నవంబర్2 పున్నమి ప్రతినిధి @ గుంటూరు
స్థానిక బృందావనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదిక లో స్వర్గీయ సినీ దర్శకులు టి. కృష్ణ సంస్కృతి కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6గంటలకు డాక్టర్ బద్రి పీర్ కుమార్ సభా పరిచయంతో ప్రారంభమై విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సామాజిక చైతన్య స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అతి తక్కువ కాలంలో సినీ చరిత్రలో మంచి పేరు తెచ్చుకున్న వారు టి. కృష్ణ. వెండి తెర అరుణ కిరణం సినీ దర్శకులు టి. కృష్ణని స్మరించుకుంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. కృష్ణ గారు చిరస్మరణీయులని, ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ, మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారని, దర్శకత్వం వహించినవి ఏడు చిత్రాలే అయినప్పటికీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలని, ఆయన దర్శకత్వం వహించిన ప్రతిఘటన, రేపటి పౌరులు మొదలైన చిత్రాలు సమాజాన్ని ఆలోచింపజేసినవని ఇటువంటి చిత్రాలు సమాజానికి ఉపయోగపడతాయని టి. కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సందేశాత్మక చిత్రాల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటనాలయ అధ్యక్షులు నీలం మందారావు, సభాధ్యక్షులు డాక్టర్ జి.ఎస్. ప్రసాద్ రెడ్డి, ముఖ్య అతిథి నల్లూరి వెంకటేశ్వర్లు, గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ డి.ఎస్.పి. గోలి లక్ష్మయ్య, కె.వి మెమోరియల్ పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పి. శివప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య, రచయిత దర్శకులు రాయపాటి ఆశీర్వాదం, ఆత్మకూరు ప్రసాద్, నెల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం స్నేహాంజలి ఆర్ట్స్ కొండేవరం పిఠాపురం వారిచే బర్రె సత్యనారాయణ రచించిన “చింత చచ్చినా” హాస్య నాటికను ప్రదర్శించారు.

స్వర్గీయ టి. కృష్ణ చిరస్మరణీయుడు సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు వక్తలు
నవంబర్2 పున్నమి ప్రతినిధి @ గుంటూరు స్థానిక బృందావనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదిక లో స్వర్గీయ సినీ దర్శకులు టి. కృష్ణ సంస్కృతి కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6గంటలకు డాక్టర్ బద్రి పీర్ కుమార్ సభా పరిచయంతో ప్రారంభమై విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సామాజిక చైతన్య స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అతి తక్కువ కాలంలో సినీ చరిత్రలో మంచి పేరు తెచ్చుకున్న వారు టి. కృష్ణ. వెండి తెర అరుణ కిరణం సినీ దర్శకులు టి. కృష్ణని స్మరించుకుంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. కృష్ణ గారు చిరస్మరణీయులని, ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ, మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారని, దర్శకత్వం వహించినవి ఏడు చిత్రాలే అయినప్పటికీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలని, ఆయన దర్శకత్వం వహించిన ప్రతిఘటన, రేపటి పౌరులు మొదలైన చిత్రాలు సమాజాన్ని ఆలోచింపజేసినవని ఇటువంటి చిత్రాలు సమాజానికి ఉపయోగపడతాయని టి. కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సందేశాత్మక చిత్రాల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటనాలయ అధ్యక్షులు నీలం మందారావు, సభాధ్యక్షులు డాక్టర్ జి.ఎస్. ప్రసాద్ రెడ్డి, ముఖ్య అతిథి నల్లూరి వెంకటేశ్వర్లు, గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ డి.ఎస్.పి. గోలి లక్ష్మయ్య, కె.వి మెమోరియల్ పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పి. శివప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య, రచయిత దర్శకులు రాయపాటి ఆశీర్వాదం, ఆత్మకూరు ప్రసాద్, నెల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం స్నేహాంజలి ఆర్ట్స్ కొండేవరం పిఠాపురం వారిచే బర్రె సత్యనారాయణ రచించిన “చింత చచ్చినా” హాస్య నాటికను ప్రదర్శించారు.

