నిర్మల్ నవంబర్ (పున్నమి ప్రతినిధి)
క్రికెట్, సాఫ్ట్బాల్, బేస్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగిన నిర్మల్ మండలం మేడిపల్లికి చెందిన పోతుగంటి భువనను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఏఎంసీ ఛైర్మన్ భీమిరెడ్డి సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి ఎదగడం నిర్మల్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని శ్రీహరి రావు కొనియాడారు. అనంతరం భువనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈటేల శ్రీనివాస్, కుంట పద్మాకర్, కుంట వేణు గోపాల్, కొట్టే శేఖర్, కాండ్లి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


