Sunday, 7 December 2025
  • Home  
  • రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరుపున కిడ్నీ బాధితుడి కుటుంబానికి జీవనోపాధి
- తిరుపతి

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరుపున కిడ్నీ బాధితుడి కుటుంబానికి జీవనోపాధి

శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్న మధు అనే వ్యక్తికి రెండు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకుండా మంచాన పడిపోవడంతో అతని కుటుంబం జీవనోపాధి కోల్పోయి పిల్లలను కూడా పోషించలేని పరిస్థితి ఏర్పడింది మధు కుటుంబం గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తిరుపతి జిల్లా పంచాయితీ అధికారి సుశీలాదేవి ద్వారా తెలుసుకున్న రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తోడుగా నిలిచారు. జీవనోపాధిగా నిలిచే విధంగా మధు భార్య రేవతి ఇడ్లీ అంగడి ప్రారంభించేందుకు కావలసిన స్టవ్, ఇడ్లీ పాత్రలు, వంట సామాగ్రి, దోశల పెనం, నెల రోజులకు అంగడికి సరిపడిన పప్పులు,బియ్యం, మసాలా దినుసులు తదితర సామాగ్రి తన ప్రతినిధుల ద్వారా మధు కుటుంబానికి అందజేశారు. సహాయం అందుకున్న రేవతి. కుటుంబం సుశీలా దేవి, దాత రమేష్ నాథ్ లింగుట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ మొర్రిమేకల దేవరాజులు, సమగ్ర శిక్ష జిల్లా అధికారి డాక్టర్ సుధాకర్ నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.