పున్నమి ప్రతినిధి
సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు బానోతు విజయ్‌పై కాంగ్రెస్ గుండాలు చేసిన అమానుష దాడిని ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ద్వేషంతో ఇటువంటి దారుణ దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను ఆయన డిమాండ్ చేశారు. బానోతు విజయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమని, కానీ హింసా మార్గం అనర్హమని ఆయన స్పష్టం చేశారు.


