పున్నమి ప్రతి నిధి
సత్తుపల్లి పట్టణ బిజెపి అధ్యక్షుడు బానోతు విజయ్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన అమానుష దాడిని తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలను హింసాత్మక దాడుల రూపంలో ప్రదర్శించడం పూర్తిగా అనర్హమని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడికి కారణమైన వారిపై ఖమ్మం పోలీస్ కమిషనర్ గారు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని తెలిపారు.
“ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. రాజకీయ పోరాటాలు చట్టబద్ధ మార్గాల్లోనే సాగాలి,” అని శ్రీధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.


