104సేవలు సద్వినియోగం సేసుకోండి. డాక్టర్ ప్. వి. కిషోర్
మర్రిపాడు :పీబ్రవరి 15(పున్నమివిలేకరి )
మర్రిపాడు మండలం
బ్రహ్మణపల్లి గ్రామ సచివాలయం నందు 104 వాహనం రావడం జరిగింది. ఈ కార్యక్రమం లో దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి షుగర్,బిపి,అలర్జీ,ఆస్తమా థైరాయిడ్ ఉన్నటువంటి వారికీ డాక్టర్ జి.బాలాజీ అశోక్ గారుపరీక్షలు జరిపి ఒక నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.మొబైల్ మెడికల్ క్లినిక్ ప్రోగ్రాం ని ఉద్దేశించి డాక్టర్ జి బాలాజీ అశోక్ మాట్లాడుతూ ప్రతిఒక్క గర్భవతి కి ECG తీయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు అందించు సలహాలు,సూచనలు, పాటిస్తూ పౌష్టి కాహారం తీసుకొంటు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ ఎస్.కె ఖాజామోహిద్దీన్ హెచ్ వి సంపూర్ణమ్మ,MLHP రజిని,సచివాలయ ఏ ఎన్ యం.యం.లావణ్య,ఆశ,అనిత,DEO ప్రసన్న,పైలట్,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.