చిన్నబజార్లో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్.. 30 ద్విచక్ర వాహనాల స్వాధీనం
జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకలి వీధి ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 500 ఇళ్లలో తనిఖీలు చేపట్టి, పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ప్రజలకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

చిన్నబజార్లో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్.. 30 ద్విచక్ర వాహనాల స్వాధీనం
చిన్నబజార్లో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్.. 30 ద్విచక్ర వాహనాల స్వాధీనం జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకలి వీధి ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 500 ఇళ్లలో తనిఖీలు చేపట్టి, పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు ప్రజలకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

