హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలో ఒక యూట్యూబర్‌ను పోలీసులు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని వసీం అక్రమ్‌గా గుర్తించారు. మేవాట్ చరిత్రపై యూట్యూబ్ వీడియోలు చేసే అక్రమ్ గత మూడేళ్లుగా పాకిస్థాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని ఫోన్‌లో దేశ భద్రతకు ముప్పుగా మారే సమాచారం, నేరపూరిత సందేశాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని వెల్లడించారు. ప్రస్తుతం అక్రమ్‌పై జాతీయ భద్రతా చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

మరో యూట్యూబర్ అరెస్టు