నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
బతుకమ్మ సంబరాలలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అంతేగాక బతుకమ్మలకు పూజ చేసే ఆడి పాడారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రధాన్యత ఇచ్చి ఉత్సవాలలో భాగంగా ఆయా జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలలో ఒకరోజు బతుకమ్మను ప్రత్యేకంగా నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నాగార్జున్ సాగర్ దగ్గర ఉన్న బుద్దవనంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని,బుధవారం ఐ సి డి స్, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, హ్యాండ్లూమ్స్ తదితర శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.

బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డ పండుగ అన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) బతుకమ్మ సంబరాలలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అంతేగాక బతుకమ్మలకు పూజ చేసే ఆడి పాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రధాన్యత ఇచ్చి ఉత్సవాలలో భాగంగా ఆయా జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలలో ఒకరోజు బతుకమ్మను ప్రత్యేకంగా నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నాగార్జున్ సాగర్ దగ్గర ఉన్న బుద్దవనంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని,బుధవారం ఐ సి డి స్, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, హ్యాండ్లూమ్స్ తదితర శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.

