స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో నెల్లూరు పోలీసులు పచ్చదనం కోసం ముందుండి నడుస్తున్నారు
– SPS నెల్లూరు జిల్లా, పున్నమి ప్రతినిధి
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం భాగంగా, నెల్లూరు జిల్లా పోలీసులు పర్యావరణ పరిరక్షణపై ఒక ప్రత్యేక చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్, IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఇ-వేస్ట్ (ఇ-వ్యర్థాలు) శాస్త్రీయంగా తొలగింపు పై అవగాహన కలిగించుకునేలా ప్రతిజ్ఞ తీసుకున్నారు. అనంతరం పలు నినాదాలతో కూడిన ర్యాలీ నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు పలు ముఖ్యమైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు:
- పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో పాదరసం, సీసం, కాడ్మియం, లిధియం వంటి విషపదార్థాలు ఉంటాయని, అవి మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు అని తెలిపారు.
- ఈ గాడ్జెట్లను నియమిత ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాల్లో వదలాలన్న విజ్ఞప్తి చేశారు.
- ఇవి సరైన రీతిలో తొలగించనిపోతే, మెదడు, గుండె, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, పోలీసు కార్యాలయంలో సేకరించబడిన:
- 57 మానిటర్లు,
- 69 CPUలు (హార్డ్‌డిస్క్‌లు తొలగించినవి),
- 26 కీబోర్డ్లు,
- 14 ప్రింటర్లు,
- 9 స్టేబిలైజర్లు,
- 25 కార్ట్రిడ్జ్‌లు
ఇవి e-వేస్ట్‌గా డిస్ప్లే చేయడమైంది.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఈ-వేస్ట్ అవగాహన కార్యక్రమాలతో పాటు పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాల శుభ్రత వంటి చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి. (AR) శ్రీ చంద్రమోహన్ గారు, ఏఓ శ్రీ చంద్రమౌళి గారు, SB-2 CI, RIలు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
“మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి” అని పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు.

