ఆక్యుపంక్చర్ మరియు రిఫ్లెక్సాలజీ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతున్నాయి. శరీరంలోని ప్రత్యేక పాయింట్లను ఉద్దీపన చేయడం ద్వారా సహజ చికిత్సను అందించే ఈ పద్ధతులు, నాడీ సంబంధిత సమస్యలు, నొప్పులు, ఒత్తిడి, మానసిక ఆందోళనలు వంటి అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెదాయపాలెంలో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది. ఏప్రిల్ 14 (సోమవారం), 15 (మంగళవారం) తేదీలలో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఈ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే ఉద్దేశంతో విశ్రాంత ఆరోగ్య నిపుణులు వీటిని అందించనున్నారు. ఆసక్తి గల వారు ముందస్తు వివరాల కోసం కింది ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
విస్సా సత్యరాజు
ఫోన్: 9444443590