యా యత్నం* *జగనన్న న్యాయం చేయక పోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని నినాదాలు* తడ మండలం తడ హరిజన వాడలో రైతులు చిన్నపిల్లలు సైతం పెట్రోల్ బాటిల్ చేతపట్టుకొని మేము పండించే భూములు జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపడుతున్నారు రైతులను కాపాడాల్సిన ప్రభుత్వమే రైతుల కడుపు కొట్టడం న్యాయమేనా అని ఆందోళన చేస్తున్న రైతు కుటుంబాలు 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి భూమిని ఇంటి పట్టాల కొరకు ఇవ్వాలి అని అనుకుంటే మా గ్రామం చుట్టూ ప్రభుత్వ భూములు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమిని ఇవ్వచ్చు కదా మేము సాగు చేసుకుంటూ ఆ భూమిపై బ్రతుకుతున్న మా దగ్గర నుంచి లాక్కోవడం ఎంతవరకు న్యాయమంటున్న రైతులు వెంటనే రైతుల ఇబ్బందులను తెలుసుకొని కలెక్టర్ గారూ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మండల తాసిల్దారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వవలసింది గా కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని గ్రామస్థులు కోరడంమైనది.

Featured తూర్పు గోదావరి

అమలాపురం డివిజన్ లో తొలి కరోనా మరణం

అమలాపురం డివిజన్ లో కరోనా బారిన పడి తొలిసారిగా ఒక వ్యక్తి మరణించడం జరిగిందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుండి అమలాపురం వచ్చి స్థానికంగా ఒక లాడ్జి లో వుండటం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. అయితే అతనికి విపరీతమైన కరోనా లక్షణాలు వుండటంతో అతన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారని అయితే తరలించే క్రమంలో నిన్న సాయంత్రం ఆ వ్యక్తి మరణించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రు నాట్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని దీనితో అతని కుటుంబ సభ్యులకు కూడా ఆర్.టీ.పి.సి.ఆర్. పరీక్షకు శాంపిల్స్ తీసుకుని వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. డివిజన్ లో సంభవించిన కరోనా తొలి మరణాన్ని అతి పెద్ద హెచ్చరిక గా భావించి ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ విచక్షణతో మెలగాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రజలకు కరోనా పై వినూత్నమైన రీతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆర్.డి. ఓ అన్నారు. అధికారులు ఏమిచేసినా ఎంత చెప్పినా ప్రజల ఆరోగ్యం కొరకే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని, కొన్ని రోజులపాటు సరదాలకు,సంతోషాలకు దూరంగా వుండి క్రమశిక్షణ తో మెలగాలని ఆర్.డి. ఓ. విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మనం కరోనా అత్యున్నత స్థాయికి చేరువలో వున్నామనే విషయాన్ని గుర్తించి కరోనా నుండి బయట పడేందుకు అన్ని జాగర్తలు తీసుకోవాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.అత్యవసరం అయితే గాని బయట తిరగవద్దని,మాస్క్ లు లేకుండా అసలే తిరగవద్దని, సామాజిక దూరం పాటించాలని,అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.