అలరించిన భక్తి గీతాలు
★ అమ్మవారి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు
★ కళాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసిన డాక్టర్ కందుల
విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గీతాలు ఆలాపన పలువురిని ఆకట్టుకుంది.
కార్యక్రమము ఆధ్యాంతం భక్తి పాటలతో అలరించడంతో భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ చేతుల మీదుగా భక్తి పాటలను ఆలపించిన నిర్వాహకులకు సత్కారం చేస్తే జ్ఞాపకలను, సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమం అందరినీ అలరించిందన్నారు.
మెలోడీ క్రియేటర్స్ సభ్యులు అందరిని ఆకట్టుకునే విధంగా భక్తి పాటలు ఆలపించి కనువిందు చేశారని కొనియాడారు.
ఆలయ ఈవో శోభారాణి ఆధ్వర్యంలో ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారం మరువ లేనిది అన్నారు.
ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
ఆలయ ఈవో శోభారాణి, సిహెచ్ వి రమణ, ఏ ఈ ఓ లు నరేంద్ర ,రాజేంద్ర,
అలాగేసిహెచ్వి సత్యనారాయణ,
మెలోడీ క్రియేటర్స్ అధ్యక్షులు ఎం.వి రాజశేఖర్, కార్యదర్శి కడలి, కన్వీనర్ శృతిలయ, అదేవిధంగా వి ప్రభాకర్ ,కొణతాల వెంకట సురేష్, ఎం శ్రీనివాస్, ప్రణవి సంతోషిని, హర్షిత ,లలిత వరలక్ష్మి, శ్రీనివాస శర్మ, సిహెచ్ జోగిరాజు, కె రామ్ కుమార్, శ్రీకాంత్, వి ఏ నాయుడు, కేదార్ లక్ష్మి, వెంకటలక్ష్మి,
ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

