రామారెడ్డి, 4నవంబర్, (పున్నమి ప్రతినిధి) :
మదన్ అన్నకు మంత్రి పదవి రావాలని రామారెడ్డిలో ఘనంగా పూజలు నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలిపారు.కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో కార్తీక మాసం మంగళవా రం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో శ్రీ కాల భైరవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ అన్న కు రానున్న రోజుల్లో మంత్రి పదవి లభించాలని ఆకాంక్షిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు, అభిమాను లు పెద్దఎత్తున పాల్గొన్నారు.పూజా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు నిర్వహించిన జై కాంగ్రెస్, జై మదన్ అన్న నినాదా లు ఆలయ ప్రాంగణాన్ని అనురంజింపజేశాయి. ప్రధాన నాయకులు మాట్లాడుతూ, మదన్ అన్న ప్రజాధారణ, సేవా తపనకు గుర్తింపుగా మంత్రి పదవి రావడం రామారెడ్డి వారందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో, స్టేట్లో స్టేట్ లెవల్లో చర్చనీయాంశంగా మారింది.


