డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పరిధిలోని కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళల హక్కులు మరియు గృహహింసను గూర్చి సామూహిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాభాయి మహిళ మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధనం మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల పై పూర్తి అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మహిళల సమస్యలకు పూర్తిస్థాయి న్యాయం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా గృహహింస చట్టం గూర్చి, బాల్యవివాహాల నిరోధక చట్టం గూర్చి,వరకట్న నిషేధ చట్టం గూర్చి వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలి