Sunday, 7 December 2025
  • Home  
  • శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఘనంగా దన్వంతరి జయంతి వేడుకలు.
- అనకాపల్లి

శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఘనంగా దన్వంతరి జయంతి వేడుకలు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం (పున్నమి న్యూస్ ప్రతినిధి కె. ఆనంద్ : కన్నుల పండుగగా ధన్వంతరి హెమం ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ కు సన్మానం శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రి నందు ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు, రామసీత దంపతులు, వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల నడుమ ధన్వంతరి హెూమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచన కర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు గారు అతిధులుగా విచ్చేసారు. అతిధులను విద్యార్థులు కోలాటం మరియు వేదపండితులు పూర్ణాహుతి తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ ను చాగంటి కోటేశ్వరావు చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డా|| కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆయుర్వేదం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప సంపద అని, ఆయుర్వేదం మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దారిని చూపే ఒక దిక్సూచి అని, ప్రపంచ దేశాలు కూడా నేడు ఆయుర్వేద వైద్య ఆవశ్యకతను గుర్తించి ఈ వైద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరైన అశేష జనవాహిని తో మాట్లాడుతూ పుస్తకాల ప్రాముఖ్యత ను వివరించారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల జీవిత చరిత్ర చదవడం ద్వారా మనకు మరియు మన శ్రేయోభిలాషులకు కూడా జ్ఞానప్రాప్తి కలుగుతుందని, మానవ శరీరం ఒక అద్భుతమని, మన శరీరంలో మనస్సు ను అధీనంలో ఉంచుకొంటే అద్భుతాలు సృష్టించగలమని, మన శరీరం మనసు రెండూ బాగున్నప్పుడే భావితరాలకు ముందుతరాల విషయసంపద ను అందించగలమని తెలిపారు. గురువు స్వార్థం లేని వ్యక్తి అని ఉన్నత స్థితికి చేరడానికి గురువు ఒక దిక్సూచి అని పలువురు ప్రముఖుల జీవిత చరిత్ర నుండి మనం ఈ విషయాన్నీ గ్రహించి గురువు కి మన జీవితంలో ఉన్నత స్థానం ఇవ్వాలని ఆయన విద్యార్థులకు తెలిపారు. శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు మాట్లాడుతూ ఈ ధన్వంతరి జయంతి రోజున ఆయుర్వేదంలో విశిష్ట సేవలందించిన వారిని సన్మానించడంఎంతో ఆనందదాయకమని, కేరళ రాష్ట్రంలో ప్రసిద్ది పొందిన ఆయుర్వేద వైద్యాన్ని ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నామని అయన తెలిపారు. కార్యక్రమంలో అకామి ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డా|| యు.ఇందూలాల్, సైకలాజికల్ కౌన్సిలర్ అపర్ణ శర్మ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన వైద్యులు డా|| టి.రమేష్ బాబు, డా|| ఎమ్ .ఏ సుమయ్య, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది, శ్రీ ప్రకాష్ ఉపాద్యాయ బృందం ఆయుర్వేదం పై మక్కువ కల్గిన తుని మరియు పాయకరావుపేటకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం (పున్నమి న్యూస్ ప్రతినిధి కె. ఆనంద్ :
కన్నుల పండుగగా ధన్వంతరి హెమం
ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ కు సన్మానం

శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రి నందు ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు, రామసీత దంపతులు, వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల నడుమ ధన్వంతరి హెూమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచన కర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు గారు అతిధులుగా విచ్చేసారు. అతిధులను విద్యార్థులు కోలాటం మరియు వేదపండితులు పూర్ణాహుతి తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ ను చాగంటి కోటేశ్వరావు చేతుల మీదగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డా|| కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆయుర్వేదం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప సంపద అని, ఆయుర్వేదం మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దారిని చూపే ఒక దిక్సూచి అని, ప్రపంచ దేశాలు కూడా నేడు ఆయుర్వేద వైద్య ఆవశ్యకతను గుర్తించి ఈ వైద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.

ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరైన అశేష జనవాహిని తో మాట్లాడుతూ పుస్తకాల ప్రాముఖ్యత ను వివరించారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల జీవిత చరిత్ర చదవడం ద్వారా మనకు మరియు మన శ్రేయోభిలాషులకు కూడా జ్ఞానప్రాప్తి కలుగుతుందని, మానవ శరీరం ఒక అద్భుతమని, మన శరీరంలో మనస్సు ను అధీనంలో ఉంచుకొంటే అద్భుతాలు సృష్టించగలమని, మన శరీరం మనసు రెండూ బాగున్నప్పుడే భావితరాలకు ముందుతరాల విషయసంపద ను అందించగలమని తెలిపారు. గురువు స్వార్థం లేని వ్యక్తి అని ఉన్నత స్థితికి చేరడానికి గురువు ఒక దిక్సూచి అని పలువురు ప్రముఖుల జీవిత చరిత్ర నుండి మనం ఈ విషయాన్నీ గ్రహించి గురువు కి మన జీవితంలో ఉన్నత స్థానం ఇవ్వాలని ఆయన విద్యార్థులకు తెలిపారు.

శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ & రీసెర్చ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సిహెచ్.వి.కె. నరసింహారావు మాట్లాడుతూ ఈ ధన్వంతరి జయంతి రోజున ఆయుర్వేదంలో విశిష్ట సేవలందించిన వారిని సన్మానించడంఎంతో ఆనందదాయకమని, కేరళ రాష్ట్రంలో ప్రసిద్ది పొందిన ఆయుర్వేద వైద్యాన్ని ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించి వైద్య సేవలు అందిస్తున్నామని అయన తెలిపారు.

కార్యక్రమంలో అకామి ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డా|| యు.ఇందూలాల్, సైకలాజికల్ కౌన్సిలర్ అపర్ణ శర్మ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన వైద్యులు డా|| టి.రమేష్ బాబు, డా|| ఎమ్ .ఏ సుమయ్య, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది, శ్రీ ప్రకాష్ ఉపాద్యాయ బృందం ఆయుర్వేదం పై మక్కువ కల్గిన తుని మరియు పాయకరావుపేటకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.