(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)దేగాం గ్రామంలోని శ్రీ దత్త మందిర్లో ఈరోజు బాబు మహారాజ్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల నిత్య సేవలతో కూడిన ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.20,025 వసూలైనట్లు నిర్వాహకులు తెలిపారు.
వసూలైన మొత్తాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో బాబు మహారాజ్ గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాహురావు పటేల్ (దేగాం), ఆనందరావు పటేల్ (దేగాం), బాబురావు పటేల్ (మాంజిరి), దిగంబర్ పటేల్ (పాంగ్రి), బాలాజీ పాటిల్ (వాలేగాం) తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


