Sunday, 24 May 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

సీసీ పుటేజీ లేకుంటే ఉషారాణి ఉద్యోగం ఉడీస్‌…

‌టూరిజం హోటల్‌ ‌దాడి ఘటనలో వెలుగుచూస్తున్న కొత్త దాష్టీకాలు నిధుల వ్యయం పైన ఆరోపణలు నెల్లూరు, జూలై 01, 2020 (పున్నమి ప్రతినిధి) : రాష్ట్రంతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచ లనం…. ప్రజల్లో ఆగ్రహావేశాలు కలి గించిన టూరిజం హోటల్‌లో అడ్మిన్‌ ‌డిప్యూటీమేనేజర్‌ ‌భాస్కర్‌ అక్కడి తాత్కా లిక ఉద్యోగిని ఉషారాణి పై దాడి ఘట నలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సభ్య సమాజం తలదిం చుకునేలా మానవత్వానికి మాయని మచ్చలా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడి అనంతరం మరో దారుణానికి సిద్ధమైనట్లు సమాచారం తెలిసింది. గత నెల 27న మధ్యాహ్నం కార్యాలయంలో ఉషారాణి పై విచక్షణా రహితంగా దాడిచేసిన భాస్కర్‌ను రక్షించేందుకు అక్కడి డివిజన్‌ ‌స్థాయి అధికారులతో పాటు కొందరు సిబ్బంది పథకం రచించినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉషారాణి ఆసుపత్రిలో చికిత్స పొందు చున్న సమయంలో దాడి చేసిన భాస్క ర్‌తో పాటు మరికొందరు మరో దుర్మా ర్గానికి వడికట్టినట్లు బాధితురాలు తెలి పింది. ఈ ఘటన అనంతరం పలువురు ఉద్యోగులు, ఉషారాణికి నైతిక మద్దతు తెలుపుతున్నారన్న సమాచారాన్ని తెలుసు కున్న భాస్కర్‌తో పాటు మరికొందరు శాశ్విత, తాత్కాలిక ఉద్యోగులు కొత్త పథకం రచించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉషారాణి ఆసు పత్రిలో చికిత్స పొందుతుండగా అదే సమయంలో దాడి ఘటన నుంచి తప్పించుకునేందుకు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉషారాణికి వ్యతిరేకంగా ఒక లెటర్‌ ‌సిద్ధం చేయించారట. ఆమె కార్యాలయంలో అందరిని ఇబ్బంది కలిగిస్తుందని, ప్రవర్తన సరిగా లేదని, రెండు పేజీలతో కూడిన ఒక నివేదికను తయారుచేసి అందులో 14 మంది ద్వారా సంత కాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపారట. డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సమయంలోనే హోటల్‌ ‌లోని ఒక వర్గం ఆమెకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సృష్టించా రట. ఒకవైపు అంగవైకల్యం, ఇంకోవైపు దాడిలో గాయపడ్డ ఉషారాణిని కోలుకుని హోటల్‌కు రాకముందే ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఉషారాణి పై దాడి చేసిన సమయంలో సీసీ పుటేజీ బయటకు రాకపోయినట్లయితే ఈపాటికే ఆమె ఉద్యోగాన్ని ఊడగొట్టడమా, లేదా మరో చోటికి బదిలీ చేయడమా జరిగిపోయేదని బాధితురాలు వాపోయింది. అదృష్టవశావత్తు దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో ప్రస్పుటంగా కనిపిస్తుందడడం, అవి మీడియాలో ప్రచారం కావడం, అంతకుముందుగానే బాధితురాలు దర్గామిట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఉషారాణి ఒకవైపు దాడి, మరోవైపు ఉద్యోగ ప్రమాదం నుండి గట్టెక్కినట్లు ఆమె చెబుతోంది. ఉషారాణి పై దాడి జరిగిన రెండు రోజులుగా సీసీ పుటేజీ దృశ్యాలు వెలుగులోకి రాకపోవడంతో దాడిని కప్పిపుచ్చి కొందరు ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేసి ఆమెను హోటల్‌ ‌నుంచి వెళ్లగొట్టాలన్న మానవత్వం లేని దుర్మార్గానికి తెర లేపారట. పలువురు సంతకాలతో భాస్కర్‌, ‌బీవీఎంను ఉషారాణికి వ్యతిరేకంగా పంపిణ నివేదికను రాష్ట్ర స్థాయి అధికారులు నివేదికను పక్కను పెట్టడం వల్ల ఆమె ఉద్యోగ ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతోంది. మొత్తంగా ఘటనను గమనిస్తే అక్కడి అధికారుల దాష్టికం, దౌర్జన్యాలు ఉషారాణి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల పై డివిజన్‌ ‌స్థాయి అధికారులు పెట్టే వేధింపులు భరించలేక గతంలో ఓ యువతి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తాత్కాలిక, శాశ్విత ఉద్యోగుల మధ్య టూరిజం హోటల్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తామంటూ అక్కడి అధికారులు అవుట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల పై భౌతిక, మానసిక దాడులు వత్తిడికి గురిచేస్తున్నట్లు ఉషారాణి ఘటనతో తేటతెల్లమయింది. ఇంకోవైపు అయినదానికి, కానిదానికి అడ్డగోలుగా లెక్కలు చూపి లక్షల్లో టూరిజం సొమ్మును అక్కడి అధికారులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన తాత్కాలిక ఉద్యోగులను తీవ్రమైన బెదిరింపులు, మానసిక వత్తిళ్లకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఇటీవల పోలీసులకు తమ ఆవేదన వెలబుచ్చింది. ఉషారాణి పై దాడినేపథ్యంలో టూరిజం హోటల్‌లో జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాలు, వేధింపులే గాక నిధుల స్వాహా పర్వాల పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనతో ఇటు శాఖాపరమైన పాలనా అంశాల పైనే గాక, నిధుల వ్యయం పైనా దృష్టి సారిస్తే మరిన్ని కఠోర వాస్తవులు వెలుగుచూస్తాయన్న చర్చ అక్కడ జరుగుతుంది.

