సీతారామపురం నవంబర్ 10 సూర్య న్యూస్
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునతో కలిసి కాకానికి పుట్టినరోజులు శుభాకాంక్షలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు తెలిపారు. ముందుగా కాకానిని శాలువాతో సత్కరించి పుట్టినరోజు కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాలగిరి ముద్దుకృష్ణమరాజు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో 2029లో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేసేలా కష్టపడి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని కాకాని తెలిపారన్నారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కల్లా వైఎస్ఆర్సిపి గెలుపు ముందు వరుసలో ఉదయగిరి నియోజకవర్గం ఉందని ఇదేవిధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ వైఎస్ఆర్సిపి పై ప్రజల్లో మరింత ఆధార అభిమానాలు నమ్మకం కలిగేలా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12వ తేదీన నిర్వహించే నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారన్నారు.


