*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
*దక్షిణనియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో*
*30వార్డు పరిధిలో 40.04లక్షల జీవీఎంసీ నిధులతో కొత్త జాలారిపేట వద్ద పలు అభివృద్ధి పనులకు మరియు
32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణముకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు*
*కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి సౌత్ ఇన్చార్జి సుధాకర్ గారు కార్పొరేటర్లు శ్రీమతి అప్పల రత్నం గారు, శ్రీ కందుల నాగరాజు గారు*
*శంకుస్థాపన చేసిన పనుల వివరాలు*
*30వార్డ్ పరిధిలో 11లక్షల నిధులతో కోడిపంధేల వీధి వద్ద CC డ్రెయిన్ల మరమ్మతులు*
*30 వార్డ్ పరిధిలో కోడిపంధేల వీధిలో 10.61లక్షల నిధులతో దెబ్బతిన్న CC రోడ్ల మరమ్మత్తులు*
*30వార్డ్ పరిధిలో 10.45లక్షల నిధులతో కొత్త జాలరిపేట వద్ద SW డ్రెయిన్ మరమ్మతులు*
*30 వార్డు పరిధిలో 4.36 లక్షల నిధులతో తాడివీధి వద్ద కాంపౌండ్ వాల్ & బయటి ఫ్లోరింగ్ మరమ్మతులు*
*30 వార్డు పరిధిలో లో వివిధ ప్రదేశాలలో ఫుట్‌పాత్ గ్రేటింగ్‌లు మరియు కవర్ స్లాబ్‌ల ఫిక్సింగ్ పనులు నిమిత్తము*
*32వార్డ్ పరిధిలో సౌత్ జైల్ రోడ్డు నందు జీవిఎంసీ నిధులతో 1కోటి 45 లక్షలతో తారురోడ్డు నిర్మాణము*
కార్యక్రమంలో ఎమ్మెల్యేశ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందనీ,
నియోజకవర్గములో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తామని చెప్పాము, ఆ విధంగా ముందుకు వెళుతున్నామని పలికారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ప్రజలు గమనించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని అన్నారు.రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు, ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని అన్నారు.
దక్షిణ నియోజకవర్గం ఓల్డ్ సిటీ అని , డ్రైనేజీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అధికంగా ఉందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు స్థానిక నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని,
రానున్న రోజుల్లో అద్భుత పరిపాలన విశాఖ ప్రజలు చూడబోతున్నారని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం
సంక్షేమము, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పాలన సాగిస్తున్నారనీ, వారి ఆదేశాల మేరకు ప్రజలకు దగ్గరగా సేవలు అందించేందుకు పనిచేస్తున్నామనీ గుర్తుచేశారు. గూగుల్ వంటి పది సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయినీ తెలిపారు.
స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్ ,మెట్రో వస్తే విశాఖ రూపురేఖలు మారనున్నాయినీ అన్నారు.గూగుల్ ను విశాఖపట్నం తీసుకువచ్చినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలను ఈ సందర్భంగా తెలిపారు.రానున్న రోజుల్లో విశాఖ పేరు ప్రపంచ పటంలో నెంబర్ వన్ గా మారుమ్రోగనుంది, ఇది విశాఖ ప్రజల అదృష్టం నీ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ గారు, జోన్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారు, అధ్యక్షులు శ్రీమతి యజ్ఞశ్రీ,, శ్రీ రమణ గారు, శ్రీ అర్జున్ గారు, కూటమి సీనియర్ నాయకులు, వివిధ విభాగాల కూటమినేతలు , కార్యకర్తలు ,జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు….


