संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

పేదల వైద్యానికి భరోసా,ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
పేదల వైద్యానికి భరోసా,ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు

खबर की मुख्य बातें

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మంగళవారం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ…
  • పోలవరం మండలంలో 35 మంది లబ్ధిదారులకు ₹ 14 లక్షలు, తాళ్లరేవు మండలంలో 35 మంది లబ్ధిదారులకు ₹ 27 లక్షలు,మొత్తం 156 మంది లబ్ధిదారులకు ₹88 లక్షలు విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర వైద్య అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ద్వారా వేగవంతంగా సహాయం అందిస్తూ ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలకు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మంగళవారం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండలాల వారీగా లబ్ధిదారులకు అందించిన చెక్కుల వివరాల ప్రకారం ముమ్మిడివరం మండలంలో 35 మంది లబ్ధిదారులకు సుమారు ₹ 15 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతిపరిధిలో 18 మంది లబ్ధిదారులకు ₹14 లక్షలు,కాట్రేనికోన మండలంలో 33 మంది లబ్ధిదారులకు ₹ 15.2 లక్షలు,ఐ. పోలవరం మండలంలో 35 మంది లబ్ధిదారులకు ₹ 14 లక్షలు,
తాళ్లరేవు మండలంలో 35 మంది లబ్ధిదారులకు ₹ 27 లక్షలు,మొత్తం 156 మంది లబ్ధిదారులకు ₹88 లక్షలు విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర వైద్య అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ద్వారా వేగవంతంగా సహాయం అందిస్తూ ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం పంపిణీ చేసామన్నారు.అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం సుమారు ₹8 కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్‌ఎఫ్ సహాయం అర్హులైన బాధిత కుటుంబాలకు అందించడం జరిగిందని అన్నారు.ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం చేరేలా నిరంతరం కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు వివేకానంద, నాలుగు మండల పార్టీల అధ్యక్షులు కూటమి నాయకులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *