రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు
ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును పరిశీలించిన కలెక్టర్ శేషగిరి బాబూ.
నెల్లూరు, అక్టోబర్ 26 (పున్నమి విలేకరి) : నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషాగిరి బాబు ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం నగరంలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తనిఖీ చేశారు. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసారు. ముందుగా ఆత్మకూరు బస్టాండ్ ప్లైఓవర్‌ను పరిశీలించి చాలా చోట్ల దెబ్బతిన్న వంతెనను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనం రద్దీ, వాహన రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు చోట్ల మరమ్మతులు చేయించాలన్నారు. ఏస్.మోహన్, కార్పొరేషన్ ఎస్.ఈ. హిమయుద్దీన్, ఏఈలు మహేష్, సంజయ్, జానీ తదితరులు కలెక్టర్‌తో పాటు ఉన్నారు.

రోడ్డుకు చికిత్స చేసిన అధికారులు ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును పరిశీలించిన కలెక్టర్ శేషగిరి బాబూ. నెల్లూరు, అక్టోబర్ 26 (పున్నమి విలేకరి) : నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండు వద్ద దెబ్బతిన్న రొడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషాగిరి బాబు ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం నగరంలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తనిఖీ చేశారు. అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసారు. ముందుగా ఆత్మకూరు బస్టాండ్ ప్లైఓవర్‌ను పరిశీలించి చాలా చోట్ల దెబ్బతిన్న వంతెనను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనం రద్దీ, వాహన రాకపోకలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పలు చోట్ల మరమ్మతులు చేయించాలన్నారు. ఏస్.మోహన్, కార్పొరేషన్ ఎస్.ఈ. హిమయుద్దీన్, ఏఈలు మహేష్, సంజయ్, జానీ తదితరులు కలెక్టర్‌తో పాటు ఉన్నారు.