ఖమ్మం అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి)
మధిర (ముదిగొండ మండలం)
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలో గల ముదిగొండ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి బెల్లం కొండ శ్రీనివాస్ యొక్క సతీమణి శ్రీమతి నాగమణి మృతి చెందారు.ఆదివారం నాడు ఆమె అంత్యక్రియలు జరిగాయి
బీజేపీ శ్రేణుల నివాళులు:
బెల్లం కొండ నాగమణి పార్ధివ దేహం మీద బీజేపీ జెండా కప్పి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నివాళులు అర్పించారు. ఎల్లా రావు గౌడ్, ప్రవీణ్, నాగేశ్వరావ్, ఇతర బీజేపీ నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.


