చిట్వేల్ సమీపంలో కలకలం – నాలుగు రోజుల క్రితం మృతి జరిగి ఉండవచ్చని పోలీసుల అనుమానం
చిట్వేల్, నవంబర్ 22: పున్నమి ప్రతినిధి
చిట్వేల్ పట్టణానికి సమీపంలో ఉన్న గుంజునేరు వాగులో శనివారం ఉదయం ఒక మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది.ఉదయం వాగు వైపు వెళ్లిన స్థానికులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే, సుమారు నాలుగు రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈమె ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాదవశాత్తు జారిపడిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వివరాలు, మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.


