Tuesday, 9 December 2025
  • Home  
  • మాజీ మంత్రి కాకాణి ని కలిసిన దుగ్గి రెడ్డి గురవారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీ మంత్రి కాకాణి ని కలిసిన దుగ్గి రెడ్డి గురవారెడ్డి

సీతారామపురం ఆగస్టు(పున్నమి ప్రతినిధి) మాజీమంత్రి, వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని కాకాణి నివాసంలో గురువారం సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురువారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నెల్లూరు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటాలు కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దుగ్గిరెడ్డి గురవారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులను బనాయించినా న్యాయం వైఎస్ఆర్సిపి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వైపు ఉండడంతో న్యాయస్థానాలు అన్ని కేసులలో బెయిల్ మంజూరు చేసిందని త్వరలోనే అన్ని కేసులలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వైసిపి కార్యకర్తలు నాయకులపై కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అక్రమ కేసులు లతో భయపెట్టాలనుకుంటే వైసీపీ కార్యకర్తలు మరింత ఉత్తేజంగా కసిగా పనిచేసి 2029 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేలా కష్టపడతారన్నారు. ఆయన వెంట దేవిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ రేనాటి సుధాకర్ నాయుడు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీతారామపురం ఆగస్టు(పున్నమి ప్రతినిధి)

మాజీమంత్రి, వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని కాకాణి నివాసంలో గురువారం సీతారామపురం మాజీ జెడ్పిటిసి దుగ్గిరెడ్డి గురువారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నెల్లూరు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటాలు కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దుగ్గిరెడ్డి గురవారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులను బనాయించినా న్యాయం వైఎస్ఆర్సిపి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వైపు ఉండడంతో న్యాయస్థానాలు అన్ని కేసులలో బెయిల్ మంజూరు చేసిందని త్వరలోనే అన్ని కేసులలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. వైసిపి నాయకుల పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వైసిపి కార్యకర్తలు నాయకులపై కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అక్రమ కేసులు లతో భయపెట్టాలనుకుంటే వైసీపీ కార్యకర్తలు మరింత ఉత్తేజంగా కసిగా పనిచేసి 2029 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేలా కష్టపడతారన్నారు. ఆయన వెంట దేవిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ రేనాటి సుధాకర్ నాయుడు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.