Tuesday, 9 December 2025
  • Home  
  • రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఎంపిక
- E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఎంపిక

ఈనెల 8.9 తేదీ పొద్దుటూరు లో వై ఎమ్ ఆర్ కాలనీ లో స్టేడియం క్యాడిట్. సబ్ జూనియర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో చిట్వేల్ ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులలో బాలికల విభాగంలో బి లోహిత. సుదీప. కుష్మిత.బాలుల విభాగంలో అనూజ్. గ్రీతేశ్వర్ రెడ్డి. ధవనేశ్వర్ రెడ్డి బంగారు పతకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14 15 16 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్ర పాల్గొంటారని తెలిపారు. విజేతలకు ఈరోజు చిట్వేలి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ యాక్టివిస్ట్ గాడి ఇంతియాజ్ అహ్మద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి చంద్రశేఖర్, సాయి వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టీ. రెడ్డయ్య నాయుడు ల ద్వారా పతకాలు అందించి అభినందన సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్ శివాజీ మాట్లాడుతూ చిట్వేలి ఎస్ వి కే అకాడమీ నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని, తన మీద నమ్మకంతో పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు మరియు మొదటి నుండి తనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సార్ గారికి మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్నారులను ప్రేరేపిస్తూ తమ అకాడమీ అభివృద్ధికి సహకరిస్తున్న గాడి ఇంతియాజ్ అహ్మద్ కు, మరియు సాయి వికాస్ పాఠశాల రెడ్డయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు. విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిట్వేలి లో టైక్వాండో అకాడమీని స్థాపించి అనతి కాలంలోనే విద్యార్థులను రాష్ట్రస్థాయి వరకు తీసుకువెళ్లడానికి కృషిచేసిన శివాజీ మాస్టర్ ను అభినందించారు. చదువులతో పాటు క్రీడలలో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని మానసిక వికాసానికే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయి వరకు పిల్లలు ఎదగాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులు కొరముట్ల నరసింహ, అలిశెట్టి పెంచలయ్య, చంద్రశేఖర్, ఓసూరయ్య, మరియు అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు

ఈనెల 8.9 తేదీ పొద్దుటూరు లో వై ఎమ్ ఆర్ కాలనీ లో స్టేడియం క్యాడిట్. సబ్ జూనియర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో చిట్వేల్ ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులలో బాలికల విభాగంలో బి లోహిత. సుదీప. కుష్మిత.బాలుల విభాగంలో అనూజ్. గ్రీతేశ్వర్ రెడ్డి. ధవనేశ్వర్ రెడ్డి బంగారు పతకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14 15 16 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్ర పాల్గొంటారని తెలిపారు.
విజేతలకు ఈరోజు చిట్వేలి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ యాక్టివిస్ట్ గాడి ఇంతియాజ్ అహ్మద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి చంద్రశేఖర్, సాయి వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టీ. రెడ్డయ్య నాయుడు ల ద్వారా పతకాలు అందించి అభినందన సర్టిఫికెట్లతో సత్కరించారు.
ఈ సందర్భంగా కోచ్ శివాజీ మాట్లాడుతూ చిట్వేలి ఎస్ వి కే అకాడమీ నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని, తన మీద నమ్మకంతో పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు మరియు మొదటి నుండి తనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సార్ గారికి మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్నారులను ప్రేరేపిస్తూ తమ అకాడమీ అభివృద్ధికి సహకరిస్తున్న గాడి ఇంతియాజ్ అహ్మద్ కు, మరియు సాయి వికాస్ పాఠశాల రెడ్డయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు.
విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిట్వేలి లో టైక్వాండో అకాడమీని స్థాపించి అనతి కాలంలోనే విద్యార్థులను రాష్ట్రస్థాయి వరకు తీసుకువెళ్లడానికి కృషిచేసిన శివాజీ మాస్టర్ ను అభినందించారు.
చదువులతో పాటు క్రీడలలో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని మానసిక వికాసానికే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయి వరకు పిల్లలు ఎదగాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులు కొరముట్ల నరసింహ, అలిశెట్టి పెంచలయ్య, చంద్రశేఖర్, ఓసూరయ్య, మరియు అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.