Sunday, 24 May 2026

Blog

Featured

ఘనంగా కెమెరా సృష్టి కర్త వర్థంతి

పలమనేరు,జులై10,2020(పున్నమి విలేకరి):పలమనేరు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె 169వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రు విగ్రహం అధ్యక్షులు వెంకటేష్ గారు లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని కళ్ళకు కట్టేటటు చూపించటానికి ప్రధాన కారకుడు కెమెరాసృష్టి కర్త లూయిస్ డాగురే కు ప్రతీ ఒక్కరు ఋణపడి ఉన్నారన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కనిపెట్టిన కెమెరా వల్ల ప్రపంచం దగ్గరగా చేరింది అనే విషయం గుర్తెరిగి ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉన్నది అని కొనియాడారు.తరువాత పట్టణం లో ఉన్న పేదలకు అన్న దానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, దేవేంద్ర.సురేష్, రాఘవ, చందు, సూర్యప్రకాష్, ధన,రాధాకృష్ణ, బాబు,శ్యామ్,ప్రభాకర్, పూర్ణచంద్ర ,అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మరణం లేని మహా నేత వై.ఎస్.ఆర్ : కాకాని గోవర్ధన్ రెడ్డి

08-07-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు గ్రామం లో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి మరియు ఆచార్య యన్.జి.రంగా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ వై.మధుసూదన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు గారితో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు మొదటగా మనుబోలు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ లను మధుసూదన్ రెడ్డి గారు, శేషగిరి బాబు గారు, ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వినూత్న రీతిలో నూతన పద్ధతుల్లో వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టిన ఆదర్శ రైతులకు సన్మానించారు.వ్యవసాయ శాఖలో అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కోదండరామిరెడ్డి గారికి ఘనంగా సన్మానించారు . రైతుభరోసా కేంద్రాల ద్వారా పలువురు రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకాని గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రైతుల అభివృద్ధి, సంక్షేమం అంటేనే రాజశేఖర్ రెడ్డి గారి పాలన గుర్తుకు వస్తుంది అన్నారు 2004కు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పై పెట్టి రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా నిలిచారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపించడం, పోలీసు కేసులు బనాయించి వేధింపులకు గురిచేసి రైతులను అవమానపరిచారు. వై.యస్.ఆర్.హయాంలో సకాలంలో రుణాలు చెల్లించి, రుణమాఫీ ద్వారా లబ్ధి కలగని రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో రైతుకు 5 వేలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది అన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి మహనీయుడి పుట్టిన రోజు రైతు దినోత్సవం గా జరుపుకోవడం మన అదృష్టం. సర్వేపల్లి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల్లో మహానేత రాజశేఖర్ రెడ్డి దయవల్ల, సాగు నీరు అందించడంతో ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతాంగం శ్రేయస్సు కోసం సొంత జిల్లా కడపలోని పలు గ్రామాలను ఖాళీ చేయించి, సోమశిల రిజర్వాయరుకు 78 టీ.ఎం.సీ.ల సామర్థ్యం పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.మహానేత మరణం తరువాత రైతులు అన్ని విధాలా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పాలనను చూస్తున్నాము. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీ కన్నా మిన్నగా, ముందుగా అమలు చేసి, రైతులపై ఆయనకున్న ప్రేమను కనబరిచారు అన్నారు రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా ప్రభుత్వం చేయూతనందిస్తుంది అన్నారు ఆక్వా రైతులను చంద్రబాబు మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకున్నారు. మహానేత ఏ లోకంలో ఉన్నా రాష్ట్ర ప్రజల హృదయాల్లో, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారిని కోల్పోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల శాపం అయితే జగన్మోహన్ రెడ్డిగారి లాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం దేవుడిచ్చిన వరం అన్నారు . అభివృద్ధి సంక్షేమంలో తండ్రి ఒకడుగు వేస్తే తనయుడు రెండడులు వేస్తున్నారన్నారు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ 660 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సహకార సంఘం ద్వారా రైతుల శ్రేయస్సు కోరిన ముఖ్యమంత్రి వైఎస్ అన్నారు. అనంతరం నియెజకవర్గంలో ని ఐదుమంది ఆదర్శ రైతులకు పూలమాల శాలువాలతో సన్మానించి రైతుశ్రేయస్సు పోష్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, వ్యవసాయ శాఖ జెడి ఆనందకుమారి ,ఏడి శివనాయక్ ,ఏ.ఓ జహీర్ బాష ,ఎమ్మార్వో నాగరాజు ,ఎంపిడిఓ వెంకటేశ్వర్లు పశు ఉద్యాన శాఖ ల జెడిలు అన్ని శాఖ ల అధికారులతోపాటు వైకాపా నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి , కడి వేటిచంద్రశేఖర్ రెడ్డి , దాసరి భాస్కర్ గౌడ్ ,చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి,మన్నేమాల సాయి మోహన్ రెడ్డి కిషోర్ నాయుడు దాసరి మహేంద్ర వర్మ ప్రదీప్ కుమార్ రెడ్డి సురేంద్ర రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి మండల వ్యాప్తంగా నాయకులు,రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేసం

08-07-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రం లోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి-జనసేన కూటమి ఆత్మీయ సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి -జనసేన నాయకులు మరియు కార్య కర్తలు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి-జనసేన కూటమిగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు.జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యల మీద మనుబోలు మండలం లో జనసేన పార్టీ పోరాటం చేయడం జరిగిందని కొన్ని సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించడం జరిగింది అని తెలిపారు రాబోయే రోజుల్లో బిజెపి-జనసేన కలిసి ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని అన్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలందరికీ తెలియజేస్తూ బిజెపి- జనసేనకూటమి పని చేస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యాచవరం గ్రామానికి చెందిన గుంజి.రామయ్య బిజెపి పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో బిజెపి -జనసేన పార్టీ బలోపేతానికి కలసి కట్టుగా కృషి చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బోలా.శ్రీనివాసులు, చల్లా.లక్ష్మయ్య, ఇరగరాజు.వెంకయ్య, యాళ్ల. శ్రీనివాసులు, గణేశ్ జనసేన నాయకులు ప్రసాద్, జాకీర్ మరియు బీజేపీ ,జనసేన కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

Featured

వై.ఎస్.ను నిత్యం అందరూ స్మరించుకుంటారు.డా.ఎల్వికే ✍️✍️

పున్నమి తెలుగు దిన పత్రిక ✍️ దివంగత ముఖ్యమంత్రి మహానేత డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నిత్యం స్మరించుకుంటూ ఉంటారని లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ లెబాకు విజయకృష్ణా రెడ్డి చెప్పారు.సున్నిత మనస్కులైన  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లో మానవీయత ఉట్టి పడేదని,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారని అన్నారు.ముఖ్యమంత్రిగా ఆయన చూపిన మానవీయత వెలకట్టలేనిది కొనమానానికి అందనిదని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా లెబాకు నారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని  ప్రభుత్వ బాలసదన్ విద్యార్థులకు పలహారాలు పండ్లు పంపిణీ చేశారు. బాలబాలికలంటే  వైఎస్ కు ఏనలేని అభిమానమని అందరూ మంచిగా చదువుకోవాలని,ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రగాఢంగా కోరుకునే వారని అన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు గురించి ప్రస్తావించాలంటే కొన్ని గంటలు  చెప్పాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు

Featured

పేదల గుండె చప్పుడు వైఎస్సార్…

పలమనేరు, జులై8,2020( పున్నమి విలేఖరి): పేద ప్రజల గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. వైఎస్ 71 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వైయస్ రాజశేఖర్రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ..పేదల గుండెల్లో గూడుకట్టుకున్న మహానుభావుడు అని కొనియాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం రైతు దినోత్సవంగా గా పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నూతన పథకాలు రైతాంగానికి చేయూతనిస్తున్నారు. కరోనా కష్టాల కాలం లో ఆర్థిక ఇక్కట్లు ఎన్ని ఉన్నా ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి దక్కిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల ఆదుకున్న గొప్ప నేతగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, వైసిపి పట్టణ కన్వీనర్ మండి సుధా,బాలాజీ నాయుడు,ఫయాజ్,జాఫర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మెకానిక్ కి 10 వేల ఆర్థిక సహాయం

పలమనేరు, జులై5 2020(పున్నమి విలేకరి): పలమనేరు పట్టణానికి చెందిన టూవీలర్ మెకానిక్ ఫారుక్ గత ఇరవై రోజుల క్రితం టూ వీలర్ లో రోడ్డు ప్రమాదంలో కుప్పం మెడికల్ హాస్పిటల్ లో చికిత్స చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మెకానిక్ ఫారుక్ అతని గ్యారేజ్ తీయ లేని స్థితిలో ఉండడం వలన పలమనేరు టూ వీలర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ ఫారుక్ కి పదివేల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో టూ వీలర్స్ కార్మికులు ఒక లక్షకు పైగా ఉన్నారని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రభుత్వము టూ వీలర్స్ కార్మికులకు ఎటువంటి సహాయాలు చెయ్యలేదని, గ్యారేజ్ లకు బాడుగ కట్టలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి అద్దెలు కూడా కట్టలేక పోతున్నామరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టూ వీలర్స్ వర్కర్స్ కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గణపతి, అక్బర్,సుబ్రహ్మణ్యం, దిన, నజీర్, హమద్ తదితరులు పాల్గొన్నారు.

Featured

ట్రాక్టర్ – బొలెరో వాహనం ఢీ…ఒక్కరు మృతి

పలమనేరు, జులై5(పున్నిమి విలేకరి):చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి జగమర్ల క్రాస్ వద్ద ఇటుకల లోడ్డుతో వెల్లుతున్నా ట్రాక్టర్ ను బోలేరో వాహనం ఢీ కొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు.మృతుడు పరదేసి బంగారుపాళ్యం మండలంలోని టేకుమంద గ్రామం చెందిన వాడుగా గుర్తించారు. సంఘటన స్థలానికి 108 చేరుకునే లోపే అతను మృతిచెందారు. కారు డ్రైవర్ పరారి అయినడుని స్థానికులు సమాచారం.ఏస్ఐ నాగరాజు తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని మృతిని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏస్ఐ తెలిపారు.

Featured భక్తి

శిల్పకళా శోభితం – మల్లాం దేవాలయం

ఆంధ్ర రాష్ట్రంలోని శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఉన్న దేవాలయాల్లో మల్లాంలోని సుబ్రమణ్య దేవాలయం ఒకటి. ఈ గుడి నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలో వెలసి గూడూరుకు తూర్పున 50 కి.మీ. దూరంలో బంగాళాఖాతానికి దగ్గర్లో ఉంది. మల్లాంగా సంస్కృతీకరించబడ్డ ఈ ప్రాంతం మొదట్లో తిరువాన్బూరుగా తరువాత తిరుగుడుమల్లాంగా, తిరుమూరు మల్లాంగా ప్రసిద్ధికెక్కింది. పల్లవులు తమ శాసనాల్లో ఈ గ్రామాన్ని తిరువాన్బూరుగా ప్రకటించారు. శిల్పకళా వైభవానికి పరాకాష్టగా ఇక్కడ చెక్కబడిఉన్న రాతిరధ నిర్మాణం ఇద్దరు శిల్పుల మధ్య భేదాభిప్రాయానికి గుర్తుగా ఇద్దరు శిల్పులు ఉత్తర, దక్షిణ దిశల్లో రధం ముందు భాగాన్ని చెక్కారు. ఉత్తర దిశ శిల్పి, దక్షిణం వైపు రథం ఇరుసుల్ని పీకి, గుర్రం ముంగాళ్ళు నరికాడట. రథం తిరగబడి తిరుగుడు మల్లాం అయ్యింది. మరో కథనం ఏమిటంటే సుబ్రహ్మణ్యస్వామికి కంచిలో ప్రేయసి ఉండేది. అక్కడికి తాను వెళుతుంటే శివుడికి కోపం వచ్చి రథం చీలలు పీకించి వేసాడు. రథం తిరగబడింది. అందువల్ల తిరుగుడు మల్లాం అయింది. మరో కథనం ప్రకారం తారక, పద్మాసుర, మాల్లాసుర, కొల్లాసుర, రాక్షస సంహారం తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తుండగా చుట్టూ వెదురు చెట్లు పెరిగాయి. అప్పటి చాళుక్యరాజు పాండ్య భూపతి తన పల్లకికోసం వెదురుల్ని నరకమనగా , సైనికులు వెదురుతో పాటు సుబ్రహ్మణ్యుడి రెండు చేతులు నరికారు.గాయపడ్డ స్వామి ఆగ్రహానికి గురైన పాండ్య భూపతికి కళ్ళు పోయాయి. తన తప్పు తెలుసుకొన్న భూపతి ఇక్కడ ఆలయం కట్టించి, పోయిన తన కళ్ళను తిరిగి పొందాడని పురాణ కథ ప్రచారంలో ఉంది. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పురాణాలు పక్కనపెట్టి నిశిత పరిశీలనతో శోధించినపుడు ఈ ప్రాంతం ఒక్కప్పుడు వైభవోపేతమైన ప్రసిద్ధ వాణిజ్యక్షేత్రంగా, జైనులకు కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది. శాతవాహన కాలంలో ఇక్కడి సముద్ర తీరప్రాంతం నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా సరకు రవాణా జరుగుతూ అందులో జైనుల పాత్ర ప్రముఖంగా ఉండేది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కాలువలతో పాటు ఒకప్పుడు పెద్ద మట్టి కోట కాలగర్భంలో కలిసిపోయిన ఆధారాలు ఈ ప్రాంతం వ్యాపార కూడలిగా ఉండిందనడానికి అవి తిరుగులేని సాక్షాలుగా చెప్పవచ్చు. ఈ వాదనకు బలం చేకూర్చుతూ ఇటీవల భారతీయ కేంద్ర పురావస్తు బెంగళూరు శాఖ అధికారి శ్రీలక్ష్మి గారి, ఆధ్వర్యంలో గొట్టిప్రోలు గ్రామంలో జరుగుతున్న తవ్వకాల్లో నౌకాశ్రయ ఆనవాళ్లు బయటపడినవి. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు నౌకా వాణిజ్యంతో విరాజిల్లందని ప్రముఖ కేంద్ర పురావస్తు తెలుగు శాసన విభాగ అధిపతి ఎం.ఏసుబాబు గారు స్పష్టం చేశారు. ప్రఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబి వెల్లడించినట్టు ప్రసిద్ధ వాణిజ్యకూడళ్ళన్నీ దేవాలయా ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఈ ప్రాంతం ఇందుకు మినహాయింపు కాదు. కోశాంబి చెప్పినట్టు ఆహారసేకరణ దశనుంచి వ్యవసాయ దశలోకి మార్పు చెందే క్రమపద్ధతిలో గ్రామనిర్మాణం కలిగి ఉంది. నాలుగువైపులా చక్కని వీధులు, తూర్పు- పడమర వీధులను కలుపుతూ మధ్యన రెండు సమాంతర వీధులను కలిగి ప్రాచీన గ్రామ వ్యవస్థకు అద్దం పట్టినట్టు అనగా 2 వేల సంవత్సరాల క్రితం నాటి వర్తక కేంద్రమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గ్రామం చుట్టూవున్న అగడ్తకు, గ్రామాన్ని దేవాలయాన్ని కలుపుతూ ఒకే దారి వుంది. ఈ అగడ్తకు చాలానే కథలున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన రాయి ఇక్కడ లేకపోవడంతో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదేశం మీదట గ్రామం చుట్టూ తవ్వగా ఆలయనిర్మాణానికి కావలసిన రాయి దొరికిందని, ఆ రాయి తీసిన ప్రదేశమే యీ అగడ్తగా మొదటి కథ ప్రచారంలో ఉంది. మల్లాసుర, కొల్లాసురులు కోట నిర్మించుకొని శత్రువుల బారినుండి తమను తాము కాపాడుకొనేందుకు తవ్విన అగడ్త అని మరొక కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఇదొక చారిత్రక ప్రదేశంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పుడో సెలవిచ్చారు. ఇక శాసనాల ఆధారంగా క్రీ .శ . 907 – 953 లో పల్లవుల ఆధీనంలోని నెల్లూరు నుంచి కంచివరకుగల ప్రాంతం మొదటి పరాంతకుడి పాలనకిందకు వచ్చింది. ప్రస్తుత ఆలయ నిర్మాణం క్రీ .శ . 13 వ శతాబ్దిలో జరిగినట్టు చరిత్రకారులు వెల్లడించారు. దాదాపు 100 శాసనాల దాకా ఉన్న ఈ ప్రాంతంలో అన్ని తమిళ శాసనాలే. ప్రముఖమైనవి మూడవ రాజరాజు కాలానికి చెందినవి 11 శాసనాలు, మూడవ కుళోత్తుంగ రాజువి 5 శాసనాలు. మూడవ కులోతుంగ కాలంలో క్రీ.శ . 1178 – 1216, మొదటి మనుమసిద్ధి తమ్ముడు నల్లసిద్ధి, ఆ తర్వాత అతని తమ్ముడు తమ్ముసిద్ధి, క్రీ.శ. 1204 -08 కాలంలో ఆలయ అభివృద్ధి జరిగింది. నెల్లూరు పాలకుడైన ఎర్రసిద్ధి 1105 – 18, తిక్క 1219 – 1248, గండగోపాల (తిరుకాలత్తిదేవ) కాలంలో ఆలయ అభివృద్ధికి కొన్ని పనులు చేపట్టారు. విజయ గండగోపాలుడి ( 1250 – 1285 ) శాసనం ఒకటి ఈ ఆలయంపై వుంది, తర్వాతి నవీన శాసనం క్రీ. శ. 1314 – 15 కి చెందినది. ఇక ధూపదీప నైవేద్యాలకు దేవాలయానికి 110 ఎకరాల మాన్యం కూడా కలుగచేసారు. ఇక ఆలయానికొస్తే సువిశాలమైన ప్రాంగణము, ప్రహరీ ఉన్నాయి. ఈ ఆలయంలో బలిపీఠం, ధ్వజస్థంభం, మహా మండపం, ముఖ మండపం, ప్రదక్షిణం, అంతరాళం, గర్భగుడి ఉన్నాయి. శైవ, వైష్ణవ విగ్రహాలను బట్టి ఇక్కడ రెండు కల్ట్ ల మధ్య జరిగిన ఆధిపత్య పోరుకు సాక్షాలుగా విగ్రహాలున్నాయి. అద్భుత శిల్పకళా పాటవానికి ప్రతీకగా శతస్తంభ మండపం అలరాలుతోంది. ఉత్తర, దక్షిణ దిశల్లో రథ చక్రాలను, గుర్రాలను మలిచారు. చోళ వాస్తుకళకు చక్కటి ప్రతిబింబమే ఈ శతస్తంభ మండపం. విఘ్నేశ్వర, ఉమామహేశ్వర, నరసింహ, సదాశివ, యోగనారసింహ, వేణుగోపాల, లక్ష్మి సమేత వరాహమూర్తి తదితర విగ్రహాలతో పాటు కాలక్రమంలో చుట్టుపక్కల దొరికిన విగ్రహాలన్నీ ఇక్కడ వున్నాయి. ప్రతి సంవత్సరం భాద్రపదశుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లోక సంరక్షణ కొరకు కుమారస్వామి మల్లాసుర, కొల్లాసురులను సంహరించిన రోజునే ఉత్సవం జరుగుతుంది. ఆ పౌర్ణమి నాటి ఉత్సవాన్ని కొర్ల ఉభయమంటారు. అరకొర సౌకర్యాలున్నప్పటికీ ఈ ఉత్సవాలలో భక్తులు పోటెత్తుతారు.ఒకప్పుడు వెంకటగిరి జమీందారిలో భాగమై వారి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఈ ఆలయం ఉండేది. జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన రైతుల సమావేశాలకు, ఆనాటి తిరుగుబాటులకు ఈ దేవాలయం సాక్షిభూతమైంది. 1930 సంవత్సరంలో ఒకేసారి 10 వేలమంది రైతులు ఈ దేవాలయ ఆవరణంలో గుమికూడి సమావేశాలు జరపడం అప్పట్లో సంచలనం సృష్టించి దేవాలయ ఇమేజ్ ని మరింత పెంచింది. అంతటి విశాలమైన దేవాలయ ఆవరణలోని ధ్వజస్థంభం, అతిపెద్ద గోపుర ముఖ ద్వారం 1927 నవంబర్ 1 వ తేదీనాటి పెద్ద గాలివానకు పడిపోయింది. పడిపోయిన ధ్వజస్తంభాన్ని కోయించి తలుపులకు వాడుకొన్నారు. మనవాళ్ల చారిత్రక తెలివి ఏపాటిదో ఈ సంఘటనతో మనకు అర్ధం అవుతుంది. అంతటి ఘనులు మన వాళ్ళు. ఏదిఏమైనా ప్రజల ఆశ్రద్ధో, ప్రభుత్వ తెలివి తక్కువతనమో తెలియదు కాని ఇప్పుడిప్పుడే మల్లాం దేవాలయం యొక్క శిల్ప సంపద పట్ల అవగాహన ఏర్పడటం శుభపరిణామంగా పేర్కొనవచ్చు.

Featured

అమరావతిని కాపాడుకొందాం

పలమనేరు, జులై4, 2020(పున్నిమి విలేకరి): రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావంగా అమరావతిని కాపాడుకొందాంని నిరసన చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టి,బ్రహ్మయ్య,శ్రీధర్,గిరి,మదన్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Featured

మాస్క్ లేకుంటే జరిమానా ఏస్ఐ

పలమనేరు, జూన్ 30 2020(పున్నమి విలేకరి): పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో పలమనేరు బజార్ వీధిలో పలమనేరు ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు ధరించ కుండా నిబంధనలను అతిక్రమించిన వారికి రూ135/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.