Sunday, 24 May 2026

Blog

Featured జాతీయ అంతర్జాతీయ

సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: మిధున్‌ రెడ్డి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మిధున్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ‘జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి’ అని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.

Featured

జనసేన ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ

జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. 22-08-2020 మనుబోలు (పున్నమి విలేకరి)మనుబోలు మండలం మనుబోలు గ్రామమునందు నెల్లూరు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గునుకుల కిషోర్ చేతుల మీదగా మనుబోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల వినాయక ప్రతిమలనుపేదలకు పంచడం జరిగింది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేసినారు మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాము అని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు మరియు మనుబోలు మండల నాయకులు ప్రసాద్,జాకీర్ ,పవన్ ,శ్రీకాంత్ సురేష్ ,ఖదీర్,లక్ష్మణ్ మరియు జనసేన కార్యకర్తలు,చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు

Featured

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

16-08-2020 మనుబోలు( పున్నమి విలేకరి)మనుబోలు మండలం కొండూరు సత్రం నందుగల రామాలయం 12వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సీతా రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా పాంచరత్న ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించడం జరిగింది. అర్చకులు జి .శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం జరిగింది తదుపరి సామూహిక విష్ణు సహస్ర పారాయణం పటీంచడం జరిగింది . శ్రీ సీతా రాముల వారి కళ్యాణంనకు ఉబయ కర్తలుగా పసుపులేటి శ్రీనివాసులు శ్రీమతి రమాదేవి దంపతులు వ్యవహరించడం జరిగింది కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అంద చేయడం జరిగింది స్వామివారి కల్యాణం వీక్షించేందుకు హాజరైన భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది

Featured

నెల్లూరు జాయింట్ కలెక్టర్ సమీక్ష ✍️

తెలుగు దిన పత్రిక పున్నమి ✍️✍️ నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఆదివారం జాయింట్ కలెక్టర్  డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా (రైతు భరోసా,  రెవిన్యూ) ఆర్ అండ్ ఆర్ జాయింట్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి.ఆర్.ఓ, ఆర్.డి.ఓ, కలెక్టరేట్ అధికారులతో  జేసీ సమీక్షా, సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించిన జేసీపూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన వి.ఆర్.ఓ లు.., రెవెన్యూశాఖ చట్టాలపై, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరం అయితే వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, మ్యాపింగ్ పై సమీక్ష నిర్వహించారు. ప్రతి రోజూ కోవిడ్-19 ఆపరేషన్స్ కి సంభందించిన సమాచారం నివేదిక రూపంలో తనకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ  మల్లికార్జున్, ఆర్.డి. ఓ  హుస్సేన్ సాహెబ్, కలెక్టరేట్ ఏ.ఓ రామారావు,  అధికారులు పాల్గొన్నారు.

Featured

బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత ✍️

తెలుగు దిన పత్రిక పున్నమి ✍️✍️ అని ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్కు వద్ద కొండా బలరామిరెడ్డి 87 వ పుట్టిన రోజు సందర్భంగా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని దినసరి కూలీలు పేదలు మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు .వారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు .చాలా మంది ఉపాధి కోల్పోయి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .కరోనా వస్తే భయపడవలసిన అవసరం లేదని ధైర్యంతో ఉండాలని ముందు జాగ్రత్తతో కరీనాను నిరోధించవచ్చన్నారుప్రభుత్వ నిబంధనలతో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు .ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు అందజేశారు . అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేతా సుబ్బారావు అడ్వకేట్ రమాదేవి బృందావనం పొగతోట ఆర్ డబ్ల్యూ ఏ కార్యదర్శి పి .కృష్ణమూర్తి .అనురాధ తదితరులు పాల్గొన్నారు .

Featured ఆంధ్రప్రదేశ్

తెలుగు నేలపై ఉద్యమాలకు ఊపిరిలూదిన ఉ.సా.