Featured

మధ్యాహ్నం వరకే దుకాణాలు

పలమనేరు, జూలై 1,2020( పున్నమి విలేకరి): పలమనేరు పట్టణంలో రోజు రోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకే దుకాణాలు నిర్వహించినట్లు పలమనేరు మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి నుంచి జూలై 31 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు .ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి జాగ్రత్త పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారిని భారిన పడకుండా తరిమికొట్టొచ్చున్నారు.ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, రాంబాబు, రాజేష్, సూరి,శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

Featured

సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘనను జయప్రదం చేయండి

పలమనేరు జూలై 1,2020(పున్నమి విలేకరి): కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై 3వ తేదీన దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన జయప్రదం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చారు అందులో భాగంగా బుధవారం స్థానిక బాపూజీ ఉద్యానవనంలో గోడ పత్రికను విడుదల చేశారు. కరోనా మహమ్మారిని అడ్డంపెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మరింత ముమ్మరం చేస్తున్నాయని, ఈ విధానాలను అడుగడుగున వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంకు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వచ్చి జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీపీఎం నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, సుధాకర్, లక్ష్మయ్య సిపిఐ నాయకులు చెన్నకేశవులు, సుబ్రమణ్యం, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు

Featured

జింకను కాపాడిన అటవీశాఖ

పలమనేరు, జులై1,2020(పున్నమి విలేకరి): పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండల కేంద్రం బైపాస్ రోడ్డులో జనరాణ్యం వైపు వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ జింకను బుధువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడిన జింకను స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జింకకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం తిరుపతి వన్యప్రాణి సంరక్షణ కేంద్రనికి తరలించునట్టు అటవీశాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు

Featured

కొత్త పెన్షన్లు పంపిణీ

పలమనేరు, జులై1, 2020 (పున్నిమి విలేకరి ): పలమనేరు మునిసిపాలిటీ 7వ వార్డ్ నందు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం క్రింద కొత్తగా మంజూరైన ఫించనుదారులు గంగరాజులు మరియు చిన్నపాపమ్మకు పంపిణీ చేస్తున్న వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ మురగేష్ మరియు వార్డ్ ఇంచార్జి బిఆర్సి కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి చంద్ర, మల్లికార్జున శెట్టి,కరాటే దేవేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Featured

భారతదేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యం.

