ఈరవత్రి రాజశేఖర్
ఆలూర్ గాండివం ఆగష్టు 14
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దేశ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల పోరాటం, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో పేదలు, బలహీన వర్గాలు, విద్యార్థులు, యువతకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడమే ఈఆర్ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగుతూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఈరవత్రి రాజశేఖర్ ఆకాంక్షించారు.



