డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్లరేవులో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ,ఏఆర్టీ కేంద్రాలు,జిల్లా ఎయిడ్స్ నివారణ కంట్రోల్ యూనిట్ ప్రతినిధులు,ఫెడరేషన్ ప్రతినిధులు,ఆశా కార్యకర్తలు,గ్రామ సమైక్య సభ్యులకు సంప్రదింపుల కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమన్వయ సహకారంతో హెచ్ఐవితో బాధపడుతున్న వారికి నిరాటంక సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ కాలా ఆంజనేయులు మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు మరియు సేవలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి మండల్ లెవెల్ ఇంప్లిమెంటరు డి అర్జున్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకర జీవితాన్ని జీవించాలని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని స్త్రీ పురుషులు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి కన్వర్జెన్సీ సమావేశం