30-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం రూరల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గండి.రఘురామయ్య ఆధ్వర్యంలో మండలంలోని చెల్లాయపాళెం పంచాయతీ పరిధిలోని పల్లెపాళెం, హరిజనవాడ, చింతోపులో గల 69 వ బూత్ పరిధిలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రెండవ సారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తరువాత చేసిన పలు అభివృద్ధి పథకాలు, చారిత్రాత్మక నిర్ణయాలు తద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని గూర్చి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.జె.పి మండల ప్రధానకార్యదర్శి గంజం.పెంచల ప్రసాద్, మండల కోశాధికారి పెజ్జాయి.క్రిష్ణారెడ్డి, టౌన్ మాజీ అధ్యక్షుడు కొప్పోలు. మస్తానయ్య గారు, కిసాన్ మోర్చా మండల ప్రధానకార్యదర్శి నెల్లూరు.సుబ్రమణ్యం, బి.జె.పి నాయకులు నిడిగల్లు.శ్రీధర్, 69 వ బూత్ కమిటీ అధ్యక్షుడు కోవూరు. గోపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గూడూరు గంగూలీ ‘కెప్టెన్ సుంకర రామచంద్ర రావు’

                                                          జులై ఒకటి డాక్టర్స్ డే సందర్బంగా డాక్టర్ సుంకర రామచంద్ర రావు పై పున్నమి స్పెషల్ స్టోరీ.. నెల్లూరు జిల్లాలో ప్రజా వైద్యుడుగా, పేదల మనసులో దైవంగా స్థానం పొందిన డాక్టర్ సుంకర రామచంద్ర రావు   రోటరీ క్లబ్ ద్వారా వైద్య సేవలను ప్రజలకు అందించిన వైద్యుడు… వైద్యవృత్తిని పేదలకు అంకితం చేసిన సేవాతత్పరుడు… డబ్బుతో వైద్యం చేసే డాక్టర్లను చూసాం, మోకాలికి తలనొప్పికి ముడిపెట్టి డబ్బు గుంజే డాక్టర్లను చూసాం. కాని డబ్బుతో కాకుండా మనసుతో వైద్యం చేసే డాక్టర్లను మనం ఎన్నడూ చూసి ఉండం . వీరు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి మనసున్న డాక్టరే గూడూరికి చెందిన సుంకర రామచంద్రరావు అలియాస్ గంగూలీ. డబ్బుతో గాకుండా మంచి వాక్కుతో వైద్యం చేయొచ్చని నిరూపించిన ప్రజాబందువు ఈయన. అందుకే ఈయన గురించి నెల్లూరుకు చెందిన సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి ఇలా అన్నారు. బడుగులే నిజమైన బంధువులనియెంచిమించుకూరిమి నాదరించినావు ప్రతిరాత్రి పవలుగా, ప్రతిరోగి బిడ్డగా సేవలో చివికి జీర్ణించినావు కవి గాయకులగన్న కరగుడెందమ్ముతో పిలిచి సన్మానముల్ సలిపినావు వరదలేవచ్చిన కరువులేరెచ్చిన నే నుంటినని ముందు నిలిచినావు మంచితనమున అందరి మనసుదోచి నిండుగా ఏబదేండ్లేని నిండకుండ అరిగితివి, మాదు జోహారు లందుకొనుము రమ్యగుణసాంద్ర! సుంకర రామచంద్ర !! పై కవితలోని ప్రతి వాఖ్యం అక్షర సత్యమన్నట్టు ప్రజారంజకుడిగా పేదల పాలిటి దైవంగా, తన అమృతవాక్కులతో రోగాల్ని నయం చేసే మనసున్న మారాజు డాక్టర్ సుంకర రామచంద్ర రావు. వీరు స్వస్థలం రాజమండ్రి అయిన నెల్లూరు, వెంకటగిరి, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టరుగా మంచి పేరు సంపాదించుకొని, గూడూరులో స్థిరనివాసంతో పాటు ప్రైవేటు ఆసుపత్రిని ఏర్పాటు చేసుకొన్నారు. డబ్బుకన్నా సేవ మిన్నగా తలచి వైద్యో నారాయణో హరి అనే సామెతకు సార్ధకత చేకూర్చారు. గూడూరు ప్రజలతో మమేకం అయ్యి గూడూరు డాక్టరుగా పేరు పొందారు.                                                  డాక్టరు రామచంద్రరావు మొదటగా మిలిటరీలో డాక్టరుగా పనిచేశారు. క్రమశిక్షణతో కూడిన వైద్యం అక్కడే ఆయన అలవర్చుకొన్నారు. మంచి క్రీడాకారుడు కావడం చేత సుంకరకు రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది. ఫుట్ బాల్ గేమ్ లో అసామాన్య నైపుణ్యం వల్ల ఈయనకు గంగూలీ అన్న మారుపేరు వచ్చిందని వారి కుమార్తె లతారావు తెలిపారు. గూడూరు మునిసిపాలిటీకి ఎల్డర్మన్ గా, గూడూరు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా పనిచేస్తూనే రోటరీ పేరుతో రాత్రి ఆస్పత్రిని కేవలం బీదసాదల కోసమే పెట్టి వైద్య సహాయాన్ని అందించారు. పేద ప్రజలు వైద్యం లేకుండా చనిపోవడం తనను కలచి వేస్తుందనేవారు. అందుకే ప్రజలకు మెరుగైన చికిత్సను అందించేవారు. పెద్ద పెద్ద రోగాలు సైతం ఈయన చేతి స్పర్శతో తగ్గేవని పెద్దలు ఇప్పటికి చెపుతుంటారు. మంచి హస్తవాసి కల డాక్టరుగా పేరు పొందారు. డాక్టర్ గారి దగ్గర శిష్యరికం చేసిన వారు కూడా వైద్యులుగా చెలామణి అయిన సందర్భాలు లేకపోలేదు. ఈయన శిష్యుడు క్రొవ్విడి సుబ్రహ్మణ్యం మంచి డాక్టర్ గా గూడూరులో పేరు తెచ్చుకోవడం విశేషం.                                                     రావు గారు వైద్యవృత్తిలో తీరిక లేకున్నా ప్రజలకు ఏదో రకంగా సహాయం చేయాలనే తృష్ణతో గూడూరులో అన్ని సంస్థల్లో, సంఘాల్లో  సభ్యత్వం తీసుకొన్నారు. కార్మిక సంఘాల నుంచి కళాసాహిత్య సంస్థలదాకా అన్నింటిని ముందుండి నడిపించేవారు. నాడు గూడూరులో డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ సి.ఆర్.రెడ్డి, సుంకరల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. స్థానికుడు కానప్పటికి సుంకర రామచంద్రరావు గారి నిరాడంబరత, నిస్వార్ధత, యధార్థవాదం, మూలంగా గూడూరు ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. వీరి స్వచ్ఛమైన సేవాగుణాన్ని చూసి, ఒకప్పటి మైకా కింగ్ అయిన సిద్ధయ్య నాయుడు తన కుమార్తె అనసూయను రామచంద్రరావు తమ్ముడు హనుమంతరావు కిచ్చి పెళ్ళిచేసారు. ఇలా గూడూరు ప్రజలతో సంబంధ భాంధవ్యాలను ఏర్పరచుకొని గూడూరుపై తనకు గల అభిమానాన్ని చాటుకొన్నారు. యస్.ఆర్. అనే బ్రాండ్ నేమ్ తో పాపులర్ అయ్యారు. ఇలా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని 1970 లో హఠాత్తుగా హృద్రోగంతో మరణించారు. సుంకర గారి అకాల మరణానికి నాడు గూడూరు పట్టణం మొత్తం తల్లడిల్లిపోయింది. ఆరోజుల్లో గూడూరు టౌన్ లో మొత్తం 20 వేలమంది జనాభా ఉంటే దాదాపు 15 వేల మంది వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారని జమీన్ రైతు పత్రిక వ్యాఖ్యానించింది. పురవీధులగుండా ఆయన భౌతికకాయం ఉత్సవంగా తీసుకోయే సమయంలో వీధులన్నీ కిక్కిరిసి, పూలతో అడుగుమేరకు నిలిచి, వాటిని మున్సిపాలిటీ వారు తొలగించడానికి వారం పట్టిందట. గూడూరులోని అంగళ్ళు, సంస్థలు, మైకా కంపెనీలు, మైకా మైన్లు, రవాణా సంస్థలు అన్ని మూసివేసి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ అయన అంత్యక్రియల్లో పాల్గొనడం డాక్టర్ గారి మంచితనానికి, నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. బహుశా గూడూరులో ఈ స్థాయి పేరు ప్రఖ్యాతులు, అభిమానాలను, గౌరవాన్ని సంపాదించుకొన్న వ్యక్తి మరొకరు లేరు. చనిపోయేనాటికి ఈయన వయస్సు 54 సంవత్సరాలు. వీరి భార్య సుంకర మణియమ్మ కవయిత్రిగా ప్రసిద్ధి చెందారు. రావు గారికి 5 మంది కుమారులు, 3 కుమార్తెలు. ఆయనకు నివాళులర్పిస్తూ ముదివర్తి కొండమాచార్యులు.. మనసునందు కర్ణములందు మాటలందు వితరణమునందు సదసద్వివేక మందు ‘దోస్తు’ సుంకర రామచంద్రునకు జోడులేడు లేదింకా భువి కానరాదు రాడు … ఇలా అందరి మనసులో మరువలేని లేని జ్ఞాపకంగా మిగిలి, కాలగర్భంలో కలిసిపోయారు. రామచంద్ర రావు గారి సంతాప సభలో వారి కుటుంబీకులు, గూడూరు పెద్దలు, డబ్బున్న మహారాజులు యస్.