సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన CRDA సమావేశంలో ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు.
రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ ఉపయోగపడుతుంది.


