విజయవాడ, సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి))
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొను నిమిత్తం…. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు…. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
ముందుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు… గవర్నర్ ను స్వాగతించారు. ఎమ్మెల్యే రాముతో పాటుగా ఏపీలోని మంత్రులు, ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
విమానాశ్రయంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన భద్రత బలగాల నడుమ ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన్న విజయవాడకు బయలుదేరి వెళ్లారు.


