*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి*
32, 34వ వార్డులకు చెందిన చలవ తోట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు సంబంధిత అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించారు.
ప్రజల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో సమస్యను పూర్తిగా పరిష్కరించారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా మరోసారి నిలిచారు డాక్టర్ నాగరాజు గారు.

