వెంప పిఏసిఎస్ బ్యాంక్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

భీమవరం : పిఏసిఎస్ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
భీమవరం మండలం వెంప గ్రామంలో పిఏసిఎస్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
చైర్మన్ గా కె కాశీ విశ్వనాథరాజు (మేడూరు), సభ్యులుగా పి సత్యనారాయణ రాజు, కోవూరు వెంకట్ సత్యనారాయణ లు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

