*రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు.*
*ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు.*
పున్నమి న్యూస్ ప్రతినిధి
4 డిసెంబర్ 2025
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
హైదరాబాద్ , రంగారెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న సోదాలు.
రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.
ల్యాండ్ రికార్డ్స్ ఈడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తింపు.
మహబూబ్నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా గుర్తించిన అధికారులు.
పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు.
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భూజా లో సోదాలు చేస్తున్న
(రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్
ఏడి, శ్రీనివాస్) అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడీ శ్రీనివాస్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఏడీ శ్రీనివాస్కు రాయదుర్గం మైహోం భుజాలో ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీలోని అనంతపురంలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్నగర్లో నాలుగు ఎకరాలు, నారాయణపేటలో మూడు ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇంట్లో రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.