ఆర్. ఆస్పత్రిని డాక్టర్ గారి స్మృతి చిహ్నంగా చేయాలని కమిటీని కూడా వేశారు. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సెలవిచ్చారు. ఆ తర్వాత ఎదో సామెత చెప్పినట్టు …. జాతర ముగిసింది. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కాల చక్రంలో అన్ని మరుగున పడిపోయాయి. తన తరువాత కూడా యస్.ఆర్. హాస్పిటల్ కొనసాగాలని ‘పేదలు వైద్యలేమితో బాధపడకూడదు అన్న సుంకర రామచంద్ర రావు గారి కల కలగానే మిగిలిపోయింది’. Doctor’s day was celebrated recently in June. This day reminds us of some of the stalwarts who remained as noble as their profession. One such stalwart who stood strong in his times was Dr.Sunkara Ramachandra Rao alias Ganguly (1916-1970 ). It’s important to pay tribute to this staunch committed person at a time when medicine has become a commodity which can earn maximum profit at the cost of human lives. It is rare to see doctors of his stature in the present times. He treated patients with compassion, love and respect, not through money. While describing about this legendary personality, poet Mallemala Sundararamaiah from Nellore, popularly known as ‘sahaja kavi’ wrote “ Treated the downtrodden as your own relatives, every night was day for you, every patient was a child to you, you dedicated yourself to serve the needy, you felicitated and promoted artists, droughts or floods you stood and served first, instilled strength and confidence, you conquered everyone’s hearts with humility and humanity, but you left us too early. Accept our salutes oh beautiful soul, Sunkara Ramachandra” Every single word written in this poem about Dr Sunkara Ramachandrarao (SR) was so true; he gained respect from the downtrodden not only for the treatment but also for his empathetic conversations. Though he hails from Rajahmundry, he worked as a doctor in government hospitals in Venkatagiri, Nellore, and in Gudur. He had his own clinic which brought him much closer to the various sections of people from the town. Dr Rao initially worked in the military. In this profession with utmost commitment and discipline. He was a good sportsman too and was the vice-president for state level football association.Their daughter Lata Rao said that he got the nickname Ganguly because of his extraordinary skill in the game of football. He was also quite active in cultural events, was president for Gudur rotary club, ‘elder man’ for Gudur municipality and became member in numerous

Featured

భారీవర్షం నేలకూలిన చెట్టు

పలమనేరు,30,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని రాత్రి కురిసిన ఈదురు గాలులతో వర్షం కురియడం వల్ల బైరెడ్డిపల్లి – పుంగనూరుకు వెళ్లే రహదారిలో హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి చింత చెట్టు నేల వాలినది. రాత్రి నుండి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.వాహన దారులకు చాల ఇబ్బంది కరంగా మారింది స్థానికలు బైరెడ్డిపల్లి పంచాయితీ సిబ్బందికి తెలియజేసారు. తొలగించే యత్నంలో లీనమైనా పంచాయతీ సిబ్బంది.

Featured

జిల్లా జాయింట్ కలెక్టర్ చేతులమీదుగా కరోనా నియంత్రణ చర్యల పోస్టర్ ఆవిష్కరణ ✍✍

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ కరోనా అంటువ్యాధి. ఇది ఏ తప్పు చేస్తేనో వచ్చేది కాదు, ఇది పూర్తిగా వ్యాధి సోకిన వ్యక్తి నుండి లేక వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొనటం ద్వారా ఒకరిని నుంచి ఒకరికి వ్యాపిస్తుందని సామాజిక దూరం పాటించకపోవడం, కరచాలనాలు చేయడం, మాస్క్ ధరించకపోవడం వల్లన ఈ వ్యాధి సోకుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. యన్ ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేశారు. వి ఎస్ యు యన్ యస్ యస్ వారు చేసిన పోస్టర్స్నును జాయింట్ కలెక్టర్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ దురదృష్టవశాత్తు సుమారు నూటికి 50 నుంచి 60 శాతం మందిలో రోగ లక్షణాలు బయటపడవు . కావున, మనము, మన కుటుంబసభ్యులు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే, పోస్టర్ లో పేర్కొన్న మూడు ముఖ్యమైన పద్దతులను మన దైనిక జీవితం లో ఒక భాగంగా అలవాటు చేసుకోవటమే ఉత్తమమైమన మార్గం అని ఆయన సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే మనతో పాటు మన కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యెస్.రాజ్యలక్ష్మి గారు , జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం గారు , యన్ యస్ యస్ వాలంటీర్స్ పార్థసారధి, రాజేష్ తధితరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Featured

కరోనా వైరస్ వ్యాప్తి పై మనుబోలు లో అవగాహన ర్యాలీ

29-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు లో కరోనా పై అవగాహనా ర్యాలీ & మానవహారం ———————————————————— ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విన్నూత రీతిలో గొడుగులతో వైఎస్ఆర్ సర్కిల్ నుంచి నుండి కేర్ పురం మీదుగా కరోనా పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు… ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… జిల్లాఅధికారుల ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ చేపడుతున్నామని తెలియజేశారు అధికారులు ఎంతో శ్రమ తీసుకొని కరోనా నివారణకు పాట్లు పడుతున్నా, ప్రజలు అవగాహనా రాహిత్యంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని… కావున కేవలం అధికారులే చర్యలు తీసుకుంటే సరిపోదు అని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి సహకరించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి గంటకు చేతులను శుభ్రం చేసుకోవాలని, తాగు నీరు ఎక్కువగా తాగాలని, ఎక్కువమంది ఒకచోట ఉండకూడదని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు ప్రస్తుతం మనుబోలు మండల పరిధిలో అధికారుల పగడ్బందీ చర్యలతో కరోనా నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులు దాసరి మహేంద్ర వర్మ ,దువ్వూరు సుధాకర్ రెడ్డి మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిఅశోక్ కుమార్,పోలీస్ సిబ్బంది,సచివాలయ సిబ్బందిమరియు వాలంటీర్లుగ్రామప్రజలుపాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.