ఉద్యమాల శ్వాస ఉసాగా చిరపరిచితుడైన ఉప్పుమావులూరి సాంబశివరావు జులై 25 వ తేదీన హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో పోరాడి మరణించాడన్న వార్తతో ఒక్కసారిగా తెలుగు నేలపై విషాద ఛాయలు కమ్ముకున్నాయి.దళిత- బహుజన వర్గాలు, విప్లవ శ్రేణుల లోని ఆయన అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేక పోయారు. ఇటు బహుజన ఉద్యమాలూ,అటు వామపక్ష విప్లవోద్యమాలూ సమంగా ప్రేమించిన ఉద్యమకారుడు ఉసా.మార్క్సిజాన్ని,అంబేద్కరిజాన్ని సమన్వయీకరించి సిద్దాంత ఆచరణలో ప్రయోగిస్తూ జీవితాంతం అనేక ఉద్యమాలను నడిపిన ధీశాలి ఉసా.అంతేకాకుండా అటు యువతీ యువకుల్ని,ఇటు మధ్య వయస్కుల్ని సమాన స్థాయిలో ప్రభావితం చేయగలిగిన సమన్వయ కర్త ఉసా.నాయకుడిగా, సిద్ధాంత కర్తగా,కవిగా,రచయితగా,వక్తగా,బోధకుడిగా,గాయకుడిగా మరియు గేయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సుప్రసిద్ధుడు ఉసా.చిరునవ్వుతో అందరినీ కలేసుకుంటూ భేషజాలు లేని సాదాసీదా వ్యక్తిగా గడిపాడు. విప్లవోద్యమాల నుంచి బహుజన ఉద్యమాల వరకూ సాగిన మరియు సాగుతున్న సామాజిక,రాజకీయ ఉద్యమాల మలుపులన్నింటిలోనూ ఉసా ఉదాత్త పాత్ర ఉంది. ఉద్యమాల నుంచి వేరు చేసి ఆయన్ను చూడలేం.ఆయన్ను వేరు చేసి ఉద్యమాలను చూడలేం.ఇదే ఉసా విశిష్టత. గుంటూరు జిల్లా లోని తెనాలి సమీపంలోని బ్రాహ్మణకోడూరు కుగ్రామంలో మంగలి( తొలి వైద్యులు) కుటుంబంలో పుట్టిన ఉసా సామాజిక వైద్యుడు అయ్యాడు. ఉసా 1960 వ దశకంలో తెనాలి డిగ్రీ కాలేజీలో యువ విద్యార్థిగా ఉంటున్నప్పుడే హేతువాదిగా జీవితాన్ని ప్రారంభించాడు. నక్సల్బరీ ఉద్యమం బద్దలయ్యాక ఉసా కమ్యూనిస్టు విప్లవ సిద్ధాంతం వైపు ఆకర్షితుడై తరిమెల నాగిరెడ్డి పార్టీలో చేరారు.1974 లో తెనాలిలో ఏర్పడిన అరుణోదయ సాంస్కృతిక సంస్థ కన్వీనర్‌గా ఎమర్జెన్సీ వరకూ పనిచేశాడు. ఎమర్జెన్సీలో ఉసా పూర్తి కాలపు విప్లవకారుడిగా పనిచేస్తున్న క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ద్వారంపూడి వద్ద అరెస్టు అయ్యాడు. దాదాపు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ తరువాత వివిధ బాధ్యతలు నిర్వహిస్తూనే కవిగా అజరామరమైన పాటలు రాశారు. పిల్లల్ని వదిలేసి తల్లులు పొలం పనులకు పోతే, బడికి వెళ్ళాల్సిన పిల్లలు తమ తరువాత పుట్టిన చెల్లెళ్ళనూ,తమ్ముళ్ళనూ ఆడించాలి.వాళ్ళ ఏడుపు ఆపడానికి పిల్లలు పడరాని పాట్లు పడతారు. అలాంటి వాళ్ళ కన్నీళ్ళు ఒక్క చుక్క కూడా నేల పాలు కానివ్వకుండా తన కలంలో నింపుకుని “జోలాలి పాడాలి” పాట రాశాడు. పోలీసు నిర్బంధం గురించి ” మేమెందుకిలా మారామో తెలుసా”అనే పాట,నాడు బ్యాంకు అప్పు వసూళ్ళ పేరుతో రైతులపై సాగుతున్న వేధింపు లపై ” అప్పులు మేం తీర్చలేం ఆందోళన సాగిస్తాం” అనే పాట, జనసాహితీ ప్రారంభ గీతాలుగా స్వీకరించిన “మేం జనం పాట పాడుతాం” మరియు ” కవి ఓ కళాకారుడా కవయిత్రి ఓ కళాకారిణి ” ఇవే కాకుండా విద్యార్థులను ఉద్యమాల వైపు ఉత్తేజ పరిచిన ” హల్లో స్టూడెంట్స్ హౌ ఆర్ యు ఆప్టర్ స్టడీస్ హు ఆర్ యు” వంటి అనేక ఉద్యమ పాటలు ఉసా కలం నుండి జాలువారినవే కావడం చరిత్ర దాచిన సత్యం. బహుముఖ ప్రతిభా పాటవాలతో ఉసా సిద్ధాంత కర్తగా, కవిగా,గాయకుడిగా పరిణామం చెందారు.సాయుధ పోరాటం వైపు మొగ్గు చూపి తూర్పు గోదావరి జిల్లా కొండ మొదలు గిరిజన విముక్తి పోరాటంలో మమేకమై 1980 ల వరకూ అక్కడే నివసించారు. తెలంగాణలో ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో తీవ్రమైన కరువు వ్యాపించడంతో తాగునీరు, సాగునీరు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ తో మోత్కూరు రైతులను సంఘటితం చేసేందుకు బాధ్యతలను చేపట్టారు. మోత్కూరు లోనే ఐదేళ్ళు నివసించిన ఉసా కులంతో పనిలేకుండా రైతు కుటుంబాలలో ఒకరిగా కలిసిపోయారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక వ్యవసాయ సమస్యలపై వేలాది మందిని కదిలించారు.అదే సమయంలో 1985 లో కారంచేడు దళితులపై హత్యాకాండ ఘటన జరిగింది.కారంచేడు ఉద్యమం నుంచి అంబేద్కర్ తాత్వికతను ఒంటబట్టించుకున్న ఉసా శషభిషలు లేకుండా దళిత మహాసభ తో దళిత ఉద్యమం వైపు నిలిచాడు. ఇదే ఆయనను కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించబడడానికి కారణమైంది. కారంచేడు ఘటన కుల దురహంకారానికి నిదర్శనమని,అందులో ఉన్నది వర్గ సమస్య కాదని, తరతరాలుగా వేళ్ళూనుకున్న కుల అసమానతల సంఘర్షణే అని విశ్లేషించారు.తనతో విభేదించిన యు.సి.సి.ఆర్.ఐ( యమ్.యల్) ఉసా ను పార్టీ నుంచి బహిష్కరించింది.ఉద్యమంలో తనతో పాటు పనిచేసిన సహచరి పద్మతో పాటు బయటకు వచ్చిన ఉసా ఆనాటి నుంచి సామాజిక సంస్కరణల్లో,కుల వ్యతిరేక పోరాటాలలో పాల్గొంటూ వచ్చారు. అదే సమయంలో కంచ ఐలయ్య కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు.మరోవైపు పీపుల్స్ వార్ నుంచి మహాకవి శివసాగర్ ( కె.జి.సత్యమూర్తి) బయటకు రావడం ఇంచుమించు అదే సమయంలో జరిగింది. ఉసా 1987 నాటికే వర్గ,కుల దృక్పథంతో జరగాల్సిన ఉద్యమం గురించి స్పష్టమైన వాదనతో ఒక పుస్తకం రాశాడు.1987-89 మధ్య కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకించి కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలలో కరువు బారినపడిన ప్రజలకు సహాయం చేసే కృషిలో ఐలయ్యతో పనిచేశారు. మార్క్సిస్ట్, లెనినిస్ట్ సెంటర్ ఏర్పాటులోనూ ముఖ్య భూమిక పోషించారు ఉసా. శివసాగర్ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇరువురు కలిసి “ఎదురీత” పత్రిక స్థాపించారు.ఉసా ఆధ్వర్యంలో “ఎదురీత” పత్రిక గొప్ప సైద్ధాంతిక పోలరైజేషన్ కు దోహదం చేసింది. తెలుగు మేధో వాతావరణాన్ని ఒక మలుపు తిప్పిన చారిత్రక పాత్రను అది నిర్వర్తించింది.ఎదురీత పత్రిక ద్వారా వ్యాస రూపంలో అంతర్జాతీయ విప్లవ స్వాప్నికుడు “చేగువేరా”ను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది కూడా ఉసానే. కలిసొచ్చిన అనేక మందితో కలసి రాజకీయ,సామాజిక ఐక్య కార్యాచరణకు సంబంధించిన అనేక ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలోనే మంద కృష్ణ మాదిగ,ఆర్ కృష్ణయ్య లతో కలిసి పనిచేశాడు. ఈ లోపే మండల్ ఉద్యమం పొడ చూపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓబిసి రిజర్వేషన్లకు మద్దతుగా ప్రజలను కూడగట్టడంలో ఉసా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాడు. అటు మార్క్సిజం, ఇటు అంబేద్కరిజం రెండింటిలోను ఉసా కీలకమైన సిద్ధాంత వేత్తగా,వక్తగా,గొప్ప సమన్వయ కర్తగా పరిణమించాడు.ఆయన రచనలు, ప్రసంగాలు నిప్పు కణిక లాంటి కుల,వర్గ నిర్మూలన పోరాట యోధుడు మారోజు వీరన్న వంటి విప్లవోద్యమ కార్యకర్త లను సైతం ఆలోచింప జేసి ప్రభావితం చేసాయి.వీరన్నతో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉసా ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తూ అనేక సమావేశాలు నిర్వహించారు. అంతేకాక గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు సి పి యం మద్దతుతో ఏర్పడిన టీ.మాస్,బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లోనూ ఉసా భాగమయ్యారు. కులాంతర వివాహాలకు ఉసా గొప్ప మద్దతుదారు.తాను స్వయంగా పార్టీలో పనిచేస్తున్న బ్రాహ్మణ కులానికి చెందిన పార్టీ కార్యకర్త పద్మను వివాహమాడారు.పద్మ రాసిన “ఆప్టరాల్ ఆడదాన్ని” స్త్రీ వాద కవితకు ప్రేరణ మరియు ఊపిరి “ఉసా”నే కావడం విశేషం. పార్టీతో విభేదించి ఉసా తో కలసి బయటకు వచ్చాక పద్మ ఎ.సి.టీ.ఓ.గా ఉద్యోగం చేయడం ద్వారా సహచరుడు ఉసా కు మద్దతుగా నిలిచింది. తమ ఏకైక కుమార్తెను చక్కగా చదివించారు. కొన్నేళ్ళ క్రితం ఆమె అనారోగ్యంతో చనిపోయారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మరియు కొందరు మిత్రులతో కలసి బహుజన సాంస్కృతిక సంస్థను ప్రారంభించిన ఉసా భావజాల ప్రసారం కోసం దేశి- దిశ అనే యూట్యూబ్ ఛానల్ ను మొదలు పెట్టి తన ఇంటినే స్టూడియోగా మార్చాడు. కుల పరమైన అత్యాచారాలు ఎక్కడ జరిగినా అక్కడకు వెళ్ళేవారు. స్వయంగా అనేక కులాంతర వివాహాలు జరిపించాడు. మహిళల హక్కులు, సమానత్వం పట్ల తాను చూపిన నిబద్ధత సాటి లేనిది. పితృస్వామ్యం నుంచి మహిళలు ఎలా విముక్తి చెందాలో అనేక రచనలు చేశాడు. గిరిజన ప్రాంతాలలో, మోత్కూరు, కొల్లాపూర్ గ్రామాలలో మరియు దళిత బహుజన వాడలలో కలగలసి పోయాడు. వివిధ పొలిటికల్ డాక్యుమెంట్లు రూపొందడంలో కీలక పాత్ర నిర్వర్తించాడు. కాపు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని,వాటికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ అంతటా సభలు,సమావేశాలు నిర్వహించి బి.సి. ప్రజలను కూడగట్టాడు.బి.సి,యస్.సి.,యస్.టీ,మైనారిటీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం మరియు రిజర్వేషన్లలో “మేమెంతో మాకంత” వాటా కోసం పిలుపునిచ్చాడు.కుల నిర్మూలన ఉద్యమంలో భాగంగా ” బహుజన ప్రతిఘటనా వేదిక”ను నిర్మించి పలు ఆందోళనల్నీ,పోరాటాల్నీ చేయడంలో ముఖ్య పాత్ర వహించాడు. పూలే- అంబేద్కరిజంపై అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసాడు. హేతువాదం,సైన్స్, బుద్ధిజం పట్ల విశ్వాసం ఉన్న వాడిగా మూఢ నమ్మకాలు, అజ్ఞానం, పట్ల బద్ద విరోధాన్ని ప్రకటించాడు. తన రాజకీయ, సైద్ధాంతిక కార్యాచరణలో భాగంగా ఆయన అనేక మంది ప్రజల ఇళ్లలో ఉండేవారు.వందకు పైగా పుస్తకాలు రాసి తెలుగు నేలపై బౌద్ధాన్ని తన రచనలు, ఉపన్యాసాలు మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుదిశలా వ్యాపింపజేస్తున్న బొర్రా గోవర్ధన్ తనకు ఉద్యమంలో, సాహిత్యంలో ఓనమాలు దిద్దిన గురువు “ఉసా” అని ప్రకటించాడు.సమత కోసం ప్రపంచానికి బౌద్ధాన్ని త్రిపీఠకాల ద్వారా సామాన్య జనానికి జ్ఞానాన్ని చేరువ చేసిన బౌద్ధ ఉపాలి వారసత్వ సంపద ఉసా కావడం గమనార్హం. ఒక విప్లవకారుడిగా,మానవ హక్కుల ఉద్యమకారుడిగా,కుల వ్యతిరేక ఆదర్శవంతుడిగా,మార్క్స్,మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయిగా,బౌద్ధ అభిమానిగా ఉసా వారసత్వం సాటి లేనిది. సంభాషణల ద్వారా, సంస్కార వంతమైన చర్చ ద్వారా విభేదాల్ని పరష్కరించుకునే ప్రజాస్వామ్య సంస్కృతిని ఉసా నుంచి మనం నేర్చుకోవాలి.తన యాభై ఏండ్ల ఉద్యమ జీవితంలో అనేక మందికి ప్రేరణగా నిలిచిన ఉసా ను స్మరించుకుంటూ వారు కలలగన్న సమానత్వ సమాజం కోసం కృషి చేయడానికి ప్రతినబూనుదాం. అన్నం శ్రీనివాసులు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సి.ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎ.పి. నెల్లూరు జిల్లా శాఖ

Featured ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

సోము కు గంగాధర్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ భాజపా నూతన అధ్యక్షులు,ఎమ్మెల్సీ, సోము వీర్రాజుని ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం తన కార్యాలయంలో కలిసి శాలువా తో సత్కరించి,మిఠాయిలుతో శుభాకాంక్షలు తెలుపుతున్న భాజపా రాష్ట్ర మీడియా కన్వీనర్,ZRUCC మెంబెర్,SC Rly, గంగాధర్ వుల్లూరి (నాని) ఈ సందర్భంగా వీర్రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భాజపా 2024 నాటికి అధికార పార్టీకి ప్రత్యామ్నా శక్తి గా ఎదిగి ఎన్నికల గెలుపే లక్ష్యం గా ముందుకు సాగాలి అని కోరారు.అలానే ప్రతీ కార్యకర్త శక్తి వంచనలేకుండా,స్వార్ధ రాజకీయాలకు దూరంగా ఉండి నూతన అధ్యక్షుడికి మద్దతుగా నిలవాలని గంగాధర్ ఆకాంక్షించారు.

Featured

కట్టువపల్లి లో ఘనంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం

29-07-2020 మనుబోలు(పున్నమిప్రతినిధి)మనుబోలు మండలం లోని కట్టుపల్లి గ్రామమునందు జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని బుధవారం నాడు ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు వైకాపా నేత గుండాల ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారుఅన్నారు ఆయన స్ఫూర్తితో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారన్నారు వారి పిలుపు మేరకు కట్టువపల్లి లో పేదలకోసంఏర్పాటుచేసినలేఅవుట్‌లో మొక్కలునాటి‘ ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టామన్నారు ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరువిధిగామొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం  వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ పేదల కోసం సిద్ధం చేసిన లే అవుట్లను పచ్చదనంతో నింపేందుకు సంకల్పించింది అన్నారు. ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో  ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు ప్రతి ఇల్లు, ప్రతీ ఊరూ పచ్చదనంతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు సన్నారెడ్డి జానకీరామిరెడ్డి , పోచారెడ్డి అశోక్ రెడ్డి , శీనా రెడ్డి,గ్రామ సచివాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ‌పోస్టులు భర్తీ చేయాలి

నెల్లూరు, జూలై 28, 2020 (పున్నమి విలేఖరి) : రాష్ట్రంలో ఇప్పటి వరకు వున్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ‌పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య ఒక ప్రకటనలో కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి 2008 అక్టోబర్‌లో సుమారు వివిధ శాఖలలో గ్రూప్‌-1, ‌గ్రూప్‌-2‌లలో ఖాళీ ఉన్న ఉద్యోగాలు కలిపి సుమారు 6000 బ్యాక్‌లాగ్‌ ‌ఖాళీలు ఉన్నట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి వాటి కాల పరిమితిని గత ప్రభుత్వం పెంచుకుంటూ వచ్చింది. ఎంతో కాలం నుండి బ్యాక్‌లాగ్‌ ‌పోస్టుల నియామకాల కోసం ఎదురు చూస్తున్న దళిత, గిరిజన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి బ్యాక్‌లాగ్‌ ‌పోస్టులను గుర్తించి వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో వయస్సు సడలింపు పై కూడా ఆలోచించాలని ఆయన కోరారు.

Featured

ప్రైవేటు టీచర్లను,లెక్చరర్లును ప్రభుత్వం ఆదుకోవాలి

పలమనేరు, జూలై27,2020(పున్నమి విలేకరి): కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను,కళాశాలల లెక్చరర్లు ను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు సంఘం డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీచర్లు సంఘం అధ్యక్షుడు దేవేంద్ర, మాట్లాడుతూ… మార్చి నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.జీతాలు లేక కొందరు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పూట గడవక వీధుల్లో పండ్లు, కూరగాయలు అమ్మ్ముకుంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందిని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు,లెక్చరర్లు జీతాలు లేక అప్పులుపాలై ఆతహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత మా ఉపాధ్యాయులదేనని సన్మానించి ప్రచారం చేసుకున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రస్తుతం స్పందించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రేమకుమార్,రెడ్డి శేఖర్, రాజేశ్వరరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.