*
కర్నూలు జిల్లా, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
ఎమ్మిగనూరు పట్టణంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్, లెదర్ సొసైటీ సహకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్‌కు మెమోరాండం అందజేశారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగ, జిల్లా నాయకులు ముత్తు సుమాల, సామెల్ మాట్లాడుతూ, కొన్ని వ్యక్తులు దురుద్దేశంతో షేర్ హక్కులను నిర్లక్ష్యం చేసి పరిశ్రమను ప్రైవేటు లీజుకు ఇచ్చారని, షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెద్ద ముష్టి అబ్రహం మాదిగ, టౌన్ అధ్యక్షులు మడ్రి గుంటేప్ప, ప్రధాన కార్యదర్శి శాంతిరాజు, సభ్యులు మరియు షేర్ హోల్డర్లు పాల్గొన్నారు